వ్యధావేదన

కంటపడకుండా బాధను మునిపంటితో నొక్కి
ముసినవ్వుతో ఎదను పిండే వ్యధను దాచేస్తే
ఎగశ్వాసలో ఎగసి పడింది మదిలోతుల సెగ
ముఖం మారింది నవ్వుని ముసుగ్గా కప్పేసి!
వ్యధనణచిన పలుకులు కంటికి తడిగా తగిలి
తనువు తడిసి ఆనందాన్ని అప్పు అడగబోతే 
సంతోషపు స్థిరాస్తుల దస్తావేజులు అడిగింది
లేదన్నానని ముఖం పైనే తలుపేసింది కసిరేసి!

తడారిన గొంతుతో నర్తించమంటూ నవ్వుని కోరి
అలుసైపోయాను తోడురానన్న కన్నీటి ధారకు
గాయమైన గుండెలో రగిలిన సానుభూతి పొగ
ఆరకుండానే తలపు పరిహసించె మరో గాటుచేసి!
దుఃఖం అలవాటైపోయి సంతోషం చుట్టంగా మారి
నవ్వినా ఏడ్చినా కన్నీరు పెట్టని కరగని శిలనైతే
ఆశావాదంతో ముందుకు సాగడానికేం మిగిలింది
నమ్మకమే తియ్యని విషమై కాటేసింది మాటువేసి!

59 comments:

  1. ఈ అమ్మాయి వేదనలో కూడా అందం ఉంది

    ReplyDelete
    Replies
    1. ఓహో కళారాధకులన్నమాట :-)

      Delete
  2. అలా చదువుతూ ఉండిపోయా...ప్రతీ లైను లోనూ అంతులేని వేదన దాగుంది.
    unable to express my feeling in words....
    ఇంతటి వ్యధను ఏ మనసూ తట్టుకోలేదు....ఎంత అలవాటు చేసుకుందామన్నా

    ReplyDelete
    Replies
    1. మీరు చాలా సున్నిత మనస్కులు.....ఇలా అయితే కష్టమే :-)

      Delete
  3. If the fellow has a heart, who made your heart to hurt will be smashed with these words.. Madam

    ReplyDelete
    Replies
    1. Don't curse.....no more hard feelings :-)

      Delete
  4. ముసురుతూ వెంటపడుతున్న దుఃఖాన్ని ఎదురుపదనివ్వక మదిలో భావాలని అణిచివేసే క్రమం లో
    నిండు హృదయపు కుండ చిల్లు పడిపోయి రుధిరాన్ని తననుండి కళ్ళకు స్థానంతరణ గావించి
    నిరాశావాదానికి నిర్వచనమివ్వాలని సతమతమయ్యే గుండె లయల మాటున దాగిన బాదతాప్త సాగరాన్ని
    చేతులతో మూయడం కంటే చేతలతో తరిమికొట్టడం సులువేమో
    జీవితం మనల్ని ఆశావాదానికి దూరం చేసిన జీవిత పాఠం లో నేర్చిన నీతి నుండి ఆశావాదాన్ని ఆలింగనం చేసుకుంటుంది

    ఆరుబయట కుండపోతగా ధారాపాతంగా ఆగని మేఘావృష్టి ని ఆశావాదం తో చూస్తె ఇంద్రధనుస్సు కనిపిస్తుంది నిరాశావాదం తో చూస్తె పిడుగులు ఉరుములు అశనిపాతాలు కనిపిస్తాయి కాని వర్షం అదే, అలానే మనసు ని అర్ధం ఆశావాదమె నీ మోము ఎదుట తలుపుతట్టి చిరునవ్వుగ మిగులుతుంది

    ReplyDelete
    Replies
    1. బాబూ శ్రేధర్ గారూ కవితకు వ్యాఖ్య సునిశితంగా సూక్ష్మంగా వుంటే బాగుంటుంది. మీ ఆవేశాన్నంతా చోటు దొరికింది కదా అని కక్కేయడం ఎందుకు..

