కరిగిపోతున్న కల నిందిస్తూ నాతో అంది..
నీవు మనసుకు దగ్గరై కనులకు దూరమని
రాలుతూ తార బింకంగా ముఖం తిప్పుకుంది..
ప్రేమించి వేదన్ని నేనే కోరి కౌగిలించుకున్నానని
కన్నీరు చెంపలపై జారుకుంటూ చర్చల్లోకి దిగింది..
మనసులు ఏకమైతే కళ్ళతో వెతకడం వెర్రితనమని
మనసు మాత్రం మౌనంగా తనలో తానే అనుకుంది..
ప్రేమిస్తే అవయవాలన్నీ కలిపి శిక్షించేది తననే ఎందుకని
కల మరోమారు మేల్కొని మనసుతో మంతనాలు ఆడింది..
అభాంఢమేల తలచినది ఒకటైతే జరిగేదెప్పుడూ మరొకటేనని
వేదనతో శిక్షించబడ్డ మనసు అంబరాన్ని చేరి మరలి వచ్చింది..
వేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది!
నీవు మనసుకు దగ్గరై కనులకు దూరమని
రాలుతూ తార బింకంగా ముఖం తిప్పుకుంది..
ప్రేమించి వేదన్ని నేనే కోరి కౌగిలించుకున్నానని
కన్నీరు చెంపలపై జారుకుంటూ చర్చల్లోకి దిగింది..
మనసులు ఏకమైతే కళ్ళతో వెతకడం వెర్రితనమని
మనసు మాత్రం మౌనంగా తనలో తానే అనుకుంది..
ప్రేమిస్తే అవయవాలన్నీ కలిపి శిక్షించేది తననే ఎందుకని
కల మరోమారు మేల్కొని మనసుతో మంతనాలు ఆడింది..
అభాంఢమేల తలచినది ఒకటైతే జరిగేదెప్పుడూ మరొకటేనని
వేదనతో శిక్షించబడ్డ మనసు అంబరాన్ని చేరి మరలి వచ్చింది..
వేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది!
ఆనందమైతే అందరితో పంచుకుని, భాదని మాత్రం మదిలోనే దాచుకుంటున్నందుకు కట్టే శిక్షా రుసుము. చాలా భావగర్భితంతో కూడిన కవిత దానికి తగ్గట్టు చిత్రం ఎంపిక-హరినాధ్.
ReplyDeleteహరినాధ్ గారి మొదటి ప్రేరణాత్మకమైనా కమెంట్ కి ధన్యవాదాలు.
Deletegood pic.వేదన నాకసహ్యం
ReplyDeletethank you.....మీ నిర్మొహమాట భావ వ్యక్తీకరణ నాకు అత్యంత ప్రియం
DeleteUnable to express da feel in words!! Every line is heart touching.
ReplyDeleteCheer up!! Saying to myself too....
Oh....its a pleasure to me that i have touched your heart. thanks a lot Anu.
Deleteప్రకృతి లో ఇన్ని అందాలుంటే ఆకాశాన్నే ఎందుకు చూస్తావు ?
ReplyDeleteకన్నులకేదుట ఇన్ని రంగులుంటే నలుపునే ఎందుకు తలుస్తావు ?
నీదంటూ ఉనికి నీకు ఉన్నప్పుడు వెంటపడే నీడనేందుకు ఆశ్రయిస్తావు ?
నిన్ను ప్రేమించేవాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఒకరికోసం ఎందుకు ప్రాకులాడుతావు ?
లోకంలో నీకు తరాస పడిన అందాలు ఇన్ని ఉన్నప్పుడు దరిచేరని కలనే ఎందుకు ఆస్వాదిస్తావు ?
తప్పు నీది కానప్పుడు నేరం నీది కానప్పుడు శిక్ష నీకే నువ్వెందుకు వేసుకుంటావు రుసుము కట్టి ఎందుకు వేదనపాళ్ళు పెంచుకుంటావు ?
