కుజుడికి ఏమెరుక మేకవన్నె పులుల మర్మమేంటో
మనిషి మనసులోని భావసంఘర్షణల అలజడెంతో!
శుక్రుడు ఎరుగడు మనిషి మనుగడల మోక్షమేంటో
ఎక్కే తెల్లగుర్రానికి తెలీదు మానవకోర్కెల రెక్కలెన్నో!
బుధుడి బుధ్ధికి చిక్కని మనుషుల చాకచక్యమేంటో
కోటి ఉపాయాల ముందు సింహం జులిపేటి జూలెంతో!
సూర్యుడి కిరణాల ధాటికెక్కదు మనమేధాశక్తి ఏంటో
ఏడుగుర్రాల రధమెంచలేదు మాటల గారడి వాడెంతో!
చంద్రుడే తెల్లబోయే మాయకందని మానవయుక్తేంటో
లేడి ఎరుగదు వేగంగా మార్చేసే బాసల సంఖ్యలెన్నో!
గురుడుఎంచలేడు గోప్యమైన మనసులోని మాటేంటో
ఏనుగు కానలేదు మనిషి ఆలోచనల మూలాస్త్రమేదో!
రాహువెరుగడు రంగుమారిన రూపు రహస్యమేంటో
పులిపంజాకు చిక్కని మనిషిలోని నైతిక విలువెంతో!
కేతువు కేకకి అందని ఈ కుళ్ళుకుతంత్రాల కేళేంటో
సర్పమే చిన్నబోయె తెలియక రాగధ్వేషాల నిలవెంతో!
శనికి కూడా అంతుపట్టలేదు మనిషి సారాంశమేంటో
కాకి నల్లముసుగులో వెతకసాగే మనలో నిర్మలమేదో!
నవగ్రహాలనే నివ్వెరపరచే మానవజన్మ కారణమేంటో
తెలుసుకునే లోపే తనువు చాలిస్తున్న బ్రతుకులెన్నో!
(నవగ్రహాలు వాటి జంతుగణం పై ఈ చిన్ని ప్రయత్నాన్ని మెచ్చుతారన్న ఆశతో మీ ముందు
"మనజన్మ".....పద్మార్పిత)
Great Padma Dear. Good Job. Keep it up.
ReplyDeleteThank you Sandya Sri
Deleteఎక్కడిదండీ మీలో ఈ జ్ఞానసంపద. అమోఘమైన విశ్లేషణతో అందంగా అలరించారు కవితని. చిత్రం అర్థం చేసుకోవడం కాస్త కష్టతరమే.
ReplyDeleteజ్ఞానం కన్నా గూగులమ్మ దయ ఎక్కువేమో :-) చిత్రం కాస్త భిన్నంగా ఉన్నా దీనికి సరైనదన్న భావాంతో పెట్టాల్సి వచ్చిందండి.
Deleteమనిషిలో అన్నీ చెడుగుణాలేనా పద్మా మంచితనం కూడా ఉందని చెప్తే మీ సొమ్మేం పోతుంది.
ReplyDeleteనా మాటకూడా మీరే అడిగేసారు రాంజీ.. థాంక్యూ...
Deleteచెడు తీసేస్తే మిగిలిందంతా మంచే కదా! తర్కించడం మానరుగా :-)
Deleteజవాబు మీకు కూడా వర్తిస్తుంది వర్మగారు:-)
Deleteచాలా బాగా చెప్పరు పద్మాగారు
ReplyDeleteథ్యాంక్సండి.
Deleteనవగ్రహాలు వాటి జంతుగణం పై పోల్చుతు మానవ స్వభావాన్ని విశ్లేషించడం అభినందనీయం ... మీ ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు పద్మార్పిత గారు....మీ శైలి అద్భుతంగా ఉంటుంది
ReplyDeleteమహదీ అలీగారు మెచ్చారంటే మహదానందం. ధన్యవాదాలండి.
Delete
ReplyDeleteనవగ్రహాల వైశిష్ట్యాన్ని అన్యాపదేశం గా మానవజన్మ మహోన్నతత కోసం నవగ్రహాల తోడ్పాటును తెలియపరుస్తూ
ఒక చక్కని ప్రయత్నం
చాలా బాగుంది
అభినందనలు పద్మార్పిత గారు!
నా ప్రయత్నాన్ని ప్రశంసగా తెలియజేసిన మీకు ధన్యవాదాలండి.
