దేవుడా..! నిన్నేమడగను? ఇంకేం కోరను?
ధనరాసులు అడిగి దారిద్ర్యం తీర్చమననా
పుట్టుకతోరాని సిరిని స్థిరాస్తులు అనుకోనా
అంతంలేని ఆశల నిధినిక్షేపాలు ఏంకోరను
కుబేరునికేలేని ఖాతలో చందా ఏమడగను!
దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
పుట్టుక్కుమనే పట్టుపోగుల బంధం కోరుకోనా
గాజు పెంకులయ్యే అనురాగానికై ప్రాకులాడనా
సంబంధాల భాంధవ్యంతో బంధాలు ఏమడగను
సంభాళించునేవారు ఎందరు ఉన్నారని కోరను!
దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
జీవించడానికి గాలి, కూడు, గుడ్డా అడగనా!!
పర్యావరణలో గాలి కలుషితమైందని మాననా
ఆకలితీరినా రుచులడిగే కూడు, ఖద్దరుగుడ్డను
నేతలేచుట్టుకుని నగ్నంగా ఉంటే ఎవర్నడగను!
దేవుడా! అందమైన కలలు నిజం చేయమంటాను
కలలరెక్కలతో నింగికెగిరి, కోరికల కొమ్మపైన వాలి
కొన్నికలలకి రంగులద్ది, సాహసకిరణాల సెగ చూపి
ప్రయత్నిస్తూ విహంగినై విజయ విహారం చేస్తాను
నన్నునడిపి నిలిపింది ఆశల ఆశయమే అంటాను!
ధనరాసులు అడిగి దారిద్ర్యం తీర్చమననా
పుట్టుకతోరాని సిరిని స్థిరాస్తులు అనుకోనా
అంతంలేని ఆశల నిధినిక్షేపాలు ఏంకోరను
కుబేరునికేలేని ఖాతలో చందా ఏమడగను!
దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
పుట్టుక్కుమనే పట్టుపోగుల బంధం కోరుకోనా
గాజు పెంకులయ్యే అనురాగానికై ప్రాకులాడనా
సంబంధాల భాంధవ్యంతో బంధాలు ఏమడగను
సంభాళించునేవారు ఎందరు ఉన్నారని కోరను!
దేవుడా....! నిన్నేమడగను? ఇంకేం కోరను?
జీవించడానికి గాలి, కూడు, గుడ్డా అడగనా!!
పర్యావరణలో గాలి కలుషితమైందని మాననా
ఆకలితీరినా రుచులడిగే కూడు, ఖద్దరుగుడ్డను
నేతలేచుట్టుకుని నగ్నంగా ఉంటే ఎవర్నడగను!
దేవుడా! అందమైన కలలు నిజం చేయమంటాను
కలలరెక్కలతో నింగికెగిరి, కోరికల కొమ్మపైన వాలి
కొన్నికలలకి రంగులద్ది, సాహసకిరణాల సెగ చూపి
ప్రయత్నిస్తూ విహంగినై విజయ విహారం చేస్తాను
నన్నునడిపి నిలిపింది ఆశల ఆశయమే అంటాను!
ప్రేరణాత్మకంగా ఉంది మీ కవిత. చిత్రంలో వెన్నెలని చేజిక్కించుకోవాలన్న తాపత్రయం అనుకుంటాను.
ReplyDeleteవెన్నెల కోసం ప్రాకులాడితే కనీసం కాస్త వెలుగైనా దక్కకపోతుందాని తాపత్రయం :-)
Deleteబంధాలు, సమాజిక ఇతివృత్తాలు, దారిద్ర్యం, ఆశలు, కన్నీళ్లు, పారిశ్రామిక జాడ్యాలు... ఇలా అన్నీ ఒక దారానికే
ReplyDeleteగుచ్చేశారు. మీరన్నది కరెక్టే. ప్రస్తుత సామాజంలో ఒక వర్గాన్ని మినహాయిస్తే... అంతా దారిద్ర్యమే. భావ దారిద్ర్యం, బంధాల్లో అభిమాన దారిద్ర్యం, పేదలకు ఉపాధి దారిద్ర్యం, ఆఖరికి ఈ కాలుష్యంలో ఆరోగ్య దారిద్ర్యం, నాయకుల్లో చిత్తశుద్ధి దారిద్ర్యం ఇన్ని దారిద్ర్యాలు. వీటన్నిటినీ అధిగమించి గెలవడం మీరన్నట్టు కష్టమే. అయినా పరిష్కారం ఉందంటున్నారుగా. దృఢ సంకల్పం, ఆశలే ఆశయాన్ని బతికిస్తాయని కంక్లూజన్ ఇచ్చారు. జీవితానికి రంగులద్దుకోడం మన చేతుల్లోనే ఉందన్న వ్యక్తిత్వ వికాసాన్ని మీ అక్షరాల్లో ఇలా చెప్పారా. మొన్నేమో మిర్చిమసాలా, ఇవాళ సమాజానికి చురక. వర్సటైల్...
