శిల్పి చెక్కిన సూక్తి....

క్రిందటి ఏడాది తాతగారు ఊళ్ళో గుడి కట్టిస్తున్నారంటే చూద్దామని వెళ్ళాను. గుడిలో ఒక శిల్పి దేవుడి విగ్రహాన్ని శ్రద్దగా చెక్కుతున్నాడు. అతను చెక్కుతున్న విగ్రహం లాంటిదే మరో విగ్రహం అతనికి కొద్ది దూరంలోనే నాకు కనిపించింది. ఆ విగ్రహాన్ని చూసి శిల్పిని అడిగాను "ఒకే రకమైన రెండు విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నారా?"అని.
నా ప్రశ్నకి అతను "లేదమ్మ ఆ విగ్రహం విరిగింది" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమై పోయాడు.
ఆ విగ్రహాన్ని ఎంతసేపు పరీక్షించినా నాకు ఎక్కడా విరిగిన జాడలే కనిపించలేదు, ముఖంపైన చెంప వద్ద చిన్ని బీట తప్ప....
ఆశ్చర్యంతో ఆగలేక శిల్పిని అడిగాను "ఎంతో పరీక్షగా గమనిస్తే, లేకపోతే మీరు చెప్పే వరకు కూడా ఆ బీటనేది ఎవరికీతెలియదు కదా!! ఎవరు చూస్తారని మీరు దాని కోసం ఇంత శ్రమపడి ఇంకొకటి చెక్కుతున్నారు?"అని.
నా ప్రశ్నకి శిల్పి చిరునవ్వు నవ్వి "ఎవరు చూసినా చూడక పోయినా నాకు తెలుసు కదమ్మా.. విగ్రహం బీట బారిందని, అలాగే ఆ దేవుడికి కూడా తెలుసు" అని సమాధానమిచ్చి తన పనిలో నిమగ్నమైపోయాడు.
అప్పుడు ఆ శిల్పిని చూస్తే అనిపించింది...."మనస్సాక్షిని మించిన సాక్షం లేదని, అతను చెక్కుతున్నది విగ్రహాన్నే అయినా దానితో పాటు నా మనోపలకం పై గొప్ప సూక్తిని కూడా చెక్కాడని"....

8 comments:

  1. దిలీప్ గారు ధన్యవాదాలండి....
    I think obervation is good, but the way i expressed is not.... ఏమంటారు?
    Next time i'll try my level best...

    ReplyDelete
  2. @పద్మార్పిత
    మీ వ్యక్తీకరణ కూడా బాగుంది. మనం వ్యక్తపరిచే విషయానికి మనల్ని కట్టిపడెయ్యగలిగే విలువ ఉన్నప్పుడు, మనం ఏ విధంగా వ్యక్తపరిచాము అనేది చాలాసార్లు ప్రాముఖ్యత సంతరించుకోదు. అందుకే మీరు రాసింది చదివినప్పుడు అందులో విషయం నన్ను ఆకర్షించింది కానీ మీరు ఎలా రాసారా అని ఆలోచించలేదు... You just did strike a chord in me at that moment!

    ReplyDelete
  3. థాంక్సండీ.....అశోక్ గారికి, దిలీప్ గారికి!!
    నేస్తమా.... నిన్ను మరువలేదు సుమ(thankQ)!!

    ReplyDelete
  4. చాలా బాగుంది పద్మార్పిత గారు. బాగా ప్రెజెంట్ చేశారు. అభినందనలు. నా బ్లాగు టెంప్లేటు మార్చానండి. ఇప్పుడు బాగానే పని చేస్తుంది. పృధ్వీ ద్వారా నాకు అది తెలియజేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. ఆత్రేయగారు..... ధన్యవాదాలు!!

    ReplyDelete
  6. పద్మా,

    మంచి టపా, టపాకు తగిన శిల్పం.

    ReplyDelete