Deleteనవగ్రహాలకి జంతుగణాలున్నాయని మీ పోస్ట్ ద్వారా చెప్పి మమ్మల్ని విజ్ఞానవంతుల్ని చేసారు. ఇంక పద్యం అయితే అదిరింది మీరు ఒక అన్శం తీసుకుని రాయడంలో నిష్టార్దులు. అభినందనలు పద్మగారు
ReplyDeleteనాకు తెలిసిన దన్ని మీతో పంచుకున్నాను, అది మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి.
Deleteనా జాతకం చెప్పండి please....
ReplyDeleteవినోద్ గారి జాతకం ఎప్పుడూ "మూడుపువ్వులు ఆరు కాయలు" :-)
Deleteగ్రహాలని కూడా గింగిరాలు తిప్పించే ఘనుడు మానవుడు :-) మీరు మాత్రం ఒక మహాజ్ఞాని
ReplyDeleteమహాజ్ఞాని అని నన్ను చంద్రమండలానికి ఎత్తేసి గింగిరాలు తిప్పించారు ఆకాంక్షగారు.:-)
Deleteనవగ్రహాలపై రీసెర్చ్ చేసి రాసినట్లు ఉందండి .... చక్కటి అల్లిక... పద్మార్పిత పెద్దబాలశిక్షలో మరో మణిపూస.....
ReplyDeleteఅభిమానుల బ్లాగ్ ఈ దాడిపై ఎలా స్పంధిస్తారోనని ఎదురుచూస్తున్నాము. :-)
Deleteపెదబాలశిక్షతో పోల్చారు....అందులోని విషయ సూచికన్ని పుటలన్నా పూర్తి చేస్తానంటారా! to Padmarpita fans thank you
Deleteఇలా స్పంధించమంటూ నాపై దాడి చేయమని రెచ్చగొట్టి తమాషా చూస్తారన్న మాట...ఏదో గుట్టుగా రాదుకోనివ్వండి natana gaaru
Deleteమానవుడి మేధస్సుని గ్రహగణాలతో చక్కగా కూర్చావు పద్మ.
ReplyDeleteధన్యవాదాలండి.
Deleteగ్రహగమనం తో ముడిపెట్టిన మనిషి మేధస్సుకు తీసిపోదు ఏదైనా
ReplyDeleteనవగ్రహాలు మనశిలోని మంచిని పెంపొందిస్తాయి కాని
ఆ గ్రహాల చలనానికే బానిస కాకూడదు.
కవితలో వర్ణన బాగుంది పద్మగారు
నిజమే మీరన్నట్లు మనిషి దేనికీ బానిస కాకూడదు. ధన్యవాదాలండి.
DeleteSatish kotturigaru write and describe about above picture sir, meerundagaa naa mind stress ki girai yem aalochinchalenandi:-) help me
ReplyDeleteYes !
DeleteSatish Garu come on Sir .. we are awaiting...
హమ్మయ్య...అలా సతీష్ గారి పై భారం మోపి నన్ను రిలాక్స్ అవమన్నందుకు యమ ఆనందంగా ఉంది. సతీష్ గారు తిట్టోకోకండి నన్ను ప్లీజ్ :-)thank you akaanksha & Padmarpita fans
Deleteఇది అంతగార అర్ధం కాలేదు. నాకు తెలిసిన సులువైన పదాలు అంతగా లేవు
ReplyDeleteనవగ్రహాల పై రాసాను యోహంత్....ఇప్పటికి అర్థమై ఉంటుందనే అనుకుంటున్నాను.
Deleteఓహొ గ్రేట్ మాడం! ఇంక మాకు మాటలు లేవు. అసలు మాకు తెలియని నవగ్రహాల గురించి, మనవ జన్మ గురించి, వాటితో జంతువులకున్న లింకు గురించి అధ్బుతంగా చెప్పారు.. మీ కవితా మేదస్సుకు నమో నమహం.. ఇంక పిక్ చాలా డిఫ్రెంట్ గా ఉంది:-)
ReplyDeleteశృతి మీ ఈ అచంచల అభిమానాక్షర స్పందనలకు నమఃసుమాంజలి
Deleteనేను అప్పుడే చెప్పాను నువ్వు సరస్వతీదేవి మానస పుత్రికవని. భళ్ళారే భళ-హరినాధ్
ReplyDeleteAvunandi... You are correct !
Deleteఅక్షరాలా నిజం చెప్పారు హరినాథ్ గారూ.
Deleteసరస్వతీ దేవి పద్మార్పిత నాలుక పైనే ఏదో 'గీత'
రాసుంటుందేమో మరి. భావనలు అలా ఉప్పొంగుతాయి.
She deserves the praise.
