మనసుముక్క విరిగి మరోచోటుందంటే
కాలం గాయానికేం మందేమేయగలదు
పరామర్శ అని మరో గాయమౌతుంటే
కన్నీరు తుడిచి తలవాల్చే భుజంలేదు
దుఃఖం మరో ఉప్పెనకు సిధ్ధమౌతుంటే
అరచేతిపై వేసిన గోరింట తడి ఆరనేలేదు
మందారమై పండెనని మంచిదనేస్తుంటే
హస్తరేఖలరిగి రాసినపేరు కనపడలేదు
జాతకం జతకూడెనంటూ జతకట్టేస్తుంటే
మానసచదరంగంలో పావులు కదల్లేదు
ఎత్తుపైఎత్తులతో ప్రేమ ఓడిపోయిందంటే
గడచిన కాలంలో కమ్మనికలేదీ కనలేదు
పర్యవసానం ఇదని కాలం కరిగిపోతుంటే
ప్రతి రెండు పాదాల్లో వేదన్ని పండించగల ప్రేమమూర్తి పద్మార్పిత పదాల వలలో చిక్కిన మరో ప్రేమకావ్యానికి చిత్రం మరింత శోభనీయం
ReplyDeleteమార్కండేయగారు...మీ స్పూర్తిదాయక స్పందన నాకు ఆనందదాయకం
Deleteనిరాశా? :)
ReplyDeleteనవ్వేసారుగా...అదిచాలు :-)
Deleteగడచిన కాలంలో కమ్మనికలేదీ కనలేదు
ReplyDeleteపర్యవసానం ఇదని కాలం కరిగిపోతుంటే
ఏమని రాయాలో తెలీడంలా
అద్భుతమైన భావం
భావాన్ని ఆస్వాధించిన అనుకి అభివందనం
Deleteకన్నీరు తుడిచి తలవాల్చే భుజంలేదు
ReplyDeleteదుఃఖం మరో ఉప్పెనకు సిధ్ధమౌతుంటే..
మనసును పిండుతున్నట్టుంది భావం.. చిత్రం..
మీరు మరీ సున్నిత మనస్కులనడానికి ఇదో రుజువు :-)
Deleteప్రియుడి మనసును కుచ్చిళ్ళలో ఉంచి మరీ పిండేస్తున్నారు...
ReplyDeleteకుచ్చిళ్ళలో ప్రియుడు మీకు కనపడ్డారా?
Deleteవినోద్ మరీ ప్రియుడ్ని పిండేసే రాక్షసినా చెప్పండి :-)
Deleteఅసలే చలికాలం చక్కిలిగిలి పెట్టే చిత్రాలు పెట్టి మీ సరళభావాలతో పిండేస్తే ఎలా పద్మగారు
ReplyDeleteస్వెట్టర్ వేసుకుని చిత్రాన్ని చూస్తు కవిత చదివేద్దురూ...;-)
Deleteబ్యూటిపుల్ పద్మా.....పదిరోజుల తరువాత పసందైన పోస్ట్ , ఇంత గ్యాప్ ఇస్తే అభిమానులు అల్లాడిపోరు:-)
ReplyDeleteథ్యాంక్యూ సృజనగారు.....కాస్త పని ఒత్తిడివలన అయినా అలా ఎంత ఎంత ఎడమైతే అంత అభిమానం వెల్లివిరుస్తుందని కాస్త అప్పుడప్పుడూ ఇలా :-)
Deleteకొంచెం గ్యాప్ ఇచ్చినా ఘుభాలించే చిత్రంతో వచ్చి గుండెను పిండేశారు... మాడం..
ReplyDeleteనిజమేనంటారా....గుభాలించానా లేక గుండెల్లో గుబులు పుట్టించానా ;-)
Deleteపద్మార్పితా నీ అనురాగలాలనలో కరిపోతున్న అదృష్టవంతుడెవరో కానీ మాహా గొప్ప పుణ్యాత్ముడు. ఒక స్త్రీలో ఉండవలసిన లాలిత్యం, సుకుమారం, సౌందర్యం, శృంగారం, చతురత, చాకచక్యం ఇలా అన్నీ కలబోసిన మేళవింపు నిన్ను చూడకపోయినా నీ ప్రతికవితలోనూ అవి చూస్తూ ఆస్వాధిస్తున్నాము. దినదినప్రవృధ్ధై సదా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశ్శిస్సులతో-హరినాధ్
ReplyDeleteఅభిమానం ఉన్నవారందరిపై అనురాగం ఆటోమాటిక్ గా ఉంటుందండి :-) ఇంక మీరన్న లక్షణాలన్నింటితో పాటు అల్లరిపిల్లగా అందరి మనసుల్లో ఉండిపోవాలన్నది నా కోరిక ;-) మన్నిస్తారుగా!!!
