కనువిప్పు

పొందికైన పదాలతో పద్యం అల్లినట్లేనుకుని
ప్రేమానురాగాలు పొందాలన్న అభిలాషతో
గుంబనంగా దాగిన గుజ్జనగూళ్ళను పీకివేసి
చిగురుటాగుల మధ్య దాగిన భావాలు విప్పితే
తెలిసింది...స్వార్ధానికి అందరూ బానిసలేనని
మనుషులు మమతలన్నీ మాయామిధ్యలని

కమ్మనికబుర్ల ప్రణయకావ్య కుటీరమనుకుని
కుదించుకున్న కలలని విడమరిచే ప్రయాసలో
కాయగాచిన కళ్ళలోని కోరికలని కుప్పగాపోసి
కడదేరబోతున్న కాంక్షల కోసం కాచుకునుంటే
కనువిప్పైంది...కాసులకి అందరూ దాసులేనని
కన్నీట కర్పూరమై కరిగిపోయేవే కలలసౌధాలని

శ్రావ్యమైన రాగబంధమేదో ఆలాపించాలనుకుని
విలువైన హృదయ ధ్వనితరంగ వాయిద్యాలతో
సప్తస్వరఝరోప్రేరిత భావోధ్వేగాలని అణచివేసి  
మౌనరాగమేదో గొంతు సవరించి గానమాలాపిస్తే
వినపడింది...బంధాలు అక్కరకురాని సంబరాలని
వారి అవసరాలకి వారంతా ఆత్మబంధువులేనని!!

46 comments:

 1. పద్మార్పిత గారు మీ కవితలు కొన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి .. కొన్ని ఆవేదనను కలిగిస్తాయి ... మరికొన్ని ఆలోచింపచేస్తాయి ... ఏది ఏమైనా మీ ప్రతి కవితను మనసుతో చదవాలనిపిస్తాయి

  ReplyDelete
  Replies
  1. ఆనందపరచి అభిమానాన్ని పెంచాలి కానీ ఆవేశాన్ని అక్రోశాన్ని కలిగించరాదని ఆశిస్తానండి. దన్యవాదాలు.

   Delete
 2. అర్పితమ్మా మీ అక్షరాలు అప్పుడే అల్లరిచేసి ఆటపట్టిస్తాయి అంతలోనే తలపైన మొట్టి కనువిప్పు కలిగిస్తాయి. సూపరో సూపరు.

  ReplyDelete
  Replies
  1. మొట్టి బొడిప కట్టిందని అభియోగం మోపకండి అభిమానంతో ఆస్వాధించండి

   Delete
 3. Awesome Padma. ఇంత భావోద్వేగ కవితలు వ్రాస్తే కమెంట్లు పెట్టడానికి భాష రాక చేతులు వణుకుతున్నాయి. ఇంగ్లీషులో కమెంటడాని మనసొప్పుకోవడంలేదు. ఏదేమైనా దిస్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్

  ReplyDelete
  Replies
  1. Thank you Sandya. ఎండాకాలంలో వణుకేంటి అందునా రాతలకి :-)

   Delete
 4. మరోమారు అనిపించుకున్నారు... దటీజ్ పద్మార్పిత. .. అని
  నూతన పదబంధాలతో చేసిన వినూత్న ప్రయత్నం చాలా బాగా నచ్చిందండి. రెండవ స్టాంజా కేవలం పద్మార్పితే రాయగలదని ప్రతి పదమూ ప్రతిధ్వనిస్తున్న్స్ది. , భావాలను ప్రస్పుటంగా చెప్తున్నట్లే అంతర్లీనంగా గొప్ప ఫిలాసఫీని జొప్పించడంలో మీకు మీరే సాటి... లేరెవరు మీకు పోటీ... ( పోటీ కోసం రాసేవారు కాదని తెలుసండి. )
  కిప్ రాకింగ్ మేడం... ఆరోగ్యం జాగ్రత్త...

