"తూనికరాళ్ళు"

అంగుళంగుళం అందగత్తెనని
ఆమడ దూరంలోనే ఉంచేసావు
ఆరుగజాల చీర నే చుట్టానని
మూరెడుమల్లెలు తీసుకురానినీవు
జానాబెత్తెడు బట్టకట్టిన దానిని
నెరజాణనంటూ చూసి లొట్టలేసావు
ఇంచు అందాలను తాకి ఆమెని
అప్సరసంటూ అందలమెక్కించావు
చిటికెడు నవ్వుని ప్రేమనుకుని
తబ్బిబై తెగ సంబర పడిపోయావు
లీటరుబీరు పావుశేరు పలావుతిని
నోట్లని లెక్కచేయక గుమ్మరించావు
అడుగడుక్కి రోగం అంటించుకుని
కొండంత ఆస్తి కరిగినాక తిరిగివచ్చావు
ఇప్పుడింక రెండు గజాలైనా చాలని
బారెడంత బాధ్యత నాకు అంటగట్టావు
చివర్లో గుప్పెడంత గుండెలో నేనని
పిడికెడుప్రాణంలో పిడిబాకు దింపావు

(ఇది వ్యసనాలకు బానిసై చరమాంకంలో తిరిగి వచ్చిన భర్త పై భార్య విసిరిన "తూనికరాళ్ళు" )

42 comments:

  1. సుతిమెత్తగా సుత్తితోకొట్టి బొడిపకట్టించావు కవితతో ముందుగానే కళ్ళు తెరుచుకోమని సందేశం అందించావు. బాగుంది పద్మా.

    ReplyDelete
    Replies
    1. మొత్తానికి సుత్తికొట్టానని అభియోగమేగా మహీ ;-)

      Delete
  2. కవిత చాలా బావుంది పద్మార్పిత గారు:-):-)

    ReplyDelete
    Replies
    1. :-) హమ్మయ్య మెచ్చుకున్నారన్నమాట

      Delete
  3. రక్తకన్నీరే! :)

    ReplyDelete
    Replies
    1. అంతుందాండి.....హాస్యానికి అన్నారా?

      Delete
  4. చైతన్యవంతం చేసే కవిత

    ReplyDelete
  5. అంతేనంటారా! అయితే ఓకే..:-)

    మీదైన శైలిలో నీతి సూత్రాన్ని కూడా కవితగా మలిచి కళ్ళు తెరిపించారు పద్మ గారూ.. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. నా డైలాగ్ మీరు చెప్పేస్తే నేనేం చెప్పను :-)

      Delete
  6. Surprising post with a stunning message. Keep rocking Madam.

    ReplyDelete
  7. super duper post mam

    ReplyDelete
  8. తర్కించడానికేముంది బొప్పికట్టేది మాకే

    ReplyDelete
    Replies
    1. ఇంకా కట్టలేదాండి :-)

      Delete
  9. How horrible!
    ఎంత బాగా చెప్పారు కవితలా...

    ReplyDelete
    Replies
    1. Do you think so!
      థ్యాంక్యూ.....

      Delete
  10. chaalaa aalochimpajese vidamgaa undi.tunika raallu. totalgaapost adubutamgaa undi
    http://www.googlefacebook.info/

    ReplyDelete
    Replies
    1. Welcome to blog Ajay Kumar.....thank you very much.

      Delete
  11. హాస్యం అనుకున్నా, కాదు సరళమైన సందేశాన్నిచ్చారుగా......బాగుంది

    ReplyDelete
    Replies
    1. అందుకని నవ్వవా తెలుగమ్మాయ్ :-)

      Delete
  12. Replies
    1. మీ ఈ "wow " నాకెంతో స్పూర్తిదాయకం..

      Delete
  13. అనుకున్నా ఇలా నవ్వుతూ ఏదో చురక వేస్తావని. నవ్వుతూ వాత పెట్టినా వాస్తవాన్ని చెప్పావు భలే భలే-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మరీ బొత్తికా ఇలా తయారయ్యానేంటో....వాతలు పెడుతున్నాను :-)

      Delete
  14. వావ్ సూపర్! నవ్వుకోవడానికి భలేగా ఉన్నా చివరికి మంచి మెసేజ్ ఇచ్చావు:-)) క్యూట్:-))

    ReplyDelete
    Replies
    1. నవ్వుతూ కమెంటావు...డబుల్ క్యూట్ :-)

      Delete
  15. ఈ తరహా పదును.. మీ నుంచి... ఊహించలేదు... నిజంగానే తల బొప్పి కట్టించింది.. సందేశం.

    ReplyDelete
    Replies
    1. ఇంకా నయం కొట్టాను అని కేస్ పెట్టలేదు :-)

      Delete
  16. padmaji it is difficult to understand but definitely I think its an useful message by you in humorous way.

    ReplyDelete
    Replies
    1. Yes its absolutely correct what you are thinking. Thanks for your comment.

      Delete
  17. చివరిదశలో వచ్చి ఇంకా భాధ్యతలని పెంచాలా?

    ReplyDelete
    Replies
    1. కొన్ని బంధాలకి భాధ్యతలు తప్పవేమో

      Delete
  18. పద్మగారూ, చాలా బాగుంది, కొంచం సంతొషంగా కూడా ఉంది.:-))

    ReplyDelete
    Replies
    1. థ్యాంక్యూ.....వై హ్యాపీ ?

      Delete
  19. పద్మా నువ్వు ఇలా రాళ్ళు రువ్వితే ఎలా......మారవలసిన వారు మారకపోగా నీతో పచ్చీ పో అంటారేమో :-).....అయినా నువ్వు విసిరేవిరాళ్ళుకాదుగా అక్షరాలు...అయితే ఓకె

    ReplyDelete
    Replies
    1. పోనీలెండీ......పచ్చీ పొమ్మన్నా నిజం నిలకడగా తెలుసుకుని వస్తారుగా :-)

      Delete
  20. "ఇప్పుడు .... బారెడంత బాధ్యతవై .... గుప్పెడంత గుండెలో నేనని, పిడికెడుప్రాణంలో పిడిబాకు దింపుటూ"
    దానంతటదే విసిరేయబడ్డ బంతి తిరిగొచ్చినట్లు .... ఆలోచనల్ని రేకెత్తిస్తూ బావుంది కవిత. అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకి ధన్యవాదాలండి.

      Delete
  21. ఇలాకూడా మమ్మల్ని ఉండనివ్వరన్నమాట :-) బాగుంది

    ReplyDelete
    Replies
    1. ఇలా నిజంగా ఇంకా ఉండాలనుకుంటున్నారన్నమాట :-)

      Delete