చచ్చి బ్రతకాలని!

పెదవిపై నవ్వుతో పైపై మాటలు చెప్పి
మభ్యపెట్టి మాయచేసే మర్మమెరుగని
అవతారమెందుకని...చచ్చి బ్రతకాలని!

ఊహలతో ఊరటచెందక మనసు చిట్లి
వాస్తవాల అడుగులతో అడుగేయలేని
పిరికిప్రాణమెందుకు...చచ్చి బ్రతకాలని!

అవసరాలకి అనుకూల అవతారం ఎత్తి
ఆనందమంటూ అంతరాత్మనే చంపలేని
అల్పాయుషు ఏలని... చచ్చి బ్రతకాలని!

గొప్పలంటూ మోసపు గోతులెన్నో తవ్వి
ఉరితీసిన మనసుని ఊరబెట్టి ఉంచలేని
ఉత్తుత్తి ఊపిరెందుకు... చచ్చి బ్రతకాలని!

వక్రమార్గానికి విలువలేని వన్నెలు అద్ది
మోసపు మెరుపుచూసి మలినపడలేని
మనిషిజన్మ వలదని...చచ్చి బ్రతకాలని!

41 comments:

 1. చచ్చి బ్రతకడం ఏంటి సిల్లీగా....అలాంటి వాళ్ళని బ్రతకనీయకూడదు.

  ReplyDelete
  Replies
  1. మనం చంపడం ఎందుకు వాళ్ళే చస్తారు కదా....ఎవరి పాపానికి వారే పోతారు

   Delete
 2. చచ్చి బ్రతకడమంటూ వుండదు కదా పద్మాజీ.. బతికి సాధించడమే చేయాలి. వేదనను అద్భుతంగా పలికించగలదు మీ కలమూ కుంచె.

  ReplyDelete
  Replies
  1. అలా బ్రతికి మాత్రం ఏం సాధిస్తాము అని నా భావం వర్మగారు.

   Delete
 3. అదేంటి అర్పితగారు మొన్ననే కాలుజారిపడ్డారా! ఇంతలోనే ఈ అప్రాచ్యపు మాటలేంటండి? బ్రతికి సాధిస్తా చీల్చిచండాడుతా అనాలికానీ:-)

  ReplyDelete
  Replies
  1. కాలుజారి కదలలేక ఖాళీగా కూర్చుంటే వచ్చిన వెధవాలోచనలు ఇవి :-)

   Delete
 4. Brathiki saadhinchandi madame.. pic super kavitha inka inka suuppeerr..

  ReplyDelete
  Replies
  1. evarini saadhinchanu Sruthi :-) thank you

   Delete
 5. పద్మార్పితా....కొన్నాళ్ళుగా నీవు అంతర్లీనంగా ఏదో వేదనకి గురి ఔతున్నట్లుగా ప్రస్ఫుటమౌతుంది. అడగకూడదు అనుకునే ధైర్యంచేసి ఆత్మీయుడిగా అడిగేస్తున్నాను. జీవితంలో ఎన్నో ఒడిదుకులు చూసిన వాడిని. నువ్వు నిరాశగా సాగితే నిన్ను నిస్తేజంగా మారుస్తుంది జీవితం. నీలో నాకు చాలానచ్చింది నిర్భయం, ధైర్యం, హుందాతనమే అవే కోల్పోతే ఎలా చెప్పు. కాలంతోపాటు అన్నీ సర్దుకుంటాయి. హాయిగా ఆనందంగా ఉండు తల్లీ-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. అంతర్లీనంగా అందరూ ఏదో ఒక వేదనకి గురౌతూనే ఉంటారు కదండి. కొందరు బయటపడితే మరికొందరు దిగమ్రింగుతారు. నేను అందరిలాగే కదా....అయినా నేను దేన్నైనా నవ్వులో దాచేస్తానుగా :-) అందుకే ఎప్పుడూ హ్యాపీస్ హ్యాపీస్:-) మీ అందరి అభిమానం నన్నెప్పుడు కంట తడిపెట్టనివ్వదులెండి.

