కస్తూరి కర్పూర పరిమళాలు ఏమివ్వను
పరిచయ పుప్పొడి సంపూర్తిగా అంటనిదే
సుగంధ లేపనాలు పూసి సేద ఏంతీర్చను
వలపు నిట్టూర్పుసెగలు గాయం చేయనిదే
లవంగా యాలకుల తైలం ఏం మర్ధించను
గతించిన ఆవిరికాని జ్ఞాపకాలు దాగుండగా
గసగసాల గుసగుసలు నాకు నేనేంచెప్పను
తలపుమసాల నషాళం తలకి ఎక్కలేదుగా
దాల్చినచెక్క ఘాటుకి ధీటైనగీటు ఏంగీయను
కంటికి కుంకుమపువ్వంటి కోమలి కానరానిదే
మిరియమై మురిసి ధనియమై దాసోహమని
జీలకర్ర వాంలా చిన్నిజీవితమంటే నేనేం కోరను
మెంతి ఆవాలతో చలువ చందనం ఏం అద్దను
చిలిపిచేష్టలతో చెంత చేరకనే చేదని ఛీదరించగా
ఇంపు ఇంగువాని సొంపుసొగసుతో పోల్చలేను
జాజికాయలో జాబిల్లిని నువ్వు చూపించమనగా
అనాసపువ్వంటి అందాలు ఏం అందించలేను
ఆపేక్షానురాగ సాంద్రతా లోపంతో సరసమాడితే
కొరివికారమైనా కొసరి కమ్మగా వడ్డించేయగలను
మమతల మసాలాతో మనసంతా నేనని దరిచేరితే
అర్పితా......అద్భుతః మసాలా దినుసులలో మమతల మర్మాన్ని చాటిన నీ పదకౌసల్యానికి సలాం- హరినాధ్
ReplyDeleteపెద్దవారు మీరు మసాల ఫుడ్ మెచ్చి సలాం చేస్తే నాకు అజీర్తి కదండి, బ్లెస్ మీ.....మన్నించాలి _/\_
DeletePadmarpitaji outstanding spicy poem with human values*** Nalottam
ReplyDeleteNalottamji dhanyavaad _/\_
Deleteఖణేల్ ఖణేల్ మనిపించే మసాలా దినుసులతో గరం మసాలా మాత్రమె చేయ్యగాలరనుకున్నాను పద్మ గారు, ఘాటు ఘాటుగా ముక్కుపుటాలు అదిరిపడేలా నూరారు కారాలు మిరియాలు (మరో విధంగా కాదండోయి) :)
ReplyDeleteమసాలా తో చేసే వంటకం ఎంత అమోఘంగా ఉంటుందో అంతటికన్నా అమోఘంగా రచించారు తమరు ఈ కావ్యాన్ని.
చిత్రం చూడముచ్చటగా కనులవిందుగా రమణీయంగా ఉంది.. కవిత అత్యద్భుతం
మసాలా ధినుసులతో గరంమసాలా చేసి వంటకూడా బాగా చేస్తాను.....మీరు నమ్మాలి :-) తిన్నాక పూచీ నాది కాదండోయ్ :-) థ్యాంక్యూ _/\_
Deleteతరుచూ నేను చూసే బ్లాగ్ ల్లో మీదీ ఒకటి. ఇది అతిశయోక్తి కాదు. కానీ, నేను స్పందనలు వ్రాయడము చాలా తక్కువ.
ReplyDeleteఏమైనా మీ టపాలు బాగుంటాయి. ఇది కూడా ...
వెల్కం టు మై బ్లాగ్...మీరు చూస్తారు అన్నదే నాకు ఆనందదాయకము, స్పందన రాయకపోయినా అభిమానం తరగనీయకండి _/\_
Deleteసుగంధ ద్రవ్యాల పరిమళాలద్దిన మమతానురాగాలను పంచే ప్రేమార్పితకు దాసోహం కాని మనసు మనగలదా? మీ శైలి సూపర్ పద్మార్పిత గారు..
ReplyDeleteవర్మగారు.....మమతల మసాలాలో మత్తు ఏదో కలిపి వశము చేసుకున్నానన్న అభియోగమేమీ లేదుకదా ? :-) ధన్యవాదాలండి _/\_
Deleteఏ దినుసునూ వదలకుండా వాడి ముగ్గులో దింపింది గడుసుపిల్ల. చిత్రమ్లో ముద్దుగా ఒదిగి కూర్చుంది.
