ఏరులో నీడను చూసి
ఎదసవ్వడి ఎగసెనని
చూపులతో గాలమేసి
వాల్జడ నయగారమన్నా
వలపు విరబూసేయునా!
రేయిజామున కలగని
రేచీకటిలో మాటువేసి
సందెపొద్దు అందాలని
వెనకమాటున వాటేసి
వంపులని నింధించినా
వగల వయ్యారమాగునా!
బాహువుల్లో బంధీనని
బాహటంగా పలకననేసి
చోద్యమేదో చూపుతానని
చిత్ర విన్యాసమేదో చేసేసి
నేలచూసిన బిడియమౌనా
పైటకప్పిన పరువమాగునా!
1st clap...picture
ReplyDelete2nd clap..poetry
A big clap to...PADMARPITA
sounds like rhyme... thank you.
Deleteఅందమైన భావాలతో అక్షరసత్యాలను ఆవిశ్కరిస్తే కాదనగలమా మేడం. మీకు సాటిలేరెవరూ....
ReplyDeleteఅభిమానాక్షరాలని ఎన్నడూ కాదనను.
Deleteహాయ్ హాయ్ పిక్ చూస్తేనే మత్తెక్కిపోతుంది, ఇక కవిత చదివితే మనసు సంతోషంతో నిండిపోతుంది:-)అందమైన భావలకు ఊహాలోకం మీ బ్లాగ్:-)) చాల రిలాక్స్ గా ఉంటుంది మీ బాగ్ ముందు ఉంటే:-) సూపర్:-)) సూపర్:-))
ReplyDeleteహాయి హాయిగా జాబిల్లిని మరిపించెను మీ స్పందన శృతి.
DeletePadmarpita gaaru I am fine, But not getting relax time due to busy schedule, How are You,
ReplyDeletethanks for you reply my dear. take care of yourself.
Deleteనాజూకు పదాల నయాగార జలపాతంలా ఉంది కవిత దానికి తగ్గ చిత్రం .
ReplyDeleteఅల్లరిపాళ్ళే కాదు చలోక్తుల జిమిక్కులూ వచ్చన్నమాట :-)
Delete
ReplyDelete" బాహువుల్లో బంధీనని
బాహటంగా పలకననేసి
చోద్యమేదో చూపుతానని
చిత్ర విన్యాసమేదో చేసేసి
నేలచూసిన బిడియమౌనా
పైటకప్పిన పరువమాగునా! "
బాగుంది.
చిత్ర విన్యాసాలు, చోద్యాలు ఎలా ఉన్నా
కవితకు మీరందించిన వంపులు మీ కవితకే అందాన్ని చేగుర్చాయి.
కవిత చిన్నదే అయినా తగ్గట్టుగా అందించారు అన్ని రసాలను.
అభినందనలు పద్మార్పిత గారు.
*శ్రీపాద
మీ స్పందనలు ఎప్పుడూ స్పూర్తిదాయకమే నాకు. ధన్యవాదాలండి.
Deleteమీ కవితలోని అందమైన హృద్యమైన భావానికి తోడుగా మీరుంచే చిత్రమెప్పుడూ అద్భుతమే పద్మార్పిత గారు. అభినందనలు.._/\_
ReplyDeleteమీ అభిమానాత్మక స్పందనలు నన్నేప్పుడూ అలరిస్తాయి. థ్యాంక్సండి.
Deleteతగునా......మీరిలా కవితా స్రవంతిలో మమ్మల్ని ముంచేయడం:-)
ReplyDeleteవద్దంటే మాత్రం ఆపనుగా :-)
Deleteఆమెకి వాలుజడ ఎక్కడుంది బెత్తెడే...
ReplyDeleteమీరు చెప్పారుగా మేము అనుకోవాలి :)
చూసే కళ్ళలో వాడి ఉంటే జడవాలుగా, పడతి పసందుగానే కనిపిస్తుందేమో :-) ట్రై చేయండి.
Delete"బాహువుల్లో బంధీనని
ReplyDeleteబాహటంగా పలకననేసి
చోద్యమేదో చూపుతానని
చిత్ర విన్యాసమేదో చేసేసి" మీ కావ్యనాయికని ఎవరు బాహువుల్లో బంధించారో తెలీదు నాకు....మీరు మాత్రం మీ భావకవితల్లో నన్ను పూర్తిగా బంధించేసారు...అక్కడ చోద్యం చూస్తే ఇక్కడ నేను మీ కవితల కోసం ఎదురు చూస్తున్నా :-)
కవితాస్రవంతిలా ఉన్నాయి మీ వాక్యాలు.
DeleteKavitha andamina oohallo viharimpachesindi...
ReplyDeletewelcome.....thank you.
Deleteబాగుంది పద్మగారు
ReplyDeleteథ్యాంక్సండి.
