మల్లెల మాటున...

విన్నవించుకున్న విరహవేదనని విని..
వాల్జడలో విరజాజులే వ్రేలాడేసుకు వస్తే
వడలిన విరజాజుల్లో వాడి ఎక్కడిదే అని
వాటేసుకుని నా వయ్యారమే వేడంటావు!

సంధ్యవేళ సన్నగా ఈలవేసి రమ్మన్నావని..
సన్నజాజి మాలలతో సొగసు విరబోయజూస్తే
సన్నని నడుము వంపే చాలు నలిగిపోతానని
సన్నజాజులేం సరికావు సౌందర్యరాశినంటావు!

చాటుమాటు సరసంలో తెలియని గమ్మత్తుందని..
చమేలీ పూలు కొప్పున చుట్టి చంగావి చీరకట్టుకొస్తే
సాయంకాల చమేలీ సువాసన రాతిరి మాయమని
చెంగావి చీరలో సన్యాసినితో సరసమాడినట్లంటావు!

నిండుపున్నమి జాబిలిని నొప్పించడమెందుకని..
నిత్యమల్లెపూలు పెట్టుకుని నిలువుటద్దంలో చూస్తే
పరిమళంలేని నిత్యమల్లెపూలు నిత్యారాధనకే అని
వెనకమాటుగా వచ్చి వెర్రిదానినంటూ వెక్కిరించేవు!

బుంగమూతితో నేనుంటే....బుట్టెడు బొండుమల్లెలని..
కుమ్మరించడం చూసి కందినమోముతో కెవ్వున అరిస్తే
ఏడుమల్లెలెత్తు సుకుమారి తొడిమతాకి కందిపోయెనని
జామురేతిరి తొడిమలుతీసి కోడికూసేవేళ కునుకుతీసేవు!

60 comments: 1. అన్ని రకాల రచనలు చేయడంలో నీది అందెవేసిన చేయని
  చెప్పకనే తెలుస్తుంది నీ కవితలు చదివే నీ అభిమానులకి.
  ఇక్కడ కూడా నీ పటిష్టమైన మాటలు వాడిగా వాడి కాస్తా
  వేడిని పుట్టించిన మాట నిజమని ఒప్పుకోక తప్పదు.

  పండితులనుండి, పామరుల వరకూ .....
  కవితలోని భావాన్ని అర్ధం చేసుకుని ఆనందించే
  విధంగా ఉంటాయ్ నీ కవితలు పద్మార్పితా ! .
  అందుకే అందరి నాలుకల్లో ఉండి.....
  " ఆయుష్మానుభవ "
  అని అనిపించుకుంటున్నావ్.

  ఇంతకన్నా కోరుకునేదేమిటి ఏ వ్యక్తికైనా.
  అదృష్టవంతురాలివి నీవు పద్మార్పితా !

  అన్ని విధాల కవితలనందించి అందరినీ అలరిస్తున్న
  నీకు మనస్పూర్తిగా అందిస్తున్న అభినందనలివి .
  అందుకో విశారదా ఈ నమస్సుమాంజలిని .

  * శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. మల్లెలమాటున అంటే ఎండాకాలం వేడి పుట్టించాను అంటారేంటి శ్రీపాదగారు. పండితులు పామరులు కలిసి తిట్టుకున్నారో ఏమో వేడి తాకిడికి...అవి కూడా ఆశీర్వచనాలేలెండి. Thank you

   Delete
 2. ఎంతహాయిగొల్పుతున్నది ఈ సంధ్యవేళ...మీ కవిత చదువుతుంటే
  మనసులో మల్లెల సువాసనలని గుబాళింపజేసింది పద్మార్పిత పదపరిమళం

  ReplyDelete
  Replies
  1. హమ్మయ్య.....అస్వాధించండి, మల్లెలగుభాళింపుని :-)