ReplyDeleteపద్మా చాలా బాగుందిరా,
ఫాతిమా గారు ! ఎంత బాగా చెప్పారు .
Deleteమీ మాటల్లో అభినందనలతో పాటు ప్రేరణ కూడా ఉంది
మీరాజ్ గారు......ఏదో ఒక దినుసు రుచినివ్వకపోతుందా అని అన్నీ వేసిన అమాయకురాలిని గడుసుదాన్నెలా అవుతాను చెప్పండి...ఏదో మీ అభిమానం కాకపోతే :-) థ్యాంక్యూ మాడం_/\_
Deleteశ్రీపాదగారు.....మీరన్నది నిజమేనండి.
Deleteమా పద్మ చాలా సున్నితం ఈ విషం తన భావాలను చూస్తే తెలుస్తుంది,
Deleteసరదాగా అన్నాను అంతే.
జాత ప్రేతమా? జాత మాత్రమా? ఈ పాకోపాఖ్యానాలాపన...
ReplyDeleteఇలా రాయడమేనా? లేక వంటా వార్పు ఏమైనా వచ్చా? అని అడిగారా వినోద్ గారు?....అదే కరెక్ట్ అయితే పాఠకులదే తుది నిర్ణయమండి :-)
Deleteఈసారికి ఏం కమెంటుతాంలే అని చూసి కూడా చూడనట్లుగా ఉండిపోదాం అనుకుంటాను....ఉండనిస్తే కదా పద్మ నువ్వు. ప్రతిసారీ ఒక వింత వ్యక్తిత్వంతో కనిపిస్తావట....ఇది మా శ్రీవారి కమెంట్ :-) మొత్తానికి అందరినీ మెప్పిస్తావు.
ReplyDeleteసృజనగారు అంతకోపమేంటి అయిదేళ్ళ బంధాని 2013 ఆఖర్లో అలా తృంచేద్దాం అనుకున్నారా ? అలా కాకూడదు అంటే ఇంకా కృషిచేయాలి అన్నమాట......మీ శ్రీవారికి _/\_ వందనాలు వంట దినుసులపై రాసేసరికి వింతగా కనిపించానటారా :-) ధన్యవాదాలండి _/\_
Deleteఇలా వెరైటీగా రాసి మెప్పించడం మీకు మాత్రమే సాధ్యం
ReplyDeleteయోహంత్ మీరూ రాయగలరు.....ఈ మధ్య వ్రాయడంలేదు.
Deletepicha picha ga nachesindi
ReplyDeleteboledanni thankulu meeku _/\_
Deleteమనసు పుటాలు అదిరిపోయాయి... మమతల ఇంగువ ఘాటుకి. కంటనీటి చుక్క జారింది... గతం మిరప
ReplyDeleteకారం తాకిడికి. వయసు రుచి తాకింది... మనసు జాపత్రి, జాజికాయ వలన. కలలోనూ వెంటాడుతోంది... కవితా
మృష్టాన్నభోజన సుగంధం. అనాస పువ్వు అందాలు కావవి.. అనార్ఖలీ గుభాళింపులు. ఈ ఘాటు ఏ మనసుని మాత్రం తాకకుండా ఉండగలదు... పద్మార్పితవిరచితమిర్చిమసాలా మధ్యమధ్యలో ఆవాల చేదులో ఆవేదన మోతాదు కూడా సమపాళ్లలో ఉంది. ఉగాది పచ్చడిలా...
మసాలా ఘాటు కంటనీరు తెప్పించింది అంటే భోజనం చేస్తుంటే పొలమారింది కామోసునండి సతీష్ గారు....అయితే నేరం నాది కాదండోయ్, మీ శ్రీమతిగారు తలంపుల్లోకి మీరు వెళ్ళి ఉంటారు :-) ఉగాది పచ్చడితో పోల్చారుగా థ్యాంక్యూ _/\_
Deletechaala ghatu ghatu ga hot hot ga undi padma:-) super..again magical lyrics..
