కాలుజారింది

ఏం చెప్పను ఎలాగ చెప్పను....
ఎక్కడని చెప్పను ఏమని చెప్పను!?

లోననరాల్లో జివ్వో జివ్వుమంటుంటే
ఒళ్ళంతా ఒకటే సలపరం పెడుతుంటే
తాకగానే మంటపుట్టి బాధపెడుతుంటే
ఎలాగో చెప్తాను ఎందుకంటే ఏంచెప్పను!
ఎప్పుడు తగ్గుతుందంటే ఏమని చెప్పను?
కాలుజారిపడితే తలబొప్పికట్టిందని చెప్పనా
మోకాలు బెణికి నడవలేకున్నానని చెప్పనా
వేళ్ళు కొట్టుకుపోయి వయ్యారాలు పోతుంటే
ఎర్రగాకందిన చర్మం నిగారింపుతో మెరుస్తుంటే
వాపుతో పసిడిమేనిఛాయ మరింత నిగారిస్తుంటే
గాయాలకి మందేసి నన్నునే ఏం ఓదార్చుకోను!

నొప్పినైతే భరించగలను త్వరగా తగ్గిపొమ్మనలేను.
తగిలించుకోవడం నారాత, తగ్గడం మాత్రం విధిరాత

21 comments:

  1. Get well soon. Painting perfectly matched with poem. Take care

    ReplyDelete

  2. చేయి క్షేమమే అనిపిస్తోంది కాలు జారాక రాసిన ఈ పెద్ద టపా చదివాక !!

    జిలేబి

    ReplyDelete
  3. తెలిసిందిలే ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే కల వచ్చింది. అందుకే జాగ్రత్తగా ఉండమంది. అయినా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంది. హమ్మయ్య ....గుడ్డిలో మెల్ల, కాలుజారింది కానీ కక్కు రాలేదు:-)

    ReplyDelete
  4. అదా సంగతి... నొప్పిని కూడా ఇంత అందంగా వర్ణించవచ్చా... బాగుందండి. ఒక్కోసారి నొప్పి బాధ కల్గించినా... తగ్గుతున్నప్పుడు హాయి ఉంటుంది చూశారు. అబ్బో. జాగ్రత్తండి. టేక్ కేర్‌.

    ReplyDelete
  5. Get well soon Madam. Take care !

    ReplyDelete
  6. I Feel sorry
    Padamarpitha.

    Get well soon .....
    and await for your
    more exiting 'Kavitha'
    at the earliest.

    Take care of your self
    and recover Fast .

    With Best wishes,
    *Sripada.

    ReplyDelete
  7. నిజమా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. ధ్యాంక్ గాడ్. త్వరగా కోలుకోండి.

    ReplyDelete
  8. Padmaa take care of your health. Healthy early recovery my dear friend.

    ReplyDelete
  9. GET WELL SOON MADAM
    -Pavankumar
    Ramanamurthy
    Samuel john
    Purushottam

    ReplyDelete
  10. getwell soon madam take care

    ReplyDelete
  11. Get well soon Arpita ji ..apna khayal rakhyegaa...

    ReplyDelete
  12. How you are madam. early recovery.

    ReplyDelete
  13. ఏంటేంటి...పద్మార్పిత కాలుజారడం గాయాలు అవ్వడం ప్చ్ ప్చ్ ప్చ్ :-( రెండ్రోజుల్లో మటుమాయం వాటికంత ధైర్యమా చెప్పండి.

    ReplyDelete
  14. మేడంగారు జాగ్రత్తగా అడుగేయండి. వారంపాటు విశ్రాంతి తీసుకోండి.

    ReplyDelete
  15. హాస్యకవిత అనుకుని సంబరపడ్డాను. మీరేంటి ఇలా పడ్డమేంటి. జాగ్రత్తగా ఉండండి

    ReplyDelete
  16. యింత బాధనూ కవిత చేసి పంచుకునే మీ ఆత్మస్థైర్యం ఎన్నడూ కొనియాడదగింది. త్వరగా కోలుకోవాలని జింకలా ఈ బ్లాగు వనంలో గంతులేయాలని ఆశిస్తూ.. చిత్రం చూస్తుంటే వేదనగా వుంది. సారీ..

    ReplyDelete
  17. చూసి అడుగెయ్యి తల్లీ......జాగ్రత్త-హరినాథ్

    ReplyDelete
  18. మీ అందరి అభిమాన ఆశ్శీస్సులతో
    ఆయురారోగ్య ఆనందాలతో జీవిస్తూ
    మీలో ఒకదాన్నై మెలిగే అవకాశాన్ని
    ఇస్తున్న ప్రతి ఒక్కరికీ- ప్రణమిల్లుతూ
    _/\_...పద్మార్పిత

    ReplyDelete
  19. కాలుజారింది అన్న వార్త తెలిసి హడలి పోయాను
    నరాలు జివ్వున లాగితే నూనే తో లేపనం పూయండి
    కాలుకు కట్టుగట్టి డైక్లొఫేనాక్ జెల్ పూయండి
    తలకు బొప్పికడితే ఆముదం నూనేను మర్దన చేయండి
    మోకాలు బెణికితే గడ్డిపువ్వాకు పసరు పూయండి
    ముప్పూటలా మరువక మందులవేసుకోండి
    మానని గాయానికి మందులతోనే కాదు పది మందికి చెప్పడం కూడా మంచిదే.
    మీరు త్వరగా కోలుకొవాలని ఆశిస్తూ..

    ReplyDelete
  20. ఏ సంఘటననైనా సాధారణం గా తీసుకోగలగడం
    గాయాన్నీ గేయం గా మలిచి
    పదీకరించగలగడం
    అభినందనీయం!

    ReplyDelete