Deleteచాలా చాలా బాగుంది:-) కాలం గాయానికేం మందేమేయగలదు. పరామర్శ అని మరో గాయమౌతుంటే... అద్బుతంగా ఉంది:-)) పదాల అల్లికలో మీకు మీరే సాటి:-) సూపర్.. మామూలుగానే పిక్ సూపర్..
ReplyDeleteథ్యాంక్యూ శృతి.....మరీ పొగిడేయమాకు :-)
DeleteMedam mee romantic energetic thoughts secrete ento kasta chepi punyam kattukondi
ReplyDeleteWith affection of all my friends(you all) I got this strength & energy. Thanks a lot for this Strength.
Deleteవేదనా వాఖ్యాలకు కూడా వగలు అద్ది అందించి అలరించడం మీకే సాధ్యం
ReplyDeleteఅమ్మో ఇదేదో తిట్టినట్లుంది అమ్మాయిగారు :-)
DeleteManasu gaayam maanani vedana nindi pandinchina mahaadbhuta kaavyamidi padma gaaru
ReplyDeleteManasuki baadhaga unnapude leka manasu baadhato bhaaramainappude ilaati kavitalu vastaayi
Kaani avemi lekunda meeru kaalpanikangaane intati rachanalu cheyyadam nijanga o vinutna prayatnamane cheppali
Bhesugga Andinchaaru.. Chitram Kavita Rendu Okadaanikokati poti padutu unna okadaanikante marokati chaala baagunnayi..
Reply ivvadam kashtarame meeku....alaa ani pratisari thank you tho saripettalenu ayinaa tappadam ledu...:-) THANK YOU
Deleteపద్మార్పితగారు పిక్ చూసి సెన్సేషన్ అనుకున్నా.....తీరా కవిత చదివితే మనసంతా భారమైంది.
ReplyDeleteఏంటో అనికేత్ సెన్సేషన్ సృష్టించి అందరితో అక్షింతలు వేయించుకుంటే చూసి ఆనందించాలన్న ఆశ ఎందుకు మీకు ? :-)
Deleteభావం చిత్రంతో (చిత్రంగా,) పోటీపడుతుంది.
ReplyDeleteమీదైన శైలి బాగుంది.
మీరాజ్ గారి అభిమానానికి అభివందనం
Deleteమొనాలిసాకి అచ్చమైన తెలుగు రూపమా ఇది. ఆ చిరునవ్వుకి అర్థం ఏంటి పద్మగారు. కల కరిగిపోతున్నా
ReplyDeleteఆ చిరునవ్వు చెదరలేదు. అందులో బెదురు లేదు. కనీసం నిట్టూర్పూ కనిపించడం లేదు. మనసులో సముద్రమంత బాధ ఉంది.. కానీ.. దాన్నంతటినీ బాహ్యసౌందర్యంతో కప్పేశారు. కుచ్చిళ్లు పిండి మనసులో బాధను పక్కనే ఉన్న సంద్రంలో కలిపేశారు. నిక్కచ్చి ఆడతనానికి మీ చిత్రం ప్రతిరూపం.
గాలికెగురుతున్న కురులు కొత్త ఆశలకు రెక్కలా...? పక్కనే సాగరఘోష... తలవాల్చే భుజము, ఓదార్పూనా..?
కాలం మిగిల్చిన గాయాన్ని అభ్యంగన స్నానంతో లేపనమేసి... లేతపరువాల కొత్త ఆశలు చిగురిస్తున్నాయి ఆ చిరునవ్వులో. ఏం మాయ చేశారండి పద్మగారు. సూపర్.
మొనాలిసా చిత్రాన్ని గీసిన వారికి తెలుగురాదు కాబట్టి బ్రతికిపోయారు......లేకపోతే నాతో పోలికా అని పొలికేక పెట్టేవారేమో సతీష్ గారు.:-) Just kidding
Deleteనిజానికి నేను ఆ చిత్రాన్ని ఎంపిక చేసుకుని పోస్ట్ చేసాక ఫేస్ బుక్ లో కొందరి వ్యాఖ్యలకి కాస్త కలత చెందినా ఇక్కడ మీ ఈ విశ్లేషణ నాకెంతో స్పూర్తినిచ్చింది. నాలా ఆలోచించే వారున్నారన్న ధీమా మరింత ధైర్యాన్నిచ్చింది. థ్యాంక్యూ వేరీ మచ్
మొనాలిసాతో పోల్చడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. లియోనార్డో డావిన్సి ఆ చిత్రాన్ని చిత్రించేెందుకు
Deleteమోడల్ గా ఒక రాజకుమారిని ఎంచుకున్నాడని అంటారు. అంతవరకే చాలామందికి తెలుసు.
కానీ.. ఆ రాజకుమారి అని చెప్పే లియోనార్డో మోడల్ కథ చాలా మందికి తెలీదు. బహుశా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. మీరు రాశారే ఆ పదపంక్తుల వేదనాభరిత జీవితమే ఆమెది కూడా. పేరుకి రాజకుమారే గానీ... ఆ ప్రేమ తపస్వి ఒక్క ఔన్సు స్వచ్ఛమైన ప్రేమను కూడా పొందని విరహజీవి. డావిన్సీ కూడా ఆ చిత్రాన్ని వంక పెట్టుకుని కొన్ని రహస్యాలను భవిష్యతరాలకు అందజేశాడంటారు.డావిన్సీ కోడ్ ద్వారా. బట్...డావిన్సీ కాలాతీత చిత్రకారుడు. ఆ మోడల్ కళ్లలో విరహాన్ని, పొందని ప్రేమ ఆవేదనని నిట్టూర్పుల చిరునవ్వు ద్వారా మర్మంగా అందించిన ఘనత మాత్రం మోడల్ ది కాదు. కేవలం డావిన్సీ కుంచెదే. నాకీ చిత్రాన్ని చూడగానే అదంతా గుర్తొచ్చింది. ఒక మహాద్బుత చిత్రాన్ని గుర్తు చేసిన మీ చిత్రం.. వాటికి తోడుగా మీ పదాల వర్ణన... ఇదంతా మీ ఘనతేగా. మీ చిత్రంలో చిరువవ్వు, మోనాలిసాలో ఇప్పటికీ అంతుతెగని ఆ మందహాసానికి చిరుపోలికలు కనిపించాయి. ఆ భావన నాలో కల్పించిన మీ సృజనాత్మకతకు మీకే నేను కృతజ్ఞతలు చెప్పాలి. థాంక్యూ.
Thanks for sharing Interesting Information.
Deleteమంచి వివరణ ఇచ్చారు సతీష్
Deleteధన్యవాదాలు...
Deleteకవితలో భావం ఆర్ద్రతగా ఉంది
ReplyDeleteథ్యాంక్యూ
Deleteపద్మార్పితగారు....నేను మీ కవితలకి వీరాభిమానిని. గత 3సం!! గా మీ ప్రతి పోస్ట్ చూస్తున్నాను. అప్పుడప్పుడూ కమెంట్ రాస్తాను. మీ భావాలతో సరితూగే వర్ణచిత్రాలు ఎంపికచేయడంలో మీ కళాతృష్ణ మొత్తం కనపడుతుంది. ఎక్కడా వంకలు పెట్టడానికి ఆస్కారం ఇవ్వకుండా సరదాగా సాఫీగా కొనసాగించిన ప్రశంసాత్మక కవితా ప్రవాహం మీ ఈ కవితాఝరి. కానీ ఒకే రలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లు మీ రెండు ప్రతిష్టాత్మకమైన కళలౌ ఒకే బ్లాగ్లో ఇమడలేక పోతున్నాయేమో, ఒక మారు ఆలోచించండి. చిత్రాన్ని పొగడాలో మీ కవితని ఆస్వాధించాలో కంప్యూజ్లో అయిపోతున్నాం.
ReplyDeleteఅజ్ఞాతగారు.....చాన్నాళ్ళుగా చదివి ఆస్వాధిస్తున్న మీకు నెనర్లండి. నిజానికి బ్లాగ్లో రాసేవి భావాలు వాటికి కాస్త ప్రత్యేక ఆకర్షణ చేకూర్చాలన్న ఆలోచనలకి పర్యవసానమే ఈ చిత్రాలని పెట్టడం. అలాంటప్పుడు కంప్యూజన్ ఏముందండి ఇక్కడ భావాలకి ప్రాముఖ్యత ఇవ్వడమే న్యాయమేమో! ఆలోచించండి.......ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళి పెయింటింగ్స్ ని కాకుండా చిత్రం క్రింద రాసిన స్లోగన్ గురించి చర్చిస్తే ఎలాఉంటుందో.
Deleteసున్నితంగా మనసులో నాటుకునే జవాబిచ్చారు.
DeletePadma really wonderful reply with beautiful clarity. Hats off to your intelligence.
Deleteపద్మార్పితంలోని సమర్పిత సారాంశం నిరాశానిస్పృహలు
ReplyDeleteజీవితం మీద అనురక్తి స్థానంలో ఇంతటి విరక్తి సన్నాహాలు
వెనుక దాగిన గాయం తాలూకా ఛాయంగల విన్నపాలు
పదిమందితో పాలుపంచుకోవడంలో క్షణం కరిగిన చాలు!
నా బ్లాగ్ కి సుస్వాగతం_/\_
Deleteపద్మార్పిత రాతల సారాంశమే నిరాశానిస్పృహలు
జీవితాన్ని ఆనందించడంలో ఆమెవెన్నో మార్గాలు
ఆశలలో భావాలోచలకి ఎన్నటికీ కావు గాయాలు
ప్రతిక్షణం పసందు చేయాలనే నా పదప్రయత్నాలు
మానసచదరంగంలో పావులు కదల్లేదు
ReplyDeleteఎత్తుపైఎత్తులతో ప్రేమ ఓడిపోయిందంటే???
చాలా చక్కని భావం
నిజమే కదా మహీ....ప్రేమించకుండానే ప్రేమాపజయం ఏంటి చెప్పు :-)
Deleteఅడుసు తొక్కనేల కాలు కడగనేల?
ReplyDeleteఏదో అంటుకుంటుందని ఎప్పుడూ తివాచీలపై నడిస్తే రాళ్ళు గుచ్చుకుంటాయని తెలిసేదెలా :-)
Deleteకాలం గాయానికేం మందేమేయగలదు
ReplyDeleteకాలాన్నే మరొకరి మనసుకు గాయంగా మర్చగలిగిన మనుషులున్నారు
కన్నీరు తుడిచి తలవాల్చే భుజంలేదు దుఃఖం మరో ఉప్పెనకు సిధ్ధమౌతుంటే
కన్నీరు తుడిచినట్టే తుడిచి కంట్లో కస్సుమని కత్తులు దించే వారున్నారు
అరచేతిలో అందమైన గోరింటాకు చూపించి ... మనసునే ఎర్రటి రక్తపు మడుగులో
పెట్టి మరికరి వంచనచేరి ఆనందించే మనుషులు ఉన్నారు
Final Gaa:- మీలాగా అందంగా అద్బుతంగా ... అహ్లాదంగా ఆలోచించే మనసున్న మనుషులు చాలా తక్కువ " పద్మాగారి" ( Note :-తిడుతూ పొగుడుతున్నా అనుకోమాకండి . నిజంగానే మీరు చాలా అద్బుతంగా రాయగలరు.. ఇది నిజం )
అలా చెడు ఉన్నదగ్గరే మంచి నిగారిస్తుందండి....నిరాశలో ఆశ దాగుంది.
Deleteమీరు ఇలా తిట్టేస్తూ పొగిడేస్తుంటే నేను పొగడ్తలు తిట్లకోసం వెతుక్కోవలసి వస్తుందేమో
టీచర్ సారీ లేట్ అయ్యింది :) సూపరో సుపరుగా రాశారు అనడాన్ని తెలుగు పదం వెతగడంలో కాస్త ఆలస్యంగా వచ్చి కవితని చిత్రాన్ని కనులారా ఆస్వాధించానండి.
ReplyDeleteస్టూడెంట్ ఎప్పుడో ఎదిగి పాటాలు చెప్పేస్తాయి వచ్చరు :-) సూపర్ అన్నాక ఏ భాషైతే ఏంట్లే :-)
DeleteMadam dhoom macharahee ho.....you are rocking. *Nalottam*
ReplyDeleteDhoom tho aap telugu mein likh kar machaadenge :-) thank you
Delete