మదితలుపులు

అక్షరాలని ఆస్త్రాలుగా చేసి సంధించానే కానీ
మది తలపులకు ఊపిరిపోసి ఉసిగొల్పలేదు
ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు

అనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
కుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు

అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు

అరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
మకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు

65 comments:

  1. పద్మార్పితా ఏంటి అక్షరాలన్నీ బహుపదునుగా ఉన్నాయి ఎందుకనో :-)

    ReplyDelete
    Replies
    1. నిజాలు ఎప్పుడూ వాడిగా వేడిగానే ఉంటాయి కదండీ :-)

      Delete
  2. అక్షరాలన్నీ పద్మార్పితను అశ్రయిస్తేనే గానీ
    అందమయిన భావాన్ని ఆవిష్కరించలేవు.

    ReplyDelete
    Replies
    1. అభిమానంతో అలా అంటారే కానీ....అర్పిత ఆశ్రయించింది అక్షరాలనే కదండీ :-)

      Delete
  3. यादों से तीरों से ज़ख्मी हो चुका है बदन सारा
    प्यार की घाव मिटते नहीं ये है इसका अन्दाज़ा
    सीना टूट चुका है दर्रारे निकल पड़ी है तन मन में सारा
    ज़िन्दगी की कलि अभी नहीं मुरझायी है प्यार कि ये है लिहाज़ा

    ప్రేమలేక బీటలు వారిన మనసు ముక్కలు
    ఒక్కో ముక్క ఒక్కో భావాన్ని ఒక్కో కష్టాన్ని తలపిస్తూ ఉన్న
    మది తలపుల్లో కలల మాటు కనుల కొలనులో ఏర్పడిన ఆ ప్రతిబింబం కనుమరుగున పడదు

    ఆప్యాయత అనురాగాలే నేర్చిన మనసుకు బాధ యెడబాటు కూడా తెలుసునని
    కరిగి కన్నిరుగా మారే కన్నుల్లో ప్రేమించే గుణం కూడా ఇమిడి ఉన్నదని
    ఏ రేయి కైనా పగలు ఉంటుందని
    కష్టం సుఖం రెండు జీవిత నాణేనికి ఇరువైపులని
    చక్కగా విపులీకరించారు పద్మగారు

    ReplyDelete
    Replies
    1. जख्मॉ कॉ ताजा कर्ननॅसॅ क्या फायिदा.....उसॅ भूलना ही अच्चा.
      వ్యధలోతుల్ని తోడి గాయాన్ని పెద్దది చేసుకోవడంకన్నా మరుగున పడేయడం మంచిది కదండీ

      Delete
  4. నిజంగా మీ అక్షరాలన్నీ చాలా చాలా పదునుగా ఉన్నాయి:-) మొత్తం మీద మీ కవితలో నా పేరు కూడా ఉంది:-) మాములుగానే ఎప్పటిలా అక్షరాలతో మాయాజాలం చేసారు:-) పిక్ సూపర్:-) మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:-))

    ReplyDelete
    Replies
    1. అక్షరాలని శృతి చేయనిదే పదాలు ఎక్కడివి? :-) నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు.

      Delete
  5. ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
    సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు...

    యిదే పద్మార్పిత గొప్పదనం. ఆత్మస్థైర్యాన్ని కవితా గానం చేసిన తీరు అభినందనీయం Padma Arpita గారు. చిత్రం ఈ మారు నాకు గజిబిజిగా అనిపించింది. ఏమనుకోవద్దు.

    ReplyDelete
    Replies
    1. వేదనలో ఎక్కడైనా ఎవరినైనా గాయం చేస్తానేమో అన్న అతిజాగ్రత్త కామోసునండి. చిత్రంలో మది మాత్రమే కాదు తనువు కూడా కూడా బీటలు బారినట్లు చూపాలనుకున్నాను. ఏదైనా నన్ను నేనే గాయపరుచుకున్నాను అని చెప్పే ప్రయత్నం. బహుశా చెప్పలేక పోయాననుకుంటా

      Delete
  6. We don't need any explanations Madam. Just keep Rocking. As a poem its a wonerful one. right Pic.

    ReplyDelete
    Replies
    1. Dear fans......I am not giving explanations to anyone. Just self analyzing.