      Delete
    2. అనానిమస్ గారు, కవితల బ్లాగ్ లో వ్యాఖ్యానించటం అంటే కవితనంత చదివిన తరువాత మనసుకు కలిగే భావాన్ని వ్యక్తపరచడమే, అంతే గాని పైపైన చదివి బాగుంది అనడం నాకు చేత కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదే చేస్తారు చేస్తున్నారు. మేము పద్మగారి శ్రేయోభిలాషులం. గుడికి వెళ్తాము హుండీ ఉంటుంది .. ఒక భక్తుడు 116 సమర్పించుకుంటే ఒక భక్తుడు కోటి నొక్క రూపాయి సమర్పించుకుంటాడు. అంటే అక్కడ భక్తీ లేక కాదు, ఎవరికీ ఎలా తోచితే అంత , అంతే గాని ఇంతే వెయ్యండని ఎక్కడ ఉండదు. మనిషి ఆలోచనపరుడు, ఆలోచన మిగిల్చే భావాన్నే నేను ఇక్కడ ప్రకటించానే తప్ప ఆవేశం కాదు. ఇక్కడ వ్యాఖ్యలు ఇచ్చే ప్రతివారి భావాన్ని నేను అర్ధం చేసుకుంట. దయచేసి మనసుని గాయపరిచే ఇటువంటి కామెంట్స్ రాయవద్దని మనవి. నా వ్యాఖ్య ఐతే మీకు పెద్దదిగా అనిపించి రాసారనుకుంటే సరే.. మరి అక్కడికేదో అందరికి వార్నింగ్ ఇస్తున్నటు మళ్ళి ఆ కిందన రాయటం మీది ఎంత ఇర్ష్య తో నిండిన కళ్ళొ తెలిసిపోతుంది. భావప్రకటన రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్చ్ఛ దానిని మంచికే ఉపయోగించాలే కాని చెడుకు కాదు. హరుని నుండి వరం కోరిన రక్కసులందరూ పొందిన వరాన్ని దుర్వినియోగ పరచడం వలెనే అసువులు బాసారని తెలియపరుస్తూ సెలవు తిస్కుంటున్నాను .

      Delete
    3. మన్నించాలి ఈ వాదోపవాదాల్లో........దక్షిణ తాంబూలకన్నా, అందరి అభిమానమే మెండుగా కనిపిస్తుంది Anonymous & Bukya Sridhar ji..... ఏది ఏమైనా మీరంతా నా అన్నభావం నాకు ఆనందంగా ఉందండి. thanks to all _/\_

      Delete
  5. నేను కటవే అని చెప్పాను కదా... పద్మగారు. నిస్సిగ్గుగా, సూటిగా చెప్తున్నా... ఓ వ్యధాభరిత అమ్మాయి
    వేదనకు ఇంత కన్నా అక్షర రూపం... నాకు తెలిసీ ఎవరూ ఇవ్వలేరు. ఈ తరం రచయితల్లో. కానీ...
    ఆశావాదంతో ముందుకు సాగడానికి జీవితం అనే వనం మిగిలింది. ఆ వనం మృగాలు ఉండొచ్చు, అమాయక
    జీవులు ఉండొచ్చు. కంటతడంటూ లేకుంటే బాధెలా తగ్గుతుంది. కనుక.. అమృతం కన్నా కన్నీటికే
    నా ఓటు. బాధంటూ లేకపోతే సంతోషం విలువెలా తెలుస్తుంది. అందుకే వంద బాధల తర్వాత..
    సంతోషం కావాలి నాకు. మీరు ఎంచుకున్న కవితా శిల్పంలో మీ భావాల వ్యక్తీకరణ వెనుక ఎక్కడా నిరాశావాదం
    లేదు. నాకు ఆశావాదమే కనిపిస్తోంది. కావాలంటే మీ కవితని మీరే మరోసారి చదివి చూడండి. ఎగిసిపడుతున్న వేదనా కెరటాలను... తీరం తాకించి.. సంతోషాల ఇసుక తెన్నెల్లో చిరుచినుకులుగా మార్చాలని... ఆ బాలిక
    మనసు ఎలా తపన పడుతోందో.. అదే కదా.. ఆశావాదం. ఇక అక్కడ నిరాశావాదానికి తావేది. అది గతం.. ఇది
    వర్తమానం. గతం ఎప్పటికి వర్తమానాన్ని తాకనుకూడాతాకలేదు. అది ఒక శిధిల జ్ఞాపకం మాత్రమే. అబ్బో...
    చాల సోది కొట్టినట్టున్నాను.. కోపగించుకోకండే...

