జీవితపాఠం..

ఒక బంధం నుండి బయటపడి మరో బంధంలో చిక్కడమంటే
పేణం మీద నుండి ఎగిరి వెళ్ళి పొయ్యి లోపల పడ్డం వంటిదే

ఒకర్ని మనసులో ఉంచుకుని మరొకర్ని పెళ్ళి చేసుకోడమంటే
ఏ ఎండకు ఆ గొడుగుపట్టి సద్దుమణిగినాక సర్దుకు పోవడమే!

ఒకసారికి ఒకటి చెప్పి మరోసారికి మాట మార్చేయడం అంటే
రాజకీయాల్లోన రాణించే లక్షణాలను పుష్కలంగా లభించినట్లే

ఒకటికి పదిసార్లు చెప్పిందే చెప్పి చేసిందే చేస్తున్నారు అంటే
వయసు పెరిగిన కొద్దీ చాదస్తం ముదిరి తిక్క తలకెక్కడం!

ఒకసారి చేసిన తప్పును ఇంకొకమారు చేయటంలేదు అంటే
అనుభవాలలెన్నో ఆలింగన చేసుకుని బ్రతకడం నేర్చుకున్నట్లే

ఒకే తప్పు ఎన్నిసార్లు వద్దన్నా మళ్ళీ తప్పు చేయడం అంటే
నిండా ములిగిన వాడికి చలేంటని చలేంటని సరిపెట్టుకోవడం!

19 comments:

  1. ఇన్ని జీవిత సత్యాలు ఒకేసారి వ్రాస్తే జీర్ణించుకోవడం కష్టం.

    ReplyDelete
  2. వ్యధ నుండి పుట్టిన వేదాంతం.

    ReplyDelete
  3. Real life lessons
    Picture is attractive andi.

    ReplyDelete
  4. లైఫ్ లో గుర్తు ఉంచుకోవలసిన విషయాలు

    ReplyDelete
  5. జీవిత సత్యాలు
    మీ భావాక్షరాలు

    ReplyDelete
  6. oka tappu 100 sarlu chesina siksha undadu.

    ReplyDelete
  7. ఒకటికి పదిసార్లు చెప్పిందే చెప్పి చేసిందే చేయడం పసిపిల్లకు అయితే చెప్పిందే చెబుతము వయసు పై పడిన వారిని విసుక్కుంటాము. మనుషులం ఎందుకు ఇలా చేస్తామో అనిపిస్తుంది.

    ReplyDelete
  8. జీవిత సారాంశం:
    అమ్మ పొత్తిళ్ళలో న్యానోమీటర్ నుండి మిల్లిమీటర్ స్థాయి లో ఎదిగి బయిట ప్రపంచాన్ని విస్మయంతౌ ఆశ్చర్యంతో అయోమయంతో పరీకించినా.. రోజువారి కష్టసుఖాలతో సావాసం చేసి ఎదుగుతు ఒదిగినా చివరి మజిలి లో కౌంట్ చేసుకునేవి జ్ఞాపకాలు, అనక పేర్చిన చితిపై ఆఖరి శయనం.. మంటలో ఆహుతి ఔతు దేహపు అంతిమ పయనం..!

    ReplyDelete
  9. జివితం బ్రతికి ఉన్నంత వరకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.

    ReplyDelete
  10. జీవితం అంటేనే ఒక అంతులేని పోరాటం. మన జీవితాలకు ఆధారం ఏమిటీ అంటే ఏదో ఒక గొప్పదనాన్ని సాధించాలనే పోరాటం.. మన జీవితాలకు ఆధారం ఏమిటీ అంటే ఏదో ఒక గొప్పదనాన్ని సాధించాలనే పోరాటం; ప్రయాసా, పోరాటమూ....

    ReplyDelete
  11. అనుభవాలలెన్నో ఆలింగన చేసుకుని బ్రతకడం నేర్చుకున్న

    ReplyDelete
  12. Beautifully said Padma

    ReplyDelete
  13. అనునిత్యం జరిగే సత్యాలు

    ReplyDelete
  14. జీవితం ఒక యుద్ధం
    పోరాడి...గెలువు
    జీవితం ఒక బహుమానం
    దానిని..స్వీకరించు
    జీవితం ఒక రహస్యం
    పరిశోధించి..తెలుసుకో
    జీవితం ఒక నాటకం
    నీ పాత్రను..ప్రదర్శించు
    జీవితం ఒక చాలెంజ్
    ధైర్యంగా..ఎదుర్కో!!

    ReplyDelete
  15. జీవితపు ఒడిదుడుకులు కష్టసుఃఖాలు బాగా వ్రాస్తారు మీరు. చిత్రాలు కూడా తగినట్లు ఉంటాయి.

    ReplyDelete
  16. ముఖ్యమైన పాఠం

    ReplyDelete
  17. బ్యూటిఫుల్ ఫీల్.

    ReplyDelete