వందనం నా ప్రియమైన శత్రువుకు
అభివందనం ఓ ప్రియతమా నీకు...
జీవితాన్ని మరో కోణంలో చూపించి
లౌక్యాన్ని తెలిపిన నీకు ప్రణామం!!
వందనం నేను మెచ్చిన నా ధ్వేషికి
మనసుని రాతిబండగా చేసిన నీకు...
ఎత్తుకు పైఎత్తు వేసి మంచిచెడునెంచి
లోకంతీరు చూపిన నీకు నమస్కారం!!
వందనం ప్రియాతిప్రియ ప్రత్యర్ధునకు
అంతర్గతంగా కలవర పరచిన నీకు...
కయ్యానికి కాలుదువ్వి కసిని పెంచి
గెలుపేదో నేర్పిన నీకు ఇంకో సలాం!!
వందనం నేను వలచిన నా విరోధికి
నా వ్యక్తిత్వానికి అర్థమడిగిన నీకు...
అస్తిత్వానికి అసలు రంగుని అద్దించి
నన్ను నన్నుగా నిలిపిన నీకు దణ్ణం!!
నిజంగా ప్రేమించవలసినది శత్రువునే, తప్పు పట్టుకుంటాడేమోనని జాగ్రత్తగా వుంటాం, అలా వుండేందుకు సహరించినందుకు :) .భట్రాజులా పొగిడే మిత్రుని కంటే మంచివాడు...
ReplyDeletepic good
నిజమే మీరు చెప్పాక కాదంటానా కష్టేఫలేగారు. ధన్యవాదాలండి.
Deleteవిరోధిని ప్రేమించడం అంత సులభం కాదు, కానీ నీకది సాధ్యం. శభాష్ పద్మ
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteశత్రువు ఎప్పుడూ ప్రియం కాదు,
ReplyDeleteఆదమరచి ఉంటే ఇంకో దెబ్బ వేయరని గ్యారంటీ లేదు.
పద్మా నిజంగా ఎవరైనా అలాంటి వారుంటే అది వారికే తగులుతుంది
మీ మంచి మనస్సు మీకు మిగిలే ఉంటుంది.
సదా మీరు మనశ్శాంతితో ఉండుగాక.
పోయే వాళ్ళమెలాగో పోతాం...పోతూ పోతూ శత్రువుని ప్రేమిస్తే మంచిదేకదండి :-)
Deleteశత్రువుని కూడా 'కసి' తో మెచ్చిన మీకు నా వందనం....ఇది మీ వ్యక్తిత్వానికి దర్పణం.
ReplyDelete"కసి" కాదండి కూసింత ప్రేమతోనే ;-)
Deleteధ్వేషిని కూడా ప్రేమించే గుణం మహాగొప్పది, అది ఇంతందంగా చెప్పడమే కాకుండా పాటించడం మీకు చెల్లింది.
ReplyDeletePainting simply superb.
యోహంత్ థ్యాంక్యూ.
Deleteశత్రువు ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాడు...అప్రమత్తతని పెంచుతాడు.
ReplyDeleteజీవితంలో చూడని, ఇష్టం లేని కోణాన్ని చూపుతాడు.
అదృష్టవంతుడా శత్రువు.
నిజమే లోకాన్ని చూపేవాడు లౌక్యాన్ని నేర్పలేడా?..
"ద్వేషించడంలో ఓ "కసి" ఉంటుంది. మరి, అంతే కసిగా ప్రేమించండి "
వాన్ని, వాని ఉనికితో సహా జయించవచ్చు.
నీ వ్యక్తిత్వపు అర్థమడిగిన వానికి మీ అస్తిత్వాన్ని చూపించండి
మనసుని గెలిచి తననీ గెలిపించుకోండి. :)
-సత్య
అక్షరాలా పాటించే ప్రయత్నం చేస్తానండి....థ్యాంక్యూ.
Deleteవందనం... 4
ReplyDeleteప్రియమైన / మెచ్చిన / ప్రియాతి ప్రియమైన / వలచిన
శత్రువుకు / ద్వేషికి / ప్రత్యర్థునకు / విరోధికి
నీకు ... 4
చూపించి / ఎంచి / పంచి / అద్దించి
ప్రణామం / నమస్కారం / సలాం / దణ్ణం
ఇరగదీసారుగా...
చివరగా చిత్రం " అద్దిరింది " పద్మ గారూ...
కమెంట్ కొత్త పంధాలో అరిపించారుగా :-) thank you
DeleteAmazing picture with soft lines which are elaborating your heart feelings-----Nalottam, Jabalpur
ReplyDeleteNalottamji thanks for visiting my blog and for giving compliments.