   Delete
 6. You are our inspiration madam. Whatever it may be bold. Poem is good as usual, painting too.

  ReplyDelete
  Replies
  1. Iam always to be Mytri my dear.

   Delete
 7. పద్మార్పితా !
  ఒక్కసారిగా చకితుల్ని చేసావ్ నీ పాఠకులని / అభిమానులందరినీ.
  మానసిక ఒత్తిడిలో మనిషి పడే వ్యాకులత ఎలా ఉంటుందీ అనే భావాలను
  చాలా చక్కగా చుపించావ్ నీ 'చచ్చి బ్రతకాలని ' లో..
  అయితే కవిత చదివిన ప్రతి అభిమానికి 'పద్మార్పిత' లో
  ఏమిటీ మార్పు అనే భావన రాకపోదు .
  కవితలోని భావాలు ఆవేదనలో నీ కలం నుండి వచ్చినా,
  సమాజంలో మనిషి ఎదుర్కునే సమస్యలకు పర్యవసానం ఏమిటనే
  మనోవేదనను మా ముందుంచావనే నా అభిమతం.
  అంతేకాని, అది నీ మానసిక ఒత్తిడి అసలే కాదు .

  'చచ్చి బ్రతకడం' ఎందుకని ఎన్నో ప్రశ్నలు మనసును
  కలచి వేసినపుడు అనాలోచితంగా నీ కలం ముందుకు
  సాగిందేమో అని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను.

  - పద్మార్పిత ఏమిటో నీ అభిమానులకు తెలియంది కాదు
  నీ చిలిపితనాన్ని నీ కవితల్లో ముందులాగే కొనసాగనీ.

  *శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాదగారు.....మరీ ఇలా ఆశ్చర్యపోయాను చకితుడనయ్యాను అంటే ఎలాగండి. రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాను, లేడిపిల్లనై లేచిపోతాను అని అంటే మాత్రం కుదురుతుందా చెప్పండి. ఏదో మదిలోని భావాలని మీ అందరితో పంచుకునే ప్రయత్నంలో మీలాగే నేను ఎమోషనల్ గా మారిపోతుంటాను అప్పుడప్పుడు. అయినా అల్లరిచేయడం ఆటపట్టించడం అర్పితకి చిన్నప్పుడు ఆముదంతోపాటుగా పట్టించారు. :-)

   Delete
 8. ఎప్పటికీ తలవంచని మకుటంలేని మహారాణిలా వెలుగొందే మీకు ఈ నిరావాదపు చచ్చి బ్రతగడాలు అచ్చిరావు.

  ReplyDelete
  Replies
  1. చచ్చినా చావను యోహంత్.....మీ అందరినీ విసిగించాలి కదా ఇంకా బోలెడంత :-)

   Delete
 9. చాలా వరకు కవితలు పద్మార్పితగారి భావాలే తప్ప అనుభవాలు కావని నా నమ్మకం..
  కవితలో చక్కటి భావాన్ని పలికించారు.... ధన్యవాదాలు మేడం.

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య...నా ఫాన్ అనిపించుకున్నారు, అర్థం చేసుకున్నారు