   Delete
 3. మల్లెలను స్నేహాన్నే కాదు బంధాన్ని అనుబంధాన్ని అలవోకగా అల్లగలరు మీరు
  సన్నజాజుల వంటి సన్నని దారం తో తెగిపోని అనుబంధాన్ని అల్లారు
  చాలా బాగుంది కవిత అంత పూల పరిమళాలతో ఘుమఘుమలాడుతుంది
  చిత్రం ఎప్పటిలానే బహువిధాలుగా సరిసాటి పరిపాటి ఇందులు మీరే ఘనాపాటి

  ReplyDelete
  Replies
  1. శ్రీధర్ గారూ మీ కామెంట్స్ చాలా బావుంటాయండీ.
   ఒక్కొక్క సారి అనిపిస్తుంది మీ కామెంట్ వల్లే ఆ కవితకు
   అందమొచ్చిందేమో అని.
   పొగడ్త కానే కాదు సుమా.
   భావగర్భితమైన మీ పలుకులను ఆస్వాదిస్తూ వుంటే
   మనసు పులకరిస్తుంది .

   ఇక పోతే పద్మార్పిత గురించి మీరన్న మాటలు అక్స్షరాల
   నూటికి నూరు పాళ్ళు సమంజసమే. ప్రోత్సాహాన్ని అందించే
   మీ ప్రతి పలుకూ ఓ నూత నోత్సాహాన్ని అందిస్తుంది ప్రతీ
   రచయితకూ , రచయిత్రులకూనూ.

   సాహితీ పరులైన మిమ్ము మనసారా అభినందిస్తున్నాను .

   *శ్రీపాద

   Delete
  2. శ్రీపాద గారికి నమస్సుమాంజలి
   సర్..
   ముందుగా నా వ్యాఖ్యలు మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదాలు. నేను పద్మగారిలా అలవోకగా కవితలు రాయలేక పోవచ్చు (మీరు నా బ్లాగ్ చూడండి: అన్నిటిలో దాదాపు విషాదమే అల్లుకుని ఉంటుంది.

   కవిత అంటే ప్రతి ఒక్కరికి వచ్చేది కాదు అది అతికోద్దిమందికి మాత్రమె తెలిసిన దేవుడిచ్చిన వరం. నా మాతృభాష తెలుగు కానప్పటికీ నేను ఆంధ్రప్రదేశ్ లో (ఇప్పటి తెలంగాణ జూన్ 2, 2014 నుండి అమలు) పుట్టాను.

   ఎవరి భావాలు వారివి కనుక ఒకరిని వెక్కిరించి బాధపెట్టే కంటే మెచ్చుకుని ప్రోత్సాహించే గుణం ఉంటె ఇక ఈ లోకం లో ఈర్ష్య ద్వేషాలకు తావులేదు. నాది అలాంటి భావనే.

   ఇందులో ఏదైనా తప్పుగా రాసిన మీ మనసు నొచ్చుకునే భావం అంతర్లీనంగా ఉన్నట్టు అనిపిస్తే పెద్దవారు మీ పెద్దమనసుతో క్షమిస్తారని తలుస్తూ సెలవు

   శ్రీధర్ భుక్య

   మీకు వీలుంటే నా వెబ్ లాగ్ ని కూడా చూడండి. మీ అమూల్యమైన వ్యాఖ్యలు ఇవ్వండి
   http://kaavyaanjali.blogspot.com/

   Delete
  3. శ్రీధర్ గారూ .
   నా వాఖ్యకి మీరు స్పందించిన తీరు ..
   మీ విశాల దుక్ప్రదాన్ని మరోమారు దృవీకరించారు.
   మంచి మనసుతో పలికిన మీ ప్రతి మాటా ఆణిముత్యాలే.

   కృతజ్ఞతలు మీకు.

   అందరిలా నేనూ మీ స్పందనలు చదువుతూనే ఉంటాను .
   ఇకపోతే నేను G + లో మీ అభిమానిని.
   మంచి పటుత్వం గల రచనా శైలి మీది.
   తప్పకుండా మీ బ్లాగ్ ని చూస్తాను.
   ఇకనుండి మీకూ 'బోర్' కొట్టిస్తానుగా..