పద్మార్పితలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిన
మీకు ధన్యవాదాలు హరినాథ్ గారూ
*శ్రీపాద
హరినాధ్ గారు చిలక జ్యోస్యం కూడా తెలుసునన్నమాట మీకు. నాకు నచ్చిందిగా మీ మెప్పు. భలే భలే:-) Thanks to Padmarpita fans & Sripadagaru
Deleteఈసారి గ్రహాలపై దాడి జరిపారు. బాగుంది, ఎప్పుడూ మీరే విజేతలు
ReplyDeleteదాడి నేను కాదండి గ్రహాలు నా పై చేసాయి. ఏదో అవి ఇవి చెప్పి తప్పించుకున్నాను.
Deleteమనజన్మ ముందు గ్రహాలన్ని బలాదూర్ అని అంటే అవన్నీ వాటి జంతుగణాలతో దాడిచేస్తాయేమో పద్మా...జాగ్రత్త. మొత్తానికి అదరగొట్టవు. కుడోస్...క్లాప్స్...కంగ్రాట్స్
ReplyDeleteఫ్రెండ్ అయి ఉండి సపోర్ట్ చేయకుండా ఇలా అదరగొట్టి బెదరగొడితే ఎలా మహీ :-)
Deleteమనిషికి గ్రహాలు వాటి జంతు వాహనాలతో జతకడుతూ వారి మానసిక వికారాన్ని చెప్పారు. వారిలో దాగిన మానసిక సౌందర్యాన్ని కూడా మరో కూర్పులో చెప్తారని ఆశిస్తూ...
ReplyDeleteవికారాన్నైతే వివరించగలం కానీ సౌందర్యాన్ని పొగడాలంటే మీవంటి కళాపిపాసకులే సరి. రాసేయండి మీరు.
DeleteSripada***శ్రీపాద17 June, 2014
ReplyDelete'హిందూ ధర్మం' అనుసారంగా కనిపించని, అజ్ఞాతమైన ఓ అద్భుత
దైవశక్తుల ప్రభావం - ఈ భువిపై ప్రాణం పోసుకున్న ప్రతీ ప్రాణిపై
ఉంటుందని ఓ నమ్మకం. ఈ ప్రభావాల సమూహాన్నే నవగ్రహాలంటారని
నా భావన. అయితే ఊహకందని భావసంపత్తిని ఈ 'నవగ్రహాలను '
వృత్తపరిధిగా మలుచుకుని అనూహ్య రీతిలో కవితనల్లి అందించిన తీరు
హర్షణీయం,గర్వంగా ఉంది కూడానూ.
నీ మేధాసంపత్తి ఏమిటో నీ కవిత 'మనజన్మ' మరో మారు రుజువు చేసింది.
నీ ప్రతి కవితా ఓ నూతన రికార్డ్ ని సృష్టించి పాత కవితలనదిగమిస్తుంది.
చాలా గొప్పగా రాశావ్ పద్మార్పితా ..
కవిత ఆసాంతం చదివాక అర్ధమయింది ....
సరైన విశ్లేషణను అందించే పరిజ్ఞానాన్ని ఇంకా ఆపాదించుకోలేదని..
అంత అవగాహన లేకనో ,లేక ఎం రాస్తే 'మాటలగారడి '
ఎలా మారుతూందోనని. లేక సమానత్వం లోపించిందో ...
ఇన్ని రకాల భయం తో సరిఅయిన 'స్పందన' ను అందించలేక పోతున్నా ....
అభినందనలు చెప్పడం తప్ప.
యు ఆర్ గ్రేట్ పద్మార్పితా .
*శ్రీపాద
శ్రీపాదగారు.....మన్నించాలి చిన్నగా రాసి సరిపుచ్చుదామంటే మనసు అంగీకరించదు. మీ వ్యాఖ్య కి సమాధానం ఇవ్వడానికి వాక్యాల కోసం వెతికితే ఏ సైట్ లోనో పొందికైన పదాలే దొరకడంలేదు. నా మెదడు ఇదెక్కడి పరేషానంటూ మొద్దుబారిపోతే వేళ్ళు మాత్రం నన్ను చేతావంతురాలిని చేసి "ధన్యవాదాలు" చెప్పడం సంస్కారమంటూ ఇలా _/\_
Deleteఇప్పుడే అందిన వార్త ......గ్రహాలన్నీ గతి తప్పి గణాలతో కలిసి పద్మార్పతపై దాడిచేసి చావుతప్పి కన్నులొట్టపోయి విశ్రాంతి తీసుకుంటున్నాయని. పద్మార్పితగారు మాత్రం ఈ దాడి కేవలం గ్రహాలకి తనపై ఉన్న అభిమానాలింగనమని అభివర్ణించారు.:-)
ReplyDeleteThis is new era....I love it.