ReplyDeletehot and sour spicy preparation with love in winter Sruti :-) Njoy with music
Deleteపద్మార్పిత గారూ !
ReplyDeleteలక్ష అక్షరాలు క్షుణ్ణంగా చదివి
విలక్షణమయిన అక్షర మాలను అల్లుకున్న మీరు
పంచ భక్ష పరమాన్నాలను అందించినట్లు,
మీరు అందించే ఆ అక్షరమాలలోని
ప్రతీ కవిత ఎంతో అందంగా ఉంటుంది.
ఇంత మంచి భావాలను మాముందుంచి ...
మరి భక్షిస్తారో లేక రక్షిస్తారో తెలీదు కాని
క్షణం ఆలస్యం చేయకుండా...
తక్షణం - వీక్షించేందుకు ఓ మాంచి
మరో కవిత అందించరూ
- శ్రీపాద
శ్రీపాదగారు..... కొద్ది రోజుల్లో ప్రాసపదాల కోసం మీదగ్గర ట్యూషన్ కి రావాల్సి వస్తుందేమో! అసలే ప్రాస కోసం ప్రాకులాడుతాను కదా :-) నేను పూర్తిగా శాఖాహారిని(అక్షరహారిని) అందుకే భక్షిస్తాను అన్న భయమే వద్దండి. సదా కనువిందు చేయాలన్న తపన ఉన్నదాన్ని తప్పక ప్రయత్నిస్తాను. ధన్యవాదాలండి _/\_
Deleteసున్నితమైన జవాబులతో అలరించడం నీకే చెల్లు. This is Padma's mark reply
Deleteమసాల దినుసుల్లో కూడా ప్రేమని చూపి మనసుదోచేయడం మీకే తెలిసిన మాహా విద్య.....మహా బాగా మసాలా దట్టించి కవితని పండించారు పద్మార్పిత
ReplyDeleteఏదో వంట చేయలేకపోయినా వస్తువులైనా తెలుసుకుందాం అన్న తపన తెలుగమ్మాయి :-)
DeleteMadam... Just Amazing !! That is Padmarpita. :-)
ReplyDeleteThanks a lot _/\_
Deleteఅందమైన మనసున్న మనిషేకాదు, మానవతా విలువలుకూడా మెండుగా ఉన్న సంస్కారవంతురాలైన మహిళ అని ఈ మమతల మసాలా కవిత ద్వారా ధృఢపరిచారు------అభినందనలు
ReplyDeleteఅమ్మో ఏంటో ఈ ధృవీకరణలు అవీ చదువుతుంటే భయమేస్తుంది ఉబ్బి తబ్బిబై ఒబెసిటీ వస్తుందేమోనని :-) థ్యాంక్యూ _/\_
Deleteమీకేవండి దివిలో విరిసిన పారిజాతం మీరు :-)
Deleteమీ ఎవర్ గ్రీన్ హిట్ సిధ్ధాంతం ఈ కవితా శైలి
ReplyDeleteప్రేరణగారు పసిగట్టేసారు...థ్యాంక్యు _/\_
Deletena friends chadavamani ante yedo anukuna ipudu telisindi valu enduku antala atukunaro me blogki.WONDERFUL BLOG motam ani ee year chadavalenu.I want to enjoy your blog writings.
ReplyDeletethanks to your friends who are promoting and following my blog._/\_ welcome to my blog hope you will enjoy the pleasure of my poetry. thank you.
Deleteకస్తూరి పరిమళం మొదటి పదంతోనే మత్తులో పడేసారు పద్మార్పిత. ఇలాంటి ఆలోచనలు మీకు ఎలా వస్తాయి అసలు. తెలియని విషయాలెన్నో చెప్తున్నట్లు తెలియకుండానే చెవిలో ఊదేస్తారు.
ReplyDeleteఇలా మీ అభిమానమే కదండీ నాకు కూడా తెలియనివి తెలుసుకుని మీతో పంచుకునేలా చేస్తున్నది. థ్యాంక్యూ _/\_
Deletethat is the reason we love you madam
Deleteమిస్ అయ్యాను....ఆలస్యంగా చూస్తున్నా, భలే రాశారే
ReplyDeleteమమతల మసాలా మరీ ఎక్కువైతే అల్సర్ తో బాధపడతారేమో
ReplyDelete