రారా నా రోబో..

అనుకున్నవి అనుకున్నట్లు నెరవేర్చుకోలేని మనిషి
తన కోర్కెలను తాను తీర్చుకునే సత్తా దమ్మూలేక
కొత్తపుంతల టెక్నాలజీతో సృష్టిని ప్రతిసృష్టి చేసుకుని
ఏం సాధించాలి అనుకుంటున్నాడో అర్థంకాక చస్తున్నా!
రక్తమాంస భావఉద్వేగ అనుభూతులున్న ప్రత్యేకజీవి
తన భౌతికత్వాన్ని నిర్థారించుకునే కొలమానాలులేక
సాంకేతిక పరిజ్ఞానంతో మనసునే మరగా మలచుకుని
ఏ దిశకు మన ప్రగతి పయనమోనని ఆలోచిస్తున్నా!
అనైతిక అవాస్తవాల్ని అవసరానికి మార్చుకునే మనిషి
స్వేచ్ఛగా ప్రకృతివిరుద్ధ ధోరణిలో పరుగిడుతూ నిలువక
అసూయాద్వేషాల్లేని రోబోలతో రమించి క్లోనింగ్ పిల్లలని
కని పెంచుతుంటే ఇంకెక్కడి రక్తసంబంధాలు అనుకున్నా!
కంప్యూటర్స్ కాపురంలో కల్పించబడ్డ కృత్రిమ మేధాజీవి
మానవసంస్కృతినే కాదు మనసుల్నీ మార్చేస్తే ఉండలేక
కల్తీకామ కార్యకలాపాల్లో కణాలు చిక్కుపడి ఊపిరాగెనని
తెలిసీ రబ్బరుబొమ్మనై రోబోర్ట్ తో రొమాన్సుకు రెడీగున్నా!

25 comments:

  1. ఇలా రొమాన్స్ చేస్తే రోబోట్లు రాజ్యం ఏలుతాయి త్వరలో పద్మజీ
    మీరు ఎంతో ముందు చూపుతో ఉన్నట్లు తోస్తుంది ఈ పోస్ట్ ద్వారా.

    ReplyDelete
  2. Robot & Romance
    ha ha ha haa

    ReplyDelete
  3. ఆధునిక టెక్నాలజీ పూర్తి లోకాన్ని ముట్టడి చేసి రోబోలు మన జీవితాల్లోకి వస్తే ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయెా తెలియదు కానీ మీరు వ్రాసినది చలోక్తి పంధాలో సాగినది.

    ReplyDelete


  4. రబ్బరు బొమ్మగ రోబో
    గుబ్బెత తో మదనకేళి క్లోన్డ్ జన రేషన్
    పబ్బాల్గడుపుకొనేస్తూ
    మబ్బుల్లో దేలెదమ్ము మా ప్రగతి యిదే!


    జిలేబి

    ReplyDelete
  5. ఇప్పటి ప్రేమలు కృత్రిమం
    ఇప్పటి ఆప్యాయతలు నాటకం
    ఇప్పటి బాంధవ్యాలు భూటకం
    ఎందుకనంటే
    ప్రేమను తెలియజేసేందుకు ఈ మెసేజులు
    ఆప్యాయత కనబరిచేందుకు ఈ ప్రౌద్యోగికతలు
    బాంధవ్యాలు బ్లాక్ అన్ బ్లాక్ నడుమ ఊగిసలాటలు
    ఎంచేతనంటే
    మనిషి మేధస్సును తన ఉనికి కాపాడుకోవటానికి బదులు
    మనిషి కే మారు రూపం దాల్చి కీర్తి గడిస్తు "లైఫ్ ఇజ్ ఎఫిమెరల్ ఆర్ట్ ఇజ్ ఇటర్నల్" కు దారులు
    తన భావోద్వేగాలను తెలుపలేక ఆర్టిఫిషియల్ ఎమోషన్ ను ప్రోగ్రాం చేస్తు సోఫియా వంటి రోబోలు.
    ఫజ్జి కాస్తా "ఈ" ధాటికి డిజ్జి అయ్యే అవకాశాలు కోక కోలలు
    అభియాంత్రికతకు ఊతమియ్యాలి కాని సాంకేతికతతో సాగాలి కాని ప్రౌద్యోగికతతో ప్రోద్బలం పెంచుకోవాలి కాని.. మనిషి ఉనికిని తలదన్నే మనిషి ఉనికిని మట్టి కరిపించేంతలా మేధతో యాంత్రికతకు దోహదం చేస్తు తన ఉనికిని మనిషే మట్టుబెట్టుకోకూడాద్

    ~శ్రీధరనిత

    ReplyDelete
    Replies
    1. ఒక రకంగా నాకు ఆ రోబో.. మెటాలిక్ హనుమంతునిలా కనిపిస్తున్నాడు పద్మ గారు.. సీతరాములు కొలువుదీరే చోటులో విడీయో ఉంది.