    ReplyDelete
    Replies
    1. బాగుంది మీ విశ్లేషణాత్మక స్పందన.

      Delete
  6. వ్యథలో వేదనలోను మీ ఆత్మస్థైర్యమే మీకు తోడు.

    ReplyDelete
    Replies
    1. నిజమే అదే మనల్ని నడిపిస్తుంది.

      Delete
  7. why should the commentators take it as the personal feeling or agony?it is only a poetic expression.

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగు చాలా బాగుంది సార్. చాలా వివరంగా..

      Delete
    2. కమనీయంగారు.....స్వాగతం, చాన్నాళ్ళకి ఇటువైపు మీరాక. Yes what you said its true. thanks for your comment Sir.

      Delete
  8. ఆమె మనసులోని ఆర్ధతకు కన్నీరు కూడా తొడురాని నిస్సహాయతన్న...
    బాగుందండీ పద్మార్పిత గారు..అవేదనకు కూడా ఇంత మంచి రూపాన్ని ఇచ్చారు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనే నాకు స్ఫూర్తి

      Delete
  9. ఎప్పటిలానే మీరు భాషకి ప్రాధాన్యమిస్తూ దానికితోడుగా కవితని నాలుగు లైన్లు చొప్పున విడగొడుతూ మంచి పనేచేశారు. ఓ శిల్పాన్ని చెక్కే పనిలో భాగంగా!! పైన ఎవరో అన్నట్లు ఇది మీ వ్యధగానే కాకుండా కేవలం ఓ కవయిత్రి కవితావేశంగా కూడా పరిగణించొచ్చు....ప్రేమ కవిత్వానికి కొంఛెం దూరం జరుగుతున్నట్లు భావించినా అన్యాపంగా అది కూడా ద్యోతకమే..అభినందనలు పద్మ గారు

    ReplyDelete
    Replies
    1. మీరు మెచ్చినట్లు రాయడం అంటే......మహానందం :-) _/\_

      Delete
  10. As usually extraordinary, unable to Express in the words:-)) Super poetry:-)) fantastic Pic:-))

    ReplyDelete
  11. U r something Special:-)) u r rocking:-))

    ReplyDelete
  12. మీ అందమైన అక్షరాల అమరికలో వేదనైనా సరే సేద తీరుతానంటుంది.

    ReplyDelete
    Replies
    1. అలా సేదతీర్చడంకన్నా ఇంకేం కావాలి

      Delete
  13. నీకింక తిరగులేదు పద్మార్పిత.......నీ పదప్రవాహంలో ప్రేమనైనా, వేదననైనా పైలాపచ్చీసు ఆడించగలవు. నీ కవితకు కమెంట్ పెట్టడం నాకో ఛాలెంజ్ అయ్యింది ఈమధ్య-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. హరినాధ్ గారు......తిరుకులేదని తగ్గించేయకండి మీ అభిమానాన్ని :-) _/\_

      Delete
  14. తలపోసినవేవీ కొనసాగకపోగా
    పరివేదన బరువు బరువుకాగా అన్న శ్రీ శ్రీ అంకితం గీతంలోని వాక్యాలు గుర్తొచ్చాయి పద్మార్పిత గారూ.. ఆవేదననైనా ఆర్తినైనా, ప్రేమనైనా మీ కలమూ కుంచె రెండూ పోటీ పడి ఆవిష్కరిస్తాయి.. కవితకు అభినందనలు అందులోని భావానికి నా సహస్పందనలు..

    ReplyDelete
    Replies
    1. ఇలా మీరు స్పందిస్తే కలమూ కుంచె రెండూ గంతులేస్తున్నాయి ఆనందంగా :-)

      Delete
  15. కవితకు వ్యాఖ్య సునిశితంగా సూక్ష్మంగా వుంటే బాగుంటుంది. మీ ఆవేశాన్నంతా చోటు దొరికింది కదా అని కక్కేయడం ఎందుకు.. ఇది అందరికీనూ..

