మొహమాటమోహం..

మదిని గిలక్కొట్టి వెన్నవంటి భావాలని వెలికితీయి..

కవ్వమే విరిపోయెనని కధలు చెప్పి కల్లోల పరచకు!

నుదుటిన ముద్దిడి ముంగురుల ముసుగులో చిక్కి..
మధువులొలికే పెదాలని ముద్దాడ మత్తు ఎక్కెననకు!

మోహపుదాహాన్ని మొహమాట పడక వెళ్ళగక్కేయి..
నీలోనే దాచుకుని ఏమెరుగని నన్ను లోభిని అనకు!

నిలువెత్తు నీ రూపాన్ని నా గుండెల నిండుగ కుక్కి..
అంటరానితనాన్ని అంటగట్టి ఆమడదూరంలో ఉండకు!

విరబూసిన మల్లెపూరేకుల సువాసన్ని ఎగపీల్చేయి..
ప్రణయపరుపుపై మెత్తదిండుల దిగంబరత్వాన్ని కోరకు!

తనువంతా తడిమేటి వ్యామోహపు తలపులలో నక్కి..
వేడెక్కిన దేహానికి దాహమెక్కువైతే వేశ్యను అనుకోకు!

విరహం పక్కనెట్టి వాంఛల్ని విచ్చలవిడిగా తిరగనీయి..
పురుడు పోసుకునే ప్రేమకు పురిటినొప్పేలని అడుగకు! 

25 comments:

 1. స్త్రీలు చెప్పలేని మనోభావాలు కనుల ముందు ఉంచారు.

  ReplyDelete
 2. అద్భుత పదాలు

  ReplyDelete
 3. amma neeku vandanamulu
  awesome post & pic.

  ReplyDelete
 4. ప్రతీ పదంలోను భావాన్ని సున్నితంగా పండించారు.

  ReplyDelete
 5. అద్భుతంగా పొందుపరచిన అక్షరమాల...అందుకోండి అభినందనలు.

  ReplyDelete
 6. పురుడు పోసుకునే ప్రేమకు పురిటినొప్పేల...ఇలాంటి అద్భుత వాక్యాలు మీరే వ్రాయగలరు.

  ReplyDelete
 7. mohamatam lekunda cheppe mee bhaavalaku "HATS OFF"

  ReplyDelete
 8. chitramu chudataniki mohamatam ledu atuvantapudu chadavadaniki vinataniki mohamatam enduku?

  ReplyDelete
 9. వూరేయి గోపాళం.. సిగాన పేసునాంబ.. బుడుగు.. రండర్రా.. భావాల లోగిలి నడుమ అక్షరాల జాటర్ ఢమాల్..!

  ReplyDelete
  Replies
  1. felice anno nuovo duemilaventuno, tutti. trascorri un anno sano e prospero. con cordiali saluti.
   ~dharAni

   Delete
 10. తనువంతా తడిమేటి వ్యామోహపు తలపులలో నక్కి..
  వేడెక్కిన దేహానికి దాహమెక్కువైతే వేశ్యను అనుకోకు!

  ReplyDelete
 11. వాహ్ వావ్...ఏమి ఘాటుగా మురిపించారు.

  ReplyDelete
  Replies
  1. Are you there?
   Missing your pic& poetry

   Delete
 12. మాటల్లేవు
  అద్భుత ప్రయోగం

  ReplyDelete
 13. Sringaramlo sunnitatwam anukovala leka maarana homaniki siddham anukovalo artham kaledu. chitram super.

  ReplyDelete
 14. Advance happy new year Padmarpita garu.

  ReplyDelete
 15. adbuthamaina nirvachanam.
  New year wishes to you Padma.

  ReplyDelete

 16. మోహపుదాహాన్ని మొహమాట పడక వెళ్ళగక్కేయి..వారే వాహ్ చెప్పినంత సులభం కాదు..చెప్పుదెబ్బలు తప్పవు :)

  ReplyDelete
 17. పురుడు పోసుకునే ప్రేమకు పురిటినొప్పేల? అమోఘం

  ReplyDelete
 18. విరహం పక్కనెట్టి వాంఛల్ని విచ్చలవిడిగా తిరగనీయి..How it is possible madam!!!!?

  ReplyDelete
 19. Madam Padmarpita garu
  No post in 2021. Are you okay andi

  ReplyDelete
 20. తనువంతా తడిమేటి వ్యామోహపు..amazing feel andi

  ReplyDelete
 21. అందరి ఆత్మీయతకూ మరో మారు చెతులెత్తి నమస్కరిస్తున్నాను..మీ పద్మార్పిత _/\_ _/\_

  ReplyDelete