వేళ కాని వేళ!


ఏ రాగం ఆలపించను, అనురాగం శృతి తప్పినవేళ!
ఎలుగెత్తి నేనేమి తెలుపను, నీవు మౌనం దాల్చినవేళ!

హృదయం అలిసేలా రోధించాను, లోకం నిదురించిన వేళ!
చందమామనే చూడనెంచాను, కారుమబ్బులు కమ్మినవేళ!

బీడుబారిన నేలలో మొక్కను నాటాను, మండు వేసవి వేళ!
బాధను దిగమ్రింగి నవ్వాను, నీవు వేరొకరి సొంతమైన వేళ!

కన్నీటితో దాహంతీర్చ తలచావెందుకు? కనులు మూతపడిన వేళ!
ఏడిపించిన నీవే కుమిలిపోతావు ఎందుకు? నేను కాటికి సాగిన వేళ!

16 comments:

  1. ఎంతో అద్భుతమయిన భావన! దానిని చక్కని పదజాలాలతో పొదిగిన మీ కవిత చాలా బాగుంది!

    ReplyDelete
  2. కన్నీటితో దాహంతీర్చ తలచావెందుకు...
    చాలా బాగుంది భావం. బొమ్మా మీరేసిందేనా?

    ReplyDelete
  3. ఏమని వివరించను, ఎదను తాకిన కవిత చదివిన వేళ!

    మీ బొమ్మలు చాలా చక్కగా ఉన్నాయండీ..

    ReplyDelete
  4. అయ్యో ఎందుకంత దిగులు :((

    ReplyDelete
  5. ఏడిపించిన నీవే కుమిలిపోతావు ఎందుకు? నేను కాటికి సాగిన వేళ!
    ఓహ్! చాలా చక్కని భావజాలం.పదాల కూర్పు బాగుందండీ.

    ReplyDelete
  6. @రసజ్ఞ,జ్యోతిర్మయి ....thank Q!
    @చిట్టి,పండుగారు...భావం నచ్చినందుకు థాంక్సండి!
    పెయింటింగ్ "ఎదురుచూస్తున్నా" అనే కవితకు వేయబోయి, భావాలు బొమ్మలో కనిపించడంలేదని ఇలా మెడను వాల్చేసా, కవితను వ్రాసేసా....వాట్ యాన్ ఐడియా కదా! :):)

    ReplyDelete
  7. @భాస్కర్ గారు.....దిగులు నాకెందులకు?
    మీరంతా నా వెంట ఉన్నంతవరకు???:):)
    @ SwapnaChandu, Subha గార్లకు ధన్యవాదాలు!

    ReplyDelete
  8. ఏడిపించిన నీవే కుమిలిపోతావు ఎందుకు? నేను కాటికి సాగిన వేళ!

    ee line naaku nachaledu...

    ReplyDelete
  9. మా పద్మ ఏ వేళలో అయినా ధైర్యవంతురాలే కాదంటావా?:)కవిత బాగుంది.

    ReplyDelete
  10. మీరు వెలిబుచ్చిన భావాలు పరిమళాలు వెదజల్లు మరు మల్లెలు!
    మీరు చిత్రించిన చిత్రాలు చూపులు కట్టేసే రసమయ దృశ్యాలు !!

    ReplyDelete
  11. మీరు వెలిబుచ్చిన భావాలు పరిమళాలు వెదజల్లు మరు మల్లెలు!
    మీరు చిత్రించిన చిత్రాలు చూపులు కట్టేసే రసమయ దృశ్యాలు !!

    ReplyDelete
  12. మీరు వెలిబుచ్చిన భావాలు పరిమళాలు వెదజల్లు మరు మల్లెలు!
    మీరు చిత్రించిన చిత్రాలు చూపులు కట్టేసే రసమయ దృశ్యాలు !!

    ReplyDelete
  13. చివరి వాక్యం నచ్చలే...బాధగా వుంది పద్మార్పిత గారు...

    ReplyDelete