నన్ను నేను

నాకు గులాబీలంటే ఇష్టం ఉండదు
"ప్రేమ" వ్యధకు ప్రతీక అందుకేనేమో
మల్లెలపైన కూడా మమకారం లేదు
"మత్తు" నుండి మరలేనన్న భీతేమో
కలువలు అంటే మాత్రం కడు ప్రియం
నాకు ప్రతిరూపం అవి అందుకేనేమో!

నాకు పిల్లగాలితెమ్మెరలు అంటే కోపం
"తాపం" రేపి తపన కలిగిస్తాయనేమో
లేలేత తొలిపొద్దు కిరణాలంటే భయం
"కలల" కైపుని కసిరి లేపుతాయనేమో
తామరను తాకే వెన్నెలంటే అమితిష్టం
తనువు వికసించి పులకరిస్తుందనేమో!

నాకు నేనే తెలిసినా తెలియని ఉత్ప్రేరణ
"తప్పు" చేసి సమర్ధించుకునే తలంపేమో
ప్రతిచేష్టలో నన్నునే చేసుకుంటా విశ్లేషణ
"ఒప్పు" కాదని అంటే భరించే శక్తి లేదేమో
పద్మంటే అపారమైన ప్రేమ ఆత్మవిశ్వాసం
నే ప్రేమించుకోనిదే ఎవ్వరినీ ప్రేమించనేమో!

51 comments:

  1. పద్మంటే అపారమైన ప్రేమ ఆత్మవిశ్వాసం
    నే ప్రేమించుకోనిదే ఎవ్వరినీ ప్రేమించనేమో! ....andamaina bhavam....

    M. A

    ReplyDelete
    Replies
    1. మీ నమ్మకాన్ని వమ్ముకానీయకూడదనే నా విశ్వప్రయత్నం :-)

      Delete
  2. చాలా బాగా చెప్పారు -
    తనను తాను ప్రేమించుకున్నాకే మరో విషయం అని.
    అందుకే అంటారేమో ...ఇంట గెలిచి , రచ్చ గెలవమని.
    మీ మానసిక విశ్లేషణకు అందుకోండి మా "తారీఫ్".
    అయితే ఇలా " ఇష్టముండదు ..... మమకారం లేదు ...
    భీతి నాకు ... కోపం నాకు ... భయం నాకు " అంటే ఎన్నింటినో
    త్యజిస్తున్నారనా అర్ధం? "భరించే శక్తి లేదేమో" అన్నది మీరేనా .
    పద్మార్పిత కలం నుండి కూడా అప్పుడప్పుడు ఇలా వచ్చే భావనలను
    చదివి గుండె నిబ్భరం చేసుకోమంటా రైతే ........
    శక్తి లేదని చెప్తూ నే ,,,, అన్నిటినీ అవలీలగా అధిగమించారు.
    హాట్స్ ఆఫ్ ... పద్మార్పిత గారూ.

    - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఇలా నాపై నేను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అంచెలంచలుగా అభిమానించబడాలనే కానీ ఎది అందకుండాపోవాలని కాదులెండి. మీ తారీఫ్ ల దొంతర్లకి తెరపడనీయనుగా...థ్యాంక్యూ :-)

      Delete
  3. ఇది ఏనాటి బంధమో ఏమో
    పద్మార్పిత అంటే అందరికీ ఎంతో ప్రియం:-)

    ReplyDelete
    Replies
    1. "ఈ" బంధమేమోనండి

      Delete
  4. wah padmaji aap ke jo noor hai vo phoolo mein kaha
    aap ki ye soch ne ki andaz jo hai har shayar mein kaha
    ek jo aap ho, vo lakhon mein hai kaha....Nalottam

    ReplyDelete
    Replies
    1. Aap jo baath kahi woh doosrone nahi kahaa...Nalottamji Sukriyaa!

      Delete
  5. నాకు చెల్లెలంటే(మా పద్మ ) ఇష్టమదేమో...
    అస్సలేమి చెప్పినా తప్పే అనిపించదు అదేమో..
    అందుకేనేమో....కలువలా వలువలు కట్టుకున్నా నిండుగానే ఉంటుందేమో...
    చూశారా నేనూ.... మీలా భావ కవిత్వం రాసేస్తున్నాను.
    బాగుందమ్మ్మా.

    ReplyDelete
    Replies
    1. ఆదరించే అభిమానం కదా అందుకే నా తప్పులు కూడా ఒప్పులైపోతాయి...అదే మరి ఈ బంధం మాయ :-) నెనర్లు.

