ప్రియా!...అని పులకరించిన మదిపలికింది
వ్రాయని ఊసుల ప్రేమలేఖ అందించింది!!
వెన్నెలవేళ వలపు వేడి నిట్టూర్పు విడిచే
పగటిపూట పరువం నీ ధ్యాసలో తడిచింది!!
తలచినదే తడువుగా పిలిచాను అనుకుని
రెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్!!
దారిలో విరజాజులు విచ్చుకుని ఉంటాయి
దోసిళ్ళతో దూసేసి దోచేసుకుని వచ్చేయ్!!
నీలి ఆంబరం అడ్డుగా రెపరెపలాడుతుంది
చీరగా నాకు చుట్టేయాలి తీసుకు వచ్చేయ్!!
తేనెటీగలు తీయనిరాగంతో కనుగీటుతాయి
వేచి ఉన్న నన్ను తలచి వేగిరం వచ్చెయ్!!
పిల్లగాలి కబుర్లు చెబుతూ చుంబనమిస్తుంది
మీసాలతో గుచ్చేసి తప్పించుకుని వచ్చేయ్!!
అలసివచ్చిన నిన్ను సేదతీర్చాలని నా శ్వాస..
తనువులోని ప్రతి అణువు దాసోహమంటుంది!!
వ్రాయని ఊసుల ప్రేమలేఖ అందించింది!!
వెన్నెలవేళ వలపు వేడి నిట్టూర్పు విడిచే
పగటిపూట పరువం నీ ధ్యాసలో తడిచింది!!
తలచినదే తడువుగా పిలిచాను అనుకుని
రెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్!!
దారిలో విరజాజులు విచ్చుకుని ఉంటాయి
దోసిళ్ళతో దూసేసి దోచేసుకుని వచ్చేయ్!!
నీలి ఆంబరం అడ్డుగా రెపరెపలాడుతుంది
చీరగా నాకు చుట్టేయాలి తీసుకు వచ్చేయ్!!
తేనెటీగలు తీయనిరాగంతో కనుగీటుతాయి
వేచి ఉన్న నన్ను తలచి వేగిరం వచ్చెయ్!!
పిల్లగాలి కబుర్లు చెబుతూ చుంబనమిస్తుంది
మీసాలతో గుచ్చేసి తప్పించుకుని వచ్చేయ్!!
అలసివచ్చిన నిన్ను సేదతీర్చాలని నా శ్వాస..
తనువులోని ప్రతి అణువు దాసోహమంటుంది!!
" తలచినదే తడువుగా పిలిచాను అనుకుని
ReplyDeleteరెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్!!"
" వచ్చేయ్ .... వచ్చేయ్ మంటూ " రాసిన ప్రేమ కవిత
పులకింతతో కాస్తా గిలిగింతలు పెట్టింది .
పదాలు బాగా కుదిరాయి .
పదనుగానూ ఉంది.
పద్మార్పిత గారూ బాగుందండీ మీ కవిత.
* శ్రీపాద
మీకు గిలిగింతలుపెట్టి కవ్వించగలే సాహసమా నా కవితకి....ఎంత మాటెంతమాట ? :-)
Deleteఇదే మీ మొదటి ప్రేమలేఖా?:-)
ReplyDeleteఎక్స్పీరియన్స్ లేదంటారా? :-)
Deletewow ..enta andamaina ahvaanam andi...kavita chala baagundi....
ReplyDeletebhaavam baagundi annaaru.....santhosham
Deleteపద్మార్పిత గారు.. చాలా బాగుందండి మీ లేఖ... నాకే ఇది రాసినట్లుగా ఫీలైపోయి, సరదాగా ఇక్కడ రిప్లయ్ ఇస్తున్నాను. తప్పుగా అనుకోకండి... ఎంజాయ్ ది థ్రిల్ ల్...
