నీ ఒడిలో నన్ను సేద తీరని...
నీ తలపులలో
నా కలతలన్ని కరగిపోని...
నీ ఆనందానికి నేను అడ్డుకానని...
నీ కష్టసుఖాలు
నా అనుకుని పాలుపంచుకోని...
నీ ప్రేమలో నన్ను మైమరచిపోని...
నీ ప్రతి అణువులో
నా రూపం మిగిలిపోని...
నీ మాటైనా పాటైనా నాదవని...
నీ ప్రతి క్షణం
నా కోసమే అనుకోని...
నీ శ్వాసలో నన్ను కలవని...
నీ చివరి ఊపిరి వరకు
నా ప్రాణముండిపోని...
This comment has been removed by a blog administrator.
ReplyDeleteబాగుందండి. మీరు కవిత రాసి ఫోటో కోసం వెతుకుతార? లేక ఫోటో నుంచి ప్రేరణ పొంది కవిత రాస్తారా? Perfect match..
ReplyDeleteమురళిగారు థాంక్సండి...
ReplyDeleteకవిత వ్రాసి ఫోటోకోసం వెతుకుతాను,
ఒకోసారి ఫొటోకే టైం ఎక్కువపడుతుంది,
మీలాంటివారి మెప్పులతో ఆనందంగా అనిపిస్తుందండి...
కవిత చాలా బాగుందండి.
ReplyDeleteఎంత అద్బుతంగా చెప్పారండి. మీ బ్లాగ్ ఇపుడే మొత్తం చూసాను.ఓ కళా హృదయం ,ప్రేమైక మందిరంగంచనండి.
ReplyDeleteపద్మార్పిత గారూ !కవిత బాగుందండి. మీ బ్లాగ్ ,శృతి గారి బ్లాగ్ చూసి ఇన్ స్పైర్ అయ్యి నేనుకూడా ఫస్ట్ టైం కష్టపడి వెదికి బొమ్మలు పెట్టాను .చూశారా ?
ReplyDeleteవిజయమోహన్ గారికి. చిన్ని(అనామిక అని అంటాను నొచ్చుకోకండి మీ పేరు ఇంకా చెప్పలేదుగా )గారికి ధన్యవాదాలు.
ReplyDeleteThank Q.....
ReplyDeleteపరిమళగారు అప్పుడే చూసా..... relevant గా ఉన్నాయండి.
"నీ ఆనందానికి నేను అడ్డుకానని...
ReplyDeleteనీ కష్టసుఖాలు
నా అనుకుని పాలుపంచుకోని..."
అది నిజమైన "నీలో నేను", "నీతో నేను"!
కవితా బాగుంది, బొమ్మ కూడా బాగుంది...
This comment has been removed by the author.
ReplyDeleteబాగుందండి. ఇక్కడకి వచ్చిన ప్రతి సారీ ఎన్నో భావాలు ముప్పిరిగుంటాయి. గుండె ఏళ్ళతరబడి మూసుపోయిన జ్ఞాపకాల గదులు తెరిచి మరీ నామీదకి వాటిని తరుముతుంది. ఎన్నని వ్రాయగలను, ఇలా ఒక్క మాటతో చెప్పాల్సిన మాట చెప్పటమే కాని.
ReplyDeletenice one padma gaaru chaalaa baagundi
ReplyDeletesimply superb!! No other words
ReplyDeleteమేడమ్,ప్రపంచంలో భావుకత చచ్చి పోతోంది అని భాధపడె నాలాంటి వాళ్ళకు మీబ్లాగు నిజంగా ఒయసిస్సే.మనస్సును తడిగా వుంచుకోలేని వారు సమాజ హితాన్ని కాంక్షించలేరని నాభావన. నేను మొదటిసారి మీబ్లాగు చూసి సంతోషించాను .
ReplyDelete-సుబ్బారెడ్డి
దిలీప్ గారికి,ఉషగారికి, నేస్తానికి,సమీహగారికి,సుబ్బారెడ్డిగారికి...
ReplyDeleteనా బ్లాగ్ కి విచ్చేసి,
మెచ్చేసి,
వ్యాఖ పెట్టేసి......
నందుకు ధన్యవాదములు!!!
really exlent....
ReplyDeleteno words padmaarpitha garu mee perulone undi padmamulu lanti kavithalu andariki arpistunnarandi
ReplyDelete