తుదిపులకరింపు!

తలపుల కౌగిలింతల్లో శ్వాసల మేళవింపు
పెదవుల కలయికలో ముద్దుల పలకరింపు
మౌనపు ఊసులతో మనసునిండా వలపు!
శృంగార పదభంగిమల్లో తనువు మైమరపు
అనురాగ రాసక్రీడలలో నలిగిన రసరమ్యకైపు
ప్రణయ పరిమళముతో శరీరమంతా సలుపు!
తడిసిన తెల్లచీరలో కనబడె నడుము వంపు
అరవిరిసిన అందాలను చూస్తు తినేసే చూపు
పరవశంతో పొంగిపొర్లె యవ్వనపు గుబాళింపు!
రాచుకున్న రాసలీలల్లో కనీకనబడని మెరుపు
వాత్సాయనకామ కసరత్తులే మరో ఆటవిడుపు
నడుంవంపులో చేసే సాక్షిసంతకమే ముగింపు!

21 comments:

  1. శృంగార పదభంగిమలతో ఊయలలు ఊగింది మనసు
    చాలా బాగా వ్రాసారు

    ReplyDelete
  2. కవితలో మీదే గెలుపు
    :) :0 :) :* ;%

    ReplyDelete
  3. Replies
    1. ఊహల రెక్కలు ఊసులకు దారి చూపేను
      ఆలోచన తరంగాలు భావాలకు నాంది పలికేను
      అవరోధాలను అధిగమించే తత్వం మానసిక పరిపక్వతకు బాటలు వేసేను

      Delete
  4. శృంగారాన్ని ప్రతీ పదములో ఒలికించారు కవితలో.

    ReplyDelete
  5. కవితలో ప్రేమతత్వాన్ని ఒక ఉచ్ఛస్తాయికి తీసుకెళ్ళి శృంగార భావాలతో ముగింపు పలికారు.

    ReplyDelete
  6. హద్దులు చెరిగె అక్షరాలతో
    తిరిగి ఇస్తాను పద్దులతో
    యుద్ధం చేస్తూ పొద్దులతో
    జతచేరిన మునిమాపులతో
    ఎగిరొచ్చేయ్ పక్షి రెక్కలతో
    వేచివుంటా వేయి కనులతో

    ReplyDelete
  7. Srungaram chinduluvesindi

    ReplyDelete
  8. శృంగార పదభంగిమల్లో తనువు మైమరపు

    ReplyDelete
  9. తీయని కోరికలు కలిగించి
    దీపాలు చీకటిలో వెలిగించి
    తీరని కోరికతో మది రగిలించి
    ఆరని వేదనను మాలో పెంచి
    అందమైన అక్షరాలతో అలరించి

    ReplyDelete
  10. సున్నిత పొరను చీల్చిన పదాలు మీ కవితలో.

    ReplyDelete
  11. ప్రణయ పరిమళము

    ReplyDelete
  12. కవి చౌదప్ప శతకం వచనంలో చదువుతున్నట్లు

    ReplyDelete
  13. శ్రీనాధకవి స్త్రీ రూపంలో వచ్చి వ్రాసినాడా?

    ReplyDelete
  14. శృంగారపు పాళ్ళు జాస్తి
    వాత్సాయన తొంగుని
    మమ్ము నిద్రలేపినాడా ఏమి?

    ReplyDelete
  15. రాచుకున్న రాసలీలల్లో కనీకనబడని :)

    ReplyDelete
  16. నా భావాలను ఆదరిస్తున్న మీకు అభివందనములు.

    ReplyDelete
  17. తలపుల కౌగిలింతల్లో శ్వాసల మేళవింపు....అద్భుతం

    ReplyDelete
  18. ఎంత సున్నితంగా వర్ణించారు.రసమయమైన వ్యాక్యాలతో రాగ రంజితంగా సాగిన ఈ కామ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంది.

    ReplyDelete