వాడు ఎవరికీ చిక్కని దొంగోడై నాలోనే ఉండాలి
నా మనసే దోచి నాకు మాత్రమే బంధీ కావాలి
ఇవ్వాలి....ఇవ్వాలి నగానట్రా దోచి నాకే ఇవ్వాలి
దొరలా లెక్కడక్క దొంగసొమ్మంతా నాదే అనాలి
అడిగిందే తడువుగా అందలం ఎక్కించి నవ్వాలి
పోవాలి....పోవాలి నాకు అసాంతం లొంగి పోవాలి
గళ్ళలుంగీ గుబురుమీసాలతో నన్నే మెప్పించాలి
ధన దర్పం కాక పొగరుబోతు వగరేంటో చూపాలి
అవ్వాలి....అవ్వాలి అన్నీ అతడికి నేనే అవ్వాలి
ఆర్భాటమేం లేకుండా హంగులన్నీ అమర్చాలి
ఈర్ష్యపడే పూర్వజన్మఫలం వాడు నాకు అవ్వాలి
ఉండాలి...ఉండాలి దొంగై దోచిచ్చే దొరలా ఉండాలి
నాకళ్ళుకాక అందరి కళ్ళుగప్పి నన్నెత్తుకెళ్ళాలి
అనుకున్నది సాధించాలనే సత్తా వాడిలో ఉండాలి
అద్గదీ పద్మార్పిత సత్తా అంటే అలా కావాలి కావాలి అని కావల్సినవి అడిగి తీసుకోవాలి :-)
ReplyDeleteకుదిరితే కళ్యాణం కూడానా:-)
ReplyDeleteఎంత చిలిపిగా ఉందో ఆడమనస్సు కనిపిస్తుంది.
ReplyDeleteఅల్లరి పిల్లని తప్పకుండా ఆదరిస్తాడూ..,అల్లుకుంటాడూ. పద్మా బాగుంది.
మీ దొంగప్రియుడు దొరబాబే, భలే పసందైన జంట. చూసినోళ్ళ కళ్ళకి చేసుకున్నంత :-)
ReplyDeleteదొంగ ప్రియుడైతేనేమి పద్మార్పిత కలంలో దొరైపోయాడు, అదృష్టవంతుడు
ReplyDeleteఇలా అని తెలిస్తే చోరవిద్యే అభ్యసించి అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళం. అన్నీ అయిపోయాక ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఎలా :-)
ReplyDeleteఎవరికీ చిక్కని దొంగోడై నాలోనే ఉండాలి
ReplyDeleteనా మనసే దోచి నాకు మాత్రమే బంధీ కావాలి
మానసచోరుడై నా మదినే అలరించాలి
చాలా బాగుంది అభినందనలు పద్మార్పిత గారు! శుభోదయం!!
అయితే గియితే మీరు దొంగల రాణి అన్నమాట:-) good feel..
ReplyDeleteమోటు ప్రియుడికోసం మేటికవితనే అల్లేశారు మాడం... చిలిపిగా చాలా బాగుంది.
ReplyDelete
ReplyDeleteమనసులో ఉన్న ఒక్కొక్క కోర్కెను కవిత లోని కథానాయకిచే మనసార చెప్పించిన శైలి బాగుంది.
చెలికాడు తనవాడే కావాలని స్వార్ధంతో అన్నా - చెప్పించిన తీరు మధురంగా అనిపించింది.
" అవ్వాలి....అవ్వాలి అన్నీ అతడికి నేనే అవ్వాలి
ఆర్భాటమేం లేకుండా హంగులన్నీ అమర్చాలి
ఈర్ష్యపడే పూర్వజన్మఫలం వాడు నాకు అవ్వాలి "
ఇక్కడ మాత్రం అన్నీ తానె అయి తనకున్న మక్కువను అందంగా వ్యక్తం చేసింది మీ కథానాయకి.
తనకు ప్రియుడు కావాలని ఆరాటపడ్డా .... తానూ ఓ మంచి ప్రియురాలేనని భావయుక్తంగా చెప్పించారు పద్మార్పిత గారు.
బాగుంది కవిత.
*శ్రీపాద
పద్మ మనసు దోచినవాడు దొంగైనా దొరే
ReplyDeleteనేను ఈ బ్లాగ్ ని 2008 నుండి ఫాలో అవుతునన్నాను... అపుడు నా వయసు 20. ..మా sir బ్లాగ్స్ అంటే మీకు తెలుసా అంటే నేను ఇంటెర్నెట్ లో చూస్తే ఈ బ్లాగ్ కనిపించింది..ఇ ఒక్కటే కాదనుకోండి కాని మిగతా బ్లాగ్స్ అన్ని ఆగిపోయయ్..ఈ బ్లాగ్ చుసినపుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది ఈ మద్య ఫెస్ బుక్ గ్రూప్స్ పేజిలు ల వలన చాలా బ్లాగ్స్ ఆపేసి ఆ పేజిలలోకి వెల్లిపొయారు కాని ఈ బ్లాగ్ ఇoకా అలా అలా కొనసాగుతు ఆనందాన్ని ఇస్తుంది
ReplyDeleteపద్మా గారు... జాగ్రత్త !! అన్నీ దోచుకొని వెళ్ళిపోతాడేమో !!
ReplyDeleteWait for my brother, he is taking rest in Rajahmundry jail.:-)
ReplyDeleteits very funny:-)
ReplyDeleteSruti....how are you?. Hope everything is fine.
Deleteదొరలాంటి దొంగోడు దొరికితే ఇంకెన్ని కవితలు వ్రాసేస్తారో.
ReplyDeleteదొంగోడైతే అన్నీ దోచేస్తాడు మరి... పర్వాలేదా. బాగుందండి.
ReplyDeleteమీ టేస్ట్ నాకు బాగానచ్చింది. మీ దొంగప్రియుడు బాగున్నాడు.:-)
ReplyDeleteThanks to everyone for accepting my thoughts and words._/\_
ReplyDeleteYevvarru ee dongga priyyuddu Padmarpita garu.
ReplyDeleteదొంగ కదా దాక్కున్నాడు
Delete