   *శ్రీపాద

   Delete
  4. Sridhargaru....పూలపరిమళాన్నే కదు అంతలీనంగా దాగిన దారపు బంధం భావాన్ని కూడా చదివే నేర్పు మీది. ధన్యోస్మి

   Delete
  5. శ్రీపాదగారు మరోమారు ధన్యవాదాలండి._/\_

   Delete
 4. ఏడుమల్లెలెత్తు సుకుమారి తొడిమతాకి కందిపోయెనని
  జామురేతిరి తొడిమలుతీసి కోడికూసేవేళ కునుకుతీసేవు
  7 mallela ettu unna lover ni chusi kunuku tisadu ante....he is unromantic fellow :-)

  ReplyDelete
  Replies
  1. అలా అని చెప్పి ఇంప్రెస్ చేయాలని చూస్తున్నడేమో....వాళ్ళ పాట్లేవో వాళ్ళవి.Don't worry dear that 7malle ettu lover is having the talent of changing him into romantic guy.:-)

   Delete
 5. ఆతృతని ఆపుకోలేక అడిగేస్తున్నాను అర్పితగారు....ఇన్నిరకాల మల్లెలకీ వంక పెట్టినప్పుడు ఆమె ఎలా ఒప్పుకుంది అతడ్ని దరిచేరడానికి, చెప్పండి చెప్పండి చెప్పండి :-)

  ReplyDelete
  Replies
  1. అదే ఆకాంక్ష....పవర్ ఆఫ్ దట్ బంధం :-) ఎవరి టేస్ట్ వాళ్ళది :-)
   తెలిసింది, తెలియంది చెప్పేసా చెప్పేసా చెప్పేసా :-)

   Delete
 6. మరీ మల్లెలన్నీ కుప్పబోసి మమ్మల్ని ఆడిబోసుకుంటారేంటి పద్మార్పిత గారూ..:-)
  ఎప్పుడూ ఇలా చిలిపిగా అల్లరిగా రాస్తూ అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ అభినందనలతో...

  ReplyDelete
  Replies
  1. తొడిమలు తీస్తూ కుప్ప పోసి మమ్మల్ని అంటారు.....ఏ సి ఉన్నా విసనకర్రతో విసిరించుకోవాలనే :-)

   Delete
 7. పద్మా....అన్నమాట 24గంటల్లోపు నిలబెట్టుకున్నావు. ఠ్యాంక్యూ. మనసారా నవ్వుకుని మల్లెల వాసన మత్తుగా పీల్చి పడుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. మీరు కోరడం నేను కాదనడమూనా :-)

   Delete
 8. జరగని దానికన్నా మల్లెల మాటున దాగిన వలపు మత్తు మర్మం ఏదో సోధిస్తే .....:-)

  ReplyDelete
  Replies
  1. శోధనలు ఎందుకండి...పరిమళాలని ఆస్వాధించక :-)

   Delete
 9. ఓహో... ఇదా సంగతి ! తోడిమల్నొదిలేయమని తొడపాశం పెడితేసరి..

  ReplyDelete
  Replies
  1. మరీ ఇంత సుకుమారంగానా వినోద్ జీ :-)

   Delete
  2. వినోద్ మరీ ఇంత సుకుమారంగా తొడపాశాలతో తేలదులే యవ్వారం. తేడాలొస్తే కుమ్మేసే సమర్ధురాలే మన మల్లెల నాయిక...మాల కడుతుందని మెత్తని అమ్మాయి అనుకోకు.

   Delete
 10. శృతిగారు అడిగిన వెంటనే హుషారెత్తించే కవితతో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు... త్యాంక్యూ సో మచ్ మేడం...

