పెద్దమనిషయ్యా..

ఏంటో ఉండుండి నాలో అనుకోని ఈ మార్పు!?
అమాయకత్వం నుండి అంధకారంలోకి వచ్చి
అన్నీ స్పష్టంగా చూసేసి అర్థం చేసుకున్నట్లు
రాబంధులన్నీ రామచిలకలై రా రామ్మన్నట్లు
కుళ్ళుపై పన్నీటి కళ్ళాపి చల్లి శుభ్రపరిచినట్లు..

ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!?
జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి
గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు
అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు
నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు..

ఎక్కడిదో నాలో నాకే తెలియని ఇంతటి నేర్పు!?
తీరని సమయంలో తీరిగ్గా ఆలోచిస్తే తెలిసింది
ఇన్నాళ్ళకి జ్ఞానం పెరిగి పెద్దమనిషి అయినట్లు
లేని దర్పం నాకబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లు
వెసులుబాటుకై వెలగాలని ఎవరో ఉసిగొల్పినట్లు..

46 comments:

  1. పద్మార్పిత గారు !
    పెద్దమనిషయ్యా !! title చాలా అరుదుగా ఉంటుంది .. కానీ మీ కవితకు భలేగా అబ్బింది . ఉసిగొల్పడమెందుకు ... చదివి ఉబ్బి తబ్బిబ్బైతేనూ. లేని దర్పం కాదది ... కథా నాయకిలో ఉన్న ఆత్మబలం అది. ఓ మంచి సందేశం ఉంది మీ ఈ కవితలో.

    " ఎందుకో నాలో సుడిగుండాల ప్రశ్నల కూర్పు!?
    జవాబులు తెలిసినా చెప్పకూడదంటూ నొక్కేసి
    గుంబనంగా బ్రతకాలని పాఠాలు వల్లిస్తున్నట్లు
    అసభ్యత అర్థం కాకపోతే అంతా సభ్యతన్నట్లు
    నలుపైతే మచ్చ కనపడదని ఇష్టం అనేసినట్లు.."

    ఎంత మంచి పలుకులివి ?
    మంచి ప్రేరణ కలిగించే పదజాలం కవిత నిండా .
    అబ్బో అదరగొట్టేసారు మరో మారు. అభినందనలు.
    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నా పదజాలం కన్నా మీ అభిమానం మెండు శ్రీపాదగారు. ధన్యవాదాలండి.

      Delete
  2. పెద్దమనిషయ్యా అంటే పట్టుపావడా తీసుకురావలి అదో ఖర్చు అనుకున్నా....తీరా చూస్తే పట్టున్న పదాలు పంచి పార్టీ ఇచ్చారు ;-)

    ReplyDelete
    Replies
    1. మరీ ఖర్చులు చూసుకుంటే ఎలా నటనా జీవితంలో.

      Delete
  3. అర్థం చేసుకోవడం కొంచెం కష్టపడ్డా, అర్థం అయ్యాక తెలిసింది సమాజంలోని కుళ్ళుని తెలుసుకుని పెద్దమనిషయ్యారని. కంగ్రాట్స్

    ReplyDelete
    Replies
    1. యోహంత్ నువ్వూ ఎదిగిపోయావుగా. thank you

      Delete
  4. పరిణితి చెందిన మీ కవిత్వం ప్రశంసనీయం మేడం. టైటిల్ కి తగ్గ న్యాయం మీరు మాత్రమే చేయగలరు. దట్ ఈజ్ పద్మార్పిత.

    ReplyDelete
    Replies
    1. మీ అందరి ఆదరాభిమానాలే నన్ను పరిణితిని చేస్తాయేమో!

      Delete
  5. ఇలా కవిత్వం రాయడంలో నేనెప్పుడౌతానో పెద్దమనిషిని.....

    ReplyDelete
    Replies
    1. మీరు ఎప్పుడో అయిపోయారుగా :-)

      Delete
  6. పద్మా మీ ఆలోచన రాసేవిధానం చదివేకొద్దీ మీ పై గౌరవాన్ని, మీ పరిచయం నాకు గర్వాన్ని పెంచుతున్నాయి. చిత్రాల ఎంపిక అద్భుతంగా. మీలోని కళాతృష్ణకి సలాం.

    ReplyDelete
    Replies
    1. సంధ్యగారు అంత తొందరగా అందలం ఎక్కించేయకండీ...మరీను

      Delete
    2. Good way of replies Padma

      Delete
  7. సంధ్యశ్రీ గారూ !
    చాలా గొప్పగా చెప్పారు మీ మనసులోని మాటను. మీరన్నట్లుగా పద్మార్పిత గారి కవితలు చాలా ప్రభావమే చూపాయి నా మీద కూడా. ఓ అభిమానిగా, మీ మాటలు చదివాక నాకూ గర్వంగా అనిపించింది.. మీ మాటల్లో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు. మీ భావనలు నన్నూ ప్రోత్సహించాయి. అభినందలతో నిండిన కృతజ్ఞతలు మీకు.
    * శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. Thanks for supporting words Sripadagaru.

      Delete
  8. బొమ్మ నీలా, కవిత నీ మనసులా స్వఛ్ఛమైనదిగా ఉంది. totally meatured words in your poetry.

