ఎవరికోసం


సవ్వడి చేయని గుండెకి లయ ఎక్కడిది?
వెలిగించని ఒత్తుకి దీపకాంతులు ఎక్కడివి
ప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
వ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది

కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
పలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది
ఒకరికోసం ఒకరున్నప్పుడు ఎవరికేంచెప్పేది
ప్రేమేలోకమైతే ఎవరి కోసం వేడుకలు చేసేది

ప్రాణం ప్రణయం రెండొకటని ముడి వేసింది
నీటముంచినా పాలముంచినా ఒకటేననంది
జ్ఞాపకాలతో హాయిగా కాలాన్ని సాగనివ్వంది
మరింక నన్నునేను మరచి ఎవరిని తలచేది
ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!

15 comments:

  1. సవ్వడి చేయని గుండెకి లయ ఎక్కడిది? No words just claps claps claps, sorry for commenting in english.

    ReplyDelete
  2. again you came with a lovely poem. .. Thank you Madam.!

    ReplyDelete
  3. Fantastic there is no words to express our happiness about your poetry, just adbutam.. Wish u happy Diwali to u and your family members..

    ReplyDelete
  4. బాబోయ్! నాకేం అర్ధంకాలేదు :)

    ReplyDelete
  5. కొంచెం తిప్పి తిప్పి అదే చెప్పినట్లుంది పద్మ :-)

    ReplyDelete
  6. isse samajh ne mein waqt lagega shayad, chitr tho bahut sundar hai.

    ReplyDelete
  7. ప్రేమించని మనసుకి వేదనవేడెలాతెలిసేది
    వ్యధలేని ప్రేమకి అర్థమేలేదని ఏం చెప్పేది
    ఎగసిపడని కోర్కెలసెగలో ధూపమెలాతీసేది.....ఉఛ్ఛ్వాసలోని నిన్ను నిఛ్ఛ్వాసలో ఎలావీడేది!
    నిజమే...మనసు పడే వ్యధలోనుంచే కదా ప్రేమ అంకురించేది....కానప్పుడే అది ప్రేమే కాదేమో...
    ఎలా చెప్పాలో తెలీడంలా....ప్రేమించామనుకునేవారు....దీన్ని చదివితే అన్నా అసలైన ప్రేమంటే ఎలా పుడుతుందో తెలుస్తుందేమో...ప్రాణం ప్రణయం రెండూ ఒకటని ముడి వేయడం...దారుణం....ప్రేమను పంచగలిగే వారికే ప్రేమంటే తెలుస్తుంది.....
    ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టున్నా...మనసూరుకోలా చదవగానే....

    ReplyDelete
  8. గుక్క తిప్పు కోకుండా చెప్పిన ప్రతి పదానా ప్రేమ కనిపిస్తుంది,
    మీ కలానికి నా సలాం,
    పద్దమ్మా.... బాగుంది పదాలపొందిక.

    ReplyDelete
  9. కవితలోని గాఢత ప్రతి పాదంలోను అంతరంగంలోని వేదన ప్రణవనాదమయి హృదయాన్ని తాకింది ప్రేమార్పిత గారు.. అభినందనలతో...

    ReplyDelete
  10. ఇంతలా చెప్పాలా ప్రేమని వేదనని :-)

    ReplyDelete
  11. chitram bagundi, kavitha konchem confused.

    ReplyDelete
  12. పద్మార్పిత అల్లిన పదమాల :)

    ReplyDelete
  13. "కవితలూ కావ్యాలు రాసి ఏం వినిపించేది
    పలుకుల మధ్యన పదాలెన్నని జోడించేది
    లిపికోసం వెతికితే కంటిభాషేలే కనిపించేది"
    ఇలా ప్రశ్నిస్తూనే రాసేస్తుంటే ఏమని పొగిడేది

    ReplyDelete
  14. మీ స్ఫూర్తిదాయక స్పందనలకు నమోఃవందనం. _/\_

    ReplyDelete
  15. chala bagundi andiii....

    ReplyDelete