అభియోగమేల?

తెలుపలేదని నాపై ఇంతటి అభియోగమా!
నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
నీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...

నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
గాయమైతేనే తీయని గేయంగా మారతానని
తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...

క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...

23 comments:

  1. Ek ishare par duniya chod denge
    Samundar ke beech mein pyaar ki naav ko kyun dubathe ho, kehte tho kinare par hi doob jaathe.
    kya khub kaha Arpitaji...badhayi

    ReplyDelete
  2. "నీ కోసమని వేచి ఉన్న కన్నుల్లో కళలు కరిగి కన్నీరుగా మారి నిను చేర పయనం అయ్యాయి
    ఏలా నీకి అభియోగం బాల, విననంటివా నా గోల
    చీకటిని చీల్చి సూర్యోదయం అయినట్టు, ఏదో ఒకరోజు నీకోసమని తిరిగి వస్తాను, నీ గాయపడ్డ మనసును అర్ధం చేసుకోవడానికైనా ఏదో ఒక రోజు నీకోసమని వస్తాను.
    ఎన్నడు నీపై నా ప్రేమను నిత్యనూతనంగా ఉంచుతానని మనవి చేస్తూ. "

    మీ కవితకు ప్రత్యుత్తర వ్యాఖ్యలా రాయలనిపించి రాసిందే నని మనవి.. తప్పుగా అనిపిస్తే క్షమించేద్దురు.

    "అత్ర వేల కాసన్ కో తోన, తార్ కవితా మా ఎకేక్ అక్షరం ఎకేక్ సుయిని దలేన్ లాగ్రిచ. సూపర్ లకిచి కవిత తు. హాట్స్ ఆఫ్ పద్మ తోన. వాతేమ కేజాఎని జసేని తు తార్ కవితాతి కేరి, తార్ దోస్తీ న మ విలువ దూంచు "

    "అంత బాధ ఎందుకు చెప్పు నీకు, నీ కవితలో ఒక్కో అక్షరం ఒక్కో సూది లా గుండెను తాకుతూ ఉంది. సూపర్ గా రాసావు కవితను నువ్వు. హాట్స్ ఆఫ్ పద్మ నీకు. చెప్పలేని భావాన్ని నువ్వు నీ కవితతో చెబుతున్నావు, నీ స్నేహానికి నేనెప్పుడు విలువ ఇస్తాను"

    పైన రాసింది మా భాష, కింద దాన్ని తర్జుమా చేసి రాసాను. ఏమైతేనేం ఈ "అభియోగాలు" కవిత నిజంగా కట్టి పడేసింది మనసుని అర్పిత గారు. హాట్స్ ఆఫ్ టు యు

    Regards,
    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  3. Kahne ko aur shabd nahi rahi..
    Itna Sundar Kavita jo hai aapki
    Lahraate in aksharon mein na jaane kahaan se itni mehak aagayi
    Jise padte padte dil mein na jaane ek choti si chehak aagayi

    Badhaayi ho Arpita ji.. Aapki is rachana ke vaaste niklaa ek choti si kavita ko isme comment ki tarah likh rahaa hun, boora mat maaniyega..

    Achi Khaasi Kavita hai aapki..
    :)
    Sridhar Bukya
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
  4. Us Chitr kaa tho koi jawaab nahi...

    ReplyDelete
  5. నిజమే సముద్ర కెరటాలని విడదీసి ఆరవేయలేము, హ్రుదయం లోని వేదనలా అవి ఎప్పుడూ తడిగానే ఉంటాయి, మనస్సుని హత్తుకొనే సున్నిత భావ వల్లరి. ఈ పదాలను పలకరించటం కూడా ఓ వ్యసనం గా మారుతుంది అందమైన గానములా పలకరించే గాయాలవి. కాదంటారా పద్మ గారు.

    ReplyDelete
  6. ilaa elaa raayagalugutunnaru Padmagaaru..?? Nijjanga Ivi mee e-kalam nundi jaaluvaarina aanimutyaale.. :) Chitram Context ku tagga undi.. Intakante inkem anagalanu cheppandi..

    ReplyDelete
  7. Fantastic words with Fabulous painting.

    ReplyDelete
  8. అర్పిత ఏయే ఒక అమ్మాయి అయితే అచ్చంగా ఈ బొమ్మలో మాదిరిగా ఉంటుంది అని అర్థమైంది. అమ్మో ఈ బ్లాగ్లోకి రాగానే కవిత్వం వచ్చేస్తుంది...హ హ:)

    ReplyDelete
  9. ఆహా తెలుగు పదాల మాయ అద్భుతం, అమోఘం. చిత్రం చాలా అందంగా ఉంది. ఇది పద్మార్పిత స్టైల్. సూపర్ .:-))

    ReplyDelete
  10. గాయమైతేనే తీయని గేయంగా మారతానని
    తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని..