DeleteYes... It is most Beautiful way of Expressing Thoughts.
Deletenatana jeevitam.. you are SUPER. Keep it up.
*శ్రీపాద
నటనలో ఆరితేరిపోయిన జీవితం అని పేరుకి సార్ధకతనిస్తూ మీరు అంధించిన తాజా కబురుతో నేను వార్తల్లోకి ఎక్కడం ఎప్పటికీ మరువలేని ఒక అపూర్వ వరం....అది దాడి అయినా దండయాత్ర అయినా నేను మాత్రం యమ ఎంజాయ్...థ్యాంక్యూ ఉత్తేజకరమైన స్పందనలతో మనసుని అహ్లాదపరుస్తున్న మీకు_/\_
DeleteOnce again thanks to Sripadagaru and Harinathji
Deleteగ్రహాల ప్రభావాలు మనిషి జీవితంలోని స్థితిగతులపై ప్రభావాన్ని చూపిస్తాయి అంటారు . అలాగే అవి మనిషిలోని చెడు గుణాల మీద కూడా ప్రభావం చూపించి మంచిమార్గం వైపు పయనింప జేస్తే ఎంత బాగుణ్ణు? ... నవీనా భావాలపై సృజనాత్మకమైన అంశాలపై ఈ మధ్యకాలంలో మీరు దృష్టి కేంద్రీకరించడం, కొత్తదనాన్ని కోరుకోవడం... నాకు బాగా నచ్చింది. మీ కవితా ప్రవాహం ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను...
ReplyDeleteనవజీవన్ గారి విశ్లేషణాత్మక స్పూర్తి నాలో మరిన్ని కొత్త ఆలోచనలని రేకిస్తాయని వాటిని మీతో ఆనందంగా కలిసి పంచుకోవాలని ఆశిస్తూ మీకు నా అభివందనములు...
Deleteమాయావిశ్వాలకి గ్రహాలతో పనిలేదండి. ఎందుకంటే వారు మీరు చెప్పిన ఏ ఒక్క లక్షణం లేని మొద్దు ముద్దు మొహాలు :-)
ReplyDeleteనిర్భయంగా మంచి ధృక్పధాలతో చేసే ఏ పనికి ఎర అడ్డంకులూ రావండి. సాగిపొండి అలాగే.
Deleteమనజన్మకు(మానవ) ఎంతో ఘనకీర్తే ఉన్నట్లు మీరు చెప్పిన లెక్క ప్రకారము పద్మగారు. చిత్రం పై కమెంట్ చేయడానికి అర్థం కాలేదు. కవిత మాత్రం అసాంతం జ్ఞానోపదేశమే.
ReplyDeleteఅనికేత్ చిత్రం సతీష్ గారి కమెంట్ చదివితే అర్థమై ఉంటుందనుకుంటాను. థ్యాంక్యూ.
Deleteఆ చిత్రాన్ని లిఖించాలని చాలా సేపటి నుంచి మనసు నలుగుతోంది. గ్రహ గమనాలకు అందని సంక్లిష్ట మనస్తత్వం మనిషి. నెమలి కన్ను లాంటి అందమైన ఆశల జీవితం. కానీ... మనిషి మనసు పొరలు తీస్తే... ఆ కలలు కన్నా కల్లోలాలే ఎక్కువ. గ్రహాలకు మోసం తెలీదు.. అందుకే మనిషి మోసాన్ని గ్రహించలేవు. ఏ గ్రహశాంతికి లొంగని మనసది, ఏ గ్రహగతులకు అంతుచిక్కని ఆలోచనలవి. ఎన్ని శాంతులు చేసినా... మనిషి చూపు... అగాధంలాంటి ఆశవైపే. నెరవేరితే ఆనందం... ఓడిపోతే నైరాశ్యం... ఆ మూడో చేయి సంకేతమదేనా...? మధ్యలో మోసానికి, నయవంచనకు.. లోకం చూడక ముందే.. చేతిరేఖలు విచ్చుకోక ముందే... మృత్యుగ్రహం చేరే అభాగ్యులెందరో. ఇదేనా పద్మగారు.. మీరు చెప్పాలనుకున్నది...
