నా చిత్రం

నన్నడగమాకు నాచిత్రంలో ఏముందని..
ఆమోములో కలల ప్రపంచమే దాగుంది
పద్మనయానాల పలుప్రశ్నల్లో నేనున్నది
అర్థంకాని జవాబులతో తల్లడిల్లుతున్నది!!

వెతకమాకు ఆలోచనల్లో ఏందాగుందోనని..
కారుమబ్బుల జ్ఞాపకాలతో కాటుకే దిద్దింది
కలువరేకై నవ్వేపెదవి వెనుక వేదనే దాగింది
వెన్నెలకు విప్పారితే పగలు చిన్నబోయింది!!

ఆరాతీయకు చెప్పనిఊసుల్లో ఏంచెప్పానోనని..
చిన్నగా చెవిలో చెప్పబోతే తుమ్మెద జుమ్మంది
తామర తహతహ తెలుసుకోలేని నీకెలా తెలిపేది
విరహ గుండంలో తెల్లకలువ ఉనికిని ఎలా ఆపేది!!

చూడబోకు చిత్రంలో కుంచెకున్న వంపులెన్నోనని..
అద్దినరంగులు నీరుకార్చితే చూడలేక మోముకంది
కమలం చలువ నీడలో విరబూయని మదొకటుంది
ఆశల అందాలతో అలంకరించుకుని కాపురముందది!

44 comments:

  1. వెతకమాకు ఆలోచనల్లో ఏందాగుందోనని..
    కారుమబ్బుల జ్ఞాపకాలతో కాటుకే దిద్దింది
    కలువరేకై నవ్వేపెదవి వెనుక వేదనే దాగింది
    వెన్నెలకు విప్పారితే పగలు చిన్నబోయింది!!

    హృదయాంతరంగంలోని వేదనంత ప్రతి పద చిత్రంలోనూ దాగి మనసును తాకుతుంది..

    ReplyDelete
    Replies
    1. పద చిత్రాన్ని ఆస్వాదించిన మీ హృదయానికి నమస్సులు.

      Delete
  2. Fabulous Words With Fantastic Picture Padma.

    ReplyDelete
  3. పద్మార్పిత గారు మీరు awesome...
    ఎలా రాస్తారండి అలా ...అలా అలా
    పదేపదే చదివినా తనివి తీరదెందుకనుకునేలా
    సున్నితమైన భావాలతో అక్షరమాలలు కట్టేస్తూ
    తెలిసిన చిత్రం నుండే తెలియని లోకాలేవో సృష్టిస్తూ ...

    "అద్దినరంగులు నీరుకార్చితే చూడలేక మోముకంది
    కమలం చలువ నీడలో విరబూయని మదొకటుంది"

    wow... మీ ఫాన్స్ క్లబ్ లో చేరిపోతున్నానోచ్ ...

    ReplyDelete
    Replies
    1. ఆత్మీయ స్పందనకు ధన్యవాదాభివందనలండి. ఫ్యాన్స్ క్లబ్ అని నన్ను మరీ ఇలా ఇబ్బంది పెడితే ఎలా?

      Delete
  4. నన్నడగమాకు నా చిత్రంలో ఏముందని... సరేనండి. మీరు రాసినవి మొత్తం నేను చదవలేదు. నాకు ఈ బ్లాగు
    పరిచయం ఎప్పటి నుంచో అప్పటి నుంచే మీ కవితవనంలో అప్పుడప్పుడు విహరిస్తున్నాను. ఆ వనంలో ఈ రోజు
    నాకు అసలైన వికసిత పద్మం కనిపించింది. ఇది... ద బెస్ట్ ఆఫ్ పద్మ. మనసుని తట్టింది. బాగుంది.

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య! కొన్నైనా చదువుతున్నారుగా... త్యాంక్యు!

      Delete
  5. Beautiful Image with lovely poem, Extraordinary words:-)) నన్నడగమాకు నాచిత్రంలో ఏముందని? నన్నడగమాకు నన్నడగమాకు అని చాలా చాలా చెప్పేసావు:-)) Very very Cute:-))

    ReplyDelete
  6. అడిగే చాన్స్ ఇస్తే కదా ఎవరికైనా మీరు. అత్యద్భుత పదజాలంలో బంధించేస్తారు

    ReplyDelete
    Replies
    1. బంధించానని నిందలేస్తే ఎలా?

      Delete
  7. వెన్నెల రేకుల కిరణాల వన్నెలు చిలికే అందమైన మోము
    కన్నిరుని కూడా దాయగల దయగల ఆల్చిప్ప కన్నుల మెరుపు
    శత్రువుని కూడా ఆకట్టుకూనే ఆలోచనల సరళి కొసమెరుపు
    కలగలిపిన కలువబాల అందాన్ని రెట్టింపు చేస్తూ అలరారింది నేడు

    చాల చక్కని పదాలతో అల్లిన కావ్య సుమార్పిత చిత్రం వర్ణన అతి సుందరం బహు రమణీయం

    ReplyDelete
    Replies
    1. కవితను ఆస్వాదించి కవితతోనే స్పందించిన మీకు వందనాలు.