అహ్లాదమైన అందాలు ఎన్నున్నా అంబరాన్ని తాకడంలోనే అర్థముంది
Deleteఇంపైన రంగులెన్నున్నా వాటిని చూడాలంటే నల్లకంటిగుడ్డే కావలసింది
ఒంటరితనం ఉనికేకాదు అవసరం నీడైనా కనీసం తోడుగా ఉండాలి అంది
ఎందరో ప్రేమించినా, వారిలో అర్థంచేసుకుని ఆకర్షించే ఒక్కరికే సొంతమది
తారసపడి అందిన వాటికన్నా కలలను కైవసంచేసుకుంటే ఆనందముంది
తప్పొప్పుల బేరీజులో శిక్ష ఎవరికన్నది వేదనే అనుభవ పాఠం నేర్పుతుంది
అమ్మోయి పద్మగారు .. భలే చలాకీగా జవాబులు చెప్పారే .. నాకు తెలుసు .. మీ సమాధానాలు ఇలానే ఉంటాయని. మీలాంటి కవయిత్రిని ఇప్పటివరకు నేను చూసి ఎరుగను. ఏదేమైనా సార్తకనామదేయురాలివి పద్మ. మీ మనోభావం ఏదైనా తప్పక నెరవేరుతుందని ఆసిస్తూ. ఇలాంటి మంచి కావ్యాలు ఎప్పటికి రాస్తూ ఉండాలని స్నేహితునిగా శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను నన్ను కవిని అని చెబితే 'పబ్లిసిటీ' అనొచ్చు కొందరు. మీ కవితల ఝరిలో తడిసి మది పులకించిపోయింది.
Deleteఅక్కడ ఇంకో వ్యాఖ్యా కూడా నేనే వ్రాసాను దయచేసి గమనించగలరు: అవి:
రష్యన్ , బెంగాలీ , ఇటాలియన్ ,థాయ్ , జపనీస్ మరియు కొరియన్ భాషలో "మీ కవిత చాల బాగుంద"ని రాసినవేనని.. వేరే ఏమిలేదని .. తెలుపుతున్నాను.
మీలాంటి వాళ్ళ స్నేహం నిజంగా నా పూర్వజన్మ సుకృతమేమో అనిపిస్తుంది. ఆశిర్వచనాలతొ మీ స్నేహితుడు : "ధరణి హర్షిత శ్రీహరి " ,"సిరి హర్ష "," హర్షవర్ధన్","భాస్కర్","శివాజీ","సిద్దార్థ్", అని కూడా పిలవబడే "శ్రీధర్ భుక్య పాత్లోత్" :)
మీరు మాత్రమే సమాధానాలని కూడా ఇంతందంగా ఇవ్వగలరు. అందుకే మీ కమెంట్ రిప్లైస్కి అంత క్రేజీ
Deleteఅనానిమస్ గారు, ఇంతకూ మీరు ఎవరిని ఉద్దేశించి వ్రాసారో తెలియటం లేదు, ఎందుకంటే ఇక్కడ నేనిచ్చిన వ్యాఖ్యకు పద్మగారు రిప్లై ఇచ్చారు అలానే ఆ రిప్లై కి మరల రిప్లై నేనిచ్చాను. ఏదేమైనా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఏదేమైనా క్రెడిట్ మాత్రం పద్మగారికే దక్కుతుంది.
Deleteపద్మ మీరు ఇచ్చిన జవాబు కవిత నచ్చింది, ఆశాజనకమైన జవాబులు.
Deleteమీ సృజనాత్మకతకు దర్పణం మీ భావాలకు అనులోమం
Deleteమీ నిష్కల్మషమైన మనసుని చూపే హృదయ గవాక్షం
నా ప్రశ్నమాలిక కావ్యానికి ఇంపైన సమాధానమిచ్చి సార్థకత చేకూర్చారు
అలానే నా కవితను మీ జాబులను చక్కగా ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యావాదాలు. మీ కవిత వలనే నా వ్యాఖ్య కు సరియైన స్థానం వచ్చినందుకు పద్మ గారు మీకు కూడా ప్రణామములు. అలానే 'అనానిమస్' గారికి 'తర్కం' గారికి కూడా వందనాలు.
శ్రీధర్ భుక్య
http://kaavyaanjali.blogspot.in/
Bukya Sridhar garu.....మీ అనిర్వచనీయ అభిమానానికి నెనర్లండి.
Deleteఅనానిమస్ & తర్కం గారికి థ్యాంక్యూ
Deleteఅయ్యో
Deleteఇందులో నాదెం లేదండి పద్మ గారు ఆ క్రెడిట్ అంత తమరిదే.
