అక్షరాలని ఆస్త్రాలుగా చేసి సంధించానే కానీ
మది తలపులకు ఊపిరిపోసి ఉసిగొల్పలేదు
ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు
అనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
కుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు
అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు
అరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
మకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు
మది తలపులకు ఊపిరిపోసి ఉసిగొల్పలేదు
ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు
అనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
కుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు
అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు
అరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
మకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు
పద్మార్పితా ఏంటి అక్షరాలన్నీ బహుపదునుగా ఉన్నాయి ఎందుకనో :-)
ReplyDeleteనిజాలు ఎప్పుడూ వాడిగా వేడిగానే ఉంటాయి కదండీ :-)
Deleteఅక్షరాలన్నీ పద్మార్పితను అశ్రయిస్తేనే గానీ
ReplyDeleteఅందమయిన భావాన్ని ఆవిష్కరించలేవు.
అభిమానంతో అలా అంటారే కానీ....అర్పిత ఆశ్రయించింది అక్షరాలనే కదండీ :-)
Deleteयादों से तीरों से ज़ख्मी हो चुका है बदन सारा
ReplyDeleteप्यार की घाव मिटते नहीं ये है इसका अन्दाज़ा
सीना टूट चुका है दर्रारे निकल पड़ी है तन मन में सारा
ज़िन्दगी की कलि अभी नहीं मुरझायी है प्यार कि ये है लिहाज़ा
ప్రేమలేక బీటలు వారిన మనసు ముక్కలు
ఒక్కో ముక్క ఒక్కో భావాన్ని ఒక్కో కష్టాన్ని తలపిస్తూ ఉన్న
మది తలపుల్లో కలల మాటు కనుల కొలనులో ఏర్పడిన ఆ ప్రతిబింబం కనుమరుగున పడదు
ఆప్యాయత అనురాగాలే నేర్చిన మనసుకు బాధ యెడబాటు కూడా తెలుసునని
కరిగి కన్నిరుగా మారే కన్నుల్లో ప్రేమించే గుణం కూడా ఇమిడి ఉన్నదని
ఏ రేయి కైనా పగలు ఉంటుందని
కష్టం సుఖం రెండు జీవిత నాణేనికి ఇరువైపులని
చక్కగా విపులీకరించారు పద్మగారు
जख्मॉ कॉ ताजा कर्ननॅसॅ क्या फायिदा.....उसॅ भूलना ही अच्चा.
Deleteవ్యధలోతుల్ని తోడి గాయాన్ని పెద్దది చేసుకోవడంకన్నా మరుగున పడేయడం మంచిది కదండీ
నిజంగా మీ అక్షరాలన్నీ చాలా చాలా పదునుగా ఉన్నాయి:-) మొత్తం మీద మీ కవితలో నా పేరు కూడా ఉంది:-) మాములుగానే ఎప్పటిలా అక్షరాలతో మాయాజాలం చేసారు:-) పిక్ సూపర్:-) మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:-))
ReplyDeleteఅక్షరాలని శృతి చేయనిదే పదాలు ఎక్కడివి? :-) నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు.
DeleteS Thank Q Very much:-)
Deleteఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
ReplyDeleteసడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు...
యిదే పద్మార్పిత గొప్పదనం. ఆత్మస్థైర్యాన్ని కవితా గానం చేసిన తీరు అభినందనీయం Padma Arpita గారు. చిత్రం ఈ మారు నాకు గజిబిజిగా అనిపించింది. ఏమనుకోవద్దు.
వేదనలో ఎక్కడైనా ఎవరినైనా గాయం చేస్తానేమో అన్న అతిజాగ్రత్త కామోసునండి. చిత్రంలో మది మాత్రమే కాదు తనువు కూడా కూడా బీటలు బారినట్లు చూపాలనుకున్నాను. ఏదైనా నన్ను నేనే గాయపరుచుకున్నాను అని చెప్పే ప్రయత్నం. బహుశా చెప్పలేక పోయాననుకుంటా
DeleteWe don't need any explanations Madam. Just keep Rocking. As a poem its a wonerful one. right Pic.
ReplyDeleteDear fans......I am not giving explanations to anyone. Just self analyzing.
Deleteఅలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
ReplyDeleteకసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు
మీ వ్యక్తిత్వానికి ఇది దర్పణం, ఇక సంజాయిషీ ఎందుకు
నేను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని రాయలేదు యోహంత్.....నన్ను నేను సముదాయించుకోవాలని ఇలా...
Deleteఇలాంటి కవితలు చదవడానికి భేషుగ్గానే ఉంటాయి కాని
ReplyDeleteఅభిమానించే మాలాంటివారి మనసుమాత్రం తట్టుకోలేదు
మరీ సున్నితంగా ఆలోచిస్తే ఎలా హరినాథ్ గారు? రాయికి ఉలి దెబ్బలు తగిలితేనేగా అందమైన శిల్పంగా మారేది....వ్యధల తాకిడిని తట్టుకునే పరిపూర్ణత్వం కోసం అనుకోండి
Deletetotally flat aiypoye heart touching poem.
