తిట్ల కాపురం!

దొంగసచ్చినోడా.....నీకు ఇదేం పోయేకాలం!
తిట్టమనే తింగరోడా.....నీకిదేం మాయరోగం?
కోపంతో కాని కాపురానికి కళ్ళెం వేయబోతే
కసిరి, కొట్టి, గిచ్చి, రక్కి కొరికేయమంటావు!

చుప్పనాతోడా.....నీకు పూయాలి కొరివికారం!
కొవ్వెక్కినోడా.....నీదంతా తలతిక్క యవ్వారం
జాబిల్లివేళ జాజిమల్లెచెండు అడిగి అలిగానని
మండుటెండలో మంచమేసి కుమ్మమంటావు!

వెర్రిబాగులోడా.....నీకు ఎక్కింది ఎనలేని పైత్యం!
పోకిరోడా....నీవు నేనెన్నడు చూడని వింతచోద్యం
పట్టెమంచం పానుపేసి సరసానికి పండ్లు తెమ్మంటే
పళ్ళికిలిస్తూ పగటిపూట పనసపండ్లు పట్టుకొస్తావు!

గూట్లేగాడా.....నీకు అవసరమా ఈ విచిత్ర శోభనం?
పొగరుబోతోడా....నీలో ఉన్నది కేవలం కండకావరం
తొలిరేయి మురిపాలని వెండి పాలగ్లాసు చేతికందిస్తే
బంగారు బిందెడు బలమైన బాదాంపిస్తా పాలడిగేవు!

20 comments:

  1. వేదన కవిత కాదు అయినా కళ్ళలో నీళ్ళు... నవ్వాగడంలేదు... ఏమండోయ్... ఇంతగా నవ్విస్తే ఎలా?

    ReplyDelete
  2. నవ్వుతూ నవ్విస్తూ...తిడుతూ దులిపేస్తూ
    ఎన్నో విషయాలు నేర్పే నేర్పరి...కుమ్మేస్తాను చూడండి :-)

    ReplyDelete
  3. అడిగితే తిడతారు అనుకుంటే అడక్కుండానే తిట్టేసారు:-(

    ReplyDelete
  4. బాగుందండీ మీ తిట్ల కాపురం.. ఏదేమైనా ముందే తిట్టేసారు కనుక యికపై తిట్టడానికేం లేక అంతా సరస సల్లాపమే.. :-)

    ReplyDelete
  5. తిట్లతో తిక్క కుదిరి తుప్పు వదిలింది.

    ReplyDelete
  6. ఆ తిట్లలోనే ఉంది యవ్వార మంతా!కాదంబరి ప్రేమలేఖలో ఉన్న సొగసు అర్ధమయితే తప్ప ఈ కవిత అసలు గొప్ప అర్ధం కాదు.

    ReplyDelete
  7. నవ్వి నవ్వి దవడలు నొప్పెట్టాయ్ .
    - సంగీతం లోని రాగాలతో కవితల్లావు ...
    - వ్యాకరణం లోని అన్ని సంధులూ - సమాసాలు
    వాడి కవిత నందించి ' శభాష్' అనిపించు కున్నావు ...
    - 'మద్యం ' ఎన్ని రకాలు అని చెబుతూ కిక్ రాస్తూ నిషా నిచ్చావు ...
    - సరిపోదా అని అన్ని రకాల జబ్బులూ - హాస్పిటల్ లోని పరికరాలు వాడి
    వింత కవితల్లి అందరినీ చకితుల్ని చేసావు ....

    ఇలా ఎన్నో వేటినీ వదలకుండా ......

    అయ్యబాబోయ్ ... మరి ఈ తిట్లేమిటి పద్మార్పితా
    ( మరోల అనుకోవద్దు, ఏకవచనం వాడా ) .
    కళ్ళు భైర్లు కమ్మితేను .
    ఇన్ని రకాలుంటాయా 'తిట్లు' ... భేష్ భేష్ .
    ప్రింట్ తీసి దగ్గరుంచుకుంటాను , ఎప్పటికైనా ఉపయోగపడొచ్చు.
    సరదాగా బాగుంది.
    ఎలాగయినా రాయగలవు పద్మార్పితా !
    భేష్ భేష్ .

