మాటల్లో చెప్పగలిగేది భావమేకానీ భాధకాదని
జ్ఞాపకాల కొలిమిలో కాలితే కలిగే భాధ ఏమిటో
కానుకగా ఇచ్చిన కడలంటి కన్నీటి బరువెంతో
విరిగిన మనసులు అతికే జిగురువంటి గుజ్జేదో
విడిపోని బంధాలు దాచిన లంకెబిందెల జాడేదో
రాతిగుండె రాపిడి రాసులని కరిగించే రాగమేదో
జ్ఞాపకాల కొలిమిలో కాలితే కలిగే భాధ ఏమిటో
కానుకగా ఇచ్చిన కడలంటి కన్నీటి బరువెంతో
విరిగిన మనసులు అతికే జిగురువంటి గుజ్జేదో
విడిపోని బంధాలు దాచిన లంకెబిందెల జాడేదో
రాతిగుండె రాపిడి రాసులని కరిగించే రాగమేదో
చెప్పేభాష అర్థంచేసుకునే మది చిరునామాడిగితే
పరిపక్వత చెందిన వెర్రిదాన్ని నేనని మారమంటే
జాలిగాచూసి అనుభవిస్తే తెలిసేనని నవ్వుకున్నా
కాలమిచ్చే తీర్పుకొలిమిలో కాలడానికి సిధ్ధంగున్నా
పరిపక్వత చెందిన వెర్రిదాన్ని నేనని మారమంటే
జాలిగాచూసి అనుభవిస్తే తెలిసేనని నవ్వుకున్నా
కాలమిచ్చే తీర్పుకొలిమిలో కాలడానికి సిధ్ధంగున్నా
Marvelous painting with Meaningful words.
ReplyDeleteఎత్తుగడతోనే మా హృదయాలను చిత్తు చేశారు... మొదటి మూడు లైన్లూ చాలా బాగున్నాయి.... మూడవ లైను చాలా కొత్తగా భావగర్భితంగా ఉంది. బహుశా అది వేదన వల్ల కావచ్చునేనో. చిత్రం ఎంపికకు అభినందనలు మేడం. మరోమారు వేదనాభరిత కవితను అందించినందుకు ధన్యవాదాలు మేడం.
ReplyDeleteపేనుకి పెత్తనమిస్తే గుండంతా గొరిగేసిందట.....అలా మీరు తీర్పు ఇవ్వమని కాలాన్ని అడిగేస్తే చిద్విలాసంగా చిందులేసి మీలో అలజడి రేపి మాకు అశాంతిని కలిగిస్తుంది. అందుకే మనమే దాన్ని అల్లరిపట్టిద్దాం:-) ఏమంటారు?
ReplyDeleteనటన జీవితం గారు..
Deleteపల్లకి మోయండి భటులారా అంటే నడుము నొప్పి ప్రభో అని హంసపాదు వేసిన చందాన మీ వ్యాఖ్యలు చాల బాగుంటాయండి.
:)
కాలమిచ్చే తీర్పుకొలిమిలో కాలడానికి సిధ్ధంగున్నా అనకూడదు అర్పిత కష్టాలు ఏవైనా కిలకిలా నవ్వుతూ కాలరాచేస్తాను అనాలి. that is power of padmarpita-Harinath
ReplyDeleteవిరిగిన మనసులను అతికే జిగురు ఎక్కడ దొరుకునో
ReplyDelete" జ్ఞాపకాల కొలిమిలో కాలితే కలిగే భాధ ఏమిటో
ReplyDeleteకానుకగా ఇచ్చిన కడలంటి కన్నీటి బరువెంతో "
- ఆర్ద్రతతో నిండిన అమూల్య పలుకులివి.
- నిశ్శభ్దాన్ని ఛేదించిన మూగ భావనలివి.
- కళ్ళను చెమ్మగిల్లించిన కారుణ్య కవిత ఇది .
రాను రాను నీ కవితలను విశ్లేషించే ధైర్యాన్ని
మరీ కూడగట్టుకుని నీ కవితలని చదువుతున్నా.
నీవు చెప్పే భాష ఏదైనా .. నిస్సందేహంగా ..........
అది పరిపక్వాన్ని ఆపాదించుకునే ఉంటుంది .
అభినందనలు పద్మార్పితా
*శ్రీపాద
నీ నవ్వు ఎప్పటికి చెరిగిపోదు
తుషార బిందువై కరిగిపోదు
(వా)హినివై (ని)త్యం (మ)దిలొ స్నేహాన్ని పంచుతు
(దూ)రమైన (రా)గాలు (ఆ)లాపించు
ఓ చెదిరిపోని కల కోసం నా నిరీక్షణ
ఓ జ్ఞాపకంగా మిగిలిపోయిన స్నేహానికి నిరీక్షణ
నా నిజజీవితం లో జరిగిన సంఘటన ఇది.