ReplyDeleteనన్ను పలకరిస్తూ పులకించిన నీ మది పంపిన ప్రేమ లేక
ఇప్పుడే అందింది ప్రియా..
వలపుసిరాతో చల్లిన ప్రేమాక్షరాల గుభాళింపులు
నా ముక్కుపుటలు తాకి మైమరిపించాయి..
అందమైన అక్షరాలను పరికించిచూసిన కళ్ళు
పదే పదే నీరూపలావణ్యాన్ని తలుస్తున్నాయి..
ఇన్నాళ్ళూ నీ ధ్యానంలో వేచిన నా అధరాలు
విరహభోజనం వద్దంటూ బెట్టుచేస్తున్నాయి..
కథలో కనిపించే కల్పిత రెక్కల గుర్రాలు
నన్ను నీదరి చేర్చడానికి దారితప్పివచ్చాయి..
తెరువరినై మధువులు కూర్చిన తేనెటీగల్ని
స్నేహించి నీ అధరాలకు తీయని కానుక తెస్తున్నా..
ఆకాశ యుద్ధంలో నీలాల మేఘాల్ని ఒడిసిపట్టుకొని
నీ తనువంతా చుట్టేయడానిమి చీరగా తెస్తున్నా..
జాబిల్లిలోంచి దూకేసి వెన్నెల కిరణమై
గోరింటతో ఎర్రగా పండిన నీచేతిలో చంద్రబింబమౌదామని
చిరుగాలుల పదదాలు తొలిచేస్తూ
నీ ఎదపై దూకేస్తున్నా... మదిలో మాటేస్తున్నా...
ఈ పాటి కవితా జ్ఞానం మాకుంటే ఎప్పుడో అద్భుతాలు సృష్టించేవాళ్ళం:-) సరదాకి అన్నాం, చక్కగా వ్రాసారు.
Deleteఊహలకి రెక్కలు వస్తే ఇంత బాగున్నాయి, ఇంక నిజంగా రాయడంలో అరిపిస్తావేమో వినోద్ :-)
Deleteనాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ ప్రత్యుత్తరము వినోద్జీ......నచ్చిందని నలుగురికీ వ్రాసేయకు :-)
Deleteవినోద్......ప్రత్యుత్తరమే అయితే పరేషాన్ కాను, ప్రేమగ్రంధం రాస్తేనే కష్టం :-). ఏమాటకామాటే......ప్రేమలేఖకి ప్రత్యుత్తరం చూసి పడిపోయాను:-)
Deleteమహీ......మీకున్న జ్ఞాణం అపారం.....పుంఖాను పుంఖలుగా వ్రాసేయగలరు ప్రత్యుత్తరాలు ప్రయత్నించండి :-) Sandhyagaru next time try cheyamandaam. ఆకాంక్ష...అసలు విషయం వినోద్ నే అడగాలి :-)
Deleteనీలి ఆంబరం అడ్డుగా రెపరెపలాడుతుంది
ReplyDeleteచీరగా నాకు చుట్టేయాలి తీసుకు వచ్చేయ్!!
అందమైన భావం పద్మార్పిత గారు. చిత్రం కూడా అందంగా అమరింది..
మీకు నచ్చింది......మనోల్లాసం :-) all happies
Deleteపద్మా...పులకరించిన మది పలికించిన మాటలు ఎప్పుడూ మధురంగానే ఉంటాయి. పెయిటింగ్ చాలా బాగుంది.
ReplyDeleteథ్యాంక్యూ మహీ
Deleteపద్మా ,
ReplyDeleteచెప్పుమా అంటూ నీవు వ్రాసే ప్రతి కవిత ,
ఉప్మా లాగ వున్నది . ఆ చిత్రాలు జీవం పోసుకుంటున్నాయి నీ కుంచెతో .
తాను అనుకున్నవని ఆ ప్రియుడు తెస్తాడని ఎదురుతెన్నులు కాస్తూ అలా అలా చూస్తూ ఊహాలోకంలో విహరిస్తున్న ఆ(డ)పడుచు అందాలొలికిస్తున్నది .