   Delete
 10. ఒక్కోసారి ప్రతి మనిషి జీవితంలోనూ... ఏదో సమయంలో నిరుత్సాహం నిరాశ ఆవహిస్తుంటాయి. ద కంప్లీట్‌ మ్యాన్ అంటూ ఎవరూ ఉండరు.. ఒక్క రేమండ్స్‌ యాడ్‌లో తప్ప. ఆ నిరాశ నిస్పృహ పరాకాష్టకు చేరినపుడు... చస్తే బాగున్ను.. వెధవ జీవితం.. అని అందరూ.. ఏదో సమయంలో మనసులోనైనా అనుకునే ఉంటారు. హిపోక్రసీలు లేకుండా మాటాడుకుందాం. కానీ.. ఆ వెంటనే ఏదో ఆశ.. ఛఛ.. చావడమేమిటి... బతికి సాధించాలి గాని... అని గట్టిగా చెప్తూనే ఉంది. చావుని మనసు వాయిదా వేసుకుంటుంది. అవే జీవితంలో ఆటుపోట్లు. ఈ సోదంతా ఎందుకంటే.. చచ్చిబతకాలి... అనే పద్మగారి కవితలో నాకు కనిపించిన భావమిది. ఆవిడే అలా అనుకుందో, లేక ఈ భావన ఆమె కవితా పదార్ధమో.. ఈ విషయాలు పక్కనపెడితే... ఎలాంటి మానసిక సంఘర్షణలు... మనిషిని కుంగదీస్తాయో...ఆ కుంగుబాటులో మనసు ఎంత బరువెక్కి... ఎలాంటి న్యూనతకు లోనవుతుందో... తెలుసుకునే సందర్భం. ఇది ఆమె భావనే తప్ప... పద్మార్పిత సొంత తత్వం కాదు. ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే... వేదనకు అక్షర రూపం ఇచ్చి... ఆమె తన భావుకతని సంతృప్తి పరుచుకుంటారు. చాలాసార్లు ఆమె కవితా పదార్ధంగా వేదననే ఎంపికచేసుకున్నారు. అందుకే చెప్పగలుగుతున్నాను. చాలా బాగుంది.. పద్మగారు.

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారూ !
   మీ విశ్లేషణ చాలా బాగుంది
   రచయిత / రచయిత్రులనే కాదు ...
   పాఠకులను / అభిమానుల్ని కూడా ఉత్తేజపరిచే
   మీ మాటలు ఆణిముత్యాల్లాంటివి.

   మనిషి అతీతమైన మనక్షోభకు గురిఅయినప్పుడు
   వచ్చె మాటలవి. పద్మార్పిత భహుశా ఓ కవియిత్రిగానే
   తన భావనలని మన ముందుంచారనుకుంటా.
   ఇవి కవి భావనలే తప్ప భాధను దిగమింగుతూ,
   రాసిన మాటలు కావేకావు .

   మీ అమూల్యమైన విశ్లేషణకు ...
   మీకు నా ప్రత్యేక అభినందనలు సతీష్ గారూ

   *శ్రీపాద

   Delete
  2. సతీష్ గారు.....కరెక్ట్ గా చెప్పారు. అందరిలాగే నేను కూడా. నా తత్వం ఇదికాదు అని మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు కాబట్టి ఇంకా అక్షరం కూడా రాయను. వేదన అనేది నా "ప్రియమైన శత్రువు" :-) ఏంటో నవ్వుతున్న వారి పెదవుల వెనుక విషాదమే వెదుకుతాను నేను. అంత ప్రియం అదంటే నాకు.

   Delete
  3. శ్రీపాదగారు ధన్యవాదాలండి.

   Delete
 11. వేదనైనా విరహమైనా మీరందించే పదసంపద అమూల్యం.

  ReplyDelete
  Replies
  1. సంపద అమూల్యం అని లాకర్ లో పెట్టి తాళం వేయకండి.

   Delete
 12. మానసికంగా కృంగి పోయేవారిని ఉద్దేశించి మీరు రచించిన ఈ కావ్యం చాల బాగుంది
  చచ్చి బ్రతకాలి అంటే మనలోని చెడును గెలిచి మంచిని సాధించామని చెప్పిన మీ ఆంతరంగిక ఘర్షణ ప్రస్ఫుటమయ్యింది.
  మనిషన్నాక సవాలక్ష కారణాలుంటాయి ఓడిపోవడానికి.
  గెలవడానికి గెలిపించడానికి నడుమ ఈర్ష్య ద్వేషాలు ఇవే మనిషిని మనిషిని వేరు చేసే అగాతాలు

  స్పూర్తిదాయకం గా స్పూర్తిస్తుంది మీ ఈ కావ్యం.