  ReplyDelete
  Replies
  1. అభిమానంతో అలా అంటారే కానీ అనుకుంటే నాకన్నా బాగా రాసేవాళ్ళు బోలెడంత మంది ఉన్నారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్

   Delete
 5. బంధాలు బూటకాలైనా మీ పదబంధంలో అందరినీ బంధించి ఆకట్టుకునే మీ భాషాశైలికి నమోఃఅభివందనం!

  ReplyDelete
  Replies
  1. తెలుగమ్మాయిగారి స్పందనకు వందనం

   Delete
 6. ఎప్పుడు ఎవరికి ఎలా ?? ఓహో... కనులు విప్పి లోకాన్ని చూస్తేగానీ కనువిప్పు కలగదనా లేక మనసు విప్పమనా ..

  ReplyDelete
  Replies
  1. మెదడు విప్పార్చి మనసుతో ఆలోచిస్తే కనులకి కనబడుతుందేమో లోకం ట్రై చేద్దామా వినోద్ :-)

   Delete
 7. ప్రతి కవితా విలక్షణంగా అది విరహమైనా, విషాదమైనా, వేదనావేదనల సమాహారమైనా, పదహారేళ్ళ పడుచు మనసైనా, హాస్యమైనా ఏమైనా మీ కలమూ కుంచెలో ఒదిగి సేదదీరుతాయి పద్మార్పిత. ఈ కవిత నిజంగానే కనువిప్పు. అభినందనలతో.

  ReplyDelete
  Replies
  1. ఓహో! మీరు సర్టిఫికెట్ ఇచ్చారంటే పట్టా పుచ్చుకున్నట్లే పద్మార్పిత :-) థ్యాంక్యూ

   Delete
 8. మీ కవిత ఆద్యంతము చాల బాగుంది చాల విపులంగా తెలిపారు నిజంగా కనువిప్పు కొందరికి (చెడు చేసే వాళ్ళకి మరి ముఖ్యంగా) హాట్స్ ఆఫ్ పద్మగారు వెల్ సేడ్.

  నవసమాజ స్థాపనలో స్వార్థానికి లేదిక తావు
  వెన్నంటే నడిపే చిరుస్నేహమే కలికితురాయి
  మమతల మాటున అన్ని మట్టికరుచుకుపోతాయి
  ఆత్మాభిమానం స్నేహగునం ముందర మిగితావాన్ని చెల్లా చెదురు

  కనువిప్పుల కాలం ఇదే ఐన కొన్ని చెడు స్నేహాలు కొన్ని స్వార్థాలు
  ఉన్నాయి ఇప్పుడు కూడా పొంచి నవలోకానికి నాంది పలకాలి స్నేహాలు
  అవే కొత్త లోకానికి అసలు సిసలు పునాది రాళ్ళు పెరగాలి ఆప్యాయత పాళ్ళు
  ఆవేదనతో సాధించలేం మనం కృంగిపోవడం తప్ప ఆలోచనే శక్తి యుక్తి ఈ భువిపైన

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్తే కళ్ళు విశాలంగా విప్పారి లోకం తీరు వివరంగా కనబడుతుందండి. అలా చెప్పే సామర్ధ్యం మీలో మెండు. Thank you

   Delete
 9. మీ కలానికి సలాం చేసి కుంచెకు గులామునౌతున్నా.....no more words padma

  ReplyDelete
  Replies
  1. ఇలా గులాముగా ఎందుకు అక్కున చేర్చుకుని అభిమానించొచ్చుగా :-) thank you dear

   Delete
 10. ప్రేమాభిమనాల్ని వలకబోసే అందమైన కల్లబొల్లి మాటల మధ్య దాగి ఉన్న ప్రేమని, నమ్మకమే జీవితమని భావించే మగువ మనసుని అందమైన అక్షరాలతో చక్కగా బంధించారు.. పద్మార్పిత గారికి అళ్ళుకుపోవడం కొత్తేం కాదులేండి.. మీ పదాలవెనుకున్న భావం అధ్బుతం:-) ఇక పిక్ అదిరింది:-)

