అర్పితావేదం!

మున్ముందు ఏం విడిచి ఉద్దరిస్తారో కానీ

ధ్వేషించడంలోనే పవిత్రత కనబడుతుంది!

ప్రేమించుకుని జనం వస్త్రాలు విప్పుతారనీ
గమనించి బాగా యోచిస్తే అర్థమౌతుంది!

ఎంతటి గాఢతతో కూడింది అయినా కానీ
ప్రేమైనా పెళ్ళైనా కామాన్నేగా కోరుతుంది!

అవునని ఒప్పుకోలేని ఈ పచ్చి నిజాలనీ
వ్రాసామా బుద్ధిలేదాని లోకం నింధిస్తుంది!

కావలసినవి ఏవైనా కోరితే దొరకవు కానీ
వద్దన్నది అడక్కుండా వచ్చి వాలుతుంది! 

20 comments:

  1. మనిషి జీవితమే అయోమయపు గాథ
    మంచి చేసినా గాని చెడునే గుర్తుపెట్టుకుంటారు జనం

    మనిషి జీవితమే విచిత్రమైన కథ
    మంచి పాత్రలో అభినయిద్దామంటే నటన అంటారు జనం

    మనిషి జీవితమే అంతులేని వ్యథ
    మంచికి చెడుకి వ్యత్యాసం మనలోని ఆలోచన విధానమంటే నమ్మరు జనం

    మనిషి జీవితం ఆ భగవంతునిదే తథ్యం
    భావోద్వేగాలను రాగద్వేషాలను మమతానురాగాలను ఆప్యాయతను నమ్మి నమ్మనట్టు జనం

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  2. నేను ఒప్పుకోను
    ప్రేమ పెళ్ళి కేవలం కామంతోనే ఫుల్ స్టాప్ అనడం అన్యాయం

    ReplyDelete
  3. ప్రేమ పెళ్ళి కామంతో ముడివేయకండి. అవి లేకుండా కొవ్వుతో కొట్టుకునే వారు ఎందరో ఉన్నారనే విషయం మరచిపోతే ఎలా మీరు? మనసుకు నచ్చింది ఏది చేసినా మనకు నచ్చుతుంది లేదా ఇలా వంకరటింకర వేదాంతం మొదలౌతుంది.

    ReplyDelete
  4. అర్పితమ్మో...వలపు వేదాంతం సెప్పమాకు

    ReplyDelete

  5. వేదం అంటారా వేదన అనుకోమంటారా? :) :) :)

    ReplyDelete
  6. మనిషికి కామం ఒక సహజాతం. ఒక జాతి ప్రత్యుత్పత్తి స్త్రీ పురుష శారీరక కలయికపైనే ఆధారపడి ఉంటుంది.
    దీన్ని మీరు నేరం ఘోరం అనుకుంటే ఎట్లా?

    ReplyDelete
  7. vedalu vallinche vayasu kadu
    mantralu japincha manasu radu
    anna meeru ila enduku eamiti???

    ReplyDelete
  8. కావలసినవి ఏవైనా కోరితే దొరకవు yes

    ReplyDelete
  9. వేదాంత ధోరణిలో సాగిన జీవిత సత్యాలు

    ReplyDelete
  10. Jeevitam love parts Prima pelli

    ReplyDelete
  11. ఆలోచిస్తుంటే వేదంలో ఆవేదన కనబడుతుంది.

    ReplyDelete
  12. అన్నీ మీరే ఆలోచించి వ్రాసిన తరువాత మేము ఆలోచించడానికి ఏం మిగిలింది. బాగుంది అవును అని చెప్పడం తప్పితే :)

    ReplyDelete
  13. అక్షరాలతో పాటుగా
    అందమైన చిత్రాలు
    అలకరించిన బ్లాగు

    ReplyDelete
  14. అందరి అభిప్రాయాలు తెలియజేసినందుకు పద్మార్పిత వందనములు_/\_

    ReplyDelete
  15. వేదాంతంలో Ph.D ఎప్పుడు చేసారు?

    ReplyDelete
  16. ప్రేమైనా పెళ్ళైనా కామాన్నే కోరుతుంది 100% కరెక్టు.

    ReplyDelete
  17. కామ ప్రేమ నిజం ఏమో

    ReplyDelete