అక్షర అరంగేట్రం

అక్షరాలతో అరంగేట్రం చేయబోయి...
కుప్పిగంతులే వేసి కూచిపూడి ఇదని
కోలాటమాడి భరతనాట్యం అనుకోమని
కథాకళి చేసి కాలు బెణికి కట్టుకట్టుకుని
కధక్ చేస్తే అర్థమైంది ఆరంభం ఇలాకాదని
గెంతులేస్తే నాట్యం, పదాలల్లితే కవిత్వంకాదని

అక్షరాభ్యాసమంటూ అడుగులేయబోయి..
తప్పటడుగు వేయకుండా సంభాళించుకుని
భావాక్షరాలతో నర్తించబోయా వీధిభాగవతాన్ని
మణిపురీనృత్యాన్ని, ఒడిస్సీ, తెయ్యం అనుకుని
మోహినీఅట్టాన్ని, తమాషా, కాదు యక్షగానమని
ఆడబోతూ అనుకున్నా భావంలేని కళకి జీవంలేదని

అక్షరాలకి భావాల మువ్వలెన్నో కట్టి గెంతబోయి..
నాట్యమని పడిలేచి అక్షరాసరాతో ఆత్మ సంతృప్తిని
వర్ణచిత్రాలకి అక్షరాలని జతచేసి ఆనంద అభిమానాన్ని
పొందాలన్న ఆశతో బాంగ్రా, ఝుమర్, నౌటంకీ నృత్యాలని
తెలియక కజ్రీ, జత్రా, ఛావ్, గర్భా, ఛక్రీ, స్వంగ్. బిహూలని
కలిపి పులినాట్యం ఆడబోతూ తడబడుతున్నా తప్పేమోనని


2008 నవంబర్ చివరి వారంలో వ్రాయడం ప్రారంభించిన నా అక్షర అరంగేట్రం ( మొదటి కవిత వ్రాసాను ) ఇప్పటికి ఐదు వసంతాలు పూర్తిచేసుకుని నా కవితాప్రస్థానం మీ అందరి ఆశిస్సులూ కోరుతూ మీముందు ప్రణమిల్లుతున్నది._/\_

భారతీయ నృత్యాల పేర్లని కొన్నింటిని కవితాక్షరాలతో అల్లాలన్న నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ పెద్దమనసుతో ఆస్వాధిస్తారన్న మరో ఆశతో......

53 comments:

 1. అత్యద్భుతం...అయిదేళ్ళలో ఇంతలా అక్షరాలతో అందమైన అల్లికలు అల్లి అలరించారు పద్మార్పితగారు. మనఃపూర్వక శుభాభినందనలు

  ReplyDelete
  Replies
  1. అనతికాలంలో అభిమానించి నా కవితల్ని ఆస్వాధించిన మిత్రునికి వందనం.

   Delete
 2. అక్షరాలకి భావాల మువ్వలెన్నో కట్టి గెంతబోయి..
  నాట్యమని పడిలేచి అక్షరాసరాతో ఆత్మ సంతృప్తిని
  వర్ణచిత్రాలకి అక్షరాలని జతచేసి ఆనంద అభిమానాన్ని..

  అభిమానమేంటి పద్మ గారూ వీరాభిమానాన్ని ప్రేమాభిమానాన్ని ఆత్మీయాభిమానాన్ని ఫాన్సాభిమానాన్ని పొందారు. పొందుతూ వున్నారు. యింకా దిన దిన ప్రవర్థమానమవుతూ కవితా చిత్ర కళా రంగాలలో విశ్వఖ్యాతిని పొందాలని మనఃస్పూర్తిగా ఆశిస్తూ అభినందన మందార సుమాంజలులు సమర్పిస్తున్నాం.

  ReplyDelete
  Replies
  1. మీరు అందిస్తున్న కవితాస్ఫూర్తి వ్యాఖ్యలకు నేను సదా ఋణగ్రస్తురాలిని వర్మగారు _/\_

   Delete
 3. పద్మార్పిత గారికి అభినందనలు. సదా మీ కవితల ఊబిలో కూరుకుపోతాను.

  ReplyDelete
  Replies
  1. వినోద్ గారు ఊబిలో(మడ్ పాండ్) ఎన్నడూ కూరుకుపోనీయనుగా......మడ్ బాత్ మంచి మరకలాంటిది :-)

   Delete
 4. గెలవడం గొప్పకాదు... ఆ వెనక ఎన్ని ఓటములున్నాయో గుర్తుచేసుకుంటేనే అసలు విజయానందం
  కలుగుతుంది. అదే విధంగా ఉంది. మొదట్లో మీరు రాసిన వాట్లో తడబాట్లు ఉన్నాయని,
  సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాను... అని హిపోక్రసీ లేకుండా తప్పు ఒప్పుకున్నారు చూడండి.
  హాట్సాఫ్. బహుశా మీ భావాల్లో నిజాయితీ వల్లే ఇంత మంది అభిమానులను సంపాదించారని అనుకుంటాను. మీ బ్లాగింట కవితాకుసుమాల గుభాళింపులు ఎప్పటికీ మనోరంజకం చేస్తూనే ఉంటాయి. అంటే పద్మార్పిత మరో పుట్టినరోజుగా భావించొచ్చా. ఈ రోజు. మరి పార్టీ...