ReplyDeleteGet up dear....next poem chadavali kadaa :-)
Deleteమీ కవిత చాలా బాగుంది పద్మ గారు..
ReplyDeleteనచ్చినందుకు వందనం
Deleteఅరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
ReplyDeleteమకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు
అక్కా యిలా నువ్వే రాయగలవు. స్త్రీ ఆత్మను స్త్రీయే ఆవిష్కరించగలదు. బాగా చెప్పావక్కా..
ఓలమ్మోలమ్మో.....స్త్రీకి స్త్రీనే శత్రువు అనే అర్థాన్ని అందంగా మార్చేసినావే సెల్లమ్మా,,
Deleteనమస్తే....సలాం....సెల్యూట్!
ReplyDeleteతెలుగులో మెచ్చి మిగిలిన భాషలో పొగిడారా :-)
Deleteఅక్షరాల అస్త్రాలతో మా మదికి ఉల్లాసబాణాలని సంధించారు పద్మార్పిత
ReplyDeleteహమ్మయ్య....గాయమైతే అవలేదుగా :-)
Deleteచాలా బాగున్నాయి మనసారా తెరిచిన "మది తలపులు"
ReplyDeleteమది తలుపులు తెరచి చెప్పిన తలపులని మెచ్చారా _/\_
Deleteఅక్షరాలతో ఆడుకుంటూ అందరినీ అలరిస్తున్నావు పద్మ. ఇలాగే అందరిమదిలో చిరకాలం ఉండిపోవాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteఅక్షరాలతో ఆడుకునేంత చనువు ఇంకా అబ్బలేదు మహీ.....అక్షరాలపై అమితమైన అభిమానం... అంతటి అభిమానం మీ అందరి నుండి కోరుతూ...
DeleteKhamosh Raat Ki Pehlu Mein Sitare Naa Hote,
ReplyDeleteIn Rookhi Aankhon mein Rangeen Najare Naa Hote,
Hum Bhi na Karte Parwah Agar aap Itne Pyare na hote.
Its true.....you are extraordinary arpita....keep it my friend
Hum agar iss pyaar ke qhaabil hai tho....isse nibhaana chaahathe hai. Thank you Abhilashini
DeleteHappy New Year 2014
ReplyDeleteFelice Anno Nuovo Duemila Quattordici
Nootana Sanvatsara Shubhaakaanshalu
Naye Saal ki Aagaman Shubhkaamnaayein
Navina Varshachya Shubhechcha
Navvo Varsesaaru Shubhaakaankshaa
_/\_ thanks in all languages
Deleteమీ మది తలుపులు తెరచి అవేదనని అక్షరాలుగా గుమ్మరించినా, ఆత్మీయతని అనురాగంగా పంచినా ఆనందంగా ఆస్వాధిస్తామండి.
ReplyDeleteమీ అందరి అభిమానం ఉన్నతకాలం ఆవేదనని ఎన్నడూ ఎవరికీ కలిగించడమే కాదు అగుపించకుండా చిరునవ్వుతో కప్పేస్తానండి....అనికేత్ గారు.
DeleteHAPPY NEW YEAR !!
ReplyDeleteTHANK YOU .
Deleteఅదెమిటి. పద్మార్పితా ..
ReplyDeleteనీవు అక్షరాలను ఆశ్రయించమేవిటి .. అవన్నీ నీ సొత్తే అయి
నీతోనే అల్లుకొని ఉంటె ....... అంతరాత్మతో ఆడుకునే నైజం
ఉన్నవారు ఇలా చక్కటి ..చిక్కటి అక్షరాలతో అందరిని
చకితులగా చేసి - చలి చెక్కిలిగింతలు పెట్టలేరు.
"ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు"
ఈ భావాలు చాలవా ... మీ రచనా సాహిత్యాన్ని చూసి
నీ అక్షరాలే నిన్ను ఈర్షగా చూడ్డానికి .....
నీ ఈ కవితలు చదువుతున్నప్పుడు " ఆకలుండదు - దాహముండదు "
అన్న పాట ఎన్నో సార్లు గుర్తుకు వస్తూంది ...
పోగుడుతున్నానని అంటావు .. అలా కాదు ....
" నీ కార్య దీక్షత - 'జబర్దస్తీ '
ఏ మాత్రం అవసరం లేదు దానికి - 'గస్తీ '
చెడు వినడం , చెప్పడం అని ఎవరన్నా ..వారికి - 'స్వస్తి '
మత్తెక్కిచ్చే మాటలు మాత్రం - 'మస్తీ '
దానికి తోడుగా పంచే నీ కవితా చాతుర్యం మరెంతో - 'జాస్తి'
- శ్రీపాద
ఇదేమిటి శ్రీపాదగారూ.....
Deleteఏదో అక్షరాలని అమ్మా అయ్యా అని బ్రతిమిలాడి ఆశ్రయిస్తే మీరు నాకు పోటీగా ఇలా పద ప్రాసలతో కొనియాడి పోటీకి రావడం తగునా? :-) ఇలా అయితే నేను పదాల ప్రాసకై మిమ్మల్ని ప్రాధేయపడాలేమో :-)
నూతన సంవత్సరంలో కవిత కోసం చూస్తున్నాను
ReplyDeleteఆలోచిస్తున్నా ఆకాంక్ష
Deletewish you a happy new year. expected a new poem from you.