      Delete
  7. అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
    కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
    ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
    సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు
    మీ వ్యక్తిత్వానికి ఇది దర్పణం, ఇక సంజాయిషీ ఎందుకు

    ReplyDelete
    Replies
    1. నేను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని రాయలేదు యోహంత్.....నన్ను నేను సముదాయించుకోవాలని ఇలా...

      Delete
  8. ఇలాంటి కవితలు చదవడానికి భేషుగ్గానే ఉంటాయి కాని
    అభిమానించే మాలాంటివారి మనసుమాత్రం తట్టుకోలేదు

    ReplyDelete
    Replies
    1. మరీ సున్నితంగా ఆలోచిస్తే ఎలా హరినాథ్ గారు? రాయికి ఉలి దెబ్బలు తగిలితేనేగా అందమైన శిల్పంగా మారేది....వ్యధల తాకిడిని తట్టుకునే పరిపూర్ణత్వం కోసం అనుకోండి

      Delete
  9. totally flat aiypoye heart touching poem.

    ReplyDelete
    Replies
    1. Get up dear....next poem chadavali kadaa :-)

      Delete
  10. మీ కవిత చాలా బాగుంది పద్మ గారు..

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు వందనం

      Delete
  11. అరమరికలులేని స్నేహాన్ని ఆలంబనగా కోరాకానీ
    మకరందం చుట్టూ ఈగలని ముసిరిపోనీయలేదు
    ఆలాపనంటూ ఎదలయను మౌనశృతిచేసానే కానీ
    తెలియని రాగం ఆలపించాలని తాపత్రయ పడలేదు

    అక్కా యిలా నువ్వే రాయగలవు. స్త్రీ ఆత్మను స్త్రీయే ఆవిష్కరించగలదు. బాగా చెప్పావక్కా..

    ReplyDelete
    Replies
    1. ఓలమ్మోలమ్మో.....స్త్రీకి స్త్రీనే శత్రువు అనే అర్థాన్ని అందంగా మార్చేసినావే సెల్లమ్మా,,

      Delete
  12. నమస్తే....సలాం....సెల్యూట్!

    ReplyDelete
    Replies
    1. తెలుగులో మెచ్చి మిగిలిన భాషలో పొగిడారా :-)

      Delete
  13. అక్షరాల అస్త్రాలతో మా మదికి ఉల్లాసబాణాలని సంధించారు పద్మార్పిత

    ReplyDelete
    Replies
    1. హమ్మయ్య....గాయమైతే అవలేదుగా :-)

      Delete
  14. చాలా బాగున్నాయి మనసారా తెరిచిన "మది తలపులు"

    ReplyDelete
    Replies
    1. మది తలుపులు తెరచి చెప్పిన తలపులని మెచ్చారా _/\_

      Delete
  15. అక్షరాలతో ఆడుకుంటూ అందరినీ అలరిస్తున్నావు పద్మ. ఇలాగే అందరిమదిలో చిరకాలం ఉండిపోవాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. అక్షరాలతో ఆడుకునేంత చనువు ఇంకా అబ్బలేదు మహీ.....అక్షరాలపై అమితమైన అభిమానం... అంతటి అభిమానం మీ అందరి నుండి కోరుతూ...

      Delete
  16. Khamosh Raat Ki Pehlu Mein Sitare Naa Hote,
    In Rookhi Aankhon mein Rangeen Najare Naa Hote,
    Hum Bhi na Karte Parwah Agar aap Itne Pyare na hote.
    Its true.....you are extraordinary arpita....keep it my friend

    ReplyDelete
    Replies
    1. Hum agar iss pyaar ke qhaabil hai tho....isse nibhaana chaahathe hai. Thank you Abhilashini

      Delete
  17. Happy New Year 2014
    Felice Anno Nuovo Duemila Quattordici
    Nootana Sanvatsara Shubhaakaanshalu
    Naye Saal ki Aagaman Shubhkaamnaayein
    Navina Varshachya Shubhechcha
    Navvo Varsesaaru Shubhaakaankshaa

    ReplyDelete
  18. మీ మది తలుపులు తెరచి అవేదనని అక్షరాలుగా గుమ్మరించినా, ఆత్మీయతని అనురాగంగా పంచినా ఆనందంగా ఆస్వాధిస్తామండి.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమానం ఉన్నతకాలం ఆవేదనని ఎన్నడూ ఎవరికీ కలిగించడమే కాదు అగుపించకుండా చిరునవ్వుతో కప్పేస్తానండి....అనికేత్ గారు.