    ఇంత అందమైన భావాన్ని పంచిన మీ హృదయవల్లరిని ఈసడించే ధైర్యమెవరికుంటుంది పద్మార్పిత గారు.
    హృదయాన్ని తాకింది ఈ కవితాభియోగం.. అభినందనలతో..

    ReplyDelete
  11. నా కోటి కంటి ఊసులు నీకు అర్థంకాలేదని
    నీమనసుకి ముసుగేసి నాపై వేసిన నిందని
    చెరిపేయాలని గొంతువిప్పితే కోకిలగానమని
    మనసువిప్పి మాట్లాడితే యుగళగీతమని...

    గాయమైతేనే తీయని గేయంగా మారతానని
    తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని
    నిజమనక, విరిసిన జ్ఞాపకాల వింజామరలని
    విడదీసి ఆరనీయలేదు సమీర కెరటానినని...

    అలా భావించే ఆ ప్రేమికుడిపై ఎలా నింద మోపుతున్నావు పద్మా ? తప్పమ్మా !.

    మిగిలిన ఆపంక్తులలో కొంచెం భావభేదం కంపిస్తోంది .

    ReplyDelete
  12. నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!ఎంత ఆర్ద్రత ఇందులో

    ReplyDelete
  13. ఏదో పాపం తెలుపలేదు అంటే మరోమారు మరింత అపురూపంగా చెప్తారు అనుకుంటే ఇలా అభియోగం అనంటే ఎలా పద్మగారు :) కాస్త అప్పుడప్పుడూ మాకుమల్లే ఆలోచించండి

    ReplyDelete
  14. ఇక్కడ అలుకే కాని అభియోగం కనిపించడంలేదండి, అలుకే బాగుంది :)

    ReplyDelete
  15. ఆర్ద్రంగా .. అందంగా .. ప్రశంసనీయంగా ఉంది

    ReplyDelete
  16. నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
    గాయమైతేనే తీయని గేయంగా మారతానని
    sounds good padmarpita

    ReplyDelete
  17. ఆడవారు అభియోగించారంటే అర్థాలేవేరులే, అలిగినట్లు దాని వెనుక అనురాగం మెండుగా దాగినట్లు అని ;-) అదృష్టవంతుడతడు....హరినాథ్

    ReplyDelete
  18. అంతా చదివితే హరినాధ్ గారన్నట్లు అర్థాలేవేరేమో....అయినా పద్మార్పిత ఏది చెప్పినా ప్రేమగానే చెప్తుందికదా:-)

    ReplyDelete
  19. పద్మ గారు .. ఈ కవిత చాలా బాగుంది . ... ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోకండి ... ఈ మధ్య మీ కవితల్లో ఎందుకో ఒక వేదన , ఎవరికో ఓ సందేశంలా అనిపిస్తున్నాయి . కేవలం నా అభిప్రాయం మాత్రమే ఇది . ఒక స్నేహితురాలిగా మీ నుండి ఆహ్లాదమైన కవితలే ఆశిస్తాను . అవి రాయడంలో మీకు ఎవరు సాటి రారు కూడ ...

    ReplyDelete
  20. నా హృదయానికే ఇన్ని తెలియని గాయాలా!
    గాయమైతేనే తీయని గేయంగా మారతానని
    తీయని తేనెమాటల ఉలితోచెక్కిన సరాగాలని

    క్షణం కూడా నిను వీడని నాపై ఇంత అలుసా!
    ఒంటరి హృదయఘోషకి రోజుకోవంక కోసమని
    నట్టేట్లో ముంచాలా పయనించే వలపుల నావని
    ఒక్క ఈసడింపు కనుసైగచాలు ఊపిరాగడానికి
    ప్రేమతృష్ణతో ఏటిగట్టున కట్టనా నా సమాధిని...ee padallu chaduvutuntee vupiri bigabattinattu Upiri adanatu gundello alajadi ,, enti jeevitam

    ReplyDelete
  21. ఈ "అభియోగమేల?" అంటూ ప్రశ్నించిన నా కవితను ఆదరించి స్పందించిన ప్రతి హృదయానికి పేరుపేరునా అభివందనము._/\_




    ReplyDelete
  22. హాయైనా భావనలూ, సున్నితపదాలెంపికా, జాగ్రత్తగ అల్లిన క్రోషెలాంటీ మూడు స్టాంజాలూ వెరసి ఓ మంచి కవితాఖండీకకి ప్రాణంపోసాయి.

    ReplyDelete
  23. అభియోగమేలని అడగడం అలగడం రెండూ మీవంతేనా

    ReplyDelete