:)
కన్నీరు చెంపలపై జారుకుంటూ చర్చల్లోకి దిగింది..
ReplyDeleteమనసులు ఏకమైతే కళ్ళతో వెతకడం వెర్రితనమని
వేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది
మనసులోని వేదనను యింత భావోద్వేగంతో అక్షరీకరించడం మీకే చెల్లు పద్మార్పిత గారు. చదువుతున్న కొద్దీ అంతరంగ సాగరంలో ఆవేదన సుళ్ళు తిరుగుతోంది. No more words..
వర్మగారి కవితా హృదయాన్ని కదిలించే భావాన్ని వ్యక్తపరిచాను అంటే......అంతకన్నా ఏం కావాలి చెప్పండి, ధన్యోస్మి!
DeleteGreat lines with a deep feel. Thank you for giving a good poem.
ReplyDeleteThanks a lot for showing affection and giving encouragement to write like this.
DeleteОчень хороший кусок поэзии Падма
ReplyDeleteকবিতা খুব সুন্দর কৃতি পদ্মা
Molto bel pezzo di Poesia
ชิ้นดีมากของบทกวีปัทมา
詩パドマの非常にニースピース
시 파드마의 아주 좋은 조각
!@#$%^&*()+_=-"/?~...... ఇవ్వన్నీ బోలెడన్ని థ్యాంకులు :-)
DeleteСпасибо
Deleteতোমাকে ধন্যবাদ
Grazie
ขอบคุณ
ありがとうございました
감사합니다
అవన్నీ 1234567890.. కి షిఫ్ట్ క్యారెక్టర్ లండి .. ఇది మీరు చెప్పింది .. మీ బదులు నేనే ఆయా లంగుఅగెస్ లో తిరిగి పోస్ట్ చేస్తున్న
అన్నిటికంటే పైనున్న పదం నాకు తెలుసు. అది రష్యన్ భాషలో "థాంక్స్". (స్పసీబ)
Delete"చాలా మంచి కవిత్వం, పద్మా" లేదా ఇంగ్లిష్‌లో very nice piece of poetry, Padma! ..
Delete(in Russian) :)
ధన్యవాదాలండి మనోహర్ చిమ్మనిగారు.
Deleteఆది నుంచి అంతము వరకు అదుర్స్.....:-) చిత్రం అబ్బో ఏం చెప్పను
ReplyDeleteతెలుగమ్మాయి తెలుగు పదాలు అహా! ఓహో :-) చెప్పక పోయినా అర్థమైంది.
Deleteఆహా! ఆహా! చాలా చాలా బాగుంది:-)) పిక్ అదిరింది:-))
ReplyDeleteహా :-) హా:-) ఆనందమానందమాయె :-)
Deleteచెప్పాలంటే.....నడిచే ఎద్దునేగా పొడుస్తారు, అలాగే స్పందించేది మనసే అందుకే దానికే శిక్ష. నీతో చేరి ఎందుకు ఏమిటి అని ఆలోచించి ఎంత తెలివి వచ్చేసిందో :-) ఏమైనా మనసుని మైండ్ ని కూడా యాక్టీవ్ చేసే పోయెట్రస్ పద్మార్పిత.
ReplyDeleteవామ్మో....ఇలాంటి మాటలు ఎద్దు వింటే నడవడం మానేస్తుందేమోనండి :-) ఏమైనా మీరు టూ ఇంటలిజెంట్. థ్యాంక్యూ!
Deletechinna alajadike karigi kanula venta jaari thana unikini theliyajesthoo entho sunnithamga untundi kadaa anduke kaabolu aa manasuke siksha
ReplyDeleteWelcome to my blog sridevi gajula garu.......అంతేనంటారా? అయితే సున్నితంగా ఉండడం కూడా తప్పేనన్నమాట :-)
DeletePadma you are marvelous.......You are poetess queen. Fantastic lines with lovely pic.
ReplyDeleteMahee my friend.....don't praise me in such a way that i may not come down to earth again ;-) Thanks for your compliments.
Deleteమీలోని కవితానైపుణ్య్యానికి ఇదో కలికితురాయి. చివరికంటూ చదివించి అందమైన మలుపులతో ముగింపునిస్తూ ఆలోచిపజేయడం మీ ప్రత్యేకం. మరిన్ని మదిని దోచే కవితలు రాయండి.