Deleteభావచిత్రకవితార్పితకు మరోమారు వందనాలు .
ReplyDeleteథ్యాంక్యూ అనికేత్.
Deleteభావం. భావానికి తగ్గ చిత్రం. బేషుగ్గా కుదిరాయి అర్పిత-హరినాథ్
ReplyDeleteమీ మాటలెప్పుడూ నన్ను మైమరపిస్తాయి. ధన్యవాదాలండి.
DeleteMadam are you here.? Why you are not giving replies?
ReplyDeleteIam fine dear. thank you.
DeleteThis Poem has got a hypnotic effect that lets one get into trance and find themselves impersonating. Really Beautiful piece of poetry.
ReplyDeleteThe Image is really life-like. Seems it is apt in this context.
Very nice attempt, Dear Padma.. (Sorry for replying late)
Thanks for your lovely reply. Hope everything went well.
Deleteతగునా అని నిలతీస్తే తగుదునమ్మా అనేంత ధైర్యమా మాకు :-)
ReplyDeleteఇలా నెత్తిమీద మొట్టి....జోలపాడాలా మహీ :-)
Deleteపిక్ & పోయెం పీలగా ఉన్నా పిచ్చెక్కించారుగా... :-)
ReplyDeleteఈసారి బలం తెచ్చుకుని బలిసిన పోయం & పిక్ పోస్ట్ చేస్తానుగా... :-)
Deleteఏమోనమ్మ, ఇలా రాస్తవు అలా మెప్పిస్తావు, నెను ఇక్కడ బ్లాగ్ చుసి కమెంటడాని అవస్తపడాల్సి వస్తుందని దొంగలా చదివి జారుకుంటున్నా, మనసాగలేక
ReplyDeleteఏమోతల్లి....ఎక్కడ నచ్చక అలకబూనుతావో అని హడలి చస్తున్నా
Deleteపద్మార్పిత ,
ReplyDeleteఅసలు పేరు పద్మ ,ఈ ని జీవితాన్ని యిలా ఈ కవితలకి , ఈ చిత్రాలకి అర్పించుకొంటూ పద్మార్పితగా పదుగురికి పరిచయమైనావు .
భేష్ భేష్ చాలా చాలా బాగుంది .
చిత్రానికిచ్చిన వర్ణాలు వర్ణనాతీతం , నీ బ్లాగులో వినిపించే పాట లాగా .
చెయ్యదల్చుకున్నవన్నీ చేసేసి చివరికి
" నేలచూసిన బిడియమౌనా
పైటకప్పిన పరువమాగునా!"
చాలా బాగుంది ఈ తరం పిల్లలకి చక్కటి సందేశం .
నా ఆటోబయోగ్రఫీని ఇలా చెప్పేస్తే అల్లరిపాలైపోతానేమో!:-)
Deleteఏదో చమత్కారినే కానీ సందేశం అందించేంత గొప్పదాన్ని కానేమో!
Thank you Sharmagaru _/\_
పద్మా..,చిత్రం చాలా బాగుంది. భావం దానితొ సరి తూగుతుంది.
ReplyDeleteఅస్సలు ఇంత బాగా చెప్పినా..., ఇంకా ఏదో వినాలనే తపన గుండెకు ఉంటూనే ఉంటుంది...,
అది మరో కవితకై ఎదురుచూస్తూ ఉంటుంది. నిజమేనా...బంగారు తల్లీ.
ఇంత ఆప్యాయంగా నన్ను పలకరిస్తూ మీరు అందించే ప్రతి పదం నాకు ప్రేరణాత్మక పన్నీటిజల్లు. ధన్యురాలిని!
Deleteఏటి గట్టున తామరాకు మీద నీటిబొట్టులా... అందీఅందని చక్కని కవిత. పట్టు విడుపుల పొడుపు కథ.బ్యూటిఫుల్.
ReplyDeleteపద్మగారు.
అహ్లాదకరంగా అలరించాలనే నా ప్రయత్నానికి మీ స్పందనలే పట్టుకొమ్మలు. థ్యాంక్యూ!
Deleteఅద్బుతమైన భావ మాలిక. అబినందనలు పద్మా గారు.
ReplyDeleteఅభివందనాలు ప్రేమైకజీవులకు!
Deleteవలపుసరాగాల్లో తగునా అంటూ తగవులెందుకు పద్మా....అందమైన భావానుభూతులను అర్పించగల జాణవి:-)
ReplyDeleteజాణలా మారిన జవరాలినైనా మీ అందరి అభిమానాన్ని ఆశించె అతిసాధారణ అతివను ఆశాజీవిని .
DeleteChala hai Ga vuddi mee kavitha Padmarpita garu .matallu ravatammu leddu.
ReplyDeleteThank you Naveen
DeleteU r welcome
ReplyDelete