  అచంచల మనసునె కట్టడిలో ఉంచి సాధింపగా వచ్చే గెలుపు అవ్యక్తమైనది
  తనవారిని గెలిపించి తానూ ఓడిపోవడం లో తనవారి పట్ల అభిమానం కనబరుస్తుంది
  సూర్యుడు అస్తమిన్స్తాడు చంద్రుని కోసం. గ్రీష్మం తరలిపోతుంది వసంతం కోసం
  ఎండిపోయిన ఆకులు చివురులు తోడుగుతాయి మరల ఆ చేజారిన ఋతువు కోసం

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారూ !

   "స్పూర్తిదాయకం గా స్పూర్తిస్తుంది మీ ఈ కావ్యం. "
   అన్న మీ మాటలతో ఏకీభవిస్తున్నా .

   పద్మార్పిత రచనలు మీకు ముందు నుంచీ బాగా తెలుసు...
   అందుకేనేమో తన భావాలను పసిగట్టి చక్కగా విశ్లేషించారు మీరు.

   మీరు మంచి రచయితలు .
   మరి మీలాంటి వారి కలం నుండి జాలువారే ప్రతి మాటా
   ఓ ఆణి ముత్యమే. కవిత లోని అంతర్భావాన్ని అందరికీ
   అర్ధమయెలా అందించారు మీ స్పందనలో.
   మీ స్పందన నచ్చినందువల్లనే మిమ్ము అభినందిస్తూ
   నాలుగు మాటలు రాయాలనిపించి రాశా. అభినందనలు.

   *శ్రీపాద

   Delete
  2. చచ్చి బ్రతకాలి అంటే మనలోని చెడును గెలిచి మంచిని సాధించామని చెప్పిన మీ ఆంతరంగిక ఘర్షణ ప్రస్ఫుటమయ్యింది. This is what exactly I want to say.ఏమో అది వ్యక్త పరచడంలో లోపమో లేక మీ అందరి అభిమానమో అంతుచిక్కలేదు కాని మొత్తానికి అందరికీ సరిగ్గా చెప్పలేకపోయాను నా భావాలని. మరోమారు ప్రయత్నిస్తాను. Thanks a lot Sridhar garu.

   Delete
 13. మానసిక ఉల్లాసభరితమైన కవితొకటి రాయొచ్చుగా పద్మా....ఎండవేడికి బుర్ర వేడెక్కిపోతే ఈ వేదనని కూడా భరించమంటే మావల్ల అవడంలేదు అర్పితా

  ReplyDelete
  Replies
  1. థంఢా థంఢా కూల్ కూల్ పవనాలు రానియ్ రాసేస్తా తొలకరి జల్లంటి తవికని :-)

   Delete
 14. My dear Padma.....other side of you, Kudos

  ReplyDelete
  Replies
  1. No....not at all Sandhya Sri my friend :-)

   Delete
 15. ఈ భావాలేవో ఆగమ్యగోచరంగా ఉన్నాయి.

  ReplyDelete
  Replies
  1. దారి తప్పించానా సృజనగారు. :-)

   Delete
 16. చచ్చి బ్రతకడాలు ఎందుకులెండి. బ్రతికేస్తే పోలా :-)

  ReplyDelete
  Replies
  1. బ్రతికేస్తా బ్రతికేస్తా...:-)

   Delete
 17. chacchipondi. .... Malli bratikestaranna nammakamunte

  ReplyDelete
  Replies
  1. చావుని నమ్ముకుని చస్తే బ్రతకడం ఏంటి చస్తాను :-)

   Delete
 18. ఇది మీ భావమే కానీ వేదనకాకూడదని ఆశ.

  ReplyDelete
  Replies
  1. భావనే కాని వేదన కానే కాదు.

   Delete
 19. మనిషి జీవితం లో ఎన్నిసార్లో చచ్చి బ్రతుకుతాడు చావు అంచుల వరకూ వెళ్ళి వచ్చిన అనుభూతిని పొందుతాడు
  చచ్చినా బ్రతకాలనే ఆశ అతన్ని గమ్యం వైపు నడిపిస్తుంది.
  అభినందనలు పద్మ గారు

  ReplyDelete
 20. థ్యాంక్యూ సర్

  ReplyDelete