అదేం లేదండి.....సామాజిక సేవలు, సందేశాలు ఇచ్చేంత గొప్పదాన్ని కాదండి, ఏదో సత్యాన్వేషణలో భావాలకి రూపమివ్వాలనుకునే ప్రయత్నం అంతే....
DeleteInspiring poem Padma Arpita గారు. చాలా సూటిగా మీరు సంధించిన ప్రశ్నల బాణాలు వాడిగా వున్నాయి. నేటి వ్యవస్థలోని నగ్నత్వాన్ని చూపారు. మీ శైలి మార్చి రాయడం బాగుంది. మీ బహుముఖ ప్రజ్నకు ఇదో మచ్చు తునక. చిత్రం భావయుక్తంగా హత్తుకుంది. అభినందనలు.
ReplyDeleteనన్ను నేను ప్రశ్నిచుకోవడమే కాని...వ్యవస్థని ఎత్తిచూపాలని కాదండి. నా శైలి నిజంగా మారిందంటారా? ఏమైనా నచ్చింది అంటేనే మాహానందం :-)
Deleteపద్మాగారు.. కవితలో కొత్తదనంతో కదం తొక్కారు. అయినా మీ మార్కు వేదన ఎక్కడా తగ్గలేదు. అధ్భుతం.
ReplyDeleteకొత్తదనమా లేక....Old Wine In New Bottle....అంటారా :-)
Deleteమనం అడిగితే మాత్రం ఇస్తాడా? ఆయనకి తోచిందే ఇస్తారు పద్మార్పితా
ReplyDeleteఅడగంది అమ్మ అయినా పెట్టదు కదండి :-)
Deleteపద్మార్పిత గారూ ........ ఏమయింది !
ReplyDeleteఅన్ని ప్రశ్నలు ఒక్కసారే ఆ దేవుణ్ణి అడుగితే ఆయన మాత్రం ఏమని
సమాధానం చెప్తాడు . ఒక్కసారి తబ్బిబ్బై పోయి ఉంటాడు.
కవ్విస్తూ ... నవ్విస్తూ రాసే మీ కలం ఏమిటిలా క్రొత్త దోవలో పరిగెత్తిందీ రోజు.
మీ కాలాన్ని అందమైన కలల్ని కననీయండి..... ఆకాశంలో మీరన్నట్లు ఓ
విహంగిని కానీయండి. ఎంతో "ఇది" గా చదువుకునే మాలాంటి వారి ముఖాన కొత్త
రంగులు పుయనీయండి. పద్మార్పితను ఈ కోణంలో చూడాలంటే ... సాహస కిరణాల
సేగేదో ముందు చూడాలి . ఏది ఏమయినా "తీక్షణ " భావాలు మీకు దూరంగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది - మీరు రాసిన మీ ముందు కవితలు చదివాక .
- శ్రీపాద
శ్రీపాదగారూ.....ప్రశ్నలన్నీ ఒకేసారి అడిగేస్తే, కొన్నింటికైనా కొందరు సమాధానం చెప్పక పోతారా అని. కలలు ఎన్ని కన్నా...అందులో కొన్ని అయినా ఫలిస్తే బాగుంటుంది కదండీ...:-) ఎప్పుడూ ప్రేమ పదాలని దొర్లిస్తే అదేదో ప్రేమరోగం సోకింది అనుకుంటారేమో ;-)
Deleteబావుందండి ..
ReplyDeleteథ్యాంక్యూ..
DeleteIts really Inspirational poem, simply Extraordinary:-))
ReplyDeleteఅడిగినా ఇవ్వడానికి భగవంతుని దగ్గర ఏం మిగిలాయని....పద్మా దేవుడు పక్షపాతం వహించాడు మీ విషయంలో.....అన్ని కళలని మంచి మనసుని నీకే ఇచ్చి.
ReplyDeleteదేవుడిపైన అభియోగం, నాపై నిందా......తగునా మహీ :-)
DeletePadmaji a kavitatho samjhne mein khatin hai, mere khayal mein bhagavan se kuch binti hai shayad.
ReplyDeleteaap jo socha voh sahi hai...sukriyaa
Deleteఇలా అంచనాలకు అందకుండా రాయడం మీకే సాధ్యం మేడం. చాలా బాగుందండి.
ReplyDeleteఅంచనాలు తారుమారైనా అభిమానం తరగనీయకండి :-)
Deleteప్రయత్నిస్తూ విహంగినై విజయ విహారం చేస్తాను
ReplyDeleteనన్నునడిపి నిలిపింది ఆశల ఆశయమే అంటాను
Very positive.....inspiring.....
Thank you Anu.
DeleteHow are you.?
అంతంలేని ఆశల నిధినిక్షేపాలు ఏంకోరను
ReplyDeleteకుబేరునికేలేని ఖాతలో చందా ఏమడగను!
కొత్తగా బాగుందండి. ఇన్స్పైరింగ్ కవిత
థ్యాంక్యూ అనికేత్
DeleteMadam no one can beat your thoughts and poems. I am simply mad of you.