Delete:-)
ReplyDelete:-)
Deleteఅందమైన కవితకు అత్యంత అందమైన చిత్రం. పద్మార్పితగారు పచ్చని ప్యెంటింగ్స్ ని నాకు వదిలేయండి ప్లీజ్.....మీ అంత బాగారాయలేను కాని ప్రయత్నమైనా చేస్తాను కదా:-)
ReplyDeleteఅలాగే అన్నీ మీవే తీసుకోండి :-)
Deleteజీవితంలో అన్నికోనాలు బయట పడేది ప్రేమ లో పడ్డాకే.. ప్రేయసి పిలుపుకోసం ఆరాట పడుతూ మానసును ఏమారుస్తున్న ఆ జ్ఞాపకాలను ఎప్పటికి అప్పుడు పేర్చుకొంటూ విడిపోతున్న క్షనాలను వేదనగా.. కలిసి పంచుకున్న అనుభూతులను ఆత్రంగా అందుకోవాలన్న ప్రయత్నంలో తెలియకుండానే ప్రేయస్.ఇని శత్రువుగా మారతాం... కల్సి ఉన్నప్పుడు తెలీదు ఇద్దరూ విడీపోయాక తెలుస్తుంది అసలు నిజం..నిజం నైజమే అంత అంతా జరిగాక సినిమాల్లో చివర్లో వచ్చే పోలీసుల్లా తీరిగ్గా వస్తుంది నిజం ఈలోగా జరగాల్సిన డెమేజ్ జరుగుతుంది.... ఇద్దరి మద్యా కావాల్సినంత గ్యాప్ ... ఇప్పుడు అవసరం అవుతాయి జ్ఞాపకాలు ... తను ఎదురుగా లేనప్పుడే కదా వాటితో పని తను నీతో నీవు తనతో పంచుకున్న జ్ఞాపకాల ఆవాహన కోసం వెంపర్లాడుతాం ..అమె ఎదురుగా ఉన్నా మాట్లాడలేని పరిస్థితి మనసు మూగబోయిన క్షనాలవి..క్షనికావేశంలో తీసుకున్న నిర్నయాల పర్యావసానం వేదనలో తడుముతున్న జ్ఞాపకాల కదలికలు
ReplyDeleteశత్రువులో కూడా ప్రియురాలిని చూస్తున్నారన్నమాట :-) బాగుందండి.
Deleteమనపై ద్వేషం...కోపం...ఉన్నవారిని సైతం ప్రేమించటం...ఇష్టపడటం..ఆచరణ సాధ్యంలో కష్టమైనా ఆ ఆలోచన మాత్రం పాజిటివ్ థింకింగ్
ReplyDeleteఏకీభవించిన మీ అభిమాన స్పందనకు థ్యాంక్యూ
DeleteWow Padmarpita. Simply Super:-)) Amazing Painting, with simple words.. virodhini kuda preminchi vandanam cheppadam neeku matrame saadhyam. Super..Niku Koti Koti Vandanaalu Padmarpita:-))
ReplyDeleteThank you
Deleteశత్రుత్వాన్ని శత్రుత్వం తో జయిస్తే శత్రువై మిగులు
ReplyDeleteమిత్రునిలా పలకరిస్తే శత్రువే మిత్రుడై మిగులు హర్ష వర్ధన సిరి నందన
శత్రుత్వం వలన అపనిందలు, శత్రుత్వం వలన లేవు లాభాలు
శత్రువైన మనిషేనని తెలిసుకో హర్ష వర్ధన సిరి నందన
శత్రువు శత్రువంటూ మిత్రునిగా మార్చేసారుకదా :-)
Deleteహమ్మయ్య...బోలడంత రిలీప్ ఉంది. లేకపోతే ఛీ పో నువ్వు నా శత్రువ్వి అంటారనుకున్నాను. ఇప్పుడు శత్రువైనా మిత్రుడైనా ఓకే కదా :-)
ReplyDeleteఏంటి మహీ ఇంత రిలీప్ నీకు కలిగించానంటే తప్పకుండా శత్రువునే
DeleteSimply superb positive attitude
ReplyDeletethanks a lot.
Deleteఆ బొమ్మలో నీళ్ళు వదులుతున్నారంటే, శత్రువుని చంపేశారేంటి? ;) అందుకేనేమో చనిపోయినవాళ్ళ గురించి చెడు చెప్పగూడదని కవిత బాగా వ్రాసారనుకుంటా ;)
ReplyDeleteఅదేంటి చాతకంగారు.....ఆ బొమ్మలో నీళ్ళువదలడమే చూసారు....కింద శత్రువు కాళ్ళు కడిగి పాదాభివందనం చేయడం గమనించలేదేం :-) thank U
Deleteశత్రువు వలన పడే బాధలను భరించి మన వ్యక్తిత్వం నిలుపుకోవటానికి చేసే ప్రయత్నంలో మనం గెలుపు కోసం శ్రమిస్తాము.లోక రీతిని తెలుసుకుంటాము.అలాంటి శత్రువును కసి గా ఐనా పొగిడి భావావేశాన్ని చాలా బాగా వ్యక్తం చేసారు
ReplyDeleteఇది మరోకోణంలో అన్నమాట :-) బాగుందండి. థ్యాంక్యూ
Deleteశత్రువు+శత్రువు=మిత్రుడు
ReplyDeletethis sort of positive thoughts you only get :-) kudoos
True formula Aniketh :-)
Deleteపద్మార్పితా.....నీ మేధశక్తి, సమయస్ఫూర్తి కూసింత దానం చేయి తల్లీ :) ఇన్నేసి ఆలోచనలు ఐడియాలూ ఎక్కడినుండి పుట్టుకోస్తాయో నీకు తెలీదు, ఉదయం నుండి ఆలోచిస్తున్నా కమెంట్ పెట్టడానికి ఒక్క వాక్యం రావడంలేదు- హరినాధ్
ReplyDeleteనేను దానం చేయడం ఏంటండి...మీ అందరి ఆశిస్సుల ఫలమే కదా ఇది.
Deleteమీ కవితలన్నిటినీ ఒక బుక్ లో పబ్లిష్ చెయ్యకూడదూ...
ReplyDeleteనిజంగా నేను రాసేవి కవితలే అంటారా అనూ? అయినా ఎందరో గొప్పవారు రాసినవే చాలామంది ఇంకా చదవలేదు, నేనెంత నా రాతలెంత?
DeleteNo plz...never say that. Evari goppatanam vaallade.
ReplyDeleteU deserve what I said.