      Delete
  19. అదెమిటి. పద్మార్పితా ..
    నీవు అక్షరాలను ఆశ్రయించమేవిటి .. అవన్నీ నీ సొత్తే అయి
    నీతోనే అల్లుకొని ఉంటె ....... అంతరాత్మతో ఆడుకునే నైజం
    ఉన్నవారు ఇలా చక్కటి ..చిక్కటి అక్షరాలతో అందరిని
    చకితులగా చేసి - చలి చెక్కిలిగింతలు పెట్టలేరు.
    "ఆశలురేపినవి మంటలమాటల జ్వాలలే కానీ
    నలిగిన మదిని నిర్ధాక్షణ్యంగా నింధించనేలేదు"
    ఈ భావాలు చాలవా ... మీ రచనా సాహిత్యాన్ని చూసి
    నీ అక్షరాలే నిన్ను ఈర్షగా చూడ్డానికి .....
    నీ ఈ కవితలు చదువుతున్నప్పుడు " ఆకలుండదు - దాహముండదు "
    అన్న పాట ఎన్నో సార్లు గుర్తుకు వస్తూంది ...
    పోగుడుతున్నానని అంటావు .. అలా కాదు ....
    " నీ కార్య దీక్షత - 'జబర్దస్తీ '
    ఏ మాత్రం అవసరం లేదు దానికి - 'గస్తీ '
    చెడు వినడం , చెప్పడం అని ఎవరన్నా ..వారికి - 'స్వస్తి '
    మత్తెక్కిచ్చే మాటలు మాత్రం - 'మస్తీ '
    దానికి తోడుగా పంచే నీ కవితా చాతుర్యం మరెంతో - 'జాస్తి'
    - శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ఇదేమిటి శ్రీపాదగారూ.....
      ఏదో అక్షరాలని అమ్మా అయ్యా అని బ్రతిమిలాడి ఆశ్రయిస్తే మీరు నాకు పోటీగా ఇలా పద ప్రాసలతో కొనియాడి పోటీకి రావడం తగునా? :-) ఇలా అయితే నేను పదాల ప్రాసకై మిమ్మల్ని ప్రాధేయపడాలేమో :-)

      Delete
  20. నూతన సంవత్సరంలో కవిత కోసం చూస్తున్నాను

    ReplyDelete
    Replies
    1. ఆలోచిస్తున్నా ఆకాంక్ష

      Delete
  21. wish you a happy new year. expected a new poem from you.

    ReplyDelete
  22. స్వయం విమర్శనాత్మక సముదాయింపు...

    ReplyDelete
    Replies
    1. కొన్ని స్వయంకృతాపరాధాలన్న సంశయంలో అప్పుడప్పుడూ తప్పదు కదండీ :-)

      Delete
  23. అనంతమానస చదరంగపు పావునైయ్యా కానీ
    కుఎత్తులతో ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
    ఆవేశాన్ని అణచి పదాలకి పదునుపెట్టానే కానీ
    సూటిపోటి మాటలతో ఎదలని గాయపరచలేదు

    అలసినా సొలసినా అక్షారాలని ఆశ్రయించా కానీ
    కసి తీర్చుకోమంటూ కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
    ఆవేదన అంతా అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
    సడలిన సత్తువతో సంస్కారం ఎన్నడూ వీడలేదు....Naa gundello Aksharalanu Pekilinchi marI rasinattu Vundi .... enta bagudo Matallo cheppaleenu... Hart Touching

    ReplyDelete
    Replies
    1. గుండెలయ వేదనలన్నీ ఒకేరాగంలో వినిపిస్తాయి కామోసు.

