అడగనా? మాననా!

గుడిమెట్లు తుడవ నేను తగుదునా?
గుడిలోని కుంకుమ నే తాకలేనా!

పూలమాలలు నేను అల్లవలెనా?
ఆ మాల తలన నే తురుముకోతగనా!

రంగవల్లులు ఎన్నైనా నే రంగరించనా?
రంగులలోకాన్ని ఊహించడం తప్పౌనా!

శింగార సామాగ్రి నే సమకూర్చగలనా?
శింగారించుకున్న నేను సిగ్గులేనిదాననా!

ముత్తైదువులతో చేరి ముచ్చటించగలనా?
మురిపాలకు మాత్రం దూరమై మసలవలెనా!

విధవరాలంటూ గడియకోసారి గుర్తుచేయవలెనా?
విధిచేత బలైనవారినే పలుమార్లు బలీయతగునా?

62 comments:

  1. పద్మ గారు!
    ఆర్ద్రంగా ఉంది!

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి విచ్చేసేలా చేసింది....
      ఆర్ద్రతైనా!!! నెనర్లండి.

      Delete
  2. vari vedanani chakkaga avishkarincharandi.

    ReplyDelete
  3. Anonymous10 June, 2012

    నివేదన లాటి వేదన

    ReplyDelete
    Replies
    1. ఆచరించని నివేదనలెన్నైనా వేదనలేకదండి!

      Delete
  4. విధి విధానాన్నిప్రశ్నించారు ,
    వైధవ్యం లోని వేదనని ఆర్ద్రంగా చెప్పారు .
    అంతకన్నా మీరు పొందు పరచిన చిత్రం వదనం లో
    కన్నుల్లో ఆ దైన్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది
    మది కలచి వేసిన మీ కవిత కర్తవ్యం నెరవేరింది
    ఆ గొప్పదనం మీది మీ కలానిది .అభినందనం
    అయినా ఆ సనాతన సంప్రదాయాలు
    అర్ధం లేని ఆంక్షలు ఇంకానా
    నిరసిద్దాం .నిషేదిద్దాం

    ReplyDelete
    Replies
    1. మదిలోని భావాన్ని
      చిత్రంలోని ఆవేదన్ని
      అర్థంచేసుకుని అభినందించిన
      మీకు అభివాదములు.

      Delete
  5. Anonymous10 June, 2012

    painful

    ReplyDelete
    Replies
    1. Yes...truth is always painful..

      Delete
    2. nijam nisturam ga untundantara,
      satyame sowdaryam kadantara,
      emonandi,antha ayomayam.
      (madhyaloki anavasaram ga vachinatlunnanu.)

      Delete
    3. Adem ledandi mee version cheppaaru:-)
      You are always welcome to express..

      Delete
  6. చాలా చక్కగా ఉందండీ పదాల కూర్పు.భావం కూడా అంతే లోతుగా ఉంది.Great one Padma gAru.

    ReplyDelete
    Replies
    1. మీరాకతో పాటుగా మీరు మెచ్చిన తీరు నచ్చిందండి!
      Thanks a lot Kranti garu.

      Delete
  7. నిలదీసి నిజాలని ఖచ్చితంగా అడిగినట్లుంది కవిత.

    ReplyDelete
    Replies
    1. అడిగినదానికన్నా ఆచరిస్తే ఆనందంకదండీ!

      Delete
  8. ఇది మారటానికి ఏం చెయ్యాలోనండీ!

    ReplyDelete
    Replies
    1. ఆలోచనా ధోరణిమారి ఆచరిస్తే బహుశా ఫలితముంటుందేమో!

      Delete
  9. మానొద్దు...అడుగుతునే ఉండాలి.
    అనాగరిక కాలం నాటి ఆచారాలు అవన్నీ...ఆ నాటి సమాజానికి అవి గొప్పేమో...ఈనాటి సమాజానికి కాదు.
    విధి కొందరి జీవితాల్తో బలీయంగా ఆడుకుంటుంది.
    ఆ విధి శాపానికి బలయ్యాం అనేలా కాక ఆ విధినే తిరిగి శపించేలా ఉండాలి జీవితాలు. అప్పుడే జీవితాలు సార్ధకం...
    కవిత లో ఆర్ద్రత తో బాటు చాలా సున్నితంగా ఈ సమాజాన్నీ ప్రశ్నించిన తీరు అద్భుతం!
    మంచి కవిత, అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. బాగాచెప్పారండి...థ్యాంక్సండి!

      Delete
  10. హ్మ్..గుండెలోలోతుల్లో గురిచూసి కొట్టినట్టున్నాయండీ ఈ ప్రశ్నల శరపరంపర...చదువుతుంటే బాధగా వుంది....ఆ చిత్రం కూడా అమరింది..అభినందనలు పద్మార్పిత గారూ..