      Delete
  6. మీకు మీరు+మేము కూడా సర్వం పద్మ ప్రియం :)

    ReplyDelete
    Replies
    1. కలకాలం కొనసాగనీయండిలా :-)

      Delete
  7. మీ ప్రతిపదం ఆత్మవిశ్వాశాన్ని ప్రోది చేసేలా వుంటూ అందంగా అమరాయి. సర్వం పద్మార్పితం యోహాంత్ గారు.. అభినందనలు పద్మాజీ..

    ReplyDelete
    Replies
    1. నా ఆత్మవిశ్వాసానికి ప్రోధ్బలం మీరంతా...ధన్యోస్మి_/\_

      Delete
  8. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు అంటే ఇంక లోకానంతా ప్రేమిస్తున్నట్లే....అందుకే పద్మార్పిత లోకమంతా ప్రేమమయం

    ReplyDelete
    Replies
    1. నాకు నేనున్నానని వదిలేయకండి...నా వెంట మీరంతా ఉంటారన్న నమ్మకమే ఇలా :-)

      Delete
  9. picture is soothing one with your fabulous wordings

    ReplyDelete
  10. మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు కనుకనే తప్పులు దొర్లవు, ఇంక ఎదుటివారు ఒప్పుకాదు అనే సాహసం
    ఏం చేస్తారు మీదగ్గర. ఎంతందంగా చెప్పారు మీ సక్సెస్ కి కారణాన్ని

    ReplyDelete
    Replies
    1. ఎప్పుడూ ఇలా సాగిపోవాలనే సంకల్పం లిపి. థ్యాంక్యు

      Delete
  11. మీ అంతరాత్మని ఉదాహరణగా చేసుకుని మరీ సాహసం చేసి... విలువైన సందేశం ఇచ్చారు. వెరీ క్యూట్ ఇన్ఫర్మేటివ్ పోయెట్. పద్మగారు. మరో చిన్న విషయం...వెన్నెలే ఊపిరిగా విరిసే పద్మం ముందు గులాబిలెంత, మల్లెలేపాటి...? పద్మ వికాసాన్ని చూడలేని దురదృష్ణం పొద్దుకిరణాలది. ఇక పిల్లతిమ్మెరలంటారా... "చెలి" గాలిని తాకలేని ఆ చిరుగాలులుండీ ఏం ప్రయోజనం. మీరు చివర్లో చెప్పిన ఆత్మసమర్ధన నిజాయితీతో కూడిన మనోభావం.
    ఒన్స్ ఎగైన్ వెరీ క్యూట్ పోయెట్ పద్మగారు. ఈ సారి కూడా విమర్శించలేకపోయా...

    ReplyDelete
    Replies
    1. సందేశాన్ని ఇచ్చేంత గొప్పదాన్ని కానేమో....నిజాయితీగా తప్పుల్ని సరిచేసుకోవాలన్న సంకల్పంతోనే సమర్ధించుకునే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్యూ.

      Delete
    2. ఈ నిడారంబరమే నీకు నిండైన ఆభరణం

      Delete
  12. నన్ను నేను అంటు మీకు మీరు చాలా బాగా వర్ణించారు. మీదైన శైలిలో చాల అందంగా వ్రాసారు. పిక్ సూపర్:-)

    ReplyDelete
    Replies
    1. అవును...చిత్రం అద్భుతం!! ఆవిడకు సాధ్యం అవనిది ఏదీ లేదేమో సుమా! కాదు కాదు .. శృతి..

      Delete
    2. ఆత్మవిమర్శ, విశ్లేషణా అవసరం అని అనుకుంటాను శృతి అది ఎంతవరకు నాకు దోహద పడుతుందో చూడాలి :-)

      Delete
    3. Padmarpita fans....లోకంలో సాధ్యం కానివి నెరవేరనివి ఎన్నో ఉన్నాయికదా ప్రతి ఒక్కరికీ...అందులో నేను ఒకదాన్ని

      Delete
  13. నిజంగా మీరు కవితల్లో, మాటల్లో ఎవర్ గ్రీన్:-))

    ReplyDelete
    Replies
    1. ఎప్పటికీ ఇలా ఎవర్ గ్రీన్ గానే ఉండిపోనీయండి మీ మనసుల్లో :-)

      Delete
  14. మీరు మీరుగా ఉంటున్నందుకే మా అందరికీ అభిమానం! సదా మీ ప్రవాహం ఇలానే సాగిపోవాలని మా ఆశ.!!