  ReplyDelete
  Replies
  1. శృతి నువ్వు నా రాతలు చదివి నా వెన్నంటి ఉన్నట్లే అనిపించే ఆత్మీయబంధమేదో నీ స్పందనలో....థ్యాంక్యూ

   Delete
 11. దేనినైనా నిర్భయంగా సూటిగా చెప్పే మీ అక్షరాల వాడి మనసుని హత్తుకుంటుంది.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ అనికేత్...అలా చెప్పే ప్రయత్నమే చేస్తాను

   Delete
 12. Your thoughts are ultimately blooming.....Claps_/\_ _/\_

  ReplyDelete
  Replies
  1. Thank you Mytri...Your comments are inspiring me a lot.

   Delete
 13. మీరు రాసే ప్రతి పదం సందేశాత్మకం, ప్రతి కవిత కనువిప్పు మారెందరికో

  ReplyDelete
  Replies
  1. నాతో పాటుగా మీరు ఇలా ఉన్నందుకు ఆనందం యోహంత్

   Delete
 14. పద్మార్పితా !

  నీ కవిత చదివాక బుర్ర కాస్తా మొద్దు బారిన
  మాట వాస్తవమే. అందులో అనృతం లేదు.

  అనుకోకుండా ఉరుములు , మెరుపులు.....
  అప్పుడే గాలి వాన, అంతలోనే ప్రశాంతత.
  ఏమిటీ వైపరిత్యం.

  నీ కవితలు కూడా అన్ని రసాలను జోడించికుని
  ఎన్నో విభిన్న మైన భావాలను అందిస్తున్నాయ్ పాఠకులకు,
  నీ అభిమానులకూ.

  నీ సామర్ధ్యాన్నంతా ఈ కవితలో నింపావ్.
  నీ కలం నుండి జాలు వారిన మరో గొప్ప
  రచన ఇది. హాట్స్ ఆఫ్ టు యు పద్మార్పితా .
  కవితకు తగ్గ బొమ్మనెంచుకోవడం నీ మరో ప్రత్యేకత.
  అందుకే కవితకు సరితూగే బొమ్మనతికించావ్.
  నీ ఆణిముత్యాల్లో మరో ముత్యం.

  'కనువిప్పు' గురించి కామెంట్ చేయలేని వింత స్థితి నాది.
  అంత స్తోమతను ఇంకా నేనాపాదించుకోలేదేమో అనే భయం .
  వాస్తవం కూడాను.

  గాడ్ బ్లెస్ యు పద్మార్పితా.
  కనువిప్పు కలిగించే కవితనందించినందుకు
  అభినందనలు.

  * శ్రీపాద


  ReplyDelete
  Replies

  1. శ్రీపాద సారూ....మీరే ఇలా అంటే మాబోటి వాళ్ళం ఏమనాలి :-) అయినా ఆమె రాయడం మనం చవి చించుకోవడం (ఆలో) పరిపాటేమో!

   Delete
  2. ఆకాంక్ష గారూ !
   పద్మార్పిత రచనలు చదివాక మనందరి
   పరిస్థితి ఒకటే కదా.
   భలేగా స్పందించారు మీరు.

   *శ్రీపాద

   Delete
  3. ఇలా కమెంటితే బదులేం ఇవ్వలేను రెండు చేతులు జోడించడం తప్ప _/\_

   Delete
  4. ఆకాంక్ష నీకు భయమేంటి చెప్పు. చించుకోకు(ఆలో) అభిమానించు అన్నీ అలవాటైపోతాయి :-)

   Delete
 15. తెలుగుతల్లి ముద్దుబిడ్డ పద్మార్పిత కవితామకుటంలో మరో మణి ఈ కవిత. అందుకో అభినందనలు

  ReplyDelete
  Replies
  1. మహీ థ్యాంక్యూ వెరీ మచ్

   Delete
 16. ఈ లోకంలో స్వార్ధం ఎక్కడ లేదు పద్మర్పిత గారు...ఆఖరికి తల్లీ బిడ్డల సంబంధం కూడా నేడు స్వార్ధం చుట్టే అల్లుకుపోతుంది.ఎవరి అవసరాలకు వారు ఆత్మబంధువులన్ని చెప్పకనే చెప్పరు...మనిషి మనసు మూలాలు తమ అస్తిత్వాన్ని కోల్పోకూడదని మరి ఈ స్వార్ధ గుణానికి వత్తాసు పలుకుతాయేమో..

