వెలిగించని ఒత్తుకి దీపకాంతులు ఎక్కడివి
ప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
వ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది
కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
పలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది
ఒకరికోసం ఒకరున్నప్పుడు ఎవరికేంచెప్పేది
ప్రేమేలోకమైతే ఎవరి కోసం వేడుకలు చేసేది
ప్రాణం ప్రణయం రెండొకటని ముడి వేసింది
నీటముంచినా పాలముంచినా ఒకటేననంది
జ్ఞాపకాలతో హాయిగా కాలాన్ని సాగనివ్వంది
మరింక నన్నునేను మరచి ఎవరిని తలచేది
ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!
సవ్వడి చేయని గుండెకి లయ ఎక్కడిది? No words just claps claps claps, sorry for commenting in english.
ReplyDeleteagain you came with a lovely poem. .. Thank you Madam.!
ReplyDeleteFantastic there is no words to express our happiness about your poetry, just adbutam.. Wish u happy Diwali to u and your family members..
ReplyDeleteబాబోయ్! నాకేం అర్ధంకాలేదు :)
ReplyDeleteకొంచెం తిప్పి తిప్పి అదే చెప్పినట్లుంది పద్మ :-)
ReplyDeleteisse samajh ne mein waqt lagega shayad, chitr tho bahut sundar hai.
ReplyDeleteప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
ReplyDeleteవ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది.....ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!
నిజమే...మనసు పడే వ్యధలోనుంచే కదా ప్రేమ అంకురించేది....కానప్పుడే అది ప్రేమే కాదేమో...
ఎలా చెప్పాలో తెలీడంలా....ప్రేమించామనుకునేవారు....దీన్ని చదివితే అన్నా అసలైన ప్రేమంటే ఎలా పుడుతుందో తెలుస్తుందేమో...ప్రాణం ప్రణయం రెండూ ఒకటని ముడి వేయడం...దారుణం....ప్రేమను పంచగలిగే వారికే ప్రేమంటే తెలుస్తుంది.....
ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టున్నా...మనసూరుకోలా చదవగానే....
గుక్క తిప్పు కోకుండా చెప్పిన ప్రతి పదానా ప్రేమ కనిపిస్తుంది,
ReplyDeleteమీ కలానికి నా సలాం,
పద్దమ్మా.... బాగుంది పదాలపొందిక.
కవితలోని గాఢత ప్రతి పాదంలోను అంతరంగంలోని వేదన ప్రణవనాదమయి హృదయాన్ని తాకింది ప్రేమార్పిత గారు.. అభినందనలతో...
ReplyDeleteఇంతలా చెప్పాలా ప్రేమని వేదనని :-)
ReplyDeletechitram bagundi, kavitha konchem confused.
ReplyDeleteపద్మార్పిత అల్లిన పదమాల :)
ReplyDelete"కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
ReplyDeleteపలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది"
ఇలా ప్రశ్నిస్తూనే రాసేస్తుంటే ఏమని పొగిడేది
మీ స్ఫూర్తిదాయక స్పందనలకు నమోఃవందనం. _/\_
ReplyDeletechala bagundi andiii....
ReplyDelete