ReplyDeleteThank you very much....I think no comparison between thoughts. Everyone has their own individual ideas & thoughts.
Deleteonly...
Deletea few could express in such /a/ beautiful expressive expression/s...
so illuminative...
to leave us in everlasting impression...
and...
others couldn't express, lacking expressisve and impressive
imprinting, though possessing illuminative thoughts...
ఇక్కడే...
మనం పద్మాలతో అర్చించడానికి ఒక మూర్తిని...
కనుగొన్నాం...
మరీ అంతలా పొగిడేయమాకండి :-) అంతా మీ అభిమానాపేక్ష ఆశీర్వాదాలే _/\_
Deleteపద్మార్పిత....ఎంత అమాయకంగా అడిగావు ఏమడగనని, దేవుడే అప్పుడప్పుడూ అసూయ పడుతుంటాడేమో నిన్ను చూసి, నేను సృష్టించిన జీవికి ఇన్ని అందమైన భావాలా అని. నీవు ఎందరికో స్ఫూర్తిదాయకం. కొనసాగించు నీ పయనాన్ని ఏ ఒడిదుడుకులూ లేకుండా-హరినాధ్
ReplyDeleteహరినాధ్ గారు.....దేవుడు రాగధ్వేషాలకి అతీతుడు కదండి....అసూయ పడడు ఆశీర్వధిస్తాడేమో కలలు పండాలని :-)
Deleteచూశారా...
Deleteమనమెప్పుడూ దేవుడికి రాగాలు మాత్రమే ఆపాదిస్తాం...
కానీ ఆయన మాత్రం మనకు రాగాలు తక్కువ
ద్వేషాలు ఎక్కువ ఇస్తాడు...
ఆయన మరెలా రాగ ద్వేషాలకు అతీతుడు?
!!!???
రాగద్వేషాల్లోన్ని రాగాల గురించా లేక అనురాగంలోని రాగం గురించా మీరన్నది :-)
Deleteరాగమే..
Deleteఅదెక్కడున్నా...
మేడం గారు...
సున్నిత భావాల సుమమాల దేవుని మెడలో వేసారు,
ReplyDeleteనిర్మలమైన కొరికలే కనుక తప్పక తీరుస్తాడు.
పద్మా...మీ ఈ శైలి కూడా బాగుంది,
మీరు అన్నారంటే అవి తప్పక తీరతాయన్న నమ్మకం :-) థ్యాంక్యూ.
Deleteపద్మా,మీ జీవితాన నిత్యవసంతం ఉండాలి.(ఓ అక్కగా ) ఇదే కోరుకుంటాను.
Deletethanks a lot Madam.
Deleteమాడం మీరు అడిగింది ఏదీ దేవుడు కాదనడు....అదీ కాకుండా ఇలా సహజ సరళమైన కోరికలను కోరితే బోనస్ గా ఇంకా ఎన్నో అందమైన హావభావాలతో మీకందిస్తాడు....ఆయన కూడా మీ ఫాన్ కదా :-)
ReplyDeleteఅంతేనంటావా యోహంత్...అయితే అంతా అనందమే కదా ;-)
Deleteవెరీ నైస్ పద్మ గారు...
ReplyDeleteథ్యాంక్యూ...
Deleteఅవునండి మీరు దేవుడ్ని నమ్ముతారా? నాస్తికురాలు అనుకున్నాను. దేవుడేంటి ఎవర్ని అడిగినా మనస్ఫూర్తిగా ఇస్తారు,,,,,,,,అడిగింది ఎవరు పద్మార్పితగారు :-)
ReplyDeleteదేవుడ్ని నమ్ముతాను....దెయ్యాన్ని నమ్ముతాను :-) ఇద్దరూ మనలోనే ఉన్నారు అని గాఢంగా నమ్ముతాను.
Deleteyes you are right Padmarpita.. our positive nature is god and negative is Devil.
Deletehttp://www.manasukosam.blogspot.com
Good one !
ReplyDeleteThank you
Deleteపద్మార్పితగారు.....కవితలమాట అటుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నది కేవలం మీకు కమెంట్ ఏం వ్రాయాలా అనే....అక్షరాలన్నీ మీ అభిమానులే మాపై వాటికి కొంచమైనా కరుణ జాలి లేదు. అర్థం చేసుకుంటారు కదా కమెంటడం ఎందుకు ఆలస్యం అయ్యిందో :-)
ReplyDeleteఅక్షరాలన్నీ తెలుగమ్మాయి ఊసులంటే పడి చస్తాయి...వాటిని ఇలా అంటే ఎలా చెప్పు లిపి :-) అవి నీకు అభిమానులే
Deleteకలత నిదురలో చెదిరిపోయే కలలను ఏం నమ్ముకుంటారండి
ReplyDeleteవాస్తవాల కన్నా కలలే కమ్మగా ఉంటాయి...అందుకేనండి :-)
Deleteవెరీ నైస్ పద్మ గారు...
ReplyDeleteచాన్నాళ్ళకి మెహదీగారు....షుక్రియా
Delete