ReplyDeleteమీ అభిమాన ఆదరణలే నన్ను ఇలా ప్రేరేపిస్తున్నాయి..... ధన్యవాదాలండి.
Deleteమనసు మాటలు, వేదనలు, ఆలోచలని హృదయానికి హత్తుకునే భావంతో ప్రత్యేకంగా చెప్పడం మీకు మాత్రమే సాధ్యం. అది ఇక్కడ పరిపూర్ణంగా పండించారు.
ReplyDeleteధన్యవాదాలు.....అందమైన వ్యాఖ్యలతో అలరిస్తున్నావు యోహంత్.Thank you
Deleteవేదనతో శిక్షించబడ్డ మనసు అంబరాన్ని చేరి మరలి వచ్చింది..
ReplyDeleteవేగంగా వాన వచ్చి పరామర్శించబోయి మనసునే ముంచేసింది
ఎందుకంటే! కన్నీరు తనతో కలిసి కనబడనందుకు కట్టే రుసుమంది
concluded ending is too good with emotional touch.
Aniketh...thank you.
Deleteబాగు బాగు-:)
ReplyDeleteధన్యవాదము. :-)
Deleteశరీరానికి శిక్షవేస్తే మందులున్నాయి అందుకే మనసుకి వేస్తే మంచిదని
ReplyDelete"తనువుకెన్ని గాయాలైనా మాసిపోవును ఎలాగైనా...
Deleteమనసుకి ఒక్క గాయమైతే మాసిపోదు చితిలోనైనా!"
ఈ పాట గుర్తుకు వచ్చిందండి మీ కమెంట్ చూడగానే
How could I miss this awesome blog!?
ReplyDeleteLovely. Especially the closing lines ..
Hearty welcome to my blog.
DeleteThanks for your comments.
క్షమించాలి. చాలా రోజుల తర్వాత మీ కవితా సముఖమునకు. వర్షం వల్ల ఎంత ప్రయోజనం. ఏడ్చినా తెలిద.. కన్నీరు కనబడదు. నిజమే గానీ... నేను చాలా ఆశావాదిని కాబట్టి.. నాకూ, నిరాశావాదానికి అస్సలు పడదు. బద్ధ శత్రువులం. అలాంటప్పుడు మీ భావనకు ఎలా స్పందించాలో అర్థం కాక.. చేతులు రాక.. నా ఆశాదాన్ని
ReplyDeleteవదులుకోలేక... పదాల పొందికకు ప్రశంసించాలో... ఎందుకే ఇంత వేదన అని మిమ్మల్ని ఏక వచనంతో
నిందించాలో అర్థం కాక.. మొత్తానికి ముగించలేక... ముగించాననిపిస్తున్నందుకు... అన్యధా భావించొద్దు. ప్లీజ్
క్షమార్పణలెందుకండి......ఆశావాదమే అన్ని వేళలా ఆలంబన, ఆనందం అని తెలిసినా.....అది అచ్చొచ్చిన వాళ్ళకే కాని అందరికీ కాదేమోనండి!!!
Deleteఎందుకే ఇంత వేదన అంటే ఏం చెప్పను??? నిరాశా, నిస్ఫ్రుహల నుండి రాటుదేలినవారికి నిగారింపు ఎక్కువని.....వేదనలో పలికిన భావాలకి ఉన్న పస పరవశంగా పలికితే రాదని అంటే మీలాంటివారు ఒప్పుకోరని తెలిసినా వాధిస్తాను....తప్పులెంచకండి ప్లీజ్ :-)
అయ్యో... మీది సున్నితమైన మనసే.. నేను కొంచెం కటువేనండి. మీరన్న ఆ వేదనలు, ఎన్నో
Deleteముళ్లదారుల మధ్యలోంచే ప్రయాణించి.. ఆశవాదాన్ని జీర్ణించుకున్నాను. వేదన తాత్కాలికం..
ఆ వేదనలో ఉన్న నిరాశావాదం... నుంచి ఆశావాదం పుట్టాలనే నా భావన. ఎందుకే ఇంత వేదన
అని చనువు తీసుకున్నాను.. ఏమీ అనుకోకండి.