    *శ్రీపాద

    ReplyDelete
  8. వాయమ్మో మావల్ల కాదు కానీ.....అదేదో మూడు కుమ్ములాటలతో, ఆరు తిట్ట్లతో కాపురం చల్లగుండా. :-) -హరినాధ్

    ReplyDelete
  9. అయ్యబాబోయ్ ఎన్ని తిట్లో! ఇన్ని తిడితేకని బాగు పడలేదన్నమాట, ఇప్పుడు అంతా ఓకే కదా మాడం.. సూపర్:-) మరోసారి నిరుపించుకున్నారు, తిట్లతో ఇంత బాగ కవిత రాయొచ్చని:-)

    ReplyDelete
  10. అధ్బుతమైన పదసంపద మీ సొంతం... మాకోసం ఖర్చుపెట్టడం మా అదృష్టం. ఎంత ముద్దుగా తిట్టారో... సూపర్ మేడం... కవితలతో ఇలా నలుగుర్ని నవ్వించడం మీకే చెల్లు.

    ReplyDelete
  11. ఒలమ్మొలమ్మొ ఇట్ట తిట్టేసినావేటి ఆడు మారాడని తెలిసి కూడా
    ఇట్ట తిట్లతో ఈపు ఈమానం మోతలతో ఎటోనమ్మ కాలం కలసి రాకా
    ఎన్నెల్లో దీపాలు బెత్తేతోడు ఇట్ట బెత్తం తో చీవాట్లు పడుతుండు ఏమి పాలుపోక
    గోదారమ్మంటి మిమ్మల్ని కట్టుకుని ప్రవాహం లో కొట్టుకొని పోకా ఏవిటో ఈ కొత్త రోత
    దారికోచినాడు కదా ఇక దొరకబుచ్చుకుని దారిన పెట్టుకో అదియే శ్రీరామ రాచ్ఛ
    లేకపోతె మరోపాలి ఇట్ట సేత్తే కాలో చెయ్యో ఇరచి ఎయ్యవమ్మ గట్టి సిచ్చ

    హేహేహే .. పదాలు విరిగిపోయాయి బహుశ భయం ఏమో.
    మీ కవిత ఆద్యంతం రసభరితంగా సాగింది చాల గడసరి అమ్మాయే తమరు
    భేష్ పద్మ గారు. అదరగొట్టేసారు బెదరగోట్టేసారు కూడాను. :)

    ReplyDelete
  12. పద్మా.....ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇన్ని తిట్టాలంటే బాదాం పిస్తా మనం తినాలేమో :-) క్రొత్త నీరు కొంగ్రొత్త ఆలోచనలు.

    ReplyDelete
  13. ఏంటో గడబిడగా తిట్టి, నాలుగు నెత్తిన మొట్టినట్లుంది. అయినా పద్మార్పిత తిట్టినా బాగుంది అనిపించింది

    ReplyDelete
  14. తిట్లకాపురం పదికాలాలపాటు చల్లగుండా:-)

    ReplyDelete
  15. అచ్చమైన తెలుగు తిట్లు .....బాగున్నాయి

    ReplyDelete
  16. తిట్టినా సున్నితంగానె
    అందంగానూ తొట్టొచ్చని ఈ పొస్టింగ్ చదివాక అర్ధం అయ్యింది
    అభినందనలు పద్మార్పిత గారు! చక్కని పోస్టింగ్!

    ReplyDelete
  17. స్పందనలతో స్ఫూర్తినిస్తున్న ప్రతి అభిమాన కమల దొంతరకూ హృదయపూర్వక అభివందనము.

    ReplyDelete
  18. Madam meeru great anndi.navthune comment chesthunnanu anndi

    ReplyDelete
  19. ఎంత తిట్టినా ఎలా తిట్టినా మీకు ప్రేమనే

    ReplyDelete
  20. తింగరోళ్ళందరిదీ ఇదే వరస
    తిట్లు తిన్నా చూపెడతారు పలువరస
    యెంత కరుకుగా కుమ్మేసినా కసాకసా
    మరి ఏమన్నా చిన్నదా ఆ ప్రేమ నిషా/పస

    ReplyDelete