పయనం

ఈ జీవితంలో జవాబులేని ప్రశ్నలు ఎన్నో
అడిగడిగి విసిగిస్తున్నాను నేను ఎందుకనో
కొన్నింటికి జవాబు తెలిసినా సరిపెట్టుకోలేక
సరైనదో కాదో తెలీని ప్రశ్నగా మిగిలున్నానో
సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వేధిస్తున్నానో
తెలీక ప్రశ్నించి నన్ను నేను అన్వేషిస్తున్నా!!

సమాజంపై సంధించబోయాను శరాలు ఎన్నో
యోచిస్తే సమాజమంటే నేనున్నా అందులో
ఇక ఎవరిపై ఎక్కుపెట్టేది వక్రించిన బాణాలను
అందుకే బంధీనైతి సంస్కరణల విల్లంబులలో
కర్తవ్యమేదో కాళ్ళనిచుట్టేసింది నేనేం చేయాలో
కార్యాచరణలో ఇక ప్రశ్నించక సాగిపోతున్నా!!

ఈ పోరాటంలో గెలుపు ఓటములు ఎన్నెన్నో
ప్రయాణంలో మజిలీ ఎరుగని మైళ్ళు మరెన్నో
అలసి విరామమంటూ స్వేదాన్ని ఆవిరవనిస్తే
దూసుకుంటూ పోయే పదునైన మలుపులెన్నో
కాలానుగుణమై సాగితే దొరికే జావాబులింకెన్నో
అందుకే నేను నేనుగా ఆగకుండా అడుగేస్తున్నా!!

42 comments:

  1. మీ పయనానికెవరు అడ్డు? సాగించండి :-)......చాలా బాగుందండి

    ReplyDelete
    Replies
    1. సాగిపోతున్నా.....థ్యాంక్యూ!

      Delete
  2. Keep going Madam..! Different style.

    ReplyDelete
  3. ప్రశ్న నుండే కదండీ మనిషి ప్రయాణం ఇంత దూరం వచ్చింది .ప్రశ్నలు వేస్తూ ఉండండి!

    ReplyDelete
    Replies
    1. అలాగే....ధన్యవాదాలు.

      Delete
  4. ప్రతి ప్రశ్న లోనూ సందించిన సందేహాలెన్నో,..
    ప్రతి పదానా తీయటి విరుపులెన్నో...
    మీ కవితలో అందమైన మలుపులెన్నో...
    పద్మా.., చిత్రం దాన్న్ని మించిన అక్షరమూ మీ సొంతం.

    ReplyDelete
    Replies
    1. మీ హృదయస్పూర్తి స్పందనకు నెనర్లండి

      Delete
  5. ఎర్ర చీర ఎర్ర అక్షరాలూ కనిపించక ప్రదర్శిస్తున్న ఆవేశపు కోపం. నిరుత్సాహంతో కూడిన తెగింపు. మీకు మీరే నచ్చక నచ్చజెప్పుకున్నట్టుంది.

    ReplyDelete
    Replies
    1. అంతేకదండి నచ్చచెప్పుకోక తప్పదు.....థ్యాంక్యూ

      Delete
  6. అలసి విరామమంటూ స్వేదాన్ని ఆవిరవనిస్తే
    దూసుకుంటూ పోయే పదునైన మలుపులెన్నో
    కాలానుగుణమై సాగితే దొరికే జావాబులింకెన్నో
    అందుకే నేను నేనుగా ఆగకుండా అడుగేస్తున్నా!!

    జీవన గమనంలోని అనేక మలుపులలోని సంఘర్షణను ప్రశ్నల రూపంలో సంధిస్తూనే పయనం సాగించాలన్న ఆశావహ దృక్పధాన్ని జోడించి ముగించడం అభినందనీయం పద్మార్పిత గారు.. చిత్రం ఎప్పట్లానే సరిజోడుగా వుంది. అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. ఆ ఆశావాదమే అలా నడిపిస్తుందండి....ధన్యవాదాలండి

      Delete
  7. సమాజంపై సంధించబోయాను శరాలు ఎన్నో
    యోచిస్తే సమాజమంటే నేనున్నా అందులో
    ఇక ఎవరిపై ఎక్కుపెట్టేది వక్రించిన బాణాలను
    అందుకే బంధీనైతి సంస్కరణల విల్లంబులలో
    ఏమని చెప్పాలో అర్థం కావడంలేదు, ఇలా నీవు మాత్రమే రాయగలవు అంతే
    Simply superb

    ReplyDelete
    Replies
    1. నన్ను నేనే ప్రశ్నించుకుంటే ఇలా మహీ.....థ్యాంక్యూ

      Delete
  8. చివర్లో అందమైన ముగింపుతో మంచి సందేశాన్ని ఇవ్వడంలో మీరు మహా నేర్పరులు

    ReplyDelete
    Replies
    1. ముగింపు అవసరం కదా యోహంత్, అందమైన ముగింపు ఆనందం కదా!

