చలిగాలికి నిను తాకాలన్న తపనేల!
వలపువిరహ సెగనై నే నిను తాకగా
నీరెండ లేతకిరణాల వెచ్చదనం నీకేల!
నా మునివేళ్ళు నీ నుదుట నర్తించగా
వానజల్లు నిన్ను తడిపి మురియనేల!
సుగంధ పరిమళ స్వేదమై నే తడపగా
చిగురాశలకు నిన్ను చుట్టేసే తాహతేల!
చక్కదనాల చుక్కను నీ చెంతనుండగా
సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా
చీకటిరేయి నిను బంధించి భయపెట్టనేల!
నాకురుల వింజామరలు లాలిలా జోకొట్టగా
పూలకి మత్తుజల్లి మాయచేసే మర్మమేల!
ప్రేమమత్తుకి కొత్తదనాన్ని నేను పేనానుగా
ప్రకృతికి మన ప్రణయమంటే పరిహాసమేల!
జగతికే ఈర్హ్య పుట్టేలా నే ప్రేమను పంచానుగా
*******
Beautiful feel.....showering all da love ....
ReplyDeletethanks for your love too dear Anu
Deleteప్రేమలో పూర్తిగా తడిసి ముద్దైపోయాను :-) సర్వం పద్మార్పితం
ReplyDeleteమరీ అంతలా తడవకండి జలుబుచేస్తుంది...అంతా తుమ్ములమయం :-)
Deleteకవిత చాలా బాగుంది
ReplyDeleteayurbless team
http://ayurbless.blogspot.in
థ్యాంక్యూ
Deleteఎంతబాగా ప్రేమను పండించగలరో అంతకు రెట్టింపు మదిని పిండేయగలరు. నవరసాల్లో మెప్పించగల ప్రతిభ మీలో మెండుగా ఉంది.
ReplyDeleteధన్యవదాలు యోహంత్...ప్రేమకు ఆ శక్తి ఉంది
Deleteఎంత బాగా రాసారండీ. సూపర్.....
ReplyDeleteబాలగారు...వెల్ కం టు మై బ్లాగ్....థ్యాంక్యూ
Deleteపాత ఒరవడితో మళ్ళీ మాముందుకొచ్చారు... కంగ్రాట్స్!!
ReplyDeleteఎప్పుడూ కొత్తగా అనుకుని పాతదే ఫాలో అయిపోతుంటాను ఏంటో :-) thank you
Deleteమీరుండగా అవంతటి సాహసం చేయలేవుగా.
ReplyDeleteనాతో పాటు మీరంతా ఉన్నారన్న ధైర్యం నాకు భయం వాటికిలెండి :-)
Deletekuch khas nahin...jaisa ke ap hamesha likhti ho ye waisa nahin
ReplyDeletehar ek baar khas kaise keha sakti hoon :-)
Deleteఆదివారం, చలికాలం అందమైన అమ్మాయి బొమ్మతో గిలిగింతలు పెడితే ఎలా అర్పితా....మరీ అల్లరి ఎక్కువైపోతుంది- బాగుంది ఇలా కూడా
ReplyDeleteహరినాధ్ గారు మీరే ఇలా అంటే...ఇంక మిగిలినవాళ్ళంతా నన్ను అల్లరిపిల్ల అంటారుకదండి :-)
DeletePadmarpita madam gariki
ReplyDeleteNamaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.
Padmarpita madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.
Padmarpita madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.
http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html
Padmarpita madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.
Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.
Padmarpita madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.
Padmarpita madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.
thank you..sure i will
Deleteవానజల్లు నిన్ను తడిపి మురియనేల!
ReplyDeleteసుగంధ పరిమళ స్వేదమై నే తడపగా
చిగురాశలకు నిన్ను చుట్టేసే తాహతేల!
చక్కదనాల చుక్కను నీ చెంతనుండగా
సప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
సరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా xtraordinay.. mesmerizing feel..Love this..<3
thanks a lot for your encouraging comments
Deleteవాటి సాహసమేమో కానీ మీరు మాత్రం గట్స్ ఉన్న లేడీ అని మరోమారు నిరూపించారు.