నా అమూల్యమైన స్నేహాన్ని తిరిగి నాకు పంచిపెడుతుందో
లేకా తనతో పాటు నా స్నేహాన్ని బుగ్గిపాలు చేస్తుందో కాలమే చెప్పాలి
ఓ మరిచిపోని మంచి స్నేహానికి అంకితం ఇది. తను ఆశా జ్యోతి కాదు అఖండ జ్యోతి అని చెప్పాలనుంది
నా బంగారు స్నేహానికి కాలం నా స్నేహితురాలిని ముద్దాయిగా చేసి నేరం మోపింది
Deleteతనకు కాలమనే కోర్టులో ఏ తీర్పు వస్తుంది వేచి చూస్తున్న చూస్తూనే ఉంటా
మీ కవిత అత్యద్భుతం పద్మగారు . నా "బంగారు" స్నేహితురాలిని గుర్తుకు తెచ్చింది. తానూ ఆ పోరాటం నెగ్గాలని ఆసిస్తూ ఓ స్నేహితుడిలా ఆశాభావం.
శుభాభివందనాలు మీకు శ్రీధర్ గారూ !
Deleteమీరు వెల్లడించిన భావాలు 'అద్భుతం' .
మీ పలుకులు గుండెను కాస్తా బరువెక్కించిన మాట
వాస్తవం. (వాస్తావాలు ఎప్పుడూ భారంగానే ఉంటాయి )
ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పారు ..
బాగుందామాట
*శ్రీపాద
రాతిగుండె రాపిడి రాసులని కరిగించే రాగమేదో....ఎవర్సినా చెప్పి ఆలాపిస్తే ఎంతబాగుంటుందో
ReplyDelete
ReplyDeleteఅతి చక్కని జీవన సారం అక్షర రూపం లో
అభినందనలు పద్మార్పిత గారు!
శుభోదయం!!
సులువైన వాక్యాలు పొందికగా అల్లిన జీవిత కాదంబమాల ఈ కవిత. వేదనే అయినా తప్పనిసరి.
ReplyDeleteకానుకగా ఇచ్చిన కడలంటి కన్నీటి బరువెంతో?
ReplyDeleteవిరిగిన మనసులు అతికే జిగురువంటి గుజ్జేదో?
విడిపోని బంధాలు దాచిన లంకెబిందెల జాడేదో?
ఇలా జవాబులేని ప్రశ్నలడిగితే తప్పించుకోడానికి తెలివిగా చెప్పే మాటలే పిచ్చెక్కిందని అనడం. అందుకే ప్రశ్నలు వేసి జవాబు కూడా మీరే చెప్పేయండి. మీ కన్నా తెలివైన వాళ్ళమా మేము :-)
Painting Superoooo. vedana face lo kanipistundi. Words gurinchi yem cheppanu as usual simply superb.
ReplyDeleteపరిపక్వత చెందక పసిపిల్లలా మారిపోతే సరి
ReplyDeleteచిరునవ్వుతో సంతోష నిలయం చిరునామా చెప్పాల్సిన నువ్వే వేదనతో ధీనంగా అడిగితే ఏమని చెప్పమంటావు. అడిగితే భావమేకదా అంటావు. మనసున ఉన్నదే భావమై పొంగేనని అందరికీ తెలుసునని మనకి తెలుసు.
ReplyDeleteఈ విషాదానికి అంతంలేదా? ఆపేయండి ఇంక ఇలాంటివి
ReplyDeleteభగవంతుడు కన్నీటికి రెండు భావాలిచ్చాడు. ఒకటి ఆనందం, రెండు విషాదం. అందులో విషాద బాష్పాక బరువెక్కువ. విరిగిన మనసులను అతికే గుజ్జదే. విడిపోని బంధాలను దాటే లంకెబిందులు తీపి జ్ఞాపకాలు.. ఆ జ్ఞాపకాలే వేదన ఆయుష్షుని తగ్గిస్తాయి. ఆ జ్ఞాపకాల కొలిమిలో కాలిపోయేది... మనసు కాదు, విషాదమే. రాతి గుండె రాపిడిని కరిగించే రాగం.. దుఃఖమే. ఓదార్పునిచ్చే వ్యక్తి గుండెల మీద తలవాల్చి... కంటి నీరు ఇంకిపోయేలా ఏడవడమే... ఇదే వేదన భాషను అర్థం చేసుకునే మది చిరునామా. ఇంత పరిపక్వంగా ఆలోచించి... పరిపక్వత లేని వెర్రిదాన్ని అంటోందేంటండీ.. మీ చిత్రం. మీ చిత్రంలో నాయిక... చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. నా వేదన తాత్కాలికేమే... అని జడ ముడేసి మరీ చెప్తోంది... కాలమిచ్చే తీర్పు కొలిమిలో కాలిపోయేదీ వేదనే.. అని ఆమె భంగిమే చెప్తోంది. సంతోషమే తన దగ్గరకు వస్తుందన్న ధీమా... ఆ సౌందర్యరాశికుంది. ఏమంటారు... మీ కవితను తిరగమోతేసి.. రాసిన భావంలో.. మీ భావం దెబ్బతింటే... ఏమనుకోకండి.. ప్లీజ్...