      Delete
  24. మది తలుపులు తెరిస్తే అన్నీ తలపులే కదా పద్మగారు. ఆ తలపులు తీపి గుర్తులా, చేదు జ్ఞాపకాలా అనేది కాలం నిర్ణయించేసి... గాయం చేసో, మధురం చిలికో వెళ్లిపోతుంది. వాటి వెనుకే గుండెచప్పుళ్లొకటి.. క్షణక్షణం బతుకు విలువ గుర్తుచేస్తూ... కాలంతో పాటూ సాగిపొమ్మంటూ. ఎప్పటిలాగే ఈ కవితలోనూ... మనసుకి మనసే సాంత్వన అని చెప్పకనే చెప్పారు. వేదన కూడా మీ కవితల్లో లొంగిపోతుంది.. ఎందుకంటారు...

    ReplyDelete
    Replies
    1. కాలమే నిర్ణయిస్తుందని వేదనకి వ్యధ చెందకుండా ఉండలేం కదండీ.....అయినా మనం ఏదో ఉంది ఏదో జరుగుతుంది అనుకుని పంజరంలో బంధీగా ఉండేకన్నా ఎదురీది సాగిపోవడం మిన్న కదా.... వేదన కూడా పద్మార్పిత ఫ్రెంఢ్ కదండీ :-)

      Delete
  25. నీకు నూతన సంవత్సరశుభాకాంక్షలు. అర్పితా రెండురోజుల నుండి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నీవు కొత్త కవితతో అలరిస్తావని. కుసలమేనా?

    ReplyDelete
    Replies
    1. కుసలమేనండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాయనా వద్దా అన్న మీమాంసలో కొట్టు మిట్టాడుతున్నా అందుకే ఆలస్యం _/\_

      Delete
  26. మీ మదితలుపులు తెరచి ఇలా అక్షరబాణాలతో సంధిస్తే ఏం తర్కించను.

    ReplyDelete
    Replies
    1. తర్కించే ఆస్కారం ఇవ్వకూడదనే తర్కంగారు ఈ ప్రయాస :-)

      Delete
  27. Happy New Year!!

    ReplyDelete
    Replies
    1. Thank you and wish you the same. Hope everything is fine Anu.

      Delete
  28. చక్కని కవిత రాసి మా మనసులను దోచుకున్నారు పద్మార్పిత గారు ..చాలా బాగుంది ....

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  29. కొందరు ఆడిన
    చదరంగపు పావునైయ్యా కానీ
    ఎత్తులు పై ఎత్తులతో
    ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
    నాలో నేను నలిగిన క్షనాల్లో తప్ప
    ఆవేశాన్ని అణచి పదాలకి
    పదునుపెట్టీ ఏదో రాయలనుకున్నాను
    అది నన్ను నేను
    ఒదార్చుకోవడానికే
    సూటిపోటి మాటలతో
    ఎదలని గాయపరచాలని లేదు ..

    ఆమాటలన్న వాళ్ళు బానే ఉన్నారు
    పడ్ద నేను తప్ప ఎందుకిలా

    అని నేను అడుగను .. అడుగలేను
    అర్హత లేదని తెలిసిన క్షనాలివి

    అలసినా సొలసి
    నిరాశ పడిన మనస్సుతో
    అక్షారాలని ఆశ్రయించా కానీ
    ఆవేదనను కాస్త
    చల్లార్చుకుందామనే
    కసి తీర్చుకోమంటూ
    కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
    అయిన కోందరికి నేనో పావు నయ్య
    అవకాసం దొరికినప్పుడల్లా
    ఆడుకుంటూనే ఉన్నారు
    ఆవేదన అంతా
    అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
    సడలిన సత్తువతో సంస్కారం
    ఎన్నడూ వీడలేదు..
    నేనెప్పుడూ మారలేదు
    మారను కుడా
    అవకాశవదిని కాదు
    నీవెప్పుడూ
    వుండాలని కోరుకునే వాడీని తప్ప

    Note :- ఫద్మాగారు మీ కవిత స్పూర్తితో మీ పదాలకు పరికొన్ని పదాలు చేర్చి నా మనస్సులోని నివేదనను ఇలా వెల్లడించాను

    ReplyDelete
    Replies
    1. మీదైన పంధాలో బాగుందండి మీ కవిత.

      Delete
  30. మీ కవిత చాలా బాగుంది పద్మ గారు..

    ReplyDelete
    Replies
    1. మెహదీగారు థ్యాంక్యూ వెరీమచ్

      Delete
  31. your self analysis endariko margadarsakam. Good poetry arpita

    ReplyDelete