"మత్తుమనిషి"

మత్తుమందు జల్లి మురిపించే మనసు నీదేనని
మాయమాటల మర్మమేదో చెప్పి మనసు దోచేసి
మగత నిదురోతున్నోళ్ళని లేపి మందుకొట్టలేదని
మందమెక్కిన నాలుకతో మొద్దుబారిన మెదడుతో
సారాలోని సారాంశమేదో చెబితే మత్తుదిగిపోవునా!

వింతరోగమేదో వచ్చెనని "విస్కీ"తో విందులేవో చేసి
బారుల్లో దూరి "బీరు" కొట్టినంతనే భారమే తీరునా!
రసికత తరిగిపోయెనని ఢ్రమ్ముతో "రమ్ము" కొట్టేసి
బ్రాండ్లే మార్చి "బ్రాంధీ" బాటిల్స్ తాగి తైతక్కలాడితే
జిజ్ఞాసలేని "జిన్" వంటి జీవితం జ్యూస్ గా మారునా!

కైపు ఎక్కించేది "కాక్ టెయిల్" అని కలిపి లాగించేసి
కిక్ అన్నంత "ఫెన్నీ" తో ఫేస్ వాల్యూ మారిపోవునా!
వైవిధ్యం కోసమని "వైన్" ని విడిగా తీర్థమని సేవించి
వట్టివేళ్ళ వంటిది "వోడ్కా" ఒక చలువ పానీయమని
మంచినీరులా గొంతు నింపుకుంటే దాహమే తీరునా!

"కల్లు"తో పాటు "బైజూ" "థెఖిలా" "సొజు" పేరేదైనా
మద్యమంటే "ఎథనాల్" విషం అని తెలిసి తీసుకుని
మత్తుతో మదమెక్కి మానవుడే మరో మృగంగా మారి
ఇంగితం కోల్పోయి వికృత చేష్టలతో వింతలోకమేగినా
మత్తు మనిషికి బానిసై జీవితభారం మోసి కడచేర్చునా!

45 comments:

  1. మత్తు పానీయమేదో పోసి మత్తెక్కిస్తావనుకుంటే, ఎక్కిన కిక్కు దించి మందుబాటిల్ పగులగొట్టేలా చేస్తే ఎలా :-)
    మీ నుండి మంచి సందేశాత్మకమైన పద్య దృశ్యకావ్యం. కంగ్రాట్స్ అర్పిత

    ReplyDelete
    Replies
    1. ఎక్కిన కిక్కు దిగకుండా పెర్మినెంట్ సొల్యూషన్ చెప్పాలని :-)

      Delete
  2. మద్యం మత్తు
    మనిషికి జీవ-వినాశకారి అని చెప్పిన విధానం బాగుంది

    అభినందనలు పద్మార్పిత గారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి

      Delete
  3. తాగితే మరిచి పోగలను
    తాగనివ్వదు
    మరిచిపోతే తాగగలను
    మరువనివ్వదు

    మనిషి బతుకింతే మనసు గతి యింతే.. :-) జోహార్ మనసు కవి..

    ReplyDelete
    Replies
    1. మీరూ మా టైప్ అన్నమాట :-)

      Delete
    2. మనసు గతికేం ఎప్పుడూ అది మనిషి మనుగడ పైనేగా ఆధారపడుతుంది అది:-)

      Delete
    3. మహీ.....సపోర్ట్ చేయడం కూడా నేరమే :-)

      Delete
  4. పద్మార్పిత గారూ ....
    మీ కవితలకు కాస్తా భిన్నంగా వున్నా
    కవిత సారాంశం ఓ నీతిని ప్రభోదిస్తున్నట్లుగా వుంది .

    " మద్యమంటే "ఎథనాల్" విషం అని తెలిసి తీసుకుని
    మత్తుతో మదమెక్కి మానవుడే మరో మృగంగా మారి
    ............... "

    మద్యమంటే ' ఎథనాల్ ' విషం అని అందురూ గమనిస్తే
    ఎన్నో కుటుంబాలు నిట్టూర్పులు మాని నింపాదిగా
    ఓ నిండైన 'శ్వాసను ' ఆస్వాదించగలవేమో ..
    సమాజంలోని కొంత మందైనా మారితే,
    మీ ఈ కవిత ఓ చక్కని ' సందేశమే '

    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత పదాల్లో మార్పుతెచ్చే పదును, శక్తితో పాటు ఆమెలో మంచి ధృఢసంకల్పం కూడా ఉందండి. తప్పక కొందరైనా మారతారు.

      Delete
    2. శ్రీపాదగారు నిజమే మీరన్నది....ఒక్కరు మారినా నా వ్రాతలకి సార్థకత సమకూరినట్లే

      Delete
    3. Sandhya....మీ ఆశాభావ కమెంట్ ఇన్స్పైరింగ్ మీ.....పొగిడేయకండి అతిగా :-)

      Delete
  5. చాలా రోజులకు వచ్చి మంచి భావమున్న సందేశ కవితను అందించిన మీకు అభివందనం. క్షేమమేనని ఆశిస్తున్నాను మేడం. ధన్యవాదాలు మీ అలరింతలకి.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి అభిమాన ఆశిస్సులతో ఐయాం ఆల్ రైట్. థ్యాంక్యూ

      Delete
  6. సమ్మర్ హిమక్రీములతో గడిపేద్దాం అనుకుంటే మందు వెరైటీలు చెప్పి టెంమ్ట్ చేస్తే ఎలా పద్మా :-)

    ReplyDelete
    Replies
    1. ఏంటో తిండిపోతు అనుకోలేను అలాగని మందు కొట్టమనలేను :-)