    ReplyDelete
    Replies
    1. గుండెలోతుల్లో గుచ్చుకుంటే అది భాధ
      మార్పును కోరితే తీరేనేమో ఈ వ్యధ
      వర్మగారు...ధన్యవాదాలండి!

      Delete
  11. పద్మగారూ, గుండెల్లో ఓ విదమైన వేదన మీ కవిత చాలా ఆలోచింపచేస్తుంది. కాలం మారినట్లు కనిపిస్తున్నా ఇంకా మనసు పొరల్లో పోలేదు ముఖ్యంగా ఆడవాళ్లే దీనికి కారణం సహా జాతికి వీరే శత్రువులు. మేడం చాలా బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. మీ పరిశీలనా విశ్లేషణ సత్యం.
      ఈ ఆచరణలు, అవలంభించడాలలో స్త్రీ పాత్రే ఎక్కువండి
      స్వజాతే అయినా ఒప్పుకోక తప్పదు..మార్పుని ఆశిద్దాం!
      ధన్యవాదాలండి!

      Delete
  12. English lo kuda rayandi...
    maa lanti vari kosam..
    BTW....Pic kocham better di tesukondi..Its not clear..
    :) tapu ga matladi undi sorry...tc

    ReplyDelete
    Replies
    1. Telugu lo cheppinanta baagaa english lo bhaavalani express cheyalenu ramya...try to read and understand dear:-)
      BTW...i will try.
      not at all....thank Q!

      Delete
  13. చాలా కాలం తర్వాత మీ బ్లాగులోకి వచ్చాను
    కామెంటు రాయనా వద్దా అనిపించింది

    అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీకు ఎందుకని అలా అనిపించిందో తెలుపలేదు....
      అభినందనలకు థ్యాంక్స్ చెప్పకుండా మనసూరుకోదు:-)

      Delete
  14. పద్మార్పిత గారు!
    ప్రతిసారి వ్యాఖ్య వ్రాయక పోవచ్చు గాని.. తరుచుగా మీ బ్లాగుని దర్శిస్తుంటానండి!
    మీ బ్లాగులోకి ప్రవేశించగానే - నాకు
    ఒక ఆర్ట్ గాలరీలోకి.. ఒక శబ్దాలయంలోకి... ఒక సంగీత మందిరంలోకి.... చేరుకొన్న అనుభూతి కలుగుతుంది.
    మీకు నా హృదయ పూర్వకాభినందన!

    ReplyDelete
    Replies
    1. మీ ఈ హృదపూర్వపు స్పందనతో
      నా మది గాల్లో తేలినట్లుందండి:-)
      మనఃపూర్వక అభివందనములు!!!

      Delete
  15. meeru mee aalochanalu eppudu gr8 andi....artham leni aaacharalu lokamlo chala vunnai lendi :-(. patinchadam tappa...prasniche dhiryam entamadikuntundi cheppadi....sanganni n atthamleni mudha aacharalni....???

    ReplyDelete
    Replies
    1. that's true...at least ila think chestu konnaallakainaa maarpukai aasiddam.thanks for comment.

      Delete
  16. పద్మార్పితనా!!! మజాకానా అన్నట్లు అడిగారు కాని ఆచరణరూపం??

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  17. చాలా బాగుంది పద్మ గారూ!
    అనాగరికమైన ఆచారాలపై సంధించిన
    కవితాస్త్రం....
    మీకు అభినందనలు....


    అన్నట్లు...
    బ్లాగ్ టైటిల్ చిత్రం మీదా?
    @శ్రీ

    ReplyDelete
  18. ధన్యవాదాలండి!!!
    అన్నట్లు...
    అమ్మాయి నచ్చిందా:-)

    ReplyDelete
    Replies
    1. మీ ఆడవారంతా ...
      అంటే చాలామంది ఫొటోస్ పెట్టకుండా మరేవో చిత్రాలు
      పెడుతుంటారు కదా!..:-))..
      అందుకని మీ ఫోటో ఏమో అని అడిగాను....
      కాకపొతే ఆ ఫోటో ఎక్కడో చూసినట్లుంది....
      @శ్రీ

      Delete
    2. ammayi natchindandi....ammayi adress urgentga chebite...velli ammayi kallu matram techesukuntanu.....!!!!!!!!!

      yes...i also saw dat foto some where....may be dat gal workd in tourism dept. in hyd long back....

      ladies always put other fotos der is no doubt sri...?????