      Delete
  6. మానవాళికి ప్రగతి పెట్టేదిగా ఉండాలి అంతే తప్పితే నాశనం చేసే ప్రగతి అవసరంలేదు.

    ReplyDelete
  7. అదుర్స్...అద్భుతంగా ఉంది నేటివిటీ

    ReplyDelete
  8. మనుషుల్లో మీకు నచ్చిన వారులేరని రోబోలతో ప్రేమ...హ అహా హా హా, చాలా బాగారాశారు పద్మార్పిత

    ReplyDelete
  9. కొత్తపుంతల టెక్నాలజీ

    ReplyDelete
  10. Ohhhh...Robort tho romance lo padabotunnaru. Then don't expect for gifts from robo you have to give him chips chips :)

    ReplyDelete
  11. రోబోల మూలంగా రాబోయే దశాబ్దాలలో కొన్ని ఉద్యోగాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని తెలిసింది. మీరు మగజాతి మానవ ప్రేమికులే అంతమైపోయేట్లు చేయాలని కంకణం కట్టుకున్నట్లు తోస్తుంది. ఏదైనా మొత్తనికి సాంకేతిక రంగం వలన లోపాలు లాభాలు రెండూ ఉంటాయని గమనించాలి.

    ReplyDelete
  12. Good development
    Proceed avvandi :)

    ReplyDelete
  13. అనైతిక అవాస్తవాల్ని అవసరానికి మార్చుకునే మనిషి...నేటితరం తెలివితేటలు అంటూ చేస్తున్న పనులు. ఏది ఎంత వరకూ వాడుకోవాలో అంత వరకూ మాత్రమే అంతె కానీ మారీ అన్నింటా ఒకే మంత్రము పద్దతి అంటే తప్పు కదూ.

    ReplyDelete
  14. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచంలో రోబోల వాడకం పెరిగింది. వివిధ రంగాల్లో రోబోలను వినియోగిస్తున్నారు. అత్యంత సున్నితమైన, అత్యంత క్లిష్టమైన పనులను రోబోల సహాయంతో చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలోకి మహిళల్ని ఆకర్షిస్తేనే వాళ్లకు భవిష్యత్తు ఉంటుందంటారు నిపుణులు. మీరు ఇలా ప్రేమా దోమా అని వెలగబెడితే...పాపం ఆ చిన్ని మెషీన్ ప్రాణాలు ఏమైపోతాయో ఏమో ఆలోచించండి మీరు కూడా.

    ReplyDelete
  15. Sudden plate phiraiste shoot cheseyala
    khabardhar ani bhayapetaledu Robot nu :)

    ReplyDelete
  16. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కృత్రిమ మేధస్సూ, ఆటోమేషన్, రోబోటిక్స్ లాంటి కొత్త సాంకేతికత కారణంగా ఎన్నో రంగాల్లో సమూల మార్పులొచ్చాయన్నది మాత్రం నిజం. వర్చువల్ వెయిటర్లు, రోబో వైద్యులు, డ్రైవర్ రహిత కార్ల వంటివన్నీ ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ఫలితాలే. కానీ దూసుకెళ్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం ఉద్యోగుల జీవితంపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించవలసిన విషయము.
    ఆటోమేషన్ ప్రపంచానికి మంచిదా కాదా అన్న అంశంపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ రోబోలూ, కృత్రిమ మేధస్సు అభివృద్ధి వల్ల సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత రంగాల్లో అభివృద్ధి సాధించామన్నది నిజం. దీన్ని తప్పకుండా హర్షించి ఒప్పుకోవలసిందే.

    ReplyDelete
  17. Really great write up mam.

    ReplyDelete
  18. _/\_పద్మార్పిత ఆత్మీయ నమస్సుమాంజలి_/\_

    ReplyDelete
  19. computer lo panichestunaru
    robot tho romance aksharalato adukondi madam

    ReplyDelete
  20. అమ్మో... రోబోలతో రతి అనుకున్నా... రోబోతో పెట్టుకుంటే జీవితం హారతే అన్నమాట

    ReplyDelete
  21. రోబో తో రొమాన్స్-ఇది కరెక్ట్

    ReplyDelete