"న" పై నా ప్రయోగం

                                             మరుగొలుపుతూ మగువ ఓరకంట చూసి"న"
మతితప్పిన మగాడు లొట్టలు వేయ తగు"నా"
ఆలోచించక ఇంతి అంతింతని ఆడిపోసుకు"ని"
పట్టుతప్పిన తమని తాము కప్పిపుచ్చుకు"నీ"
వలపనుకుని పలకరించెదరు ఆమె నవ్వు"ను"
భాషలోని భావాలను చూపెడతారు చేతల్లో"నూ"
కాదని కన్నెర్రజేస్తే ధూషించి తూలనాడుతారు(నృ)
వయ్యారిని ఒకరివెనుకొకరు చూస్తారు ఓకంట"నె"
ఒంటరిగుంటే ప్రగల్భాలు పలికేరు రాసులుగా"నే"
వేషాలకి లొంగకపోతే వేలెత్తబడును వెలయా"లై"
వాలుచూపుకే లొంగి మీసమెందుకు మెలివేసు"నొ"
ఇలాపడితే పురుష పుర్రెలోని పౌరుషం ఏమను"నో"
బుర్రలేదంటే ఒప్పుకోని బుద్దిమంతుడు బగరా"లౌ"తూ
మాకేంటి బలశాలులం అనుకుంటారెందరో మగజ"నం"
గుజ్జులేని పుర్రెని ఆమె తింటుందని వేస్తారు అభాం"ఢః"

 (ఇది "న" గుణింతం చివర్లో రావాలని చేసిన చిరుప్రయత్నంగా భావించి లై, లౌ లను నై నౌ గా అనుకోవలసిందిగా మనవి, వినమ్రతతో.....పద్మార్పిత)

30 comments:

  1. అర్పితగారు ఇదేదో మగవారిపై సంధించిన "నీ", "నా"టుబాంబులా ఉందండి
    ఫైర్ బ్రాండ్ కి ప్రతిరూపం ఈ పెయింటింగ్ :)

    ReplyDelete
  2. చిత్రాల ఎంపికలోని చిత్రవిన్యాసాలన్నీ మీ బ్లాగ్లో తనివితీరా చూసి అక్షరాల అందచందాలని ఆస్వాధించడం అలవాటైపోయింది, మీ కళాతృష్ణకి అభినందనలు.

    ReplyDelete
  3. బుర్ర తినేసేరండీ! కాదు కాదు స్ట్రా తో తాగేసారా? అహహ!

    ReplyDelete
  4. శాశ్వతంగా భవిష్యత్తులో మరెవ్వరూ అచ్చు తప్పులను వేలెత్తి చూపకుండా ఆ మధ్య యిచ్చిన సమాధానం మమ్మల్ని ( చదువరులను ) సమాధానపరచింది .

    కవ్విస్తున్న కన్నెపిల్లలు మెల్లగ మగవాళ్ళ పుఱ్ఱెనే జుఱ్ఱేస్తారని ఈ చిత్రం చెప్పకనే చెప్తుంది . ఆ కన్నె తాగుతున్నది కొబ్బరి బోడాం కాదు కపాల భాండం సుమా ! కడు జాగ్రత్తగ ఉండక తప్పదు మరి .

    ఇది నువ్వు 'న ' గుణింతం అంటున్నావు , ఇది నీ కవిత్వం .

    ReplyDelete
  5. నీ నా అంటూ విడగొట్టలేని బంధమేదో నా నీ లో వుంది కదా అదే స్త్రీ పురుష బంధం.. బాగుంది మీ నా'రీ' శరం.. ఆ చిత్రంలో మీరు మా పుఱెను జుఱుకుంటున్నట్టి వేసారు కదా మరి.....:-)

    ReplyDelete
    Replies
    1. నీ నా, నా నీ ల బంధమేదో కాస్త కంప్యూజ్గా ఉందండి వివరించగలరా?

      Delete
    2. నీ అంటే స్త్రీ నా అంటే పురుషుడని ఈ బంధం యుగాంతమైనా చెరగనిదని..