ReplyDeletesame 2 U. What to write thinking :-)
Deleteస్వయం విమర్శనాత్మక సముదాయింపు...
ReplyDeleteకొన్ని స్వయంకృతాపరాధాలన్న సంశయంలో అప్పుడప్పుడూ తప్పదు కదండీ :-)
Deleteఅనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
ReplyDeleteకుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు
అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు....Naa gundello Aksharalanu Pekilinchi marI rasinattu Vundi .... enta bagudo Matallo cheppaleenu... Hart Touching
గుండెలయ వేదనలన్నీ ఒకేరాగంలో వినిపిస్తాయి కామోసు.
Deleteమది తలుపులు తెరిస్తే అన్నీ తలపులే కదా పద్మగారు. ఆ తలపులు తీపి గుర్తులా, చేదు జ్ఞాపకాలా అనేది కాలం నిర్ణయించేసి... గాయం చేసో, మధురం చిలికో వెళ్లిపోతుంది. వాటి వెనుకే గుండెచప్పుళ్లొకటి.. క్షణక్షణం బతుకు విలువ గుర్తుచేస్తూ... కాలంతో పాటూ సాగిపొమ్మంటూ. ఎప్పటిలాగే ఈ కవితలోనూ... మనసుకి మనసే సాంత్వన అని చెప్పకనే చెప్పారు. వేదన కూడా మీ కవితల్లో లొంగిపోతుంది.. ఎందుకంటారు...
ReplyDeleteకాలమే నిర్ణయిస్తుందని వేదనకి వ్యధ చెందకుండా ఉండలేం కదండీ.....అయినా మనం ఏదో ఉంది ఏదో జరుగుతుంది అనుకుని పంజరంలో బంధీగా ఉండేకన్నా ఎదురీది సాగిపోవడం మిన్న కదా.... వేదన కూడా పద్మార్పిత ఫ్రెంఢ్ కదండీ :-)
Deleteనీకు నూతన సంవత్సరశుభాకాంక్షలు. అర్పితా రెండురోజుల నుండి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నీవు కొత్త కవితతో అలరిస్తావని. కుసలమేనా?
ReplyDeleteకుసలమేనండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాయనా వద్దా అన్న మీమాంసలో కొట్టు మిట్టాడుతున్నా అందుకే ఆలస్యం _/\_
Deleteమీ మదితలుపులు తెరచి ఇలా అక్షరబాణాలతో సంధిస్తే ఏం తర్కించను.
ReplyDeleteతర్కించే ఆస్కారం ఇవ్వకూడదనే తర్కంగారు ఈ ప్రయాస :-)
DeleteHappy New Year!!
ReplyDeleteThank you and wish you the same. Hope everything is fine Anu.
Deleteచక్కని కవిత రాసి మా మనసులను దోచుకున్నారు పద్మార్పిత గారు ..చాలా బాగుంది ....
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలండి.
Deleteకొందరు ఆడిన
ReplyDeleteచదరంగపు పావునైయ్యా కానీ
ఎత్తులు పై ఎత్తులతో
ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
నాలో నేను నలిగిన క్షనాల్లో తప్ప
ఆవేశాన్ని అణచి పదాలకి
పదునుపెట్టీ ఏదో రాయలనుకున్నాను
అది నన్ను నేను
ఒదార్చుకోవడానికే
సూటిపోటి మాటలతో
ఎదలని గాయపరచాలని లేదు ..
ఆమాటలన్న వాళ్ళు బానే ఉన్నారు
పడ్ద నేను తప్ప ఎందుకిలా
అని నేను అడుగను .. అడుగలేను
అర్హత లేదని తెలిసిన క్షనాలివి
అలసినా సొలసి
నిరాశ పడిన మనస్సుతో
అక్షారాలని ఆశ్రయించా కానీ
ఆవేదనను కాస్త
చల్లార్చుకుందామనే
కసి తీర్చుకోమంటూ
కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
అయిన కోందరికి నేనో పావు నయ్య
అవకాసం దొరికినప్పుడల్లా
ఆడుకుంటూనే ఉన్నారు
ఆవేదన అంతా
అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం
ఎన్నడూ వీడలేదు..
నేనెప్పుడూ మారలేదు
మారను కుడా
అవకాశవదిని కాదు
నీవెప్పుడూ
వుండాలని కోరుకునే వాడీని తప్ప
Note :- ఫద్మాగారు మీ కవిత స్పూర్తితో మీ పదాలకు పరికొన్ని పదాలు చేర్చి నా మనస్సులోని నివేదనను ఇలా వెల్లడించాను
మీదైన పంధాలో బాగుందండి మీ కవిత.
Deleteమీ కవిత చాలా బాగుంది పద్మ గారు..
ReplyDeleteమెహదీగారు థ్యాంక్యూ వెరీమచ్
Deleteyour self analysis endariko margadarsakam. Good poetry arpita
ReplyDeleteThanks for your comments
Delete