      Delete
    3. Anonymous12 June, 2012

      శ్రీనివాస్ గారూ ఆమె కళ్ళు పీకేసి తెచ్చుకుంటారా?? కామెంటు రాసేముందు అది మన బ్లాగు కాదు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేట్టు వుందా లేదా అన్న ఆలోచనతో రాయండి.. మీకెవరైనా అడ్రసులడిగారా?? ఆడవారిపై విశ్లేషణలెందుకిక్కడ??

      Delete
    4. సరదాగా నవ్వుతూ సాగనీయండి ఈ బ్లాగర్స్ స్నేహపయనం...

      Delete
    5. పద్మ గారూ!
      నా కామెంట్ కేవలం సరదాగా తీసుకోండి...
      ఎవర్నీ ఉద్దేశించి...
      ఆడవారిని కించపరిచేదిగా
      కాదండోయ్....
      @శ్రీ

      Delete
    6. "శ్రీ"గారు నేను కూడా సరదాగానే సమాధానాలు ఇస్తున్నాను అనుకుంటున్నా!
      ఎవరినీ ఏవిధంగాను భాధపెట్టాలని, కించపరచాలని మాత్రం కాదండోయ్!
      కాసేపు హాయిగా నవ్వుకుంటారని మాత్రమే....గమనించ ప్రార్ధన:-)

      Delete
  19. చాలా టచీగా వుందండి .

    మీ టెంప్లెట్ చాలా బాగుంది . పైన వుంది మీ ఫొటోయేనా ?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి!!!

      Delete
  20. చాలా చాలా బాగుంది. ఇంకా ..ఇంకా..ఎన్నాళ్ళు ఈ బాధయిన వైధవ్య ముద్ర? అని సూటిగా ప్రశ్నించినట్లు ఉంది.
    పద్మార్పిత గారు.. మీ బ్లాగ్ చిత్రం చాలా బాగుంది. అందం ఎక్కడున్నా ఆస్వాదించ తగినదే! ఆ చిత్రంలోని అమ్మాయి నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. బహుశా కవితలలోని రాణి ఏమో!

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు ధన్యవాదాలండి!
      అనందాన్ని ఆస్వాదించడం ఆరోగ్యకరం:-)
      కవితలరాణీ అయితే తప్పక కలలరాణియేలెండి:-)

      Delete
  21. Anonymous13 June, 2012

    వితంతువులను వేరుగా చూడటం ఈమధ్య కాలంలో నేను చూడలేదు. బొట్టు పెట్టుకోని వాళ్ళను అరుదుగా చూస్తాము. గుడిలో ప్రవేశానికి ఎలాంటి ఆంక్షలు పూర్వకాలంలో కూడా లేవనుకుంటా.
    పెళ్ళికిముందు వున్న అలంకరణలు, తమకు తాముగా వద్దనుకుంటే తప్ప, వైధవ్యంతో పోనవసరంలేదు. బాగా చెప్పారు.

    అమ్మాయి: సాధారణంగా, బాగా వుంది. పెన్సిల్ స్కెచ్‌లో పోర్ట్రైట్‌లు కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తాయి.

    ReplyDelete
  22. మీరు చెప్పింది కూడా నిజమేలెండి, కాని
    మీరు చెప్పింది నాణ్యానికి ఒకవైపండి.....
    ఇంకోవైపు వితంతువుని బొట్టుపెట్టి శుభకార్యాలకి
    మనస్ఫూర్తిగాఎంతమంది ఆహ్వానిస్తున్నారు చెప్పండి?
    గుడిలోకే ప్రవేశం, కుంకుమార్చనలకు నిషిద్ధం...కాదంటారా?

    అమ్మాయి: సాధారణం, అంతేనంటారా? :-) ;-)

    ReplyDelete
  23. excellent..kaani painful...

    chala rojula tarvatha vacha me blog ki...mee header pic..pakkana unna bomma kuda chala chala chala bagunnayandiiiiiii..........!!!!
    chala chakkaga unnaru :)
    meere geesara??

    ReplyDelete
  24. thanks for visiting my blog after a long time. Truth is always painful. chala chala thanks nanchinanduku....:-):-)

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. చాల భారకరమైన దుస్థితి ఒకవేళ అలంటి స్థితి ఎవరికైనా వస్తే కానీ మీ చెప్పినవి జరిగి ఉండవచ్చు ఇప్పుడు మాత్రం అలంటి విబెధం ఏమిలేదు. అందరిని సమానంగా చూస్తున్నారు. పోతే ఇంకో విషయం మీ మీ కవితలు తెలుగులో వ్రాసి మీ ప్రొఫైల్ ని ఇంగ్లీష్ లో పెట్టడం బాగోదు. ఒకసారి ఆలోచించండి!

    ReplyDelete