  ReplyDelete
  Replies
  1. ఓటములు అంటూ ఏం కాదు సతీష్ గారు నిజానికి ఇవి నా తృప్తికోసం, ఆత్మస్థైర్యం కోసం రాసుకుంటున్న భావాలు. తప్పకుండా ఇందులో ఎన్నో తప్పులు ఉండడం సహజం అందుకే నేను ఎప్పుడూ అవి ఎవరు సరిచేస్తున్నా ఆనందంగా స్వీకరిస్తాను. మీ అభిమానానికి నెనర్లండి....

   Delete
 5. పద్మార్పితగారికి మనఃపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ..., ఇంకా మీరు ఇలాంటి ఎన్నో కవితలను మాకు అందించేలా అవి చదివి మేము ఆనందించే భాగ్యాన్ని ఇవ్వాలని సదా ఆ దేవున్ని ప్రార్థిస్తూ ....

  ReplyDelete
  Replies
  1. మీ అత్మీయ అభినందనలకు అభివందనములు.

   Delete
 6. పద్మా చూస్తూ చూస్తు నీతో నా అనుబంధానికి అయిదేళ్ళు పూర్తయ్యాయి. నువ్వు మాయింట్లో ఒక వ్యక్తి అన్నభావం, అంతలా అక్షరాలతో అల్లుకుపోయావు. అభినందనలు

  ReplyDelete
  Replies
  1. సృజనగారు.....మీరు నా కవిత చదవకుండా ఇంట్లో వంటచేయను అని నాలుగేళ్ళ క్రితం అన్న మాటలు నా చెవిలో ఎప్పుడూ మారు మ్రోగుతుంటాయి. మీ అభిమానాన్ని ఎప్పుడూ కోరుతూ

   Delete
 7. Arpita you are different and multi talented personality rocking the bloggers world. Keep it up yaar. Hearty Congratulations dear.

  ReplyDelete
  Replies
  1. thanks for your lovely comment & compliments.

   Delete
 8. అభినందనలు!
  మీ కవితా ప్రస్థానం అప్రతిహతమై పురోగమించుగాక!
  విజయోస్తు!!

  ReplyDelete
  Replies
  1. మీకు అభివందనాలు నాగరాజ్ గారు. _/\_

   Delete
 9. ఏ నాట్యము చేసిన భావ భంగిమ కు ఎన్నడు హాని వాటిల్లలేదు
  ఎలాటి కవిత మీరు రాసిన భావం ఎప్పుడు వీడలేదు
  పాదాలను లయబద్దకంగా ఆడిస్తే నాట్యమయ్యింది
  పదాలను ఒద్దికగా అమర్చితే భావ కావ్యమయ్యింది
  పంచేంద్రియాలు పులకింప చేసిన చిరుప్రయత్నం మీది
  చదివి తరించిన భావాత్మక హృదయం మా అందరిది
  ఈ ఐదు వత్సరాలు మీ కావ్యఝారి తో మమ్మేన్తగానో అలరించారు
  రాబోయే వసంతాలు కూడా మీ పదాల వనం లో విరుల కావ్యమాలికలు విరబూయాలని ఆశిస్తూ
  (మరో రెండు రోజుల్లో నా కావ్యాంజలి బ్లాగ్ ఆరేళ్ళు పూర్తి చేసుకుంటుంది)

  ReplyDelete
  Replies
  1. ఇలా సమ్మోహనాస్త్రాన్ని సంధించినా, మదినిదోచినా, అంతా మీ అందరి అభిమాన ఆశిస్సులే కదండి....ధన్యవాదాలు. మీకు నా హృదయపూర్వక అభినందనలు

   Delete
 10. _/|\_ అప్పుడే 5 వసంతాలు గడిచాయా అన్నట్లుంది. మీ కవితలు ఎప్పటికీ తాజాగా ఉంటాయి. యుగాలు మారినా ఈ భావాలు చెక్కుచెదరవు.

  ReplyDelete
  Replies
  1. http://padmarpitafans.blogspot.in/2013/11/5.html

   Delete
  2. సదా మీ అభిమానం కూడా స్వఛ్ఛంగా తాజాగా ఉండాలనే ఆకాంక్ష. _/\_

   Delete
 11. Congrats Padmarpitha garu...Enni nruthayalu vunnayya....Great...

  -Roopa

  ReplyDelete
  Replies
  1. Thank you....inkaa unnayandi nenu konnea raasanu.