      Delete
  6. నరుని నాటకీయ నిజరూపము నీలాకాశం నుండి నూతిలో నృపమించ నెలవంకతోడ నేరములేలమ్మ నైమిశ నొప్పింపగ నోరుతెరిచి నౌనీతమున్ నందనదనుండ నఃనఃమనున్ నందగోకులమున ఇతగాడిని గొపకిశొరున్ గావక తప్పేనేటులా తెలిసే దారే లేకున్ మాధవా రామాధవ!!

    మీ "న" ప్రయోగానికి గోకులం గోపబాలునికి అంకితమిస్తూ రాసిన "న" గేయం. మీ కవిత నుండి ఆ స్వామిని తలిచే భాగ్యం ఇచ్చిన మీకు ధన్యవాదాలు.

    నరులేల్లరు సమ దృష్టి కలవారే ... కొంత మందికే వక్రబుద్ధి పుట్టుకోచ్చేనేలనో. అయినా మీ కవితను సహృదయతతో చూస్తె అక్షరం ఒక శూలం లా కనిపిస్తుంది.

    మీ భావ రచన కి మీ ఆలోచన ద్రోణి కి వేనవేల కుసుమాంజలి

    శ్రీధర్ భుక్య
    http://kaavyaanjali.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. పైన తెలిపిన 'నేరం' అరవ భాషలొ 'సమయం' అని చదువుకొగలరని మనవి

      Delete
    2. చాలా చాలా బాగుంది సర్ ....

      Delete
    3. Thanq Sagar ji.. Credit goes to Padmaji..!!

      Delete
    4. మొదటి అక్షరం "న" గుణింతంతో దేవుని స్తుతి బాగుందండి.

      Delete
    5. నందకిషోర నవనీతచొర nu Naa Blog lo choodandi.
      Mee Spandanaku dhanyavaadaalu Telugammayi gaaru..:)

      Bukya Sridhar
      http://kaavyaanjali.blogspot.in/

      Delete
  7. padmarpita garu naa gunitam pai prayogam chala bagundi.. super prayogam:-))

    ReplyDelete
  8. naa gudintam ani cheppinaru chala bagundi... inkoncham maalaanti vaallaki kooda artham ayyetatlu vraaste baguntundi kadaa ani ante...

    ReplyDelete
  9. పద్మా చాన్నాళ్ళకి నీలోని అర్పితను ఆక్టివ్ చేసినట్లుండి నీ "న" గుణింతాల గుణగణాలు చదువుతుంటే:-)

    ReplyDelete
  10. అమ్మోయ్ అర్పితా అసలుసిసలు సివంగి అనుకున్నాను అక్షరాలతో పేల్చేసే ఆటంబాంబువి కూడానా :-) నవ్విస్తూ చురకలువేస్తూ, చిత్రాలతో మెప్పించే చతురత నీకు ఆ భగవంతుడిచ్చిన వరం. బొమ్మతో గిలిగింతలుపెట్టి, భాషాపటిమతో మురిపించావు. సదా చక్కగా కాపాడుకో తల్లీ.....ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
  11. చాలా చాలా బాగుంది

    ReplyDelete
  12. పద్మార్పితగారు.....మంచి ప్రయోగం. మిగిలి అక్షరాలపై గుణింతాలు ఎప్పుడో మరి :-)

    ReplyDelete
  13. అప్పుడెప్పుడో "క"గుణింతంతో కలువబాల అందించిన కవిత కడు ప్రశంసం.
    తరువాత ఇలాంటిదే "అ"లుకపై చేసారు ఒక ప్రయోగం.
    ఇప్పుడు "న" తొ మాపై సంధించారుగా హల్లుల అస్త్రం.
    మీ స్నేహమాధుర్యంలో నేను నేర్చుకున్న అక్షరాలు మీకే అర్పితం.

    ReplyDelete
  14. oka asaktikaramaina prayogam ..beautiful pic.

    ReplyDelete
  15. గుణింతాలు నీవు ఇలా వింతగా వల్లిస్తుంటే మళ్ళీ స్కూల్ లో చదువుకుంటూ నీతో పోట్లాడాలి అనిపిస్తుంది పద్మా....అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నువ్వు గ్రేట్ నా ప్రియ నేస్తం

    ReplyDelete
  16. అంత అలవోకగా చూస్తే ఆవిరైపోతామని తెలిసే ఆడుకుంటారేమో ఆడవాళ్ళు. మీరు ఇలా మా వీక్ పాయింట్స్ అన్నీ బట్టబయిలు చేసేస్తే ఇంకేం అంటాం

    ReplyDelete
  17. జుట్టంతా పోయి పుర్రె మీ చేతికిచ్చాక ఇంకేం ఉంటుందని పీల్చడానికి ఏమన్నా అంటే పుసుక్కుమనడం తప్ప

    ReplyDelete
  18. "న " అనే క్షరంలోనే ..ఇద్దరు మనుషులుంటారు. .ఆ నా గుణింతాలకలు చెలుకు తలుకులు చేరవేస్తే మెరసి మైమరపించకుండా ఎలా ఉండగలము పద్మాగారు....." ఆ "న" అనే అక్షరానికి దీర్షం ఇస్తే ('నా") ఆమనిషి సొంతం అవుతుంది... అదే "న" అక్షరానికి మ చేరిస్తే "మన" ఆ మనిషి మరింత దగ్గర ఔతుంది...ఇద్దరి మద్యా గొడవ వచ్చినప్పుడు అదే "న" కు ఓ ఏత్వం ఓదీర్గం చేస్తే "నేనా " అదో భారమన ప్రశ్నగా మారిపోతుంది.అదే న" కు కొమ్ము చేర్చి "వ్వు" తగిలిస్తే " నువ్వు ఇద్దరి మద్యా దూరం పెరుగుతుంది..అదే "న" కు ఏత్వం జోడించి కొమ్ము కలిపితే (" నేను ") తను ఒంటరి అవుతుంది ..ఇలా నాను అడ్దదిడ్డంగా వాడీతే మనిషే మిగలకుండా పోతాడు అంత పవర్ ఫుల్ "న" అనే అక్షరం

    ReplyDelete
  19. అర్పితా....మీరు ఇంకో నాలుగు గుణింతాల్లో ప్రశ్నలడిగి జవాబులెన్ని చెప్పినా వాలు చూపుకి పడనివారెవరు చెప్పండి. అందులోను చిత్రంలోని అమ్మాయి చూపుకి పడడం ఖాయం :-)

    ReplyDelete
  20. "న" అక్షరంపై "నా" ప్రయోగా"ని"కి స్పందనల"నీ" మీ అందరి అ"ను"రాగోప్రేరిత వ్యాఖ్యల"నూ" చదివిన మనసు "నృ"త్యం చేస్తూ ఎగితిగంతేసె"నె" అని చెప్పబోవ వెంట"నే" అలాగెంతితే కాలు విరిగి కుంటిదా"నై" "నొ"ప్పి"నో"ర్వలేక అరిచి వెర్రిదా"నౌ"తానని తెలిసి ప్రతిఒక్కరికీ వంద"నం" అంటూ పేరు పేరునా పద్మ నమఃసుమాంజలి అర్పిస్తున్నది _/\_

    ReplyDelete
    Replies
    1. ఇలా సింపుల్ గా నాలుగు ముక్కల్లో థ్యాంక్స్ చెప్పేకన్నా, విడివిడిగా మీ నాలుగు చలోక్తి జవాబులతో సంతృప్తి పరచండి పద్మార్పితగారు. మీ కవితలకే కాదు మీరిచ్చే రిప్లైస్ కోసం కూడా ఎదుచూస్తుంటాం.

      Delete
    2. వ్యాఖ్యలకి రిప్లై ఇవ్వడంలో కూడా మీదైన స్టైల్ కనబరిచారు.

      Delete
  21. ఎన్నో అందమైన చతురోక్తులతో జవాబులిస్తారనుకుంటే ఇలా చప్పబరిచారెందుకనో పద్మార్పితగారు:)

    ReplyDelete