జంటపదాలమై...

ఉండి-ఉండి అనుకోకుండా దగ్గరైనావు
మెల్ల-మెల్లగా నా మనసునే దోచేసావు

చూస్తూ-చూస్తూ వెర్రిమది నీదైపోయింది
తియ-తీయని నీ ప్రేమలో పడిపోయింది

పదే-పదే పెదాలు నీపేరే పలుకుతున్నాయి
నన్ను-నన్నుగా నిలువనీయక ఉన్నాయి

చిన్ని-చిన్ని సైగలతో నన్ను మాయచేసావు
మిణుకు-మిణుకుమన్న కోర్కెల సెగ రేపావు

ఏవో-ఏవో కలలంటూ మనసు మాటవినకుంది
నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది

ఇలా-ఇలా తెలియకనే నావన్నీ నీ వసమైనాయి
క్రమ-క్రమంగా నాలోనే నన్ను లేకుండా చేసాయి

చిలిపి-చిలిపి చేష్టలతో చిత్రంగా ఒకటి అయినాము
ఏడు-ఏడు జన్మలకి జంటపదమై మనముందాము

19 comments:

 1. madam thank you adigina ventane andincharu pasandaina prema kavita

  ReplyDelete
 2. This is the magic of Padmarpita...

  ReplyDelete
 3. ఏడు జంట పదాలతో ఏకమై ప్రేమభావంతో అలరించారు.

  ReplyDelete
 4. Very sweet and short poetry, Cute and fantastic lines with simple words. Really really very nice:-))

  ReplyDelete
 5. పద్మగారు మీ టాలెంట్ కి జోహారు....మాకు కాస్త నేర్పించండి మాడం :-)

  ReplyDelete
 6. ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤ ❤

  ReplyDelete
 7. ^^ motham 14 janmaliki.. :)

  Luv u and all.. but luv u more..
  jk.. poetry chala bagundi..

  -- Anonymous coward..

  ReplyDelete
 8. పద్మార్పితగారు ఒక్కట్టి- ఒక్కటైనా నన్ను మీలా రాసేలా దీవించండి :-)

  ReplyDelete
 9. ఏవో-ఏవో కలలంటూ మనసు మాటవినకుంది
  నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది..
  beautiful expression ప్రేమార్పిత గారు..

  ReplyDelete
 10. చూస్తూ-చూస్తూ వెర్రిమది నీదైపోయింది
  తియ-తీయని నీ ప్రేమలో పడిపోయింది

  పదే-పదే పెదాలు నీపేరే పలుకుతున్నాయి
  నన్ను-నన్నుగా నిలువనీయక ఉన్నాయి..ika cheppaTaniki matalu leevu mari

  ReplyDelete
 11. ఎప్పుడూ ఏదో ఒక నూతన కాన్సెప్ట్ ఆలోచించి విన్నూతన ప్రయోగాలని చేస్తారు అందుకే మీరు అందరిలో ప్రత్యేకం. చాల బాగుంది

  ReplyDelete
 12. నీలోని జ్ఞానసంపదకి, ఆలోచనా శక్తికి దానికి తోడు ముఖ్యంగా నీ సమయస్పూర్తికి సలాం పద్మ. ఈ కవిత బాగు-బాగు/హరినాధ్

  ReplyDelete
 13. జంటపదాలేం ఏదైనా రాసేయగల చాతుర్యమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు

  ReplyDelete
 14. నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది....ఎంత బాగా అన్నారు...
  క్రమ-క్రమంగా నాలోనే నన్ను లేకుండా చేసాయి....నాకు బాగా నచ్చిన మాటలివి
  ఆస్వాదిస్తున్నా మీ పదాలలోని మాధుర్యాన్ని...

  ReplyDelete
 15. అక్షర మల్లెలను... వలపు దారంతో ముడివేసి... ప్రణయ సుగంధాలద్ది.. మనసులు కలిస్తే
  ప్రతి రాత్రి వసంత రాత్రేనని... ప్రతి రోజూ వెన్నెల జల్లేనని.. చెప్తున్నారు. ఈ ఆధునిక రాధామాధవజనాంతికంతో...
  శభాష్.... ఈ సౌగంధికా అక్షర సుమాల జడివానకు...

  ReplyDelete
 16. Padmarpita gaaru, inthaa baagaa elaa rastaaru... superb..:-):-)

  ReplyDelete
 17. నా రాతలకి స్పందించిన ప్రతిఒక్కరికీ నమస్సుమాంజలి_/\_

  ReplyDelete
 18. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 19. chala chala bagundi mee kavitha...

  Ammainu varnisthu oka kavitha rayagalara...pls

  ReplyDelete