   Delete
 12. అబినందన సుమార్పిత ఐదు వత్సరాలు అలుపెరుగని కవితలను అందించిన మీకు మీ కాలమునకు
  అభివాదం కావ్యార్పిత నిండు మనసును అక్షరాలలో ఆవిష్కరించిన మీ భావుకత కు
  అక్షరాలను మలిచి మల్లెల వానలు వాన నీటిలో కేరింతలు కొట్టించిన మీ అసమాన ప్రతిభకు

  ఐదు వత్సరాలు పూర్తి చేసుకుని ఆరవ వసంతం లో అడుగిడుతున్న మీ కావ్య ఝారికి కవితతోనే అభినందించాలని అనిపించి ఇలా రాస్తున్నాను

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 13. super duper post. congrats

  ReplyDelete
 14. హృదయపూర్వక అభినందనలు మాడం.....ఇంక ముందు కూడా ఇలాగే అలరిస్తారని

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 15. ముందుగా అభినందనలు. కవిత చదువుతున్న కొద్దీ మీపైఅభిమానం రెట్టింపై నోట మాటరావడం లేదండి

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి. అలా నోటమాట రాలేదనకండి మీరు బోలెడన్ని ఊసులు చెప్పేస్తానని మాటిచ్చారు ;-)

   Delete
 16. ప్రతి పదాన్నీ రంగులద్ది అందరి హృదయవేదికపై నాట్యమాడించిన పద్మమయూరీ... అభినందనలు.
  ఇంకా ఎన్నో కవితా పద్మాలు మీ నుండి ఆశిస్తున్నం

  ReplyDelete
  Replies
  1. మీ ఈ అభిమాన ఆప్యాయతాక్షరాలు నాకు సదా ప్రేరణలు.

   Delete
 17. Congratulation Dear Padma:-)) ila nindu nurellu vrastune undalani korukuntunnanu:-))

  ReplyDelete
 18. సకలకళాకోవిధురాలు మా పద్మార్పితకు ఆశ్శిస్సులు

  ReplyDelete
  Replies
  1. హరినాథ్ గారు....మీ అభిమాన ఆశిస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను

   Delete
 19. పద్మార్పిత గారూ,
  మీ అక్షరసువర్ణాలు మీ భావాలకి మీరు జీవం అద్దే (అపు)రూపాలు.
  మరిన్ని వసంతాలు పచ్చగా అలరించాలని కోరుకుంటూ...
  అభినందనలు!

  ReplyDelete
  Replies
  1. చిన్ని ఆశగారు మీరు వ్యాఖ్యాక్షరాలు నాకు ఆనందంతో పాటు స్ఫూర్తిని కూడా అందిస్తున్నాయి. ధన్యవాదాలండి.

   Delete
 20. "అభినందనల వాద్యాలన్నీ మేళవించి మీ అక్షర అరంగేట్రాన్ని ఆకాశమంత ఎత్తుకి ఎదగమని ఆశీర్వదిస్తున్నాయి" padmaji ise maine mere telugu dost se likhaayaa taki aap ko mai telugu mein comment karoon. aap ko bhadaayi ho# Nalottam

  ReplyDelete
  Replies
  1. Nalottam ji....aap ki ye telugu seekh ne ki ichcha mujhe bahut pasand aayaa. mai aap ka iss pyaar k abhaari hoon. తెలుగులో మీరు రాసిన కమెంట్ చాలా బాగుందండి. థ్యాంక్యూ

   Delete
 21. శభాష్ పద్మగారు సరిలేరు మీకెవ్వరు సకల కళాసంపన్నులు మీరు congrats

  ReplyDelete
  Replies
  1. ఓ....భలే భలేగా పొగిడేస్తున్నారుగా :-)థ్యాంక్యూ

   Delete
 22. కమెంట్స్ ఏం రాయాలో తెలియక తప్పించుకుంటూ తిరుగుతున్నాను అంటే నమ్మాలి మీరు :-) కంగ్రాట్స్

  ReplyDelete
  Replies
  1. భయాన్ని నమ్మాను కదా అని అభిమానాన్ని తగ్గించకండి :-)

   Delete
 23. అభినందనలు పద్మార్పిత....అందమైన అద్భుత అక్షరజాలం

  ReplyDelete
  Replies
  1. మీ అభిమాన స్పూర్తికి అభివందనం

   Delete
 24. ఎన్నో చెప్పాలనుకున్నా ఏమీ చెప్పలేక మౌనంగా మిమ్మల్ని మనస్పూర్తిగా అబినందిస్తున్నా పద్మాగారు

  ReplyDelete
  Replies
  1. అభినందన చాలండి....అభివందనం _/\_

   Delete
 25. అరంగేట్రం ఏంటి అంచెలంచెలుగా ఎదిగిపోతున్నారు

  ReplyDelete
  Replies
  1. అలా ఎదిగి ఎదిగి పడిపోతానేమోనండి.

   Delete
 26. అక్షర నాట్యం అద్భుతంగా ఉందండి

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతం మాయాగారు...థ్యాంక్యూ

   Delete