ఏమీకావు


నా చిరునవ్వు విలువెంతో తెలుసుకోలేని నీవు
చితివరకూ తోడుంటానని చిత్రంగా మాట్లాడేవు
చితిచింతేల!? నాలుగడుగులు కలిసి వేయలేవు


మదిలోతుల మమతల మర్మం ఎరుగని నీవు
మణి మకుట హారాలతో మనసు దోచుకోలేవు
మది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు

నా సొగసు సోయగాలను చూసి మురిసే నీవు
సొంతమైనా మదిమందిరంలో కొలువుండలేవు
మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు


వలపుల ఎరతో వాంచల గాలమేసి వలచే నీవు
వెళ్ళిపోతున్న వయసును వజ్రాలతో కప్పలేవు
కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు


నా లోపాలని సరిచేసి చేయూతమీయలేని నీవు
నీడనై ఉంటానంటూ ప్రగల్భాలు మెండు పలికేవు
                                                                           నీడేంటి!? నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు

48 comments:

  1. సొంతమైనా మదిమందిరంలో కొలువుండలేవు
    మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు

    నిజమే...అటువంటి వ్యక్తి గుండెను బద్దలు మటుకే చేయగలరు....

    నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు.....మృత్యువు ఎదురుగా ఉన్నామనలో లేని మనసు ఎదురు చూసేది కన్నీరు కార్చలేని ఆ మనసు కోసమే కదా....heart touching......

    ReplyDelete
    Replies
    1. అనూ...అలౌకికమైన ఆనందంతో స్పందిస్తారు...నాకు భలేనచ్చారు. :-) Thank you

      Delete
  2. మరోమారు మాపై చర్నాకోల్ ఝళిపించి అందమైన చిత్రంతో కట్టిపడేసారు-జయహో

    ReplyDelete
    Replies
    1. ఎందుకో ఈ భీతి :-)

      Delete
  3. Nice feel Madam. Keep Rocking...

    ReplyDelete
  4. చితిచింతేల!? నాలుగడుగులు కలిసి వేయలేవు
    మది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు
    మందిరమేల!? గుండెగుడిసెకు తాళమేయలేవు
    కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు
    నీడేంటి!? నింగికెగసిన వేళ కన్నీరుకార్చ రాలేవు

    యిలా ప్రతి పాదంలోనూ విరహ వేదనలోని జ్వాలను ఆవిష్కరించడం అనితర సాధ్యం ప్రేమార్పిత గారు. కవితలోని పద చిత్రంతో పాటు వర్ణ చిత్రంలోనూ ఆ భావాన్ని ప్రస్ఫుటిపింప చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. సుమాభివందనాలు...

    ReplyDelete
    Replies
    1. ఇలా వెన్న నెయ్యి అంటూ తీయని తేనెల మాటలతో ముంచేస్తే మొద్దుబారిపోతానేమో:-)

      Delete
  5. భావావేశాన్ని బందీ చేశారు. ప్రేమ గులాబి కొందరికి అద్భుతమైన అనుభూతి
    పంచితే, చాలా మందికి ముళ్ల రుచి చూపించి ఎర్రని విషాదాన్ని మిగిల్చింది. పదునెక్కుతున్న
    మీ భావాలు ఇలానే కొనసాగనివ్వండి... ఎవరూ దరిచేరలేని సముద్రమంత లోతున్న స్త్రీమూర్తి ఆలోచనలను
    కెరటాల రూపంలో కొన్నైనా ఇలా తీరాన్ని తాకనివ్వండి. కడుపు నిండడానికి పట్టెడన్నం చాలు.
    మనసు నిండాలంటే ఓ జీవితం కావాలి. కానీ.. మీ లాంటి నిజమైన భావుకుల వల్ల
    తెలియని, అవ్యక్త భావమేదో మనసు నిండా నిండుతోంది.

    ReplyDelete
    Replies
    1. మనసు నింపలేకపోయినా ఒక మూల కొన్ని క్షణాలు తలచుకుంటే అది చాలండి.

      Delete
  6. thanq... for ever remembering... deep impact... with sincere and heart-full poetic waves drizzle.

    ReplyDelete
  7. వలపుల ఎరతో వాంచల గాలమేసి వలచే నీవు
    వెళ్ళిపోతున్న వయసును వజ్రాలతో కప్పలేవు
    కప్పినా!? కుటిలత్వానికి పరిమళాలు అద్దలేవు.
    Wah! Subhanallah kya bath hai

    ReplyDelete
    Replies
    1. Shukriyaa Saab...aapne tho kamaal kardiyaa :-)

      Delete
  8. మణి మకుట హారాలతో మనసు దోచుకోలేవు
    మది దోచడమా!? మనసువిప్పి మాట్లాడలేవు
    అద్భుతం. మీకు వ్యక్తిత్వానికి ప్రతిబింబం ఇవి

    ReplyDelete
    Replies
    1. ప్రతిబింబాన్ని చూసి పద్మార్పితని అంచనావేస్తే ఎలా:-)