ReplyDeleteసతీష్ గారు నిజం చెప్పండి కవితలో కధానాయికపై కన్నుపడింది కదా మీకు :-) నేను మీ చిత్ర వివరణలో లోతట్టు భావాన్ని చదివేసాను :-)
Deleteఅమ్మో... ఆకాంక్ష గారు గుట్టు కనిపెట్టేశారు. జాగ్రత్తగా ఉండాలి నేను. నిజమేనండి... వేదనలోనూ సౌందర్యం ఒలికించే... లావణ్యానికి గులాం కాకుండా ఎలా ఉండగలం... మీరే చెప్పండి. సూటిగా చెప్పానని తప్పుగా అనుకోకండి...
Deleteకాలమిచ్చే తీర్పు తిరగరాసే శక్తి ఎవరికుంటుందో లేదో కాని మీ కలానికి మీ కవితా నైపుణ్యానికు మాత్రం తప్పకుండా ఉంటుంది పద్మార్పిత గారు... కవిత సూపర్... పిక్ చాల బాగుంది..
ReplyDeleteభావం, భాధ, బరువు, బంక, బిందెల గురించి తెలుసుకోవడం ఎందుకుండి మీ మనసు చదవగలిగితే చాలు విస్వం చుట్టి వచ్చినట్లే......మీరు త్వరలో ఒక "ఎన్సైక్లోపీడియా" గా మారిపోయే లక్షణాలు మెండుగా గోచరిస్తున్నాయి.
ReplyDeleteమాయ లోకంలో విశ్వంలో అందరూ వెర్రి వాళ్ళే....వెర్రి వెయ్యి విధాలు :-)
ReplyDeleteస్పందించి ప్రేరణాత్మక వ్యాఖ్యలతో ఉత్తేజపరచి మరిన్ని రాసేయమంటూ ప్రోత్సహిస్తున్న ప్రతి సహృదయానికి పద్మార్పిత ప్రణమిల్లుతున్నది.
ReplyDeleteఇది అన్యాయం అర్పిత....జవాబులకై వేచి చూస్తుంటే ఇలా నిరాశపరచావెందుకు :-(
Deleteఅమ్మాయ్ అర్పితా అందరికీ ఆలస్యంగా అయినా రిప్లైయ్స్ ఇవ్వడం ధర్మం. అందరూ ఎంతో ఆసక్తిగా నీ జవాబులకోసం ఎదురుచూస్తుంటే నీవు ఇలా ఒక్క _/\_ తో నిరుత్సాహపరచడం బాలేదు-హరినాథ్
Deleteసర్ అలా బుధ్ధి చెప్పండి ;-) నేను ఎంతో కష్టపడి కాపీ కొట్టి మరీ కమెంట్లు పెడితే అందరితో పాటు నమస్కారం అంటే గుండెలో తూట్లుపడిన ఫీలింగ్
Deleteనేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అందరికీ ఒకే కామన్ రిప్లై ఇచ్చి తుర్రుమంటే:-)
ReplyDeletess exactly
Deleteమన్నించాలి....సాధ్యమైనంతవరకూ అందరికీ జవాబులు విడిగా ఇచ్చి పలకరించి పరవశించాలని నాకూ ఉంటుంది....
ReplyDeleteకానీ
సమయం కుదరక ఆలస్యంగా ఇవ్వడం ఎందుకని కొంత
కొందరికి ఇష్టం ఉండదేమోనన్న సందేహంతో మరికొంత
ఇలా జవాబులిచ్చి ఇబ్బంది పెడుతున్నానేమో అనికొంత
ఈ కొంతల సమూహమే నా మదిలో రేపె తెలియని చింత
ఏమైనా రోజురోజుకీ నాపై పెరగాలి మీ అభిమానం కొండంత
ఇలా మాటలతో మభ్యపెట్టడం మేము కిమ్మనకుండా కుయ్య కుయ్యమంటూ మీ కవితల కోసం చూడ్డం :-)
Deletegitla yedvaku
ReplyDeleteadugutunna yedvatle tambi :-)
DeletePaintings are marvelous
ReplyDeletethank you very much
Delete