నీ తలపే భలే తుంటరి
నన్ను చేస్తుందది ఒంటరి
గిలిగింతలతో అదిచేసే అల్లరి
చలికాలం వద్దన్నా వినని పోకిరి
వేసవిలో వసంత సమీరాల ఝరి
వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!
ఎందుకిలాగని అడిగితే....మురిపంగా కసిరి
మరింతగా చేరువైపోతావు వద్దంటున్నా కొసరి
తలపులతో తనివితీరదుగా అంటాను విసిగివేసారి
నీ మత్తుమాటల్లో అన్నీ మరిచేను ఇదేం వింతవైఖరి
అందుకేనా తరచి తర్కించి తలుస్తాను నిన్ను మరీమరి
ఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!
నన్ను చేస్తుందది ఒంటరి
గిలిగింతలతో అదిచేసే అల్లరి
చలికాలం వద్దన్నా వినని పోకిరి
వేసవిలో వసంత సమీరాల ఝరి
వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!
ఎందుకిలాగని అడిగితే....మురిపంగా కసిరి
మరింతగా చేరువైపోతావు వద్దంటున్నా కొసరి
తలపులతో తనివితీరదుగా అంటాను విసిగివేసారి
నీ మత్తుమాటల్లో అన్నీ మరిచేను ఇదేం వింతవైఖరి
అందుకేనా తరచి తర్కించి తలుస్తాను నిన్ను మరీమరి
ఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!
తలపు తుంటరిది
ReplyDeleteఅల్లరి మాత్రం అర్పితగారిది
అమాయకురాలిని చేసి అల్లరిదంటే ఎలా:-)
Deleteనేను.. మీ అల్లరి చూసే ముందు... అంతకుమునుపు మీరు రాసినవి మరోసారి చూశాను. ఒకటేమో... ఎందుకు, మరొకటి కాలం కరిగి. నిజమైన ఆనందం, ప్రేమ పొందలేనపుడు.. అవి పొందినట్టు నటించడం ఎందుకూ.. అంటు ప్రశ్నించారు. ఇది పూర్తిగా సగటు అమ్మాయి అంతరంగం. కాలం కరిగిపోయింది... గాయం మాత్రం మానలేదు.. అని కాాలం తీర్చలేని సమస్యతో పలకరించారు. అది... బాధాతప్త హృదయ విలాపం. ఇక ఇది... తుంటరి తలపు.
ReplyDeleteమావిచిగురు లాంటి తొలకరి ప్రేమ జల్లుకి పులకరించిన మనసు లోతుల్లోంచి నులి వెచ్చని ఆలోచనలు. మొత్తంగా ఈ సుత్తి అంతా ఎందుకంటే... చాలా మంది రాస్తుంటారు. కానీ.. ఒకే లైన్ కి, థ్రెడ్ కి అంకితమవుతుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ థ్రెడ్ దాటి రాలేరు. అలా వచ్చి అన్ని భావాలను కూర్చగలిగేవారు సమర్ధులు. గిలిగింతలు పెట్టించే తుంటరి అల్లరిపిల్లే మీరు... ఒప్పుకోక తప్పడం లేదు.
sateesh garu correct ga chepparandi:-)
Deleteధన్యవాదాలు శృతి
Deleteసతీష్ గారు ఇలా పొగిడేస్తె అల్లరిమానేస్తానన్న భ్రంలోకి వెళ్ళకండి :-)
Deleteశృతి పార్టీ మారిపోతే ఎలా ;-)
Deleteమీ అల్లరి ఎప్పటికీ కొనసాగాలి. మీ కవితలు, ద్విపదతలతో మా మనసుతో అల్లరి చేయించాలి.
Deleteకీప్ ఇట్ దిస్ నాటీ... ఫర్ ఎవర్.
పద్మ గారు పిక్ ఎంత బాగుందో అందంగా చిలిపిగా, మీ కవిత అంతకంటే చిలిపిగా అద్బుతంగా ఉంది:-)
ReplyDeleteహమ్మయ్య....నాతోపాటే నువ్వు అల్లరి చేసెయ్....ఇద్దరం ఒక్టేకదా :-)
DeleteWow... Beautiful Madam...
ReplyDeleteThank you
Deletekhoob likh rahee hoe......rukh na math*Nalottam*
ReplyDeleteNalottamji aap telugu mei అ ఆ ఆహా....likhthe jaayiye :-)
Deleteక్రౌంచ ద్వందమా.. :-)
ReplyDeleteఅర్థం ఏమి ఆచార్యా :-)
Deleteఒంటరిగా ఉంటే తుంటరి తలపులే , చిత్రం నిలువునా మీ కవిత అలవోకగా జాలువారుతోంది పద్మగారు .
ReplyDeleteఏదో అప్పుడప్పుడు అల్లరిచేస్తే కసురుకోకండి ;-)
Deleteమరీ తుంటరి మనసు అల్లరి యిలా చెప్పేస్తే ఎలా. మీ కలం కుంచె అద్భుతం పద్మార్పిత గారు .
ReplyDeleteమనసులోనే దాచుకుంటే బరువైపోతుందని :-)
Deleteపద్మ కలానికి పదునెక్కువని తెలుసుకానీ మరీ ఇంత అల్లరిది అనిమాత్రం ఈ కవిత చదువుతుంటే నిర్ధారణ అయ్యింది :-) చిత్రంలో కవితలోని భావాలన్నీ కనిపిస్తున్నాయి
ReplyDeleteమహీ....పదును అని పొగిడావా లేక అల్లరిదని కోప్పడ్డావా :-)
Deleteనీలో దాగుంది అక్షరాల సిరి
ReplyDeleteనీకు అదే అదృష్ట అనంతగిరి
చెప్పేయకండి అందరికీ ఈ రహస్యభేరి
Deleteపద్మా ఇలా తుంటరి అని అతడి తలపులనే అన్నావా లేక నిన్ను నీవు అనుకున్నావా?