  ReplyDelete
  Replies
  1. సృజనగారు నేను రాయలేదని వాళ్ళాయనకి వంటచేసి పెట్టరు. అందుకే:-)

   Delete
 11. అమ్మాయ్ నీ భావాలని ఊహల్లో ఊహించుకోవడానికే కానీ వాస్తవానికి ఈ రోజుల్లో ఇంతటి రొమంటిక్ సంసారాలు చాలా అరుదుగా కనబడుతున్నాయి అనేది వాస్తవం. అందరి ఆలోచనలు, అలవాట్లు కూడా యాంత్రికంగా మారిపోయాయి. కవితాపరంగా కొంటెగా కవ్వించడంలో చివరికి ట్విస్ట్ ఇవ్వడంలో నీదైన చాకచక్యాన్ని చూపావు-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. వాస్తవాలు బాగోలేదని, ఉండవని....
   ఊహల్లో ఉసూరుమనడం ఎందుకండి
   భావ దారిద్ర్యం ఎందుకు... :-)థ్యాంక్యూ

   Delete
 12. చాలు చాలు...ఈ మల్లెల మాటున సరసాలు. ఇలాంటివి బాగా పరిమళింపజేస్తావు నీ కవితల్లో.

  ReplyDelete
  Replies
  1. అంటే ఈ పరిళం పసందుగా లేదనా సంధ్యగారు :-(

   Delete
 13. మల్లెలే ఉండాలా మురిపించాలంటే :)

  ReplyDelete
  Replies
  1. మురిపాలే ఉంటే మల్లెలు ఎందుకు:-)

   Delete
 14. మెరటోడికి మల్లెపూలు ఇస్తే ముడిచి ఎక్కడో పెట్టుకున్నట్లుంది యవ్వారం:-) అయినా మొరటోడ్ని కూడా మెత్తగా మొట్టడం మీకే చెల్లును .

  ReplyDelete
  Replies
  1. వామ్మో ఏంటి ఈ సామెతల పంచాంగం:-) ఇంకో రెండు సామెతలు చెప్తే నేను ఢమాల్ :-)

   Delete
 15. ముందుగా మీక్ పెద్ద సారి పద్మర్పిత గారు! వీలు కుదరక మీ బ్లాగ్ లో కామెంట్స్ పట్టట్లెదు సరిగ్గా, గీతలు-రాతలు కవితలో అందమైన అమ్మయి మనసు గురించి చాల బాగ వర్ణించారు. సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!! అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు, ఆహా సూపర్. తెలుగు పదాల కల్పవల్లి మీరు. పిక్ కూడా అదిరింది:-)

  మీ మల్లెల మాటున... మీ మల్లెల పరిమళం మీ దగ్గరినుండి నావరకు వచ్చి నీ బాగ్ ముందు కూర్చోబెట్టి, అందమైన పాట వినిపిస్తూ, మత్తులో పడేసింది:-) సూపర్:-)

  ReplyDelete
  Replies
  1. శృతి.....ఆలస్యంగా వచ్చి కల్పవల్లని మల్లెచెండని భలే మురిపిస్తావు. మీ జీవితం పూభరితమై ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను.

   Delete
 16. మాడం చాన్నాళ్ళకి ఒక మంచి రొమాంటిక్ పోయం రాశారు.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ.....రొమాంటిక్ ని తెలుగులో ఏమంటారు యోహంత్ :-)

   Delete
 17. ఈ కొంటెకోమలి తుంటరి అల్లరికే కైవసమైపొయింది. ఎప్పటికి తేరుకుంటామో ఏమో.

  ReplyDelete
  Replies
  1. వశమైపోయేంత వీక్ అయితే ఎలా మహీ.....తేరుకున్నాక బాదాం పిస్తా బాగా తినండి, మరోసారి పడకుండా జాగ్రత్త పడండి :-)