  ReplyDelete
  Replies
  1. చాన్నాళ్ళకి ఇటువైపు రాక. మీరు చెప్పినవన్నీ నగ్నస్త్యాలండి. మీ హృదయపూర్వక స్పందనలకు నెనర్లు

   Delete
 17. స్వార్ధానికి అందరూ బానిసలేనని
  మనుషులు మమతలన్నీ మాయామిధ్యలని
  కాసులకి అందరూ దాసులేనని
  కన్నీట కర్పూరమై కరిగిపోయేవే కలలసౌధాలని
  బంధాలు అక్కరకురాని సంబరాలని
  వారి అవసరాలకి వారంతా ఆత్మబంధువులేనని
  మూడు నగ్నసత్యాలు చెప్పావు...శభాష్

  ReplyDelete
  Replies
  1. సృజనగారు...మీ స్పూర్తిదాయక స్పందనలకు ధన్యవాదాలండి.

   Delete
 18. పద్మగారు మీరు కనువిప్పు అంటూ బ్రహ్మాండంగా రాసి మా కళ్ళు బైర్లుకమ్మేలా చేస్తే భయం వేస్తుంది అందనంత ఎత్తు ఎదిగిపోయి మమ్మల్ని మరచిపోతారని.:-(

  ReplyDelete
  Replies
  1. ఆకాంక్ష పైనే చెప్పాను కదా...భయం వద్దు నేనెప్పుడూ మీలో ఒకరినే. నాకు మీ అభిమాన కొలనులో పద్మమై విరబూసి మిమ్మల్ని అహ్లాదపరచడమే ఆనందం.

   Delete
 19. జీవితాంతం వరకు తెలుసుకోలేని నిజాలు నీ కనువిప్పు కవితలోని పంక్తులు. జీవిత సారాన్ని చివరివరకు తెలుసుకోవాలనుకుంటూ ఏమీ తెలుసుకోకనే అంతమైపోయేవారు కోకొల్లల్లు. ఇంత త్వరగా కనువిప్పు కలగడం నీ భాగ్యం అవి చదివి మాకు జ్ఞానోదయం అవడం మా భాగ్యం.

  ReplyDelete
  Replies
  1. మీబోటి పెద్దల ఆశిస్సులుండగా నాకేంటి చెప్పండి. తెలియనివి చెప్పడానికి మీరంతా ఉండడం నా భాగ్యం.

   Delete
 20. కబుర్ల .... కావ్య కుటీరం .... కలలని విడమరిచే ప్రయాసలో కోరికలని కుప్పగాపోసినప్పుడు
  కనువిప్పైంది...కాసులకి అందరూ దాసులేనని, కన్నీట కర్పూరమై కరిగిపోయేవే కలలసౌధాలని

  చాలా చక్కని ఆలోచనాత్మక కవిత.
  అభినందనలు పద్మార్పిత గారు!

  ReplyDelete
  Replies
  1. మీ లాటి జ్ఞానులని ఆలోచింప చేసిన నా అక్షరాలు ధన్యం. థ్యాంక్యూ

   Delete
 21. శ్రావ్యమైన రాగబంధమేదో ఆలాపించాలనుకుని
  విలువైన హృదయ ధ్వనితరంగ వాయిద్యాలతో
  సప్తస్వరఝరోప్రేరిత భావోధ్వేగాలని అణచివేసి
  మౌనరాగమేదో గొంతు సవరించి గానమాలాపిస్తే .....> అద్బుతమైన భావన చెప్పేవిదానం అద్బుతం పద్మాగారు

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు మీ స్పందనలకు

   Delete
 22. మీరు లోకం చూసి కనువిప్పైతే మేము మీ కవితలు చదివి అయిపోతున్నాం

  ReplyDelete