మరో చిన్న మాట.. మీ పదాలకు నిజంగా మనసుకి ఏదో చలనం కలుగుతుంది. ఏదో ఒకటి బదులివ్వాలని
ReplyDeleteఉవ్విళ్లూరుతుంది. కానీ... మీ వేదనలో గాంభీర్యం చాలా పిరికితనానికే ధైర్యం ఇచ్చేలా ఉంటుంది. మనసుకి
గాయం అయిన వారికి మందు వేస్తుంది. అందుకే మీ మనసుకి ఏనాడు గాయం కలగకూడదని
సదా ఆశిస్తున్నాను. ఇలా స్పందించాలనిపించింది. స్పందించాను. తప్పులుంటే.....
ధన్యురాలిని......ఇలా నా పదభావాలు కొందరిలో చలనం పుట్టించి, నా పై అభిమానాన్ని కలిగించేలా చేయగలిగాయి అంటే నా రాతలకి సార్థకత చేకూరినట్లే.....నాకే కాదు ఎవరి మనసుకీ గాయం కాకూడదు అనే కోరుకుందాం!!
Deleteస్పందించాలనిపించినా,
అనిపించకపోయినా,
తిట్టాలనిపించినా,
మెచ్చుకోవాలనిపించినా....
సంశయించకుండా చెప్పేస్తారని ఆశిస్తూ....
కానీ మీ అక్షరాల్లో ఉన్న ఆవేదన మీలో లేదని నాకు తెలుసు. అందుకే మీ అక్షరాలు నిరాశావాదులకు
Deleteసాంత్వన కలిగిస్తాయన్నది. దిగులు ఉన్నవారు దిగులుపడుతూనే ఉంటారు. ఎందుకు దిగులు..
వెలుగుని తరిమేసే చిరుదీపంలా కన్నీళ్లను తుడిచే వానచినుకులుండగా... అని భావం వచ్చేలా
రాశారు. ఎంత ఆశావాదమది. మీ అక్షరాల్లో సంస్కారానికి, పిరికివాళ్లకు కూడా ధైర్యాన్ని
నూరిపోసే మీ కుంచె లాంటి కలానికి... నా వందనాలు.
పద్మ గారు... మీ ఫ్యాన్స్ అంటూ ఒక బ్లాగ్ క్రియేట్ అయింది. కంగ్రాట్స్. ఒక వ్యక్తి అక్షరాలు ఈ స్థాయిలో
ReplyDeleteఅభిమానాన్ని పెంచుతాయా అని అనిపించింది. అభిమానం దొరకడం అంత సులువేం కాదు.
వేయి జన్మల పుణ్యమది. మీకు.. మీ అక్షరాలతో అభిషేకం చేశారు. ఓ మిత్రుడిగా చాలా
ఆనందిస్తున్నాను. కీపిట్ అప్.
ఏ జన్మ పుణ్యఫలమో.....ఇలా అభిమానాన్ని పొందడం నిజంగా సుకృతమే. ఇంతటి అభిమానానికి నేను ఎంత వరకు అర్హురాలినో నాకు తెలీదు కాని.....నా భావాక్షరాలకి ఆ స్థాయి అభిమానాన్ని అద్ది అలరిస్తున్న ఆ వ్యక్తికి నమఃసుమాంజలులు_/\_.
Deleteమీ అందరి ఆదరాభిమానాలతో ఇలా సాగిపోవాలని కోరుకుంటూ మరొక్కమారు_/\_
పుణ్యం మాత్రమే కాదు... మీ సృజనకు పట్టం. ఆ బ్లాగు క్రియేట్ చేసిన వారికి మీ కవితల ద్వారా
Deleteఏదో సందేశం... సమస్యలకు పరిష్కారం దొరికి ఉంటుంది. ఆ అభిమానమే ఆ బ్లాగులో
నాకు కనిపించింది. ఏది ఏమైనా... ఇంత మంది అభిమానం... మీకు లభిస్తుంటే.. నాకు ఆనందంగా
ఉంది. ఎందుకో...
You are so awesome :)
ReplyDeleteSuresh Babu
The sweet painting got Life ...with u r words !!!
ReplyDeleteSuresh babu
Thanks a lot for your comments & compliments.
ReplyDelete