చితివరకూ తోడుంటానని చిత్రంగా మాట్లాడేవు
చితిచింతేల!? నాలుగడుగులు కలిసి వేయలేవు
మదిలోతుల మమతల మర్మం ఎరుగని నీవు
మణి మకుట హారాలతో మనసు దోచుకోలేవు
మది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు
నా సొగసు సోయగాలను చూసి మురిసే నీవు
సొంతమైనా మదిమందిరంలో కొలువుండలేవు
మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు
వలపుల ఎరతో వాంచల గాలమేసి వలచే నీవు
వెళ్ళిపోతున్న వయసును వజ్రాలతో కప్పలేవు
కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు
నా లోపాలని సరిచేసి చేయూతమీయలేని నీవు
నీడనై ఉంటానంటూ ప్రగల్భాలు మెండు పలికేవు
నీడేంటి!? నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు
సొంతమైనా మదిమందిరంలో కొలువుండలేవు
ReplyDeleteమందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు
నిజమే...అటువంటి వ్యక్తి గుండెను బద్దలు మటుకే చేయగలరు....
నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు.....మృత్యువు ఎదురుగా ఉన్నామనలో లేని మనసు ఎదురు చూసేది కన్నీరు కార్చలేని ఆ మనసు కోసమే కదా....heart touching......
అనూ...అలౌకికమైన ఆనందంతో స్పందిస్తారు...నాకు భలేనచ్చారు. :-) Thank you
Deleteమరోమారు మాపై చర్నాకోల్ ఝళిపించి అందమైన చిత్రంతో కట్టిపడేసారు-జయహో
ReplyDeleteఎందుకో ఈ భీతి :-)
DeleteNice feel Madam. Keep Rocking...
ReplyDeleteSure...I will try to be...
Deleteచితిచింతేల!? నాలుగడుగులు కలిసి వేయలేవు
ReplyDeleteమది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు
మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు
కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు
నీడేంటి!? నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు
యిలా ప్రతి పాదంలోనూ విరహ వేదనలోని జ్వాలను ఆవిష్కరించడం అనితర సాధ్యం ప్రేమార్పిత గారు. కవితలోని పద చిత్రంతో పాటు వర్ణ చిత్రంలోనూ ఆ భావాన్ని ప్రస్ఫుటిపింప చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. సుమాభివందనాలు...
ఇలా వెన్న నెయ్యి అంటూ తీయని తేనెల మాటలతో ముంచేస్తే మొద్దుబారిపోతానేమో:-)
Deleteభావావేశాన్ని బందీ చేశారు. ప్రేమ గులాబి కొందరికి అద్భుతమైన అనుభూతి
ReplyDeleteపంచితే, చాలా మందికి ముళ్ల రుచి చూపించి ఎర్రని విషాదాన్ని మిగిల్చింది. పదునెక్కుతున్న
మీ భావాలు ఇలానే కొనసాగనివ్వండి... ఎవరూ దరిచేరలేని సముద్రమంత లోతున్న స్త్రీమూర్తి ఆలోచనలను
కెరటాల రూపంలో కొన్నైనా ఇలా తీరాన్ని తాకనివ్వండి. కడుపు నిండడానికి పట్టెడన్నం చాలు.
మనసు నిండాలంటే ఓ జీవితం కావాలి. కానీ.. మీ లాంటి నిజమైన భావుకుల వల్ల
తెలియని, అవ్యక్త భావమేదో మనసు నిండా నిండుతోంది.
మనసు నింపలేకపోయినా ఒక మూల కొన్ని క్షణాలు తలచుకుంటే అది చాలండి.
Deletethanq... for ever remembering... deep impact... with sincere and heart-full poetic waves drizzle.
ReplyDeleteWow....blessed with nice feel :-)
Deleteవలపుల ఎరతో వాంచల గాలమేసి వలచే నీవు
ReplyDeleteవెళ్ళిపోతున్న వయసును వజ్రాలతో కప్పలేవు
కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు.
Wah! Subhanallah kya bath hai
Shukriyaa Saab...aapne tho kamaal kardiyaa :-)
Deleteమణి మకుట హారాలతో మనసు దోచుకోలేవు
ReplyDeleteమది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు
అద్భుతం. మీకు వ్యక్తిత్వానికి ప్రతిబింబం ఇవి
ప్రతిబింబాన్ని చూసి పద్మార్పితని అంచనావేస్తే ఎలా:-)
Deleteఅందమైన తెలుగు మాటలతో అత్యాద్బుతంగా వ్రాయగలిగేది మీకు మాత్రమే సొంతం అన్నట్టుగా అనిపిస్తుంది:-)) చాలా చాలా బాగుంది:-)) పిక్ సూపర్:-)) మొత్తంగా అధిరింది:-))
ReplyDeletesruthi very glad to see u
DeleteThank Q Srinivas garu:-))
Deleteశృతి....నీ స్పందన నాలో ఎప్పుడూ నూతనోత్సాహాన్ని ఇస్తుంది
DeleteVery nice:-):-)
ReplyDeleteThank you :-)
Deleteకరిగే మబ్బుల మాటున నీటి చినుకు ఎవరికి సొంతం? కరిగే వరకు మబ్బులదా లేకా కరిగినాక భూమిదా?
