మాననిగాయం

కన్నీరంతా కలంలో నింపి కాగితాన్ని తడిపితే
వియోగం హద్దుదాటి కవితగా మారిపోయింది
అప్పుతెచ్చి అక్షరాలతో వేదనాదప్పిక తీర్చబోతే
పదాలు కరువై అసంపూర్తి పంక్తి చిన్నబోయింది

ముగియలేదని ఊపిరాపి నిండుజీవితాన్ని కోరితే
స్మృతులెగసి నిరీక్షణాశృవులై ఆడ్డుకట్టని తెంపింది
ఇంకిన కన్నీరు కనబడనీయకుండా నవ్వేయబోతే
ఒంటరితనపు ఎడారి జ్ఞాపకాలని ఒయాసిస్సులంది

ఓటమే శత్రువుగానెంచి నిబ్బర అస్త్రం సంధించబోతే
ఎక్కుపెట్టిన బాణం గురితప్పి నన్నే గాయంచేసింది
కలసిరాని కాలాన్ని కసితో కసురుకుని జీవించబోతే
గతి నేనేనంటూ మృత్యువు పరాయిపంచన చేరింది

గాయం కనబడకుండా మనసుకి ముసుగేయబోతే
అలిగిన మది ఏడ్వలేక తనని తానే ఓదార్చుకుంది
గమ్యానికి ఆశ్రయం ఇవ్వబోయి ఆశలతో గూడల్లితే
నిరాశపొగ వేదనసెగతో మంటలెగసి కుప్పకూలింది

49 comments:

  1. ఏమిటీ వేదనాంభుది. అంతర్దహనావేషమా? అంతరంగావిష్కరణా?

    ReplyDelete
    Replies
    1. ఏదైనా అంతరంగ భావావిష్కరణే ;-)

      Delete
  2. Extraordinary Painful Poetry With Suitable Photo. Good Work.

    ReplyDelete
  3. వేదన కూడా సుఖమే పద్మార్పిత పదాల్లో అన్నంత అపూర్వ పదజాలంతో కట్టిపడేసావు. నీ భావవాహకెరటాలకు హద్దులే లేవని మరోమారు తెలిపిన నిరాశ కవితే అయినా నిశ్చల మనసుతో రాసినట్లుంది-అభినందనాశిస్సులు

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు మీకు వందనాభినందనలు. ఎంతో అభిమానంతో స్పందనలు తెలియజేయడానికి భ్రమరంగా (బ్లాగ్ లో) మారినందుకు- _/\_ Profile Honey bee is apt pic sir :-)

      Delete
  4. నా మనసులోని భావాలను అక్షీకరించి నా ముందు పరిచినట్టుగా అనిపిస్తోంది.
    "అప్పుతెచ్చి అక్షరాలతో వేదనాదప్పిక తీర్చబోతే
    పదాలు కరువై అసంపూర్తి పంక్తి చిన్నబోయింది"
    "ముగియలేదని ఊపిరాపి నిండుజీవితాన్ని కోరితే
    స్మృతులెగసి నిరీక్షణాశృవులై ఆడ్డుకట్టని తెంపింది"
    ఇంతకన్నా వేదనని తెలిపే పదాలు లేనే లేవుగా......
    అలిగిన మది ఏడ్వలేక తనని తానే ఓదార్చుకుంది....
    నా అనుకున్న మనిషి దూరమై వేదన అనుభవించే ఇంతకన్నా ఏం చేయగలదు....తనని తాను ఒడార్చుకోవడం తప్ప...
    i am reading this since u have posted it...but till now i could not come out of this mood n write da cmnt.My heart cried...reading this.

    ReplyDelete
    Replies
    1. అనూ.....స్పందించే హృదయమున్న ప్రతి ఒక్కరిలో కలిగే భావాలేగా మనలో కలిగేవి కూడా :-)
      You are becoming too sensitive dear :-)

      Delete
  5. ఈ కవితలో వేదనా దప్పిక, నిరీక్షణాశృవులు నిబ్బర అస్త్రం వంటి కొత్త పదబంధాలతో వేదన సెగను ఆవిష్కరించారు పద్మార్పిత గారూ.. చిత్రం చూడగానే కవితలోని భావం తెలియజేసేట్టు వుంది. చాలా నచ్చింది.
    అభినందనలు..

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన పదాల్లికల్లో నుండి పుట్టిన పదబంధాలే కదండి ఇవి, ధన్యవాదాలు.

      Delete
  6. Entho Apuroopanga Entho Bhaavayuktanga.. Aatte manasu doche vidangaa.. manasu baadhalu telipe bhaava geetam laa chaalaa adbhutanga undi Padma gaaru.. Hats off.. !!