      Delete
  9. kyaa bath kaha aap ne, khudh par unglee utaya :)

    ReplyDelete
    Replies
    1. Duniya ko sudhaar ne se, Apne aap ko badal na achcha......Sukriya dost

      Delete
  10. మీకు మీరే ఇన్స్పిరేషన్ అన్నమాట :-) బాగుంది

    ReplyDelete
    Replies
    1. అంతేకదండి...థ్యాంక్యు

      Delete
  11. hay hey super:-)) inka image super:-)) img kattila undi:-)) kavitha inka chala bagundi:-))

    ReplyDelete
  12. సామాజిక భాణం సంధించారీసారి. అక్షరాల్లో స్పృహని, ఆవేశా్న్ని దట్టించారు. అందుకు అందమైన చెక్కిన శిల్పానికి
    ఎర్రచీర కట్టి భావావేశానికీ చక్కని రూపాన్నిచ్చారు. ఓకే.

    ReplyDelete
    Replies
    1. నాపై నేనండోయ్....సమాజంపై సంధించి సాధించడానికి ఏముందని?-)

      Delete
  13. ఎర్రమందారం ఎన్నీయల్లో సంధించిన అస్త్రం

    ReplyDelete
  14. బంధీనైతి సంస్కరణల విల్లంబులలో
    కర్తవ్యమేదో కాళ్ళనిచుట్టేసింది నేనేం చేయాలో
    కార్యాచరణలో ఇక ప్రశ్నించక సాగిపోతున్నా!!
    ప్రశ్నలు జవాబులు మీకు మీరే ఇచ్చుకోగలరు :-)అదే మాకు ధీమా

    ReplyDelete
    Replies
    1. జాబులు జవాబులు నేనే చెప్పుకోనా అనికేత్ :-)

      Delete
  15. చర్నాకోల్ తో చరిచావో లేక ఉలిక్కిపడ్డావో, మొత్తాని మది దోచావు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. ఏదో నా మానాన్న నేను రాసుకుంటే చరిచావు , దోచావు అంటారేంటో......హరినాధ్ గారు

      Delete
  16. జవాబులు దొరకని చిక్కు ప్రశ్నలకు,సమాధానాలు వెతుక్కోవడమే జీవితం,ఎవరినివారు అన్వేషించుకొని అంతర్మధనం చేసుకొని ,గుండెను కవ్వం చేసుకొని చిలుకుతూ పోవాలి,సమాజం మందలో ముఖంలా ఉండక,నలుగురితో నారాయణా అనుకుంటూ ఉండక,అత్యాచారాలను,ఆకృత్యాలను,అరాచకాలను నిర్ద్వంద్వంగా ఖండించాలి,సంస్కరణలకు నడుం కట్టి ,ప్రశ్నలశరాలను సంధిస్తూ సంధిస్తూ,కార్యాచరణను మొదలు పెట్టి,ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ,ముందుకు మున్ముందుకు,ఆగకుండా అడుగు వేయడమే జీవితం!పద్మార్పిత పయనం శరవేగంగా సాగాలి! బొమ్మకంటే కవనం కదలించింది!

    ReplyDelete
    Replies
    1. మీ ఈ ఆత్మీయ ఆశీర్వచనాలు నన్ను ఇలా సాపీగా సాగేలా చేస్తాయండి. ధన్యవాదాలు మీకు _/\_

      Delete
  17. ఇది నాకు చాలా నచ్చింది పద్మ

    ReplyDelete
    Replies
    1. మనసు కుదుటపడింది....మీకు నచ్చిందిగా :-)

      Delete
  18. మాడంగారు ఒక మంచి రొమాంటిక్ కవిత రాసేద్దురు చాలారోజులైంది :-)

    ReplyDelete
    Replies
    1. అలాగే తప్పకుండా....శీతకాలం వచ్చేసిందిగా :-)

      Delete
  19. Luv you Padmarpita gaaru.. :)

    ReplyDelete
  20. "సమాజమంటే నేనున్నా అందులో" ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మంచి సందేశం!

    ReplyDelete
    Replies
    1. గమనించాలి అనుకున్న విషయాన్ని విశధీకరించారు. థ్యాంక్యూ

      Delete
  21. కొన్నింటికి జవాబు తెలిసినా సరిపెట్టుకోలేక
    సరైనదో కాదో తెలీని ప్రశ్నగా మిగిలున్నానో
    సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ వేధిస్తున్నానో...
    .ఈ పరిస్థితి తప్పదేమో ప్రతి ఒక్కరికీ.....
    కాలమే జవాబు చెప్పగలడు కొన్నిటికి....
    నిరాశ నడుమ ఆశ.....ఎంతో inspiration కలిగించేలా ఉంది....all da best.

    ReplyDelete