    ReplyDelete
    Replies
    1. పోనిద్దురూ....ఎవరి అభిమానం వారిది కదండి :-)

      Delete
  16. వేదనలోను వేడుకలోను నీకు నీ అక్షరాలు భలేతోడొస్తాయి పద్మా.....నాకు కించిత్ ఈర్ష్యగా ఉంది నీపై.

    ReplyDelete
    Replies
    1. అలా ఈర్ష్య ఉంది అంటే అభిమానం దానికి పదింతలున్నట్లేకదండి :-) థ్యాంక్యు

      Delete
  17. Hello anonymous...meeru ikkada kakkadam enduko? U do that in Ur blog if u have any....we all do not need Ur suggestion....mind it.

    ReplyDelete
    Replies
    1. అనుగారు చాల థాంక్స్ అండి. మీరు ఐన భావప్రకటన లోని ఆంతర్యం గ్రహించి మమ్మల్ని కాపాడినందుకు చాల ఆనందంగా ఉంది. Thank You Anu gaaru for Supporting Us.

      Delete
  18. raajyaangaalu hakkulu avi marokari svechanu privacyni paaducheyadaaniki kaadu. mee alochana bloglo raasukondi. mee aavesam mee duppatlo terchukondi. dirikindi kada ammayi yemanadu ani ikkadenduku vaanti chesukovadam.

    ReplyDelete
  19. anoo gaaru meeru fans ayite nenu aaraadhakunni. merem ikkada vakaalta puchukonakkarledu. ee bhukya tana paandityaannanta chupinchalani try chestadeppudu. anduke atanitopatu alaa raasevarandariki ichaa.

    ReplyDelete
  20. అభిమానులం మనలో మనం పోట్లాడుకొవడానికి దీన్ని వేదిక చేసుకుంటే ఎలా ? ప్లీస్ డోంట్ రిప్లయ్ మి.

    ReplyDelete
    Replies
    1. అందరం ఒక గూటిపక్షులం.....

      Delete
  21. దినదినం మీపై పెరుగుతున్న అభిమానమేనంటారా ఇదంతా......:-)
    కవిత విషయానికి వస్తే అద్భుతం....వేదన కూడా సుఖమే కదా మీ అక్షరాలలో

    ReplyDelete
    Replies
    1. అంటే మీకు తెలియదా? :-) షుక్రియా మహీ

      Delete
  22. మనసులోని భావాలకు ముఖం వేదిక వంటిది,
    ఎంత దాచుకున్నా కనిపిస్తూనే ఉంటుంది.
    అందుకే నేనంటానూ వేదన కంటే రోదన నయమేమో...
    చక్కటి భావ ప్రకటన చేయగలరు అభినందనలు పద్మా.

    ReplyDelete
    Replies
    1. షుక్రియా మీరాజ్ జి_/\_

      Delete
  23. Tq.
    Ur great Andee....for being able to bear all this...
    That is da spirit....carryon leaving all this mess behind.

    ReplyDelete
  24. ఎవ్వరి మనసు నొొప్పించకుండా అందరి హృదయాలు తట్టేటట్టు బాగా బదుళ్లు ఇచ్చారు.
    చాలా ఓపిక.. అంతకు మించి సహనం ఉండాలి. ఎంత అభిమానమైనా.. అది మనోభావమే
    కావాలి గానీ.. వ్యక్తిగతం కాకూడదు కదా. మీ అక్షరాల్లో సొగసుకి... మీ మాటల్లో సంస్కారానికి మరో
    సారి అభినందనలు.

    ReplyDelete
  25. నమ్మకమే తియ్యని విషమై కాటేసింది మాటువేసి!

    Adbutham andi Padma garu..


    --Roopa

    ReplyDelete
    Replies
    1. భావం నచ్చినందుకు.....సంతోషమండి :-) thank you

      Delete
  26. లోతయిన భావ గర్భితం మీ కవిత .

    ReplyDelete
    Replies
    1. బహుకాల దర్శనం.....మీ స్పందనకు వందనం_/\_

      Delete
  27. జారిన మాట తిరిగి రాదు
    విరిగిన మనసు మల్లి అతకదు
    మీ భావ కవిత్వానికి అంతు లేదు

    నా చిన్ని ప్రయత్నాన్ని భరించగలరనుకున్తున్నా ...

    ReplyDelete