    ReplyDelete
    Replies
    1. తప్పక ప్రయత్నిస్తానండి. థ్యాంక్యూ

      Delete
    2. ఆయురారోగ్యాలతో ఆనందంగా చిరకాలం అందరి మన్ననలు అందుకోవాలని ఆశీర్వధిస్తూ-హరినాధ్

      Delete
  15. నిన్ను నువ్వే నిన్ను నీవే నిలువద్దమున నిగారించుకుని నింగిలో నెలలో నీటిలో నిప్పులో నవ్వులో నేలవంకలో నడిరేయి లో నడయాడుతు నటిస్తూ నర్తిస్తూ ననవిధముల్ నేర్పరితనపు నవయవ్వన నాయగారానివో నిత్యనూతనంగా నిలిచిపోయే నవకవిత నాయికవో నేనేటుల నినదించిన నవ్యంగనున్నది నీ నవకవిత నాటకీయత నోక్కోవ్యాఖ్యంబుల నక్కినుండేన్ నానావిధముల నవినత

    మీ అంతగా కాకపోయినా ఏదో నాకు తెలిసినంతలో వ్రాయడానికి చేసిన చిరుప్రయత్నమిది పద్మ గారు. మీ కవిత ఆద్యంతము బాగున్నది.

    ReplyDelete
    Replies
    1. చిరుప్రయత్నమే కడుకౌసల్యోపేతమైతే...ఇంక మీరు కవితలు రాస్తే అహా ఓహో అన్నమాట :-)

      Delete
  16. "తప్పు" చేసి సమర్ధించుకునే తలంపేమో
    ప్రతిచేష్టలో నన్నునే చేసుకుంటా విశ్లేషణ
    "ఒప్పు" కాదని అంటే భరించే శక్తి లేదేమో
    ఇలా మీకు మీరు విమర్శించుకుంటారు కాబట్టే వేరొకరికి అనే ఛాన్స్ ఇవ్వలేదు.
    "పద్మంటే అపారమైన ప్రేమ ఆత్మవిశ్వాసం" మాకు కూడా అపారమైన అభిమానం, అనురాగం.

    ReplyDelete
    Replies
    1. కలకాలం ఇలాగే పద్మపై ప్రేమ ఆత్మవిశ్వాసం ఉండనీయండి.

      Delete
  17. mee self analysing bagundi padmarpita.

    ReplyDelete
  18. ఒక అందమైన ( మానసిక ) విశ్లేషణ ... మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి మెహదీఅలీగారు. _/\_

      Delete
  19. ఇంతలా ఆలోచించి తర్జన భర్జనలు పడితే ఇంక మాలాంటివాళ్ళు తర్కించడానికి ఏముంటుంది చెప్పండి

    ReplyDelete
    Replies
    1. మీతో తర్కించబడరాదనే నా ప్రయత్నం :-)

      Delete
  20. తమనితాము విశ్లేషించుకుంటే ఎంతబాగుంటుందో అందరూ

    ReplyDelete
  21. come on yar again you are rocking

    ReplyDelete
  22. నన్ను నేను తడిమి చూసుకొంటే
    నా నిండా ఎల్లలు లేని ప్రేమ
    పూలను చూసినా
    వెన్నెల విరిసినా
    చల్ల గాలి తాకినా
    అమ్మను తలచుకొన్నా
    నాన్న గురుతుకు వచ్చినా
    చిన్న నాటి టీచరు జ్ఞప్తికి వచ్చినా
    చిన్న నాటి స్నేహితుడు పలకరించినా
    అందమైన భావాలకు ఆలవాలమైన
    కవితను చదివినా
    ఎంత అందమైనది నా జీవితం అనిపిస్తుంది
    జగమంతా ప్రేమమయమే అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి విచ్చేసిన మీకు వందనం _/\_
      నాకవిత మిమ్మల్ని ఆనంద పరచినందుకు నాకు ఎంతో సంతోషం.

      Delete
  23. నీనుండి నేర్చుకున్న గొప్ప సందేశం...నన్ను నేను ప్రేమించికోనిదే ఎదుటివారిని ప్రేమించలేనని. పద్మార్పిత పదాల్లోని పరమార్థం కమ్మని పరమాన్నం. ఎప్పుడూ తిండి గోలేనే అనకు పద్మా....ఇప్పుడు భోజనంచేస్తూ నీ కవితను ఆస్వాధిస్తున్నాను అందుకే-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు మీ అభిమానం నాకు ఎప్పుడూ ఆనందాన్ని స్ఫూర్తిని ఇస్తాయండి. ధన్యవాదాలు.

      Delete