పగటిపూట పరువం నీ ధ్యాసలో తడిసి ,
వెన్నెలవేళ వలపు వేడి నిట్టూర్పు విడిచింది
శర్మ గారు.. అద్భుతం! మీరు ఇలాంటి కవితలెన్నెన్నో వ్రాయాలని కోరుకుంటున్నా.. అయినా పబ్లిష్ చేయకండి.. అవో గుర్తులా ఉంటాయి..
Deleteఅయినా ఉప్మా చెప్మా ఏమిటి.. పని లేక ?
మీ కమెంట్లు ఉప్మాలో జీడిపప్పులా కమ్మగా ఉందండి :-) థ్యాంక్యూ
Deleteకాయగారు....థ్యాంక్యూ
Deleteవచ్చేయ్ వచ్చేయ్ అని కవితతో కవ్వించి చిత్రంతో మురిపించారు.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteపద్మార్పిత గారూ బాగుందండీ మీ కవిత.
ReplyDeleteథ్యాంక్యూ
Deleteఇంతకీ రాసిన లవ్ లెటర్ పోస్ట్ చేసారా లేదా?
ReplyDeleteపోస్ట్ చేస్తే ఇక్కడ మీరంతా చదవలేరని పోస్ట్ చేయలేదండి.:-)
Deleteఎక్కడివాడొ యక్ష తనయేందు జయంతు వసంతు కంతునిన్ చక్కదనంబునన్ గెలువ జాలెడువాడు?... ఎక్కడివాడొ :)
ReplyDeleteనా మదిలోనే నిదురించు నిండుజాబిల్లి వాడు :-)
Deleteప్రియా! అని అర్పిత అని కవిత అని కేక వేస్తే చాలు రెక్కల్లేకుండానే క్షణాల్లో వచ్చి వాలిపోతారు....ఇంక ఈ ప్రేమలేఖలేల?:-)
ReplyDeleteకేకవేస్తే ఏమైందో అని కంగారు పడతాడు పాపం :-)
Deleteప్రేమలేఖ రాసినా, విరహ వేదన వెల్లడించినా, విషయం ఏదైనా చెప్పాలన్నా నీకే చెల్లు....చెప్పెయ్ చెప్పెయ్
ReplyDeleteచెప్పేయ్ చెప్పేయ్....అంటే చచ్చేంత సిగ్గేస్తుంది బాబు :-)
Deleteతలచినదే తడువుగా పిలిచాను అనుకుని
ReplyDeleteరెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్!! అమ్మాయి ఇలా వచ్చేయ్ వచ్చేయ్ అంటే రాని సన్యాసి ఉంటాడా :-) అందులో పిలిచింది పద్మార్పితాయె....సరదాకి నవ్వేసుకో సుమా!-హరినాధ్
రివ్వున వచ్చి...రయ్యిమంటూ వెళ్ళి సన్యాసుల్లో కలిస్తే :-)
Deleteపడుచు భావలని ప్రేమలేఖలో చక్కగా చిత్రించారు. సంధర్భం ఏదైనా, కాన్సెప్టు ఎలాంటిదైనా భిన్నంగా మీరు స్పృశించేతీరు అమోఘం మేడం. అందుకే మేమెప్పుడూ అంటాం... దటీజ్ పద్మార్పిత..
ReplyDeleteత్యాంక్స్ ఫర్ ఎ గుడ్ పోయెం..