    ReplyDelete
    Replies
    1. మనసు తెలుపైనా నలుపేమో నాకిష్టం అని మీకు తెలుసుగా :-) thank you

      Delete
  9. పరిణితి చెందిన మీరే ఇప్పుడు పెద్దమనిషైతే మేము ఇంకా ఎన్ని టోఖరాలు తిని పెద్దగవ్వాలో ఎప్పుడో మరి :-)

    ReplyDelete
    Replies
    1. మీరంతా ఇచ్చిన సపోర్ట్ కదండీ ఈ స్టేజ్.

      Delete
  10. వినోద్ అన్నట్లు నేను మీలా రాయాలనుకుంటే అవ్వాలి తప్పదు . ఎప్పుడు అవుతానో ఏమో?:-) పిక్ కేకో కేక

    ReplyDelete
    Replies
    1. ఎదగడానికెందుకులే తొందరా ఎదర బ్రతుకంతా చిందరవందరా :-)

      Delete
  11. చాలా బాగుంది. మీలాగే వ్రాసే ప్రయత్నమేదో చేస్తున్నాము......త్వరలో రాసేస్తామండోయ్;-)

    ReplyDelete
    Replies
    1. బ్రహ్మాండంగా రాసేస్తారు.

      Delete

  12. తీరని సమయంలో తీరిక చేసుకుని ఆలోచిస్తే తెలిసింది
    జ్ఞానం పెరిగి పెద్దమనిషిని అయి .... లేని దర్పం అబ్బి కొత్తఛాయ ఏదో పెరిగినట్లుందని
    చాలా బాగా వ్రాసారు
    సూటిగా
    ప్రశ్నై సమాధానమై
    అభినందనలు పద్మార్పిత గారు!

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలే నాకు ఆశీర్వచనాలు.

      Delete
  13. అనిర్వచనీయ అంతర్మథనాన్ని అందంగా, హుందాగా ఆవిష్కరించారండీ :-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి.

      Delete
  14. మరింకేం ప్రశంసల పట్టుపావడా
    ఆశీర్వాధిస్తూ అద్దంకీలద్దిన ఓణీ
    అభినందన పూలు చప్పట్ల పళ్ళు
    ఇవ్వన్నీ నీకే పద్మ...మరి మాకు:-)

    ReplyDelete
    Replies
    1. మీకు వందనాల బొబ్బట్లు
      నమస్కారాల నేతిసున్నుండలు
      కృతజ్ఞతల తాపేశ్వరం కాజాలు
      ఇంకా బోలెడన్ని థ్యాంక్యూలు :-)

      Delete
  15. చిత్రంలోని అమ్మాయి ముఖంలో అమాయకమైన అందంతోపాటు అల్లరి, స్ఫురధౄపి, ధీమా, దర్పం అన్నీ కలిపిన నీవులా ఉన్నవు. చాలా బాగుంది

    ReplyDelete
  16. నాటు టైటిల్ పెట్టి నీటుగా మమ్మల్ని కొట్టారు

    ReplyDelete
    Replies
    1. నీటుగా నన్ను నేను తిట్టుకుంటానే కానీ మిమ్మల్ని కొట్టడం ఏంటి? :-)

      Delete
  17. ఎప్పటికప్పుడే నూతన జ్ఞానసముపార్జనే మీలో, ఇలాగే వెలుగొందుతూ సాగిపో

    ReplyDelete
    Replies
    1. అమ్మో సెలవుల్లో తెలుగు ట్యూషన్ చెప్పండి మాడం మాకు :-)

      Delete
  18. మనసు పరిణతి చెంది లోకం తీరు అర్థం చేసుకునే అమ్మాయి మనసును భలే చెప్పారు. బాగుందండీ చిత్రం కూడా. నాకు మీరా పక్కన నిబ్బరంగా నలుపు తెలుపు చిత్రంలో నిల్చున్నది చాలా నచ్చింది.
    ఏమనుకోనంటే ఒక్క మాట ఈ కవితలో వచనం ఎక్కువయింది మరికాస్తా చిలికితే చిక్కని వెన్నలాంటి కవిత్వం వచ్చేదనిపించింది.
    అభినందనలతో...

    ReplyDelete
    Replies
    1. వర్మగారు అన్యధా భావించకండి. పరిణితి చెందిన మనసు వచనాలు పలుకుతుంది అందుకే పద్మార్పిత కవయిత్రి మనసు అలా పలికి ఉంటుంది. పెద్దమనిషైన కవిత కాదంటారా?:)

      Delete
    2. నిజమే అనుకుంటా....చిలికితే వెన్నతో పాటు మిగిలిన చల్లకూడా పనికి వచ్చేదేమో :-)

      Delete
    3. హరినాధ్ గారు ఇంకా అంత పెద్దదాన్ని కాలేదేమోనండి

      Delete
  19. చాలా పెద్దతనమే ఉంది భావాల్ల్లో...అందుకే మీ కవితల్లో అంతటి ముగ్దతనం చాలా బాగుందీ కవిత.

    ReplyDelete
    Replies
    1. మీరాజ్ గారు మీరు నాలో ఎంత పెద్దతనం ఉందన్నా మీ ముందు చిన్నదాన్నే కదా! మీ అభిమానానికి అభివందనాలు.

      Delete
  20. పెద్దమనిషైపోయారుకదాని మాకు కనపడకుండా పోరుకదా :-)

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete