చలనంలేని మనసును ప్రణయమంటూ దోచి
ఊపిరున్న ఊహలకు రూపమంటూ ఒకటిచ్చి
కదులుతున్న శ్వాసలో పలికే భావంగా మారి
గాజువంటి మదిని అందమైన అద్దంగా మార్చి
తడబడుతున్న అడుగులకు తోడుగా అడుగేసి
ఆవేశంతో చెలరేగబోయే సుడిగాలిదిశను మార్చి
అలిగికోరితే అందలమైనా అపూర్వంగా అందించి
మధుర ధరహాసమంటూ జ్ఞాపకాలని జతకూర్చి
కలత పడితే కన్నుల్లో దాగిన కన్నీళ్ళను తడిమి
కమ్మని కోయిల పాటలై ఎద ఊయలపై సేదతీర్చి
పంచభూతాల సాక్షిగా ప్రకృతి నీవు ప్రాణం నేనని
నమ్మి వలచిన ఇరుమది సవ్వడులు ఒకటైనప్పుడు
ప్రణయానికి పవరున్నప్పుడు...
*****
ప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???
ఊపిరున్న ఊహలకు రూపమంటూ ఒకటిచ్చి
కదులుతున్న శ్వాసలో పలికే భావంగా మారి
గాజువంటి మదిని అందమైన అద్దంగా మార్చి
తడబడుతున్న అడుగులకు తోడుగా అడుగేసి
ఆవేశంతో చెలరేగబోయే సుడిగాలిదిశను మార్చి
అలిగికోరితే అందలమైనా అపూర్వంగా అందించి
మధుర ధరహాసమంటూ జ్ఞాపకాలని జతకూర్చి
కలత పడితే కన్నుల్లో దాగిన కన్నీళ్ళను తడిమి
కమ్మని కోయిల పాటలై ఎద ఊయలపై సేదతీర్చి
పంచభూతాల సాక్షిగా ప్రకృతి నీవు ప్రాణం నేనని
నమ్మి వలచిన ఇరుమది సవ్వడులు ఒకటైనప్పుడు
ప్రణయానికి పవరున్నప్పుడు...
*****
ప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???
పద్మార్పితగారు.......అల్పజీవులం, మీరు అడిగే ప్రశ్నలు కాస్త సులువుగా అడిగితే చెప్పగలం కానీ ఇలా ప్రేమిస్తేనే కానీ చెప్పలేని క్లిష్టమైనవి అడిగితే ఎలా??? :) వాటర్ కలర్ పెయింటింగ్ అదిరింది.....మొత్తానికి ప్రేమని ప్రేమగా ప్రేమెందుకని ప్రశ్నించారు
ReplyDeleteసులువుగా జవాబులివ్వగలిగితే అది ప్రశ్నెందుకౌతుంది....తేలికైనది అయితే నా తెలివైన బుర్రకు తెలియకుండా ఎందుకుంటుంది.:-)
Deleteచిత్రాన్ని చూస్తుంటే ప్రేమను మీరడిగిన ప్రశ్నలను పక్కన పెట్టి చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ముందుగా కవిత చదివి ప్రేమ ఎంత మధురం అనుకుని చివర్లో ప్రశ్నించే సరికి నీరుకారిపోయాం.
ReplyDeleteథ్యాంక్యూ యోహంత్...పై జవాబే మీకు వర్తిస్తుంది.
DeleteGood pic,super selection
ReplyDeleteThank you very much.
Deleteచలనం లేని మనసు ప్రయానం ... చెలిచెంత చేర్చలేదని తెల్సి..చెంత ఉన్న జ్ఞాపకాల సాక్షిగా...నీవు గుర్తొచ్చిన ప్రతిసారి ఎగసిపడుతున్న నా శ్వాసలో ఎన్ని భావాలున్నాయో ఎన్ని అనుబవాల తలపులున్నాయో తెలుసా..కలత చెందిన వెంటేనే గుండెల్లో మొదలైన అలజడి నేను నిన్ను చేరలేక కన్నీరై కదలి వస్తున్నా జాలి లేని నీవు నానుంచి ఎప్పుడో జారుకున్నావు ........................................................
ReplyDelete...."ప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???" exlent Feel Padmagaru
thank you.
Deleteప్రశ్నల్లా కనిపిస్తున్న తాత్విక సమాధానాలివి. సోక్రటీస్ దూరిపోయాడు మీలో... సన్యాసులు విన్యాసం చేస్తున్నారు మీ ద్వారా వారి మాటలే వినిపిస్తున్నాయని.
ReplyDeleteమొత్తానికి సన్యాసిణిని చేసారుగా ప్రేమతో :-)
Deletepainting bahut badiyaa hai, main tho prashna munch ki jawaabo k inthezaar mein hoon padmaji.
ReplyDeletetheek jawab aap ko shaayad yahaa pe nahi mila.....sabar ka phal meetha hotha hai :-)
Deleteపెయింటింగ్ ఎంత బాగుందోనండీ మీ కవిత కూడా చదవకుండా ఇప్పటిదాకా చూస్తూ కూర్చుని కామెంట్ రాస్తున్నాను.
ReplyDeleteవేణూశ్రీకాంత్ గారు....అసలే అరకొరకుగా వచ్చి, ప్రేమంతా చిత్రంపై చూపి నా రాతలపై అలిగితే ఎలాగండి.;-) thank you.
Deleteప్రకృతి నీవు, ప్రాణం నేనని .... వలచిన మది సవ్వడులు ఒకటైనప్పుడు, నిజంగా ప్రణయానికే పవరున్నప్పుడు .... రాయబారమెందుకు?
ReplyDeleteఒక అందమైన భావన, ఒక చక్కని సందేహం
అభినందనలు పద్మార్పిత జీ.
చంద్రగారు.....మీ అభిమాన స్పందన స్ఫూర్తిదాయకం.
Deleteఏదో ఇన్నాళ్ళు మిస్ అయ్యాము, ఇప్పుడిప్పుడే ప్రేమలోని మాధుర్యం ఎంతో అద్భుతం అనుకుని మీకవితల్ని చదివి ఆ అనుభూతికి లోనౌతుంటే.....ఇదేం ఫిటింగ్లు? ఇవేం ప్రశ్నలు? అయినా అంత సులువుగా అర్థం అయితే అది పద్మార్పిత కాదేమో!:-)
ReplyDeleteఅయినా ప్రశ్నలకే భయపడి ఫిటింగులు అంటే ఇంక ప్రేమ మాధుర్యాన్ని ఏం గైకొంటావు ;-)
Deleteప్రణయానికి పవరున్నప్పుడు...
ReplyDeleteప్రమాణపరిణయానికి పసుపుతాడు ముళ్ళెందుకు?
గుండె గోడల్లో కొన్నాళ్ళకి తెలియని బీటలెందుకు??
అ చంచలప్రేమను బలపరిచే రాయబారాలెందుకు???
చాలా చక్కగా అడిగారు, ఈసారి చిత్రం ముందు కవిత సాంద్రత తగ్గినట్లుంది.
కంటికింపైన చిత్రం కనబడితే కవిత కాస్త కంటికి ఆనదేమోనండి మీరన్నట్లు :-)
Deleteఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి
ReplyDeleteకలకాలం కలిసి జేవించడానికి
బాధలోనూ సంతోషం లోను ఒకరి భావాలు మరొకరు గౌరవించి మెదలడానికి
ప్రేమను ఒక్కటైనా కలిసి పంచుకోవడానికి
గుండెకు గుండెకు మధ్య వారధిలా ప్రేమే సర్వమై నిలవడానికి
ఎక్కడో లోతుగా పాతుకుపోయిన ప్రేమను వెలికి తీసి ప్రాణం పోయడానికి
తెలియని మనసును తేలిక పరచడానికి రాయబారం అవసరం ప్రేమకు
పరిచయాలు లేని మదిని సొంతం చేసుకోవడానికి
కొంగొత్త లోకం లో అడుగిడుతూ వెంట తెచ్చిన ప్రేమపు మూట ముడి విప్పడానికి
మీరన్నవన్నీ జరిగాక మళ్ళీ మొదటి నుండి అన్నట్లు రాయబారం అవసరమంటారా?
