నీవు నా జీవితం కాకపోయినా
నా జీవితంలో భాగమైపో...
నీవు నా నవ్వుల హరివిల్లు కాకపోయినా
నా పెదవులపై చిరునవ్వైపో...
నీవు నా కంటికెదురుగా లేకపోయినా
నా కంటిపాపవైపో...
నీవు నాకు మనస్సుని ఇవ్వలేకపోయినా
నా గుండెల సవ్వడివైపో...
నీవు నాప్రేమ గీతం కాకపోయినా
నా ప్రతి కవితలో ఇమిడిపో...
నీవు నాకు సంతోషాన్ని ఇవ్వకపోయినా
నా భాధవై నాలో ఉండిపో...
నీవు నా చెంత లేకపోయినా
నా ఊహల సౌధనివైపో...
నీవు నిన్నలలో లేకపోయినా
నా నేడై వుండిపో...
నీవు నాదీపం కాకపోయినా
నా ధూపమై కరిగిపో......
ఫొటో చాలా బాగుంది పద్మ గారు కవిత కొంచెం తికమకగా అనిపించింది :)మళ్ళోసారి చదవాలి నేను పనులన్నీ అయ్యాకా
ReplyDelete''అమ్మని చెయ్యలేక పోయినా అగరుబత్తి వైపో '' అని ఆఖర్న add చేస్తే ఇంక బావుండేదేమో పద్మార్పిత గారు.
ReplyDeleteమసక మసక చీకటిలో
ReplyDeleteమంచి అగరు బత్తీలో
కలసి మెలసి ఒకటైపో
కాలానికి ఎదురై పో
Kavithanu artham chesukovataniki
ReplyDeletesaripade kalam naa vadda ledu
kaani kannulanu my marpipchese
chitram entho adbutham
నేస్తమా... ధన్యవాదాలు.
ReplyDeleteఅనుకుమార్ గారు మీకు కూడా....
రవిగారు... కొన్నిభావాలని సున్నితంగా చెబితేనే బాగుంటాయి కదండీ!!!
ReplyDeleteశర్మగారు... మీ కాగడాకి చురకలే కాదు, కవిత్వం కూడా వచ్చాండీ!!!
బొమ్మలు చక్కగా ఉన్నాయి.
ReplyDeleteప్రసన్న కుమార్ గారికి ధన్యవాదాలు!!!
ReplyDeleteబొమ్మ చాలా బావుంది. మొదట సిగరెట్ పొగేమో అనుకున్నా. కానీ కిందదాకా స్క్రోల్ చేసి చూస్తే అగరు పొగలోంచి బొమ్మలు రూపు దిద్దుకోవడం చాలా సందర్భోచితంగా ఉంది. .. ఎప్పుడో ఆకాశవాణిలో వస్తుండే లలిత సంగీతంలో అగరు పూల లతికవోలె అనే గేయపాదం మనసులో మెదిలింది.
ReplyDeleteధన్యవాదాలండి..... మీ వ్యాఖ్యతో ధూపంలోని బొమ్మలకి కదలిక వచ్చింది, గమనించారా!!!!
ReplyDeleteమొదటి రెండు లైన్స్ చాల అద్బుతం ,.ఎంత సున్నితంగా వ్యక్తపరుస్తునరండి ...
ReplyDeleteమొదటి రెండు లైన్స్ చాల అద్బుతం ,.ఎంత సున్నితంగా వ్యక్తపరుస్తునరండి ...
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteHey Padmarpita nee kavithalu and photography nannu chala impress chesayi...oka feel vundi
ReplyDelete'నీవు ఒక వెన్నల వాసంతమైతే...
ReplyDeleteనేను జాబిలికి సుగంధాన్నిస్తా... ' ఏదో పిచ్చిగా రాసాను కానీ మీ కవిత అదరహ.