ప్రేమభావాలు వల్లించడానికి పడుచు పెద్దరికం ఏంటండి....పద్మార్పిత ఇస్ ఆల్వేస్....స్వీట్ సిక్స్ టీన్:-)
Deleteగాలి నాకు తోడొస్తానంది నిన్ను దరిచేరడానికి...వచ్చె వచ్చె
ReplyDeleteవిరజాజులే పరిమళం నీ తనువు తాకుతానంది...వచ్చె వచ్చె
అంబరమే చీరనై సారె పెడతానంది నీకు...వచ్చె వచ్చె
పుట్టతేనె నీకు పలహారమౌతానంది...వచ్చె వచ్చె
పిల్లగాలి వింజామరై వీచింది...వచ్చె వచ్చె
ప్రేమతో సర్వం సమర్పం...నీకై
కనులు కాయలే కాచాయి ఎదురుచూసి...నీ రాకకై :-)
Deleteవలపు పిలుపు మధురం పద్మ.
ReplyDeleteఅభివందనం
Deletenice...
ReplyDeletethank you
Deleteతలచినదే తడువుగా పిలిచాను అనుకుని రెక్కల గుర్రం ఎక్కి రివురివ్వున వచ్చేయ్! దారిపొడుగునా విరజాజులు విచ్చుకునే ఉంటాయి దోసిళ్ళతో దూసేసుకుని వచ్చేయ్!!
ReplyDeleteఎంత ఆవశ్యమో .... వ్యక్తపరిచిన ఆ నమ్మకము గడుసుతనమూ
మరోసారి చదివేలా బాగుంది కవిత
ప్రేమకి దోమకి తేడా తెలియని అమాయకురాలండి.....ప్రేమార్పిత :-)
Deleteచిత్రానికి తగ్గ భావం
ReplyDeleteధన్యవాదాలు
Deleteఆ వాలుజడ, మల్లెపూలు, ఆ వెన్నెలరేయి, ఆ చిరునవ్వు, ఆ సిగ్గు అద్బుతం..చిత్రానికి తగ్గ అందమైన భావం.. అచ్చం నీలగా ప్రశాంతంగా, స్వేచ్చగా, అందంగా ఉంది కవిత..
ReplyDeleteమరి నేను బాలేనా శృతి :-)
Deletenuvvu eppudu supere kadaa..
DeleteSuper:-))
ReplyDeleteవచ్చేయ్ అంటూ ప్రేమలేఖ వ్రాసి వలపుల్లో తడిపేస్తే విరహమెట్లు భరించేది విరిబోణీ:-)
ReplyDeleteనిండుపున్నమికి విరహమేల నీలవేణీ :-)
Deleteవెండి వెన్నెల్లో దాగిన ప్రియునికై పిలుపులు అందించారా? కథనం చాల బాగుంది పద్మ గారు ఈ సారి వినూత్నంగా ఉంది చాల మంచి భావం తో రాసారు. కనుకే ఈ కావ్యానికి నా కవితతో ఈ సారికి బదులు ఇవ్వలేక పోతున్న. చిత్రం చూసి మైమరిచిపోయానంటే నమ్మండి
ReplyDeleteమిమ్మల్ని మైమరపించి మురిపించే ప్రయత్నమెప్పుడూ చేస్తూనే ఉంటాను :-)
Deleteచివరి రెండు లైన్లతో కట్టిపడేసారు. చిత్రం మనసు దోచింది
ReplyDeleteఅభిమాన బంధిఖానాలో అలాగే ఉండిపొండి :-)
DeleteMunddu matallu ravatammu leddu Padmarpita garu.mee vallapu pillupu chala bhagundi anndi.inthakku eppudu post chesthunarru anndi.
ReplyDeleteI can't believe this. Naveen after 5yrs of our long journey today you saw my blog and commenting on it. Thanks a lot.
DeleteU r welcome Padmarpita Garu.
DeleteThanks for the understanding.
మాయ మీలా ఒక ప్రేమలేఖ రాసి ఉంటే విశ్వం ఢమాల్ మని పడిపోవాడు. :-) ఈసారి రాసేసుకుంటాం ఇద్దరం
ReplyDeleteథ్యాంక్యూ మాయావిశ్వంగారు
Delete