ఎందుకు?

 దరహాసానికి దరకాస్తెందుకు
దండించి దరహాసమెందుకు?

మదిభావాలకు ఉనికెందుకు
మనసులేని మనుగడెందుకు?

వేదనగాటుకి లేపనమెందుకు
అతికినమదికి నగీషీలెందుకు?

వాస్తవాలకి వాస్తుదోషమెందుకు
వరమిస్తూ వంక పెట్టడమెందుకు?

అంతర్ సౌందర్యానికి అత్తర్లెందుకు
అద్దెఅందానికి ఆడంబరమెందుకు?

ముఖస్తుతిమంత్ర మాటలెందుకు
మాయలో మర్మానికి మత్తెందుకు?

62 comments:

 1. ఇలా ధైర్యంగా ప్రశ్నించడం మీకే చెల్లు. .. పద్మార్పిత గారు..

  ReplyDelete
  Replies
  1. ఆ ధైర్యానికి కారణం మీ అందరి అభిమానమే

   Delete
 2. asahajaalaku alamkaaraalu kaavaaligaa amduku...

  NICE.

  ReplyDelete
 3. అందమైన చిత్రం దానికి తగిన దరహాసం మీదేనా?

  ReplyDelete
  Replies
  1. దరహాసం దానికి రూపం కూడా నాదే.

   Delete
 4. ఇన్ని ప్రశ్నలు అడిగినా ఒక్క దానికి సరైన జవాబు చెప్పలేని నిస్సహాయత....మీరే జవాబు చెప్పే సమర్ధులు.

  ReplyDelete
  Replies
  1. ప్రశ్నలు జవాబులు నేనే చెప్పుకుని....మార్కులు మాత్రం మీకు వేయాలా?:-)

   Delete
 5. ఎందుకైనా ఏమైనా అందమైన మీ దరహాసానికి ఎన్ని దరకాస్తులైనా పెట్టుకుంటాం...రెడీనా

  ReplyDelete
  Replies
  1. అమ్మాయిగారు నా దరహాసానికి దరకాస్తెందుకు....అన్నిటికీ నవ్వేస్తాను :-)

   Delete
 6. కాస్తందుకో దరకాస్తందుకో....మీ దరహాసానికి మా దరకాస్తందుకోండి :-) అందంగా నవ్వేయండి

  ReplyDelete
  Replies
  1. అందంగా కాదు కానీ ఆనందంగా నవ్వాలన్నదే నా ఆకాంక్షండి.:-)

   Delete
 7. చిత్రం చిన్ని చక్కని పదాలతో మీ కవిత్వం రెండు బాగున్నాయండి

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్సండి.

   Delete
 8. మీ చిరునవ్వుల దరకాస్తులో ..అక్షరంగా మిగిలిపోవాలని కోరుకోని వారెవ్వరు లెండి పద్మాగారు

  ReplyDelete
  Replies
  1. అక్షరాలు విడివిడిగా కాకుండా అభిమాన మాలగా అయితే అందాన్నిస్తుందేమోనండి :-)

   Delete
 9. అందమైన ప్రశ్నల హరివిల్లు ఈ కవిత మీ నవ్వులాగే

  ReplyDelete
  Replies
  1. ఆ హరివిల్లులోని రంగులు మీ స్పందనలు :-)

   Delete
 10. చిత్రం చాలా బాగుంది. అది నువ్వు ఆ నవ్వులో ఉన్నది నువ్వు అనే అనుకుంటున్నాను పద్మార్పిత. ఎప్పుడు అలా నవ్వుతూ నవ్విస్తూ ఉండు....నీ దరహాసానికి దరకాస్తుగా ఇందరి అభిమానం నీ తోడుగా సాగిపో

  ReplyDelete
  Replies
  1. అటు నేను ఇటు నేనై ఎంతకాలం సాగిపోగలిగితే అంతకాలం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటాను....ఆశీర్వధించండి

   Delete
 11. Fantastic photo with superb smile. Keep rocking with smiles

  ReplyDelete
 12. ప్రశ్నలు ఇలా నవ్వుతూ వేస్తానంటే ఎన్ని ప్రశ్నలైనా వేయండి సంతోషంగా జవాబు ఇస్తాం

  ReplyDelete
  Replies
  1. ఎప్పుడూ నవ్వుతూ ప్రశ్నిస్తే పిచ్చిదైపోయింది పద్మార్పిత అనుకుంటారు అనికేత్ ;-)

   Delete
 13. అంతర్ సౌందర్యానికి అత్తర్లెందుకు
  అద్దెఅందానికి ఆడంబరమెందుకు?
  ఈ విధంగా మీరే అడగ్గలరు

  ReplyDelete
  Replies
  1. అడగడం వరకే నా వంతు...పరిష్కారం చెప్పలేని అల్పురాలిని. థ్యాంక్యూ

   Delete
 14. దరకాస్తు లేకుండా నవ్వేస్తే వెర్రివాడనుకుని వింతగా చూస్తారేమో అని సందేహం

  ReplyDelete
  Replies
  1. నవ్వమనండి లేక నవ్వించండి...మీరు నవ్వకపోయినా పర్వాలేదండి :-)

   Delete
 15. తడిచి ముద్దైయ్యాను

  ReplyDelete
  Replies
  1. తడి ఆరనివ్వండి...త్వరలో ఇంకో కమెంట్ పెట్టాలికదా ;-)

   Delete
 16. ఆ నవ్వు వెనుక ఇంత వేదనా.. ఇన్ని ప్రశ్నలు ఉన్నాయా..? జవాబులకు సమాధానంగా చిరునవ్వుల
  ముసుగేశారా? మొత్తానికి అంతర్ముఖాన్ని ఆవిష్కరించారు.