    ReplyDelete
    Replies
    1. Ilaa raaste simple gaa thanks ani yem cheppanu :-)

      Delete
  7. Each and Every word Speaks out the real pain of the heart, off the heart. The Poem speaks about itself on its own.. every word is filled with emotions and every stanza is perfectly put.
    This poem really gives out the essence of true pain through your creation Padma.. I have no other words to convey how I am indulged to your poems..!! Thank you for that.. Hope this saga continues...

    ReplyDelete
    Replies
    1. Thanks a lot for reciprocating with affectionate & inspiration words.I will try to maintain this....

      Delete
  8. అనంత నిరాశానిసృహల భావడోలికలమాల, నీ కలం పదును అమోఘం.

    ReplyDelete
    Replies
    1. సృజనగారి అభిమానం నన్ను ఎప్పుడూ సేదతీరుస్తుంది :-) థ్యాంక్యూ

      Delete
  9. కన్నీటిని కలంలో నింపారా.. ఈ సారి. అందుకే కాగితం మనసు కూడా బరువెక్కినట్టుంది. ఆవేదనాక్షరాలు
    భావావేశాన్ని అదుపుచేయలేక కట్టలు తెంచుకున్నాయి. నేను తరచూ ఒక కామెంట్ పెడుతుంటాను
    మీ పోస్ట్ లకు. ఈ సారి మళ్లీ రిపీట్ చెయ్యక తప్పడం లేదు. అనుభవాల అంతరంగాల్లోంచి పెల్లుబుకుతున్న
    సిరా చుక్కలివి. నిరాశావాదులకు ఆశ కలిగించే బదుళ్లు మీ అక్షరమాలికలు. ఇది కూడా అంతే. బాగుంది అంటే
    ఆవేదన చెందడం బాగుందని వస్తుందేమో. గుండెలోతుల్లోంచి పెల్లుబుకుతున్న కన్నీటి ఝరికి రూపం ఈ భావకవిత్వం.

    ReplyDelete
    Replies
    1. సతీష్ కొత్తూరిగారు....ఇలాంటి అభిమానాత్మక స్పందనలకి ఎలా బదులివ్వాలో తెలియడంలేదు-----------

      Delete
  10. Padmaji this is the ultimate emotional feel of a painful heart. You are the queen of poetic world. Nalotham

    ReplyDelete
    Replies
    1. Thank you Nalotham ji..... to be frank not a queen of poetic world, just first class student I am.

      Delete
  11. ముగియలేదని ఊపిరాపి నిండుజీవితాన్ని కోరితే
    స్మృతులెగసి నిరీక్షణాశృవులై ఆడ్డుకట్టని తెంపింది
    ఇంకిన కన్నీరు కనబడనీయకుండా నవ్వేయబోతే
    ఒంటరితనపు ఎడారి జ్ఞాపకాలని ఒయాసిస్సులంది
    ఇది అర్థమై కానట్లుగా ఉందండి, వివరించగలరు

    ReplyDelete
    Replies
    1. ఇంకా చావుకి సమయమున్నదని నిండుజీవితాన్ని జీవించాలి అనుకుంటే జ్ఞాపకాలు నిరీక్షణలో కన్నీరై పొంగి బ్రతకాలన్న ఆశల ఆనకట్టను తృంచేసింది.
      ఏడ్చి ఏడ్చి ఇంకిపోయి ఆరిన కన్నీటిచారలు కనపడకుండా నవ్వేయబోతే, ఒంటరితనపు ఎడారిలో జ్ఞాపకాలే ఒయాసిస్సులాంటివని అంది. నేను వివరించడంలో ఏదీనా లోపముంటే సర్దుకుపోతావని ఆశిస్తూ.....

      Delete
    2. అర్థమైందండి. మీ వివరణకు ధన్యవాదాలండి. ఇప్పుడు కవిత ఇంకా చాలా నచ్చింద

      Delete
  12. మీరు మామూలుగా రాసే మనసుని పిండేస్తారు, ఇంక కన్నీటినే సిరాగా చేసి ఒలికించిన ఈ భావసాగర ప్రవాహంలో కొట్టుకుపోవడం తప్ప వేరే దారిలేదు. అత్యంత ఆర్ద్రతని నింపారు.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయి....నా ఈ భావసాగర ప్రవాహంలో ఈతనేరుచుకుంటానని చెప్పి కొట్టుకుపోవడం ఏమిటో :-)

      Delete
  13. బాధను కూడా అక్షరాలతో అంధంగా మలిచే శక్తి మీకు మాత్రమే ఉందండోయ్:-)) చాలా చాలా బాగుంది:-))

    ReplyDelete
    Replies
    1. బాధకి అందమైన రూపం ఉందని తెలిసింది మీ అభిమానం వల్లేగా :-) థ్యాంక్యూ