ReplyDeleteరంగురంగుల హరివిల్లు ఎవరికి సొంతం? ఆకాశానిదా లెకా చూసే కనుపాపదా?
కాలగమన మార్గమున వెలిసి ఉన్న జ్ఞాపకాలు ఎవరి సొంతం? కాలానిదా లెకా వాటిని నెమరువెసుకునే మనసుదా?
"చేసే బాసలకు విలువనివ్వని బాసలు బాసలే కావని
చేసే బాసలు నెరవెరెదాక అలసిపొని ప్రయాణం చెయ్యాలని" సూచించిన మీ కవిత ఆద్యాంతము ఆసక్తికరము రసదాయకము..
ఇంతకు మించి చెప్పాలంటే మాటలకి అక్షరాలు సరితూగక ఇలా ముగిస్తున్నాను.
అమ్మో ఇలా ప్రశ్నించే నన్నే మీరు ప్రశ్నిస్తే బహుకష్టం :-) ధన్యవాదాలు
Deleteఇలా మనసుకి నచ్చేలా రాసే మనసుదోచారు.....చిత్రం బాగుంది.
ReplyDeleteనా మనసులో మీరుకూడా పదిలం :-)
Deleteసున్నితంగా కవితలో తిట్టావు అనుకున్నా, కానీ తరచిచూస్తే అన్నీ నిజాలే చెప్పావు-హరినాథ్
ReplyDeleteహరినాధ్ గారూ.....అంతటి సాహసం నేను చేయగలనా చెప్పండి :-)
Deleteమీ వెర్రికానీ ఏమీ కానప్పుడు ఏంచేసి మాత్రం ఏంటి చెప్పండి
ReplyDeleteవెర్రిదంటూ డొంకతిరుగుళ్ళు ఎందుకు చెప్పండి :-)
Deleteఇంకా ఏమైనా మిగిలాయా మీరు కవర్ చేయాలనుకుంటున్న టాపిక్స్....ప్లీజ్ నాకు చెప్పండి నేను రాయడానికి ప్రయత్నిస్తాను, మీ అంత అందంగా కాకపోయినా చిరు ప్రయత్నం. ఎంతైనా మీ శిష్యరికం కదా :-)
ReplyDeleteనీకేం అందమైనా తెలుగుపదాలతో అందరినీ అలరించేయగలవు :-)
Deleteadbuthaha
ReplyDeletevandanam _/\_
Deleteexcellent poetry.
ReplyDeleteThanks a lot
Deleteఇలా మీరు "ఏమీకావు" అంటే అల్పజీవులంతా ఏమైపోవాలి చెప్పండి :-)
ReplyDeleteదేనికదే...కవిత మాత్రం అదిరిందండి
అల్పులు అనుకున్నవారు అల్పులేమో అనికేత్....ఆలోచించు :-)
Deleteఏం చెప్పను, ఎలాగ చెప్పను ఈ కవిత ఎంతబాగుందో అని. చిత్రంకూడా అదిరిందని, ఇలా ఎప్పుడూ కమ్మని కవితలతో అందరిని అలరించమని :-) కుడూస్ పద్మ
ReplyDeleteచెప్పకనే ఎన్నో చెప్పేసారుగా....ఇంకేంటి :-)
DeletePrathi felling ni intha adbutham ga ela akshara baddam cheyagalaru meeru!!!!....Entho lothu gaa....anubavichi rasinattu gaa vuntai mi bhavaalu..
ReplyDelete--Roopa
Roopa--ఆస్వాధించే మనసుంటే ప్రతిఅక్షరం అలరిస్తుందేమో కదా :-)
Deleteనిర్మొహమాటంగా నిజం చెప్పారు.
ReplyDeleteధన్యవాదాలండి
Deleteప్రస్తుతం ఎక్కువ భాగం ప్రేమ కథల్లోని సారమిదేనండి!బాగా చెప్పారు
ReplyDeleteనిజం చెప్పారు......ధన్యవాదాలండి
Deleteఅమ్మో చదవడమంటూ మొదలుపెడితే జీవితకాలం సరిపోదు సుమా madm ur great
ReplyDeleteవెల్ కం టు బ్లాగ్....మరీ అంత అర్థంకాకుండా రాయలేదులెండి...చదివెయ్యండి.Thank you
Delete