ReplyDeleteఅంటే పిరికిదాన్ననా తెలుగమ్మాయిగోరు అర్థం :-)
Deleteచిలిపి ప్రశ్నలతో బాగుంది పద్మర్పిత.
ReplyDeleteథ్యాంకులూ థ్యాంకులు ;-)
Deleteమనిషిలోని ప్రతి స్పందన ప్రతి ప్రతిస్పందన ప్రకృతి తో ముడిపడి ఉందన్న సత్యాన్ని ఇందులో గ్రహించవచ్చు. ప్రకృతిలో ఋతువుల మాదిరిగా మనలోని భావాలు కొంగోత్తగా పల్లవిస్తాయనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాక్షాత్తు ప్రకృతే మనిషిలో ఇనుమడింపజేసినట్టు బహుచక్కని కావ్యమిది సరియైన చిత్రం అది పద్మార్పిత కారు. ది బెస్ట్ అనిపించారు కదా ...
ReplyDeleteకారు అని పడింది దానిని గారు గ చదువుకోగలరని మనవి
Deleteమీ అభిమానాత్మక ప్రేరణా స్పందనకు ప్రణామం_/\_
Deleteకవిత చాలా బాగుంది
ReplyDeleteWelcome to my blog..థ్యాంక్యూ
Deleteప్రపంచాన్ని శాసించేదే ప్రేమ. ప్రేమ లేని చోట మనిషే లేడు. స్త్రీ తన ప్రేమను మనస్పూర్తిగా
ReplyDeleteపంచాలీ అనుకుంటే.. ప్రకృతైనా తలవంచక తప్పదుగా. దాసోహం కానిదేది.
వాహ్ వాహ్.....ఏంచెప్పారండి. అంతేకదా...that is the power
Deleteసూపర్ పద్మ గారు, చాలా చాలా బాగుందండి. పిక్ సూపర్:-)) పధాల అల్లిక ఇంద్రజాలంలా ఉందండి:-))
ReplyDeleteథ్యాంక్యూ....
Deleteawesome pic with fabulous words and lovely feel.. padma you are always rocking.
ReplyDeleteThank you....
Deleteఅమ్మో ఎన్నేసి మాటలంటున్నావు చేయవలసినవన్నీ చేసి కొంగున ముడివేసుకుని :-)
ReplyDeleteనేనా....కొంగున ముడివేసుకున్నానా....ఎప్పుడు :-)
Deleteసప్తస్వరాలు కనుసైగతో నిను పిలవనేల!
ReplyDeleteసరిగమ శృంగారనాదస్వరమే నే ఊదగా
చీకటిరేయి నిను బంధించి భయపెట్టనేల!
నాకురుల వింజామరలు లాలిలా జోకొట్టగా
ఇంతలా ప్రతి అణువునూ ప్రేమతో పూరిస్తే ఇంక వేరేవి జొరబడ్డానికి ఆస్కారమేముంది ఆ ధైర్యం తాహతు ఎవరికి ఉంటాయి చెప్పండి
మహీ.....మరీ ఇంతలా అనాలా చెప్పు :-)
DeleteMi bhavalu super andi....Padma garu meeku fans page vunda!!....Ayyooo nenu inni rojulu miss ayyanee....
ReplyDelete-Roopa
thank you Roopa.....appudu miss aithenem ippudu follow avvandi
Deleteకవిత చాల బాగుంది
ReplyDelete..పెయింటింగ్ అంతకన్నా బాగుంది
ధన్యవాదాలండి
Deletechala chala bagundhi....
ReplyDeletethank you
DeleteNice...really beautiful..:-):-)
ReplyDeletethank you
Deletewow....amazing words with romantic touch.
ReplyDeleteThanks a lot Aniketh
Deleteచాలా బాగుంది పద్మార్పిత
ReplyDeleteధన్యవాదాలండి.
Delete