      Delete
  9. అందమైన తెలుగు మాటలతో అత్యాద్బుతంగా వ్రాయగలిగేది మీకు మాత్రమే సొంతం అన్నట్టుగా అనిపిస్తుంది:-)) చాలా చాలా బాగుంది:-)) పిక్ సూపర్:-)) మొత్తంగా అధిరింది:-))

    ReplyDelete
    Replies
    1. sruthi very glad to see u

      Delete
    2. Thank Q Srinivas garu:-))

      Delete
    3. శృతి....నీ స్పందన నాలో ఎప్పుడూ నూతనోత్సాహాన్ని ఇస్తుంది

      Delete
  10. కరిగే మబ్బుల మాటున నీటి చినుకు ఎవరికి సొంతం? కరిగే వరకు మబ్బులదా లేకా కరిగినాక భూమిదా?
    రంగురంగుల హరివిల్లు ఎవరికి సొంతం? ఆకాశానిదా లెకా చూసే కనుపాపదా?
    కాలగమన మార్గమున వెలిసి ఉన్న జ్ఞాపకాలు ఎవరి సొంతం? కాలానిదా లెకా వాటిని నెమరువెసుకునే మనసుదా?

    "చేసే బాసలకు విలువనివ్వని బాసలు బాసలే కావని
    చేసే బాసలు నెరవెరెదాక అలసిపొని ప్రయాణం చెయ్యాలని" సూచించిన మీ కవిత ఆద్యాంతము ఆసక్తికరము రసదాయకము..

    ఇంతకు మించి చెప్పాలంటే మాటలకి అక్షరాలు సరితూగక ఇలా ముగిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. అమ్మో ఇలా ప్రశ్నించే నన్నే మీరు ప్రశ్నిస్తే బహుకష్టం :-) ధన్యవాదాలు

      Delete
  11. ఇలా మనసుకి నచ్చేలా రాసే మనసుదోచారు.....చిత్రం బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నా మనసులో మీరుకూడా పదిలం :-)

      Delete
  12. సున్నితంగా కవితలో తిట్టావు అనుకున్నా, కానీ తరచిచూస్తే అన్నీ నిజాలే చెప్పావు-హరినాథ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారూ.....అంతటి సాహసం నేను చేయగలనా చెప్పండి :-)

      Delete
  13. మీ వెర్రికానీ ఏమీ కానప్పుడు ఏంచేసి మాత్రం ఏంటి చెప్పండి

    ReplyDelete
    Replies
    1. వెర్రిదంటూ డొంకతిరుగుళ్ళు ఎందుకు చెప్పండి :-)

      Delete
  14. ఇంకా ఏమైనా మిగిలాయా మీరు కవర్ చేయాలనుకుంటున్న టాపిక్స్....ప్లీజ్ నాకు చెప్పండి నేను రాయడానికి ప్రయత్నిస్తాను, మీ అంత అందంగా కాకపోయినా చిరు ప్రయత్నం. ఎంతైనా మీ శిష్యరికం కదా :-)

    ReplyDelete
    Replies
    1. నీకేం అందమైనా తెలుగుపదాలతో అందరినీ అలరించేయగలవు :-)

      Delete
  15. ఇలా మీరు "ఏమీకావు" అంటే అల్పజీవులంతా ఏమైపోవాలి చెప్పండి :-)
    దేనికదే...కవిత మాత్రం అదిరిందండి

    ReplyDelete
    Replies
    1. అల్పులు అనుకున్నవారు అల్పులేమో అనికేత్....ఆలోచించు :-)

      Delete
  16. ఏం చెప్పను, ఎలాగ చెప్పను ఈ కవిత ఎంతబాగుందో అని. చిత్రంకూడా అదిరిందని, ఇలా ఎప్పుడూ కమ్మని కవితలతో అందరిని అలరించమని :-) కుడూస్ పద్మ

    ReplyDelete
    Replies
    1. చెప్పకనే ఎన్నో చెప్పేసారుగా....ఇంకేంటి :-)

      Delete
  17. Prathi felling ni intha adbutham ga ela akshara baddam cheyagalaru meeru!!!!....Entho lothu gaa....anubavichi rasinattu gaa vuntai mi bhavaalu..

    --Roopa

    ReplyDelete
    Replies
    1. Roopa--ఆస్వాధించే మనసుంటే ప్రతిఅక్షరం అలరిస్తుందేమో కదా :-)

      Delete
  18. నిర్మొహమాటంగా నిజం చెప్పారు.

    ReplyDelete
  19. ప్రస్తుతం ఎక్కువ భాగం ప్రేమ కథల్లోని సారమిదేనండి!బాగా చెప్పారు

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పారు......ధన్యవాదాలండి

      Delete
  20. అమ్మో చదవడమంటూ మొదలుపెడితే జీవితకాలం సరిపోదు సుమా madm ur great

    ReplyDelete
    Replies
    1. వెల్ కం టు బ్లాగ్....మరీ అంత అర్థంకాకుండా రాయలేదులెండి...చదివెయ్యండి.Thank you

      Delete