ReplyDeleteసతీష్ గారు.....చూసారా మీరే మాకు పద్మార్పిత చిత్రాల గురించి చెప్పే గురువుగారు. అలోచ్చించి చించి చస్తుంటే....ఇలాగ వచ్చి అలాగ విశధీకరించారు. అందుకే నేను మీ A/C ని( Fan కన్నా పవర్ ఫుల్. త్యాంక్యూలు మీకు బోలెడన్ని..
DeleteSatish Kotturi your analysis on Padmarpita's poetry and Paintings are Simply amazing. Keep it up.
DeleteYou are great andi. Thank you!!
Deletenijangaa sateesh garu chala baga chepparandi:-)
Deleteసతీష్ గారూ
Deleteమీరు చెప్పే ప్రతీ మాటలో ఏదో నూతనత్వం యిమిడి ఉంటుంది .
భహుశా నా లాంటి వారికి అదేనేమో స్ఫూర్తి దాయకం.
మంచి భాషా పరిజ్ఞానం .
ఆకాంక్ష అన్నట్లు మీరొక్కరే ఈ విధంగా విశ్లేషించగలరేమో .
పద్మార్పిత 'కవితంతా ' గీసే బొమ్మల్లోనే దాగి ఉంటుంది.
విశదీకరించడం మీకే సాధ్యం సుమా.
పిన్న వయసులోనే గొప్ప ప్రాచూర్యం సంతరించుకున్నారు .
దీర్ఘాయుష్మానుభవ.
అందుకోండి అభినందనలు ........
సతీష్ కొత్తూరి గారూ .
* మరో అభిమానిని
*శ్రీపాద
సతీష్ గారూ.....మీకు ముందస్తుగా నా నమోఃఅభివందనాలు. చిత్రాలకి చక్కటి విశ్లేషణతో పాటు విషయాన్ని కూడా సున్నితంగా చెప్పి అందరి అభిమానాన్ని పొందుతున్న మీకు నా అభినందనలు. నా చిత్రాలకి కుంచె ద్వారా చేయలేని న్యాయాన్ని మీ కలంతో అధ్భుతంగా అలంకరిస్తుస్తున్నారు. మీ అలోచనాశక్తి మీ రచనా శైలి అమోఘం.
Deleteఆకాంక్ష, Harinath Maddi, Padmarpita fans, శృతి, Sripada***శ్రీపాద....మీరంతా ఇలా పార్టీ మార్చేసినా పర్వాలేదు కానీ అభిమానం కూసింత తగ్గిన్నా నేనొల్లగాక ఒల్లను.
Deleteసతీష్ గారు ఇది మనలో మాట.....నా చిత్రాలకి మీరు వివరణ ఇచ్చేస్తారన్న ధీమాతో ఇలా వాళ్ళకి ఒక ఝలక్ ఇచ్చాను లేకపోతే అలుసైపోతాను కదండి, అర్థం చేసుకుంటారుగా పెద్ద మనసుతో అభిమానంగా :-)
Deleteఒక అందమైన వివరణ ఇవ్వాలంటే.. అంతకన్నా అందమైన భావం ఉండాలి. అలాంటప్పుడే వివరణ చేయాలన్న కసి పెరుగుతుంది. కవితల విభాగంలో నేను చాలా బ్లాగులు చూస్తుంటాను. కానీ. ఏదో ఫ్రెష్ నెస్... మనసుని మెలిపెట్టే అక్షరాల తునకలు.. పద్మార్పితమయ్యాయి. అందుకే... వివరణ ఇవ్వాలన్న ఆసక్తి. చిత్రాల ఎంపికలో ఏదో మర్మం... అందులోనూ ఏదో నిగూఢత ఉండాలన్న పద్మ ఆతృత. ఆమె శ్రమ వృధాపోకూడదని కూడా.. నా ఆత్రం. మీ అందరికీ నా విశ్లేషణలు నచ్చడం... నాకు అదృష్టం. పద్మగారు.. మీ మీద అభిమానం వల్లే... మీ అభిమానులకు... నా విశ్లేషణల మీద అభిమానం. మీ తర్వాతే... వాళ్లకేదైనా... అంతేనా...
Deleteనీ ఆలోచనల జ్ఞానభాండాగారం సుసంపన్నము సువిశాలము. నీ కలం నుండి మరో ముత్యం ఈ కవిత. అభినందనములు,
ReplyDeleteధన్యోస్మి సృజనగారు.
Deleteఏడ్చినవాడితోపాటు ఏడ్వనివాడికీ పెళ్ళైనట్లు నాకూ ఫాన్స్ పాలో వచ్చేసిందోచ్:-)
ReplyDeletegrahalu padkar pareshan aina.
ReplyDelete