      Delete
  8. వేదన కూడా పద్మార్పిత పదాల్లో అందంగా అమరిపోతాయి అన్నట్టుంది కవిత, చిత్రాల ఎంపికలో నీకెవరు సాటిరారు-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. సదా మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.

      Delete
  9. అద్భుతంగా వివరించారు భావసంఘర్షణని .....ఈ వేదన నిజం కాకూడదని ఆశిస్తూ...అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. అబినందనలను ఆస్వాదిస్తున్నా. త్యాంక్యు!

      Delete
  10. no words..

    ReplyDelete
  11. ఇది మీ మార్క్ కవితల్లో ఒక మణిపూస.

    ReplyDelete
    Replies
    1. మీరు చదివాకే అది మనిపుసగా మారిందేమో!

      Delete
  12. Superb..superb..superb.....:-):-):-)

    ReplyDelete
  13. చూడబోకు చిత్రంలో కుంచెకున్న వంపులెన్నోనని..
    అద్దినరంగులు నీరుకార్చితే చూడలేక మోముకంది
    కమలం చలువ నీడలో విరబూయని మదొకటుంది
    ఆ మది ఎన్నెన్నో అందమైన ఊసులతో అందరినీ అలరిస్తుంది

    ReplyDelete
    Replies
    1. ఉసుల్లో తేలినందుకు ధన్యవాదాలు యోహాంత్

      Delete
  14. ఇలా ప్రతీ కవిత ఒకదాన్ని మించి ఒకటి వ్రాసేస్తే ఏం కమెంటాలో తెలిక సతమతమౌతున్నా....

    ReplyDelete
    Replies
    1. తెలియదంటూనే కామెంటేశారుగా...

      Delete
  15. With the help of one AP friend I am learning telugu to understand your poetry, Mam you are an extraordinary talented lady..This is the reflection of your heart, painting is outstanding---Nalottam, Jabalpur

    ReplyDelete
    Replies
    1. Welcome to the Blog. Thank you & Your friend.

      Delete
  16. ప్రతి పాదాన్ని చక్కగా ఆవిష్కరించడంలో మీ నైపుణ్యాన్ని కనబరిచారు. అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్లే నాకు ప్రేరణ.

      Delete
  17. కవితా ప్రియులకు, కళాభిమానులకు పేరు పేరునా ప్రణామం._/\_

    ReplyDelete
    Replies
    1. ఇలా అందరికీ కలిపి ఒక్క ప్రతిస్పందనతో ఊరుకొని అభిమానులను నిరాశ పరచడం ఏం బాగోలేదండి. మీకు టైం లేకపోవడం వల్ల కావొచ్చేమో. అయినా ఫర్వాలేదు. మీరు వదిలేసినా పోస్ట్లకు ఇలా ఒక అభిమానిగా (మీలో దూరి) స్పందించాలన్న నా చిన్ని కోరికను మన్నిస్తారు కదూ...

      Delete
    2. ఎవరో తెలిస్తే ఎగిరిగంతేసి, ఇకపై మీరే రాయండని అప్పగిస్తాను :-)

      Delete
  18. Madam simple ga thanks chepakandi reply mi stylo istarani hope

    ReplyDelete
    Replies
    1. That is why as a fan I came here to reply my dear friend... Thanks to Padmarpita garu...

      Delete
  19. Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality. But, of course, only those who have personality and emotions know what it means to want to escape from these things. You are true poetess PADMARPITA

    ReplyDelete
    Replies
    1. Welcome ! Thanks for your appreciating words.

      Delete
  20. నా అభిమాని ఆడో/మగో తెలియదు కానీ నన్ను మాత్రం చక్కగా నా రాతల్లో చదివారు అనడానికి నిదర్శనం ఇలా రిప్లైస్ ఇవ్వడం. బహుశా ఇలా నా భావాలకి నేను ఇవ్వలేని రూపాన్ని ఇలా అభిమానం ద్వారా పొందేలా నాకు దక్కిన వరం అనుకుంటాను_/\_ ఎవరో త్వరలో తెరముందుకి వస్తారని ఆశిస్తూ!

    ReplyDelete
    Replies
    1. padmarpitagaru abhimanam undochu adi mudipoete kashtam munde kallem veyandi

      Delete
    2. క్షమించండి. హద్దు మీరాను. ఇంకెప్పుడూ అలా చేయనుగా...

      Delete