      Delete
  7. ఒకరకం మందు పార్టీలో కొడితేనే ఇంటిదగ్గర రబస రబస, ఇంక మీరు చెప్పిన బ్రాండ్స్ అన్నీ కొడితే ఇంట్లో బజంత్రీలే :-) మందు గోల పక్కన పెడితే వెరైటీగా ఉంది మీ కవిత

    ReplyDelete
    Replies
    1. బజంత్రీలు అని భయపడుతున్నట్లు నటిస్తూనే మందుకొట్టేసేవారు ఎందరో కదా :-)

      Delete
  8. పద్మా ,

    మత్తు పదార్ధాల పై లోనున్న యదార్ధాలను బహు చక్కగా వెలికి తీయటం , కనులు తెరుచుకున్నా ఎప్పటికప్పుడు కనులు మూసుకు పోవాలని తపించే వారందరికీ " కనువిప్పు " గా బహు చక్కగా సెలవిచ్చావు .

    సారాలోని సారాంశమేదో చెబితే మత్తుదిగిపోవునా!

    బ్రాండ్లే మార్చి "బ్రాంధీ" బాటిల్స్ తాగి తైతక్కలాడితే
    జిజ్ఞాసలేని "జిన్" వంటి జీవితం జ్యూస్ గా మారునా!

    మత్తుకి మనిషి బానిసై జీవితభారం మోసి కడ చేరునా!

    ఈ కవిత సందేశమేగా నిస్సందేహంగా .

    ReplyDelete
    Replies
    1. మీ ప్రేరణాత్మక స్పందనతో పాటు మెచ్చుకునే విధానం నన్ను మైమరపిస్తుంది. ధన్యవాదాలండి.

      Delete
  9. ఒయ్ పద్దమ్మతల్లీ.., బగ్న ప్రేమికులంతా...మత్తెక్కిన వారే..:-))
    బాగుంది మీ కవిత ఎప్పటిలాగే.

    ReplyDelete
    Replies
    1. మందుకొట్టకుండా మత్తెక్కించి మురిపించారుగా నన్ను మీరాజ్ గారు... పద్దమ్మతల్లీ అని :-) థ్యాంక్యూ.

      Delete
  10. మందుబాబులకు మంచిసూక్తులు.

    ReplyDelete
  11. Meru ilanti research poems rasinappudu inspire aipoyin mimmalni picha pichag love chesestanu. :-)

    ReplyDelete
    Replies
    1. Research chestene love chestava leka pothe leda? :-) antha commercial love ah?

      Delete
  12. చెప్పాల్సిన విషయాలని నెమలిఈకల కొరడా ఝళిపి వివరించి సందేశాన్ని నరాల్లో జీర్ణింపజేసి చైతన్యవంతం చేయగల శక్తి నీ కలానికి ఉందని మరోమారు తెలిపావు. అభినందనలు పద్మ.

    ReplyDelete
    Replies
    1. కొరడాకోసం నెమళ్ళని చంపితే అటవీశాఖవారు నన్ను అరెస్ట్ చేస్తారుగా సంధ్య. అందుకే కొరడా ఝళిపించక ఇలా కవితల్లో చెప్పేస్తా. థ్యాంక్యూ.

      Delete
  13. మందుకొట్టే వారికి తెలియని పేర్లు మీకు తెలిసాయి అంటే దానివెనుక మీ కృషి అమోఘం. ఏ సబ్జెక్ట్ పై అయినా కుతూహలం పుట్టించేలా కవితలల్లడం మీకే చెల్లు.

    ReplyDelete
    Replies
    1. S Yohanth U are correct:-)

      Delete
    2. కొంత నా ప్రయత్నం మరికొంత గూగులమ్మ దయాధర్మం :-)

      Delete
  14. మందుకొట్టనని ఒట్టెట్టమంటారా! :-)

    ReplyDelete
    Replies
    1. ఒట్టు పెట్టుకోడానికి బెట్టుచేయనేల :-)

      Delete
  15. Hey Super:-) నిజంగా వాళ్లు (అబ్బాయిలు) మందు బాబులే!

    ReplyDelete
    Replies
    1. శృతి....అబ్బాయిలే కాదు అమ్మాయిల్లోను మందు పాపలున్నారు అని సర్వే ద్వారా తెలిసింది...జాగ్రత్త. :-)

      Delete
    2. శృతి థ్యాంక్యూ.

      Delete
  16. మందు పార్టీలో కవిత చదివి వినిపించలేను, కానీ, మీ కవిత చదివి మందు కొట్టను. :-)

    ReplyDelete
    Replies
    1. అది చాలు నాకు.:-)

      Delete
  17. హమ్మయ్య!! ఇందులో నా బ్రాండ్ లేదు..

    ReplyDelete
    Replies
    1. మనిద్దరిదీ ఒకటే బ్రాండ్....మంచినీళ్ళేగా :-)

      Delete
  18. మందుబాబులని మందు కూడా ప్రశాంతంగా కొట్టనీయకపోతే ఎలా పద్మార్పితా:-)

    ReplyDelete
    Replies
    1. ప్రశాంతంగా మందుకొట్టనిస్తే వాళ్ళు రేపు మనల్ని కొడతారు :-)

      Delete
  19. Padmarpita garu mathu chittu chesthadi anni bhaga chepparu mandubabulakku

    ReplyDelete
    Replies
    1. Naveen kavitalloni bhaavaanni chadivestunnaarugaa...thank you

      Delete
    2. Merru rasthe evvarainna chaduvtharuu anddi.neenu kudda fan kaddandi anduke chaddivannu.chala bhagga rasthunarru andi

      Delete