ReplyDeleteనన్ను నేననుకున్నా.....తననన్నా ఒకటేకదండి :-)
Deleteఏ కాలమైనా వదలని ఆ తుంటరే ఈ అందమైన భావవల్లరికి సరి.
ReplyDeleteమనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది మీ కవితా ఝురి,
మరి మా కవితలెందుకో .. మాలో రేపుతాయి అలజడి.
పద్మా... చక్కని కవిత.
నాదేముంది అంతా నాభావాలఝరి...మీవేమో నలుగురికి మంచిని చూపే దారి
Deleteఏదేమైనా బాగుంటుంది ఇరుమనసులు ఒకటై నడిచేదారి!
ReplyDeleteఇదే నిజం మిగిలినదంతా ఊహ. :)
ఊహలో మిమ్మల్ని నవ్వించానుగా....:-)
Deleteబాగుంది పద్మా గారు.. మీ ఆరోహణాక్రమకవిత
ReplyDeleteనెక్ట్స్ అవరోహణే :-)
Deleteమంచి రిథమ్ మంచి భావం అంతకు మించి చిలిపి అల్లరి కలబోసి కావ్యం చక్కగా అలరారుతుంది చక్కిలిగింతలు పెడుతూ, తుంటరి భావాల నడుమ కలిగే మనసులో కదలికలకు అక్షరరూపం... ఇది నిజంగా అపురూపమైన కళాఖండం.
ReplyDeleteకైత మాలచ్మి పాదాన కావ్య పద్మమిదే
స్యాన బాగున్నాది ఒయమ్మి ఈ కైత
:-) నవ్వి తప్పించుకుంటే మంచిదేమో :-)
Deleteచలికాలం గిలిగింతల కవితా? బాగుంది
ReplyDeleteఅన్ని కాలాల్లోను గిలిగింతలు పెట్టలని :-)
Deletechadivi anandinchadame tappa yem chestam :)
ReplyDeleteనవ్వేయండి అదే పదివేలు ;-)
Deleteచిలిపి కవిత చిన్నిపదాలతో అలరిస్తే చిత్రం కొంటేగా రమ్మని సైగచేస్తుంది :-)
ReplyDeleteహరినాధ్ గారు.....రమ్మని సైగచేసి నవ్వితే చలించిపోతారా ఏంటీ :-)
Deleteఅల్లరి అర్పిత...తుంటరి తలపు బాగు బాగు :)
ReplyDeleteఅనికేత్ అందరూ అల్లరిదాన్ని అంటున్నారు....నువ్వు కూడా :-)
Deleteచాలాబాగుంది
ReplyDeleteకవితల్లొ ఈ రకంగా అంత్యప్రాస కోసంపాకులాటడం దేనికి? ఎంచక్కా సినిమా పాటలే రాసుకోవచ్చుగా? ;)
ReplyDeleteబోలెడంతమంది ఎంచ్క్కగా రాసేస్తున్నారు నేను రాసేవెంత.....ఈ ప్రాకులాటైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా ఇలా రాసేసుకోనిద్దురూ :-)
Delete
ReplyDeleteమీ ' తుంటరి తలపు'... ఓ వినూతన రీతిలో ఉంది, ప్రాసతో ప్రాణం పోసుకున్న మీ ఈ కవిత బావుంది. అందరిని ఆకట్టుకుంటుంది కూడాను . ముఖ్యంగా
"వేసవిలో వసంత సమీరాల ఝరి" .
ఓ మాంచి ఝలక్ ని ఇచ్చింది -
....... శ్రీపాద
శ్రీపాదగారికి.....నా బ్లాగ్ ముఖాభివందనం _/\_ వింటర్ లో చలిమంట ఆవిరి కవితలు అందించే ప్రయత్నం చేస్తాను :-)
Deleteఅరవిరిసిన అందమైన అల్లరి
ReplyDeleteఅనుమానంగా అన్నట్లున్నారు :-)
Deleteనీ తలపే భలే తుంటరి
ReplyDeleteవలపు తలపులంటేమరి
నన్ను చేస్తుందది ఒంటరి
నేనుండాగా నేనొంటరె అంతె ఎలగు
గిలిగింతలతో అదిచేసే అల్లరి
అల్ల్రి అహ్లాదంగా ఉణ్ది మనసు కవిత కదాఇది
చలికాలం వద్దన్నా వినని పోకిరి
కవ్వించే మనసుండగా కాలందెముందండి
వేసవిలో వసంత సమీరాల ఝరి
వెసవి లో కూడా చలి పుట్టించగలవు
వానాకాలం తడిపేసి చేస్తావు కిరికిరి
కర కరమంటున్న కదల్లేకున్నా
కాలమేదైనా నన్ను వీడవెందుకో మరి!!
ఎలా వీడను కాదనలేని నిజం కదా మరి ( Emanukokandi Padma garu ...meee padalaku edo rayalani oo Chinnna Prayatnam tappite kashminchagalaru )
బాగుందిగా మీ ప్రయత్నం....నాకు నచ్చేసింది :-)
Deleteనా ప్రయత్నంచూసి నొచ్చుకుంటారేమో అని భయపడ్డాను మెచ్చుకున్నందుకు చాలా సంతోసం పద్మాగారు
Deleteఈ కవితల విందును ఆరగించాను మరి. !
ReplyDeleteసదా కవితావిందులు పసందుగా అందించే ప్రయత్నం చేస్తానండి :-)
Delete