Deleteపంచభూతాల సాక్షిగా ప్రకృతి నీవు ప్రాణం నేనని
ReplyDeleteనమ్మి వలచిన ఇరుమది సవ్వడులు ఒకటైనప్పుడు
యింకా ఈ కట్టుబాట్లెందుకు హాయిగా ప్రేమించుకొని జీవించక అన్న సందేశాన్ని మీ ప్రశ్నల అరలలో దాచి చెప్పిన తీరు అద్భుతం పద్మార్పిత గారు. కవిత చిత్రమూ రెండు అదిరాయి. దేనికదే పోటీ పడ్డాయి. అభినందనలతో..
మీ స్పందనతో కడుతెలివిగా తప్పించుకున్న తీరు బాగుంది కవివర్మగారు :-) మీ నుండి జవాబు రాలేదు, బహుశా చిత్రాన్ని అస్వాధిస్తున్న నెపముతో జారుకున్నారేమో! :-)
Deleteనమ్మి వలచిన ఇరు మదీ సవ్వడులు ఒకటైనప్పుడు.....
ReplyDeleteఇక...ఆ ప్రేమ బీటలెందుకు...పడనిస్తుంది??..మదిని....ప్రమాణం చేయమని ఎందుకడుగుతుంది??....చంచల ప్రేమ ఎందుకవుతుంది??
ఒక్కటిగా మరిన మనసులో ఈ ప్రశ్నలే ఉదయించవెన్నటికీ....
హమ్మయ్య....అవసరంలేదన్న మాట అయితే ఓకే :-)
Deleteకవిత, చిత్రము చాలా బాగున్నాయి....ప్రశ్నలకి జవాబు నావల్లకాదు.
ReplyDeleteతెలియదు అన్నంత తెలివైన పని మీకు తెలియంది కాదు సృజనగారు :-)
Deleteనిజమైన ప్రేమకు ఈ ప్రశ్నలు వర్తించకపోయినా, సమాజం కోసం కొన్ని కట్టుబాట్లు అవసరం అని చెబితే నీకు నచ్చదు అని తెలిసినా అదే నిజం అనేది ఒప్పుకోవాలి పద్మ. కవిత విషయానికి వస్తే అసాంతం ఆకర్షణీయమైన పదాలతో అలరిచావు....చిత్రం గురించి ఏం చెప్పను నీ కవితలాగే ముగ్ధమనోహరంగా ఉంది -హరినాధ్
ReplyDeleteమీరు సమాజం కోసం తప్పదు అని సమంజసంగా చెప్పితే నచ్చకపోవడం ఏంటండి.....ధన్యవాదాలు మీ వివరణకు మరియు స్పందనకు.
Deleteఇలా సున్నితంగా ఆకట్టుకునే గుణం నన్ను ఎప్పుడూ అబ్బురపరుస్తూనే ఉంది-హరినాధ్
DeleteSuper Padmarpita:-)) Wonderful words with Beautiful Painting:-)) Its Fantastic..
ReplyDeleteYou always rock...Madam
ReplyDeleteIam also a member....let her walk rock
Deleteనా పేరిట బ్లాగ్ క్రియేట్ చేసే ఫ్యాన్ ఉండడం....భలే బాగుంది, ఓహో ఇంక రోజూ అక్షింతలే అఖింతలు :-) మీ అందరి అభిమానమే నాకు బలము & భాగ్యం, కానీ నేను ఇంకా అంత గొప్పస్థాయికి ఇంకా ఎదగలేదండి.
DeleteAniketh....thank U.
DeleteHi! I am also one among them....u deserve this....
ReplyDeleteAnoo...your affection towards me speaks like this.
DeleteThank you for being this.
ఎందుకో చెప్పలేకే చిత్రాన్ని చూస్తూ చివరికంటూ మిగిలిపోయా :)
ReplyDeleteక్రింది నుండి మొదలెడితే నువ్వే ముందుంటావు అనికేత్.....చీర్సప్ :-)
DeletePic చాల బాగుంది... మీ ప్రశ్నలకు నా దగ్గర మాత్రం జవాబు లేదు.
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteచిత్రాలతో కవ్విస్తే కష్టం
ReplyDeleteచదవకుండా చిత్రాన్నే చూస్తే ఎలాగండి :-)
Delete