  ReplyDelete
  Replies
  1. అంతర్ముఖాన్ని ఆవిష్కరిస్తే అందులోని అగాధాలే తప్ప అహ్లాదం ఏముంటుంది చెప్పండి....అందుకే అందమైన ముసుగేసి నవ్వేయడమే వేదనకి వేసుకునే మందండి :-)

   Delete
 17. pic loni navvu chusthe ee kalmasham lekunda nindu ga vundi...mi question emoo alochimpa chese vidham ga vunnayi...both are too good..


  --Roopa

  ReplyDelete
  Replies
  1. kalmasham lekundaa navvadam oka goppavaram kadaa....adi andariki dakkitea entha baaguntundo :-)

   Delete
 18. aha beautiful smile with wonderful poetry:-))

  ReplyDelete
  Replies
  1. this smile is due all the love i got from you people

   Delete
 19. चाँद की रोशनी से सारा जग झिलमिल होता है क्यों
  किसी अजनबी से मुलाक़ात किसी एक दिन अपनापन ला देती है क्यों
  दिल में छुपी अरमानों के प्रति हंसी झलक उठती है
  जो बात दिल से मुख तक न आ पाये उन्हें जताने के लिए तड़पती रहती है
  मन में छुपी बात बाहर आने के लिए दिल के दीवारों में दर्रारे लगाने के लिए
  जो आतंरिक सौंदर्य को देख न पाए बाह्य सौंदर्य की आराधना न कर पाये इसलिए
  मुख से निकली बात कभी सच नहीं होती, जो बात दिल से निकलती है उसकी मान्यता के लिए

  पद्मजी मैंने आज आपके ब्लॉग में पहली बार हिंदी में टिपण्णी दी है , Just for a Change.

  The Poem Reflects your Characteristic Way of Expressing the Thoughts.

  మహాద్భుతంగా మలిచారు ప్రశ్నలకు ధీటైన సమాధానాలు కూడా ఇవ్వడం మీకే పరిపాటి పద్మ గారు

  Regards,
  Sridhar Bukya

  ReplyDelete
  Replies
  1. आप कि ऍ हिंदी टिप्ण्णी बहुत खूब......
   Yes of course whatever i write they are the reflections of my thoughts mirror :-)
   ప్రశ్నల ముళ్ళే ఇంకా విప్పలేక సతమతమౌతున్నా అప్పుడే సమాధానాలంటే ఎలాగండి :-) thank you

   Delete
 20. Happy Birthday Dear padmarpita:-)) Have a wonderful life:-))

  ReplyDelete
 21. కోటి వరాల తల్లి కి అక్షరాల భావ కల్పవల్లికి
  వెన్నెల కొమ్మకి అపరంజి బొమ్మకి
  నిత్య నూతన ఒరవడిలో సాగిపోయే "కమలానికి"
  ఇవియే మా ముందస్తు పుట్టిన రోజు మహోత్సవ శుభాభినందనలు

  ఇలాగే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ రేపటి మీ పుట్టిన రోజు మీకెంతో శంతోశాన్ని ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ
  మరొక్కమారు జన్మదిన శుభాకాంక్షలు పద్మార్పిత గారు

  ReplyDelete
  Replies
  1. అందమైన అక్షర అశిస్సుల అక్షింతలు నా శిరస్సున జల్లిన మీకు నమోఃవందనాలు _/\_

   Delete
 22. అంతర్ సౌందర్యానికి అత్తర్లెందుకు
  అద్దెఅందానికి ఆడంబరమెందుకు?

  ముఖస్తుతిమంత్ర మాటలెందుకు
  మాయలో మర్మానికి మత్తెందుకు?

  మీ ప్రశ్నలన్నీ సూటిగా వాడిగా వున్నాయి మీ శైలిలో.. సహజంగానూ సరళంగానూ.. ఎప్పట్లానే చిత్రం కూడా చాలా బాగుంది.. అభినందనలు..

  ReplyDelete
  Replies
  1. వర్మగారి అభినందనలు......అహ్లాదభరిత చందనాలు. ధన్యవాదములు

   Delete
 23. Many more happy returns of da day!!
  Have a joyful birthday!!

  ReplyDelete
 24. Replies
  1. తెరతీయగరాదా....అభిమాన మందారమాలవేసి అజ్ఞాతంలో దాగనేల :-) thank you

   Delete
 25. Janmadina subhakamkshalu Padmarpitha garu..

  --Roopa

  ReplyDelete
 26. జన్మ దిన శుభాకాంక్షలండీ :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి.

   Delete
 27. చిత్రంలోని నవ్వు ఇట్టే ఆకర్షించేలా ఉందండి.

  ReplyDelete
  Replies
  1. మొదటిసారి చూడగానే ఆకర్షించింది అంటే అది సహజమైన నా నవ్వు మీకు స్వాగతం చెబుతున్నట్లుగా భావించాలి

   Delete
 28. అందమైన భావాల మాలిక మీ బ్లాగ్... పద్మార్పిత గారు...

  ReplyDelete
  Replies
  1. నచ్చినందుకు ధన్యవాదాలు.

   Delete
 29. మీ నవ్వు అందంగా ఉంది, ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి

  ReplyDelete
  Replies
  1. దేన్నైనా నవ్వుతో కప్పే ప్రయత్నమే చేస్తానండి శ్రీపాదగారు :-) నా బ్లాగ్ కి స్వాగతం

   Delete
 30. what happened are you ok? missing you alot padmarpita

  ReplyDelete
  Replies
  1. I am fine, thanx for concerned

   Delete