   Delete
 18. హాయ్ రామా... ఏంటి పద్మగారు.. అక్షరాలతో మనసుని తట్టిలేపుతారనుకుంటే.. ఇలా పువ్వులతో తియ్యని గాయం చేశారు. ఆ గాయానికి మందేసి కాస్తైనా భారం తగ్గించుకుందామంటే.. అసలు ఆ గాయం తగ్గదే. హన్నన్న. ఏమని వర్ణించను. వర్ణిస్తే... గుండెకోత మాకేగా. అందుకని వర్ణించలేను. బొండు మల్లె తొడిమె తగిలితే కందిపోయే అందాన్ని తాకి బాధపెట్టలేనంత అభిమానవంతుడైన ప్రేమికుడు ముందు బుంగమూతి పెట్టడం మాత్రం న్యాయమా చెప్పండి. ఆ బాధ కన్నా... మరపు రాని తీయని బాధ భరించడమే ముద్దని... దరిచేరని నాయికపై నాకు మాత్రం కోపం వచ్చిందండి ‍‍‍( జస్ట్‌ కిడ్డింగ్‌). సూపరండి. మనసు మల్లెల తీరంలో మరు మల్లెల మంచమెక్కి చిరుజల్లుల్లో విహరించింది.

  ReplyDelete
  Replies
  1. ఏంటో ఒక్కముక్క అర్థం కాలేదు మల్లెలంటారు మత్తుజల్లులంటారు. ఇంతకీ తప్పెవరిదో ? :-)

   Delete
  2. అక్షరం మీ ఆయుధం కదండి కొత్తూరి సతీష్ గారు.... మాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పైగా గాయాలు చేసామని, మూతి ముడిచామని నిందారోపణలా....మల్లెల వాసన ఎక్కువగా పీల్చి మత్తులో పడేసాం అనకండి :-) థ్యాంక్యూ.

   Delete
  3. ఆకాన్ష....అర్థం చేసుకోవాలి, లేదా అర్థమైనట్లు నటించాలి అంతే కానీ ఇలా ప్రశ్నిస్తే ఎలా చెప్పు :-)

   Delete
 19. మంచిమల్లెల పరిమళభరితం మీ కవిత

  ReplyDelete
 20. మొత్తానికి ఇద్దరూ మాంచి రొమాంటిక్ జంట...మాలాగే ;-)

  ReplyDelete
  Replies
  1. మాయ- విశ్వం మమైకం....వీళ్ళెంత :-)

   Delete
 21. Madam are you there? eagerly waiting for replies.

  ReplyDelete
  Replies
  1. వచ్చేయండి వచ్చేయిండి అర్పితమేడం :)

   Delete
  2. Yes my dear friends I always oblige these :-)

   Delete
  3. మాడం మాకిక్కడ అన్యాయం జరిగింది. :-) అంతా తొడి తొండి ఆన్సర్స్

   Delete
  4. ఆకాంక్ష...సమన్వయం పాటించు :-) అన్యాయం కాదు అనంతం మీ సొంతమౌతుందిగా :-)

   Delete
 22. Beautiful poem with beautiful picture ..hats of to you Padma arpita garu..( phool to nazuk hote hi hai us se bhi nazuk ap ka andaz hai..ap wo phool bankar hi rahe..jis ki khushboo sada bahar rahe....)

  ReplyDelete
  Replies
  1. మెహదీ సాబ్ బహుత్ దినోంకె బాద్ ఆప్ యహా పర్ తష్రీఫ్ లాయే హై. యేహ్ జో ఖుష్బూ ఆప్ కే సాథ్ లాయే, వోహ్ ఇస్స్ సే భీ బడియా హై...
   బహుత్ షుక్రియా :-)

   Delete
  2. మీ బ్లాగ్ చాలా బావుందండి

   Delete
  3. Suguna Bolisettigaru....well come to my blog. thank you

   Delete
 23. పద్మగారు ఎలా ఉన్నారు ? గతరెండు రోజులుగా మనసు కీడు శంకిస్తుంది. ఇది నా ఊహే కావాలని అనుకుంటూ మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. బాగున్నాను జీవన నటిగారు (మీ పేరు తెలీదు) మీ అభిమానానికి కృతజ్ఞతలు. సదా మీ ప్రేమానురాగాలని కోరుకుంటున్నాను.

   Delete
 24. gitlane mastu mastu rayiee

  ReplyDelete