      Delete
  14. చిత్రాన్ని చూసి కాసేపు మాటలురాక, తరువాత కవితచదివి మనసు మూగబోయింది. చిత్రంలో ఆమెచూపులతో కట్టిపడేస్తే, మీరు పదాలతో పైలాపచ్చీసు ఆడేసుకున్నారు. సూపర్ నేస్తం.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య మహీగారి గుండె కొట్టుకుంటూ చూపులు ఎవరినెవరినో చూసేస్తున్నాయి :-) నేను చింతపిక్కలాటే ఆడలేదు ఇంక పైలాపచ్చీసు ఏం ఆడగలను. థ్యాంక్యూ

      Delete
  15. కన్నీటి సిరాతో లిఖించిన వేదనా కావ్యం.
    నవరసాలు పలికించగలిగే మీ కలానికి, మీ మది అక్షరాలు నేర్పింది.
    మంచి కవిత గొప్పగా ఉంది పద్మ గారూ,

    ReplyDelete
    Replies
    1. ఫాతీమాగారి స్పందన నన్ను ఎప్పుడూ మీ మెప్పుకోరేలా రాయాలన్న స్పూర్తినిస్తుంది. ధన్యవాదాలండి

      Delete
  16. కన్నీరంతా కలంలో నింపి కాగితాన్ని తడిపితే
    వియోగం హద్దుదాటి కవితగా మారిపోయింది
    అప్పుతెచ్చి అక్షరాలతో వేదనాదప్పిక తీర్చబోతే
    పదాలు కరువై అసంపూర్తి పంక్తి చిన్నబోయింది....manasulo ekkadO dagivunna badhanu todestunnaru eee kavitatooo

    ReplyDelete
    Replies
    1. మీరు వేదనని మనసుతో ఆస్వాధించి ఇలా స్పందిస్తూనారు అందుకే ఇలాగేమో. ధన్యవాదాలండి.

      Delete
  17. మొత్తం వేదనంతా మీరొక్కరే చెప్పేస్తే ఇంక మాలాంటి చిన్న చిన్న కవితలు రాసుకునే వాళ్ళకి ఏం మిగులుతుంది చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. అనికేత్ వేదనని వెతికి మరీ రాయడమెందుకు, ప్రేమను రాసి పంచేసెయ్ ;-)

      Delete
  18. వేదన, నిరీక్షణ, కసి, ఓదార్పు, ఆశ్రయం, గూడు, నిరాశలతొ బాగా ముసుగేసారు.

    ReplyDelete
    Replies
    1. మీ తర్కానికి అంతు చిక్కనీయలేదంటే ఒప్పుకోవల్సిందే....ముసుకేసానని :-) thank you.

      Delete
  19. Who is that lady in photo? she is simply chasing me with her looks and Padma you are totally disturbing me with heart touching words> Robert

    ReplyDelete
    Replies
    1. Robert,,,,beauty of her eyes may be due to lubrication of hidden tears. You are with tender heart so her looks are chasing, dont get afraid, no exception from my words, you have :-)

      Delete
  20. తెల్లని క్యాన్వాసుపై రంగుల మిళితంతో చిత్రకారుడు ఓ అద్భుతాని సృష్టించినట్టు,
    మనసులోని భావాలని ఏరి కూర్చిన పదాలతో అద్భుతమైన కవితాచిత్రాలని మీరు ఆవిష్కరిస్తున్నారు.
    కవిత, చిత్రం...దేనికదే సాటి...సుపర్బ్!

    ReplyDelete
    Replies
    1. మీరు అభిమాన స్పందనలే నాకు స్పూర్తినిస్తాయండి.thank you

      Delete
  21. అక్షరాల అల్లికలు ఇంతందంగా అల్లి ఎక్కడా అంతు చిక్కరు అర్పితగారు ఇలా అనుకుంటూ అక్షరం పొల్లుపోకుండా చదివేస్తుంటాను ప్రతీసారి. మీ పోస్ట్ లు చవి కామెంట్స్ పెట్టడానికే ఇన్నిరోజులు పడుతుంది ఇంక కవితరాయాలంటే ఎన్నాళ్ళో మీ మెప్పు ఎప్పుడు పొందుతానో......నేను తెలుసు మీకు

    ReplyDelete
    Replies
    1. అభిమానానికి అంతు చిక్కనవసరంలేదుగా.....అలా కొనసాగిస్తూ ఆస్వాధించేయండి.:-)

      Delete
  22. వేదనంతా సువర్ణాక్షరమాలగా అల్లి అలరించారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రేరణగారు

      Delete
  23. Padmarpita your poetry is plucking at the heartstrings, and making music with them. Beautiful and worth of reading this blog.

    ReplyDelete
    Replies
    1. Welcome to my blog. thanks a lot for beautiful comments and hope you will enjoy.

      Delete
  24. I am sorry for commenting in english and causing in convenience to you. I promises you next time i will keep comments in telugu.

    ReplyDelete
    Replies
    1. పర్వాలేదండి....తెలుగులో టైప్ చేయడానికి "లేఖిని" ని వాడండి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete