ఎందుకో!

ముత్యాల పందిట్లో మూడుముళ్ళేస్తనని..
మూతి ముడుచుకున్నాడెందుకో నామావ!
పుష్యరాగమల్లే పచ్చని పరువాలు నావని..
పస్తులంటూ పలకకున్నాడెందుకో నామావ!
మాణిక్యం వంటి మరులు ఉన్న మణినని..
మురిపించి మారిపోయాడెందుకో నామావ!
గోమేధికంలా గోముగాచేరి కలిసుందామని..
గోప్యమేదో చెప్పనంటాడు ఎందుకో నామావ!
వైఢూర్యమై వెలిగిపోతూ వగలుపోమాకని..
చిత్రచేష్టలతో వింతగున్నాడెందుకో నామావ!
కెంపు రంగు చీరకట్టి కైపు ఎక్కించమాకని..
కిమ్మనక కూర్చున్నాడు ఎందుకో నామావ!
పచ్చల హారమెందుకే ఎదలోనే ఉన్నానని..
పలికి పెదవి విప్పకున్నాడెందుకో నామావ!
వజ్రం వంటి విలువైన వల్లమాలిన ప్రేమని..
వల్లమాకు అంటున్నాడు ఎందుకో నామావ!
నీలం వంటి కన్నీటిచుక్క నాకంట చూడని..
నట్టేట్లో నన్ను ముంచినాడెందుకో నామావ!

రాతమార్చేది నవరత్నాల మహిమకాదని..
రాయినైనా సరే కరిగించేది ప్రేమతత్వమేనని
ఎప్పుడు ఏవిధంగా తెలుసుకుంటాడో నామావ!

53 comments:

 1. One of the Gem from your poetry Padma.

  ReplyDelete
 2. రాతమార్చేది నవరత్నాల మహిమకాదని..
  రాయినైనా సరే కరిగించేది ప్రేమతత్వమేనని
  ఇలా చెప్పి రాయినైనా మార్చగల మహోన్నతమైన భావాలు నీవి పద్మార్పిత.

  ReplyDelete
  Replies
  1. ఉన్నతమైన ఆదర్శ అభిమానాలు మీవి కూడా _/\_

   Delete
 3. నవరత్నాలైనా రాళ్ళేనని...ప్రేమలోనే మహిమ ఉందని బాగాచెప్పారు.

  ReplyDelete
  Replies
  1. జాతకరత్నాలన్నీ రాళ్ళేనంట కదా లిపి :-)

   Delete
 4. పాపం మొద్దు మామ... ఈ సారికి సర్దుకుపోరూ...

  ReplyDelete
  Replies
  1. మొద్దు అని ఒక్కసారి సర్దుకుపోతే శిలగా మలచేస్తాడేమో అన్న భయం :-)

   Delete
 5. వద్దంటూనో తెలియదంటునో మావ ఎక్కడికీ పోలేదు కదా? నవరత్నాల వంటి మరదలను వదిలిపోతాడా? :-)
  బాగుందండీ వర్ణనతో పాటు ఎప్పట్లానే మీ వర్ణ చిత్రం కూడా.

  ReplyDelete
  Replies
  1. వద్దు వద్దని ఆడవాళ్ళు అంటే ముద్దుకానీ.....చెట్టంత మగాడు నా మావకి అదేం మాయరోగం :-) Thank you _/\_

   Delete
 6. papam mama gems tho pogidina workout kaledu:)

  ReplyDelete
  Replies
  1. papam inka guri choosi kottadam practice cheyaalemo :-)

   Delete
 7. మీ వంటి మరదలిని వదిలే ప్రసక్తే లేదుగా.....
  good one....

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య....అదే ధీమాలెండి నాకూ :-) thank you

   Delete
 8. నవరత్నాలు రంగురాళ్ళు, రాతల్ని మార్చవని చెప్పాలనుకున్నది చక్కగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. రాళ్ళ రంగుని మార్చలేనుగా అందుకే చెప్పేసాను ఇలా :-)

   Delete
 9. నవరత్నాల కోసం వెంపర్లాడే దశమగ్రహం మీద అనుగ్రహం అనవసరమమ్మా.........పద్మగారు కవిత సందేశాత్మకంగా బాగుంది .

  ReplyDelete
  Replies
  1. మీ స్పందన ప్రేరణాత్మకం శ్రీదేవిగారు :-) Thank you

   Delete
 10. U r Like a Beautiful Diamond for us:-)) Ur poetry is like wonderful Gem:-)) Its really Awesome Words:-)

  ReplyDelete
  Replies
  1. wow.... i got 3 gems stones in your comments ;-) thank you

   Delete
 11. నిజంగా వజ్రం మరదల్ని అర్ధం చేసుకొకపోతే ఎలా? వదిలే ప్రసక్తే ఉండదు:-) తప్పకుండా అర్ధం చేసుకుంటాడు:-)

  ReplyDelete
  Replies
  1. మావకేం మేలిమి బంగారం వదలడు కాక వదలడు....కానీ వయసు పైనే కాస్త అపనమ్మకం :-)

   Delete
 12. ఒక్కో రత్నం నుండి వెలువడే కాంతి మనసునెల ఆనందపరుస్తాయో అలానే మీ కవితలోని ఒక్కో అక్షర రత్నం మెరుపులను ఎన్నిసార్లు ఆస్వాదించిన తనివి తీరదు పద్మగారు

  నవరత్నాలలో నవరసాలు కలగలిపి బహుచక్కగా బంధాల ప్రాముఖ్యత తెలిపారు
  ఎలాంటి భావాన్నైనా అలవోకగా పలకరించే భావానికి ప్రతిరూపం మీ కవిత అంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు సుమ !!

  ReplyDelete
  Replies
  1. నవరత్నాల కాంతి(పవర్) స్థానాన్ని బట్టి మారినట్లే......మీ అభిమాన సాంద్రతని బట్టి ఆస్వాధించే గుణం కూడా పెరగాలని ఆశ :-)

   Delete
 13. It's really a wonderful piece of fine poetry Dear Padma.. Hats off to you. Even little words become precious in your poetic excellence..
  Marvellous Piece of Majestic Poetry from a Neverending Saga of a Beautiful Brain behind it, transforming each syllable into something more meaningful and has a good message blended in it.

  Kudos to You
  Hats off Once Again

  ReplyDelete
  Replies
  1. Yes 100%.....Never ending Saga no doubt in this.

   Delete
  2. Thanks a lot for you valuable inspiring comments Sridhar.

   Delete
  3. ఆకాంక్ష...thanks for giving 100% confidence :-)

   Delete
 14. I am very much impressed by your blog and just want to follow your foot steps. ఇదే నా ఆకాంక్ష

  ReplyDelete
  Replies
  1. Welcome to my blog...ఆకాంక్ష. Just give your love and affection.After all I'm a dust particle in desert .I’m GOD creation! As all of us!.....thank you

   Delete
 15. నవరత్నాలు రాశిఫలాలలో ఏముందో తెలియదు కానీ నీ అక్షరాలకి మాత్రం రాతిగుండెనైనా కరిగించే శక్తి ఉంది.

  ReplyDelete
  Replies
  1. మహీ మరీ ఎమోషనల్ టచ్ ఇస్తున్నావు.....:-) thank you

   Delete
 16. Padmarpita always rocks.. Let he be...

  ReplyDelete
 17. నవరత్నాలలో నవరసాలు పండించారు

  ReplyDelete
  Replies
  1. పండించినా...అనుభూతి చెంది స్పంధించే పస మీ అందరిదీను _/\_

   Delete
 18. బాగుంది మీ పదాల్లో నవరత్నాల పరిభాష మరియు ప్రేమతత్వం

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలండి...ప్రేరణగారు

   Delete
 19. Yes, our heart itself is a Gem and love is astrological status for our soul.

  ReplyDelete
 20. నవరత్నాల మహిమ Vs జీవనసారమా ?

  ReplyDelete
  Replies
  1. మీరే చెప్పాలి :-)

   Delete
 21. చాలా సున్నితంగా లోతైన భావాన్ని అమాయకపు స్వచ్ఛతతో కలిపిన మీ కవితా, ఆ బొమ్మా రెండూ రెండు రత్నాలే.

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళకి....ఇక్కడ కనిపించారు, ధన్యవాదాలు.

   Delete
 22. Replies
  1. Welcome to blog....thanks a lot trinendra prasadgaru.

   Delete
 23. రాతిలోని సారాన్ని రమ్యంగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. అనికేత్ మీకు అంతగా నచ్చలేదనుకుంటాను :-)

   Delete
 24. పద్మార్పిత...
  ప్రేమార్చిత...

  ReplyDelete
  Replies
  1. అంతా మీ అందరి అభిమాన మయం....

   Delete

 25. పద్మార్పిత గారూ !
  నవరత్నాలను రంగరించి , మదించి, మదిలొంచి సంధించి ,పంచిన మీ కవిత చాలా బాగుంది . మామను ఇలా ఉరికే ఆడిపొసుకుంటే ఎలా ... ?

  "కెంపు రంగు చీరకట్టి కైపు ఎక్కించమాకని..
  కిమ్మనక కూర్చున్నాడు ఎందుకో నామావ!"

  ఇది విన్నాక మామ మా 'మాలచిమి' అక్కున చేర్చు కోకుండా ఉండగలడా . నవరసాలను సునాయాసంగా అల్లి - ఓ రూపం అందించే అపురూప మైన భావనల సౌధం మీ మేధస్సు .
  ఇలాగే మరిన్ని తీయని కవితలు ఈ 2014 లో మీ కలం నుండి జాలు వారుతాయనే ప్రఘాడ మైన నమ్మకాన్ని మరింత దృడపరచండి - శ్రీపాద

  ReplyDelete