చిత్రాంగి

అధరాలమెరుపు అల్లరిచేసిన అలరించకంటావు
కనులకాటుక కన్నుగీటినా దూరం ఉంచుతావు
రవ్వలముక్కెర రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దంటావు
ముంగురులు మురిపించినా ముట్టుకోకంటావు
కొప్పునున్న మల్లెలు పిలిచినా వద్దు వద్దంటావు
నడుము వంపు నాజూకందాలను చూడనిస్తావు
సిరిమువ్వలు సడిచేస్తుంటే సరసమాడకంటావు
బొటనవేలు బిడియపడుతున్న బింకంగున్నావు
సిల్కు చీర నలగరాదంటూ లక్మణరేఖనే గీసావు
ఒంటరూగిసలాటలో తుంటరివై నన్ను కవ్విస్తావు
                             ********
                                *****
                                   **
ఎందుకిలా అని ప్రశ్నిస్తే చిద్విలాసంగా నవ్వేస్తావు
లోలాకులు లోగుట్టు చెప్తున్నాయంటూ లాలిస్తావు
తప్పంటూ తర్కించి తలూపించి కొంగున కట్టేసావు
మదిలోన మంటలు రేపి చందన లేపనం పూస్తావు

17 comments:

  1. చల్లగా గిల్లి జోలపాడిన చిత్రాంగి బహు తెలివైన చిన్నది.
    కవిత, చిత్రం రెండూ గిలిగింతలు పెడుతున్నాయి :)

    ReplyDelete
  2. Its really Interesting:-)) chitrangi chala chitranaane undi:-)) super:-)) Keka:-))

    ReplyDelete
  3. ఆమాత్రం దానికి ఇలా ఊరించడమెందుకో? చిత్రాంగిని భలే చిత్రంగా చిత్రించారే... పద్మార్పిత గారు..

    ReplyDelete
  4. చిత్రాంగి కొప్పున పూలెట్టుకుని......కెవ్వువ్వువ్వు కేక:-):-P

    ReplyDelete
  5. కొంటెకోణంగితో ఆ మాత్రం జాగ్రత్త అవసరమే కదా! కాదంటారా?? చిత్రం భలే విచిత్రంగా వుంది పద్మార్పిత గారూ..

    ReplyDelete
  6. చిత్రాంగి సొగసు చూడతరమా
    అడుగు ముందుకేస్తే అయస్కాంతం
    వెనక్కి వేస్తే గుండె యమభారం
    మీ బ్లాగ్ చూస్తుంటే కవితలు పొంగుకొస్తాయి

    ReplyDelete
  7. ఏం చెప్పారండి....మగవారిని స్కాన్ చేసి మరీ చూపించారు. పద్మా సింపుల్ గా చప్పట్లు తప్ప ఇంకేమన్నా ఇంకేం రాసేస్తారో

    ReplyDelete
  8. హాస్యరసాన్ని కూడా అద్భుతంగా పండించగలరు మీరు

    ReplyDelete
  9. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే.. అర్ధాలే వేరులే... అర్ధాలు వేరులే.. అర్ధాంగీ అంతే.
    వద్దువద్దు అంటే ముద్దుముద్దూ అని... బెట్టు చేస్తోందిలే అని.. వదిలేస్తే.. చాటుగా
    వెళ్లి బుంగమూతి పెడతారు. మగడి ముందు వగలు పోకపోతే... సరసాంగి చిలిపితనం
    ఎలా తెలిసేది... పద్మగారు.. అడువారి సైకాలజీ... అగాధమంత లోతైనదండీ...

    ReplyDelete
  10. ఊరించే చిత్రాంగి ఉత్తుత్తిది కాదు
    నరుడి నాడి తెలిసిన నేరజాణ
    పద్మార్పిత ఊపిరి ఊదిన కల్కి
    --హరినాధ్

    ReplyDelete
  11. చిత్రమైన చిన్నది ఈ చిత్రాంగి :-)

    ReplyDelete
  12. గడుసరిదే....అడ్రస్ అడిగినా చెప్పదు :)

    ReplyDelete
  13. కలికి వెన్నెల్లో కులుకులెన్నో నేర్చి
    వాలు చూపుల్లో వగలునంత ఏర్చి కోర్చి
    వయ్యారాలు ఒలకబోసి ముసి ముసిగా
    చూపు తిప్పనియ్యక కసి కసిగా
    జాణ వలె నెరజాణ వలె ఊరించిన ఓ చిత్రాంగి
    బహు చక్కగా ఉన్నది నీ ఊసుల కోణంగి

    పరమాద్భుతమైన కావ్యం ఇది కావ్యార్పిత
    అన్ని కోణాలు కవితలో యిట్టె ఇనుమడింప చెయ్యడం లో మీకు మీరే సాటి పద్మ గారు

    ReplyDelete
  14. పద్మా.. చిత్రం చూసే కదా ఈ కొంటె కవిత పుట్టిందీ..
    కానీ మీ కలం నుండి వచ్చి దాని జన్మ సార్దకమయ్యింది.
    అభినందనలు డియర్.

    ReplyDelete
  15. హాస్యానికి కాస్త సరసశృంగారాన్ని జోడించి పదాచిత్రంగా మలచి కాసేపు మిమ్మల్ని నవ్వించాలని చేసిన నా ఈ ప్రయత్నాన్ని మన్నించిన ప్రతి కళాకవితారాధకులకు ప్రణామం _/\_

    ReplyDelete
  16. మీ చిత్రాంగి చాలా తుంటరిది మరియు కొంటె కోణంగి.

    ReplyDelete