చూసేటి కనులకు చుట్టూ అన్నీ
సుగంధ పరిమళపు పుష్పాలే..
అవి విచ్చి వెదజల్లటానికి జరిగే
విస్ఫోటకాలు ఎవ్వరికీ కనబడవుగా!
పెరిగే మొక్కల కౌగిట్లో మొగ్గలన్నీ
పువ్వు విచ్చితే జరుగు సంబరాలే..
ఆ పూతేనెను జుర్రుకోవాలని చేసే
కపట కల్మష ప్రయత్నం ఎందరిదోగా!
పూల అమాయకపు అవయవాలన్నీ
అందంగా విచ్చుకుని వేసే చిందులే..
మోహమాయ ముళ్ళలో ఇరుక్కునే
పుప్పడిరెక్కలకు పరిమళం అంటదుగా!
వనమంతా ఝుమ్మనే తేనెటీగలన్నీ
కనబడని మర్మప్రాంతపు దృశ్యాలే..
నిర్జీవ లోకం చూడాలన్న యోచనే
తెలియని ఇంద్రజాలపు ప్రతిబింబంగా!
స్త్రీలను పూలతో పోల్చి చెప్పినట్లు ఉన్నారు.
ReplyDeletepuvvula parimalame andariki kavali, vati kashtalato paniledu evvariki..well written madam.
ReplyDeleteఏ పువ్వులో ఏమి వ్యధ దాగి ఉన్నదో?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete•<!*_*!>•
ReplyDelete౽:"...":౽
~౻౻౼౻౻~
౾ ౾
నిత్యనిర్మలమైన వాటిక లో పరిమళభరితమైన దానిమ్మ పుష్పాలు
ReplyDeleteఅలరారె తోటలో రంగురంగుల అరటి పువ్వులు
పచ్చని చెట్టుపై అల్లంత దూరాన కొబ్బరి పువ్వులు
ముళ్ళ కంపలపై మృదువైన రేకులు గల మొగలి పూరెమ్మలు
పూలన్నీపరిమళాలు వెదజల్లవు..
ReplyDeleteఅన్ని పువ్వులూ పూజకు పనికిరావు
పువ్వుల్లో దాగున్న పరిమళమే కదా పూలకు అందం. ఆ పరిమళమే లేనప్పుడు ఎందుకు? కాగితపు పూలు ఎందుకు పనికివస్తాయి చెప్పండి.
ReplyDeleteపువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ReplyDeleteఆ సీతాకోకచిలక ఒళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం
అచ్చరువొందె మీ ఆలోచనలే అతిశయం..
If you enjoy the fragrance of a rose, you must accept the thorns which it bears.
ReplyDeleteFragrance of poetry.
ReplyDeleteవిరుల ఊసు లేని కవిత్వం ఉండదు.
ReplyDeleteప్రకృతికి శోభనిస్తూ పరిసరాలను ప్రశాంతంగా ఉంచేవి పువ్వులు.
ReplyDeleteబాగు బాగు..
ReplyDeleteకనబడని మర్మప్రాంతపు దృశ్యాలే..
ReplyDeleteఅవే అందమైన అక్షరాల పొదరిల్లు.
ReplyDeletewrite in simple way madam.
ReplyDeleteartam chesukovatam kashtam ila raste
పద్మార్పిత రాసే అక్షరభావాలాని ఆస్వాధించే అభిమాన ఆత్మీయులకు అభివందనం _/\_
ReplyDeletechurakatti
ReplyDeleteపుప్పడిరెక్